18-01-1973 అవ్యక్త మురళి

* 18-01-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సమానత మరియు సమీపత"

          బాప్ దాదా సమానంగా స్వమానధారిగా, స్వదర్శన చక్రధారిగా మరియు నిర్మాణంగా అయ్యారా? ఎంతెంతగా ఈ విశేష ధారణలలో సమానంగా అవుతూ ఉంటారో అంతగానే సమయమును సమీపంగా తీసుకువస్తారు. సమయాన్ని తెలుసుకొనేందుకు ఇప్పుడు ఎంత సమయము ఉంది? దీనికి సూచికగా మీ ధారణలలో సమాన స్థితి ఉందా? ఇప్పుడు చెప్పండి, సమయము ఎంత సమీపంగా ఉంది? సమానతలో సమీపంగా ఉన్నట్లయితే సమయము కూడా సమీపంగా ఉంటుంది. ఈ ప్రోగ్రాము మధ్యలో మిమ్మల్ని మీరు పరిశీలించుకొనేందుకు లేక మీ ద్వారా సమయాన్ని తెలుసుకొనేందుకు సమయము లభించింది. విశేషమైన ఈ మాసములో రెండు ముఖ్య విషయాలను ముఖ్యరూపముగా లక్ష రూపములో మీ ముందు ఉంచుకోవాలి. అవి ఏమిటి? ఒకటేమో లవ్ రెండవది లవలీన్. (ప్రేమ మరియు పారవశ్యములో మునిగిపోవుట).

          కర్మలో, వాణిలో, సంబంధసంపర్కములో ప్రేమగా మరియు స్మృతిలో లేక స్థితిలో లవలీనులై ఉండాలి. ఎవరు ఎంతగా లవ్లీగా ఉంటారో, వారు అంతగానే లవలీనులుగా ఉండగలరు. ఈ లవలీన స్థితిని మనుష్యాత్మలు లీనమైపోయే స్థితిగా చెప్పారు. తండ్రిపై ప్రేమ అన్నదానిని తీసేసి కేవలము లీనము అన్న మాటను పట్టుకొన్నారు. కావున ఈ మాసము లోపల ఈ రెండు ముఖ్య విశేషతలనూ ధారణ చేసి బాప్ దాదా సమానంగా అవ్వాలి, మిమ్మల్నందరినీ విశేషంగా తయారుచేసినది, అన్నింటినీ మరిపింపజేసి దేహీ అభిమానిగా తయారుచేసినది - బాప్ దాదా ముఖ్య విశేషతలైన ఈ లవ్ మరియు లవలీన్ లే.

           ప్రేమ మీ అందరికీ విస్మృతి అయిపోయి ఉన్న 5000 సంవత్సరాల విషయాలను ఒక్క క్షణములో స్మృతిలోకి తీసుకువచ్చింది, సర్వ సంబంధాలలోకి తీసుకువచ్చింది, సర్వస్య త్యాగిగా తయారుచేసింది. బాబా ఒకే విశేషత ద్వారా ఒకే క్షణములో తనవారిగా చేసుకున్నారు మరి మీరందరూ ఈ విశేషతను ధారణ చేసి తండ్రి సమానంగా అయ్యారా? సాకార తండ్రిలో ఈ విశేషతలో పర్సెంటేజ్ ను చూడలేదు, పర్‌ఫెక్ట్ నే చూసారు కావున విశేష ఆత్మలు మరియు తండ్రి సమానంగా తయారైన ఆత్మలైన మీరు కూడా పర్‌ఫెక్ట్ గా అవ్వాలి. ఈ ముఖ్య విశేషతలో పర్సెంటేజ్ ఉండకూడదు