18-01-1975 అవ్యక్త మురళి

18-01-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరివర్తన కోసం ప్రతిజ్ఞ. 

               మధువనం అనే పరివర్తన భూమిపై పవిత్రతా వరదానాన్నిచ్చే శివబాబా సేవా కేంద్రాల నుండి వచ్చిన పిల్లలతో మాట్లాడుతున్నారు -
               మధువనం గురించి ఏమి మహిమ చేస్తారు? ఇది పరివర్తనా భూమి అని అంటారు. మీరందరూ పరివర్తనా భూమికి లేదా వరదానభూమికి వచ్చారు. స్వయంలో లేదా ఇతరుల్లో వరదానాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇక్కడికి రావడం అంటే వరదానం పొందడం, పరివర్తన అవ్వడం. ఇప్పుడు ఏమి పరివర్తన చేయాలి? ఏదైతే విశేష బలహీనత లేదా విశేష సంస్కారం సమయాన్ని అనుసరించి విఘ్న రూపంగా అవుతుందో, ఆ సంస్కారాన్ని లేదా బలహీనతను ఇక్కడ పరివర్తన చేసుకుని వెళ్ళాలి. అప్పుడే స్వయంలో పరివర్తన తీసుకువచ్చారని అంటారు. విశేష ఉత్సాహ, ఉల్లాసాలతో మరియు సంలగ్నతలో ఇక్కడి వరకు చేరుకుంటున్నారు. కానీ ఇక్కడ మధువనంలో మీ సంలగ్నతను అగ్ని రూపంలో తయారు చేసుకోండి. ఆ అగ్నిలో వ్యర్థ సంకల్పాలు, బలహీనతలు లేదా మిగిలిపోయిన పాత సంస్కారాలు అన్ని భస్మం అయిపోవాలి. మధువనాన్ని అశ్వమేధ రుద్ర జ్ఞాన మహయజ్ఞం అని అంటారు. యజ్ఞంలో ఏమి చేస్తారు? స్వాహ చేస్తారు. పిల్లలైన మీరు కూడా అమృతవేళ లేచి రోజూ యజ్ఞం రచిస్తున్నారు. సంలగ్నత అనే అగ్నితో. ఆ సంలగ్నత రూపీ అగ్నిలో మీ బలహీనతలు స్వాహా చేస్తున్నారు. కానీ ఇది మహయజ్ఞం. మధువనానికి రావడం అంటే మహయజ్ఞానికి రావడం, మధువనాన్ని మహయజ్ఞం అని ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ అనేకాత్మల సంలగ్నత యొక్క అగ్ని సమూహంగా ఉంటుంది. దీని యెక్క లాభాన్ని తీసుకోవాలి. అనేకసార్లు స్వతహగానే ప్రతిజ్ఞ చేస్తారు. సంకల్పం తీసుకుంటారు. అదేవిధంగా మధువనంలో మీరు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేసారా? సంకల్పం తీసుకున్నారా? ఏమని భావిస్తున్నారు? ఇకముందు కొరకు సమాప్తి అయ్యేలా ఆహుతి చేస్తున్నారా? మహయజ్ఞంలో మహ ఆహుతి చేయాలి, సాధారణ ఆహుతి కాదు. అనేకాత్మల సామూహిక సంలగ్నత అనే అగ్నిలో ఆహుతి చేశారా? ఇక్కడి నుండి వెళ్ళే లోపు ఆహుతి చేసి వెళ్తున్నారా? లేక తిరిగి తీసుకువెళున్నారా? లేక ఏ రకమైన నువ్వులు లేదా ధాన్యం వేయాలో లేక ఆహుతి చేయాలో అని అనుకుంటున్నారా? ఎన్నిసార్లు మహయజ్ఞానికి వస్తున్నారో అన్నిసార్లు మహయజ్ఞంలో ఆహుతి చేస్తున్నారా లేదా అని పరిశీలించుకుంటున్నారా? సంపూర్ణ సమర్పణ అయ్యారా లేక తిరిగి తీసుకువెళ్తున్నారా. ఆహుతి సంపూర్ణంగా సమర్పణ చేస్తున్నారా? లేక మిగిలిపోతుందా? ఈ సంస్కారాలు పాత ప్రపంచంలో పనికొస్తాయని ఆలోచించడం లేదు కదా? బలహీన మానవులైతే చేయి వెనక్కి తీసుకుంటారు. ఆహుతి చేసేవారు బలహీనులైతే అగ్నిసెగ తగులుతుంది. కనుక సగమే ఆహుతి సగం లోపల, సగం బయట పడిపోతాయి. చేద్దామా, వద్దా అని ఆలోచిస్తున్నారా? అవుతుందా అవ్వదా? చేయగలమో లేదో.. ఇలా బుద్ధి అనే చేతిని ముందుకు వెనక్కి జరుపుతున్నారు. అందువలనే సంపూర్ణ స్వాహ జరగడం లేదు. కొన్ని మిగిలిపోతున్నాయి. కొన్ని చెల్లాచెదురు అయిపోతున్నాయి. సంపూర్ణ స్వాహ కానంత వరకు సంపూర్ణంగా సఫలం కానట్లే. ఎక్కువ ఆలోచిస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. అప్పుడు ఫలం కూడా తక్కువే లభిస్తుంది. ధైర్యం తక్కువగా ఉంటుంది. సంకల్పం శక్తిశాలిగా ఉండడం లేదు. కనుక కర్మలో కూడా బలం రావడం లేదు మరియు ఫలం కూడా తక్కువగా లభిస్తుంది. తరువాత ఏం చేస్తున్నారు. సగం ఇక్కడ, సగం అక్కడ వెదజల్లుతున్నారు. సఫలత లభించలేదు కదా! ఇప్పుడు మీ అందరి ఫలితం ఏమిటి, సఫలత లభించిందా. యజ్ఞంలో సంపూర్ణ ఆహుతి చేశారా, లేక చెల్లాచెదురైపోయాయా? మీ అందరి ఇప్పటి ఫలితం చెల్లాచెదురయ్యాయి, అంటే మిగిలిపోయాయి. ఆలోచించినదానిని ప్రత్యక్షంలో నింపుకుని వెళ్ళాలి. ఈరోజు నుండి ఈ బలహీనత మరలా రాదు, ఇలా సంపూర్ణ సమర్పణ చేసే ధైర్యం ఉందా లేక తక్కువగా ఉందా. వినాశనం అవ్వకపోతే? స్వర్గం రాకపోతే? ఏమవుతుందో, చేరుకుంటామో లేదో? అప్పుడు ప్రజలు ఏమంటారో? ఇలాంటి తెలివిగలవారిగా అవ్వకండి. అందరి పరిస్థితి ఇదే. సహజంగా చేయి ముందుకు చాచుతున్నారు. సెగ తగలగానే చేయి వెనక్కి తీసుకుంటున్నారు, అంటే ధైర్యం పెట్టుకుంటున్నారు. కానీ ఏదైనా విఘ్నం రాగానే వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి ఏమి గతి లభిస్తుంది? గతి-సద్గతి గురించి తెలుసు కదా! జ్ఞానవంతులై ఉండి చేయకపోతే ఏమంటారు? వీటిని తిరిగి తీసుకువెళ్తే ఏమి గతి లభిస్తుంది? అన్నీ తెలిసి ఉండి కూడా చేయకపోతే ఏమంటారు? ప్రకాశ స్వరూపులు మరియు శక్తి స్వరూపులు అయ్యి ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నారు, కారణం ఏమిటి? జ్ఞానం మీ బుద్ది వరకు ఉంది; అర్థమైంది. అంతే, తెలుసు కానీ ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువరావడం లేదా నింపుకోవడం రావడం లేదు. భోజనం ఉంది, తింటున్నారు కూడా కానీ తినటం వేరు, తిని అరిగించుకోవడం వేరు. జీర్ణం కావడం లేదు, రసం తయారవడం లేదు మరియు శక్తి లభించడం లేదు ,కంఠం వరకు తిన్నారు. కానీ రసం తయారుకాలేదు, శక్తి రాలేదు. అరిగించుకున్న తరువాతే శక్తి స్వరూపంగా అవుతుంది. వంటబట్టకపోతే నాలుకకు రుచిగా ఉంటుంది అంతే. వంటబట్టించుకుంటే శక్తి వస్తుంది. అలాగే వినే రసం వచ్చింది, విన్నది అర్థమైంది, కానీ నింపుకోలేదు. అంటే ప్రత్యక్షంలోకి తీసుకురాలేదు. ఎంతగా ధారణలోకి వస్తుందో అంతగా సంస్కారం తయారవుతుంది. అప్పుడే ప్రత్యక్షంగా సఫలతాస్వరూపంగా కనిపిస్తారు. ఙ్ఞానవంతులు అంటే అర్థమేమిటి? జ్ఞానవంతులు అంటే ప్రతి ఒక్క కర్మేద్రియంలో జ్ఞానం నిండి ఉండాలి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు... ఇది తెలిస్తే మోసపోయే విషయం ఉంటుందా, కళ్ళు మరియు వృత్తి మోసగిస్తున్నాయా? ఎప్పుడైతే ఆత్మలో జ్ఞానం వస్తుందో సర్వ ఇంద్రియాల్లో ఙ్ఞానం నిండిపోతుంది. ఎలాగైతే భోజనం ద్వారా శక్తినిండుతుందో, శక్తి ఆధారంగా పని జరుగుతుందో అలాగే ఇప్పుడు జ్ఞానాన్ని నింపుకోండి. ప్రతి కర్మేంద్రియాన్ని జ్ఞానవంతంగా తయారు చేసుకోండి. ప్రతి సంవత్సరం వస్తారు, ఇప్పుడు చేస్తాం అంటారు, ప్రతిజ్ఞ చేసి వెళ్తారు, కానీ ఎప్పుడు పూర్తవుతుంది? కారణం ఏమిటి, ఆలోచన మరియు కర్మలో తేడా ఎందుకు? కారణం ఏమిటి? పూర్తిగా చేస్తామని ఆలోచిస్తున్నారు, కానీ సగమే అవుతుంది. ఎంత తేడా, ఇది ఎందుకు వస్తుంది? చాలా ప్లాన్స్ వేస్తున్నారు, ఉల్లాసం కూడా బాగా తెచ్చుకుంటారు, అర్థం చేసుకుని ప్రతిజ్ఞ కూడా చేస్తారు, అన్ని విషయాలు వస్తాయి, కానీ అనుకోవడంలో, చేయడంలో తేడా వచ్చేస్తుంది. దీనికి కారణం ఏమిటి? సంస్కారాలను ఆహుతి చేసి వెళ్తున్నారు. మరలా అవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి. స్వాహ చేసి వెళ్ళినప్పుడు మరలా ఎందుకు వస్తున్నాయి? దేహభిమానం, సోమరితనం తిరిగి ఎందుకు వస్తున్నాయి, కారణం ఏమిటంటే స్వాహ చేయాలని సంకల్పం చేసి వెళ్తున్నారు. సమయానుసారం వాటి అవసరాలు పూర్తి చేయాలి, ఈరోజు బీజం వేసేసి సోమరి అయిపోతున్నారు. బాబాకి ఇచ్చేసాము, బాబాకే తెలుసు, బాబా పని అంటున్నారు. మీరు బీజాన్ని పాలన చేయడం లేదు. కనుక వాచా మరియు మనసుపై ధ్యాస అవసరం. బీజాన్ని నాటి నీళ్ళు పోస్తారు, అప్పుడు బీజం పక్కా అవుతుంది కదా! మరియు ఆ బీజానికి ప్రతి రోజు నీరు పోయాలి, అదేవిధంగా సంకల్పం అనే బీజాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానిలో లోటు వస్తుంది. నిశ్చింత అయిపోతున్నారు, విశ్రాంతికి ఇష్టమైనవారిగా అయిపోతున్నారు. విశ్రాంతి ఇష్టమయ్యే సంస్కారం ఉండకూడదు. సంకల్పం యొక్క చింతన ఉండాలి. ఒక్కొక్క సంస్కారం గురించి చింత ఉండాలి. పురుషార్థంలో ఒక్క లోపం యొక్క మచ్చ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు ఈ చిన్న మచ్చ నా విలువను తగ్గించింది అని ఎప్పుడూ గుర్తుంటుంది, ఈ చింతన చింత రూపంలో ఉండాలి, అది లేకపోతే సోమరితనంతో చెబుతున్నారు, కానీ చేయడం లేదు. కేవలం వినటం కాదు, విని నింపుకోవాలి కూడా. యుక్తిని ప్రత్యక్షంలోకి తీసుకురండి, విశ్రాంతిని ఇష్టపడడం దేవతా స్థితి యొక్క సంస్కారం, అది బాగా ఆకర్షిస్తుంది, సంగమయుగీ బ్రాహ్మణుల సంస్కారం త్యాగమూర్తి. అది తక్కువగా ప్రత్యక్షంలో ఉంది. త్యాగం లేకుండా భాగ్యం తయారుకాదు. చేసేస్తాము, చూస్తాము, ఇవన్నీ విశ్రాంతిని ఇష్టపడే సంస్కారం, తప్పక చేస్తాము, ఇదే బ్రాహ్మణ సంస్కారం. లౌకిక చదువులో కూడా ఎవరికి చింత ఉంటుందో వారు పాస్ అవుతారు. వారికి నిద్రపట్టదు కూడా. విశ్రాంతిని ఇష్టపడేవారు ఎలా పాసవుతారు? ప్రత్యక్షంలోకి తీసుకురావాలని ఇప్పుడు అనుకుంటున్నారు. చింత ఉండాలి, ఇది శుభచింతన, సంపూర్ణంగా అవ్వాలనే చింత, బలహీనతలను దూరం చేసుకోవాలనే చింత, ప్రత్యకం ఫలం ఇవ్వాలనే చింత ఉండాలి. 

Comments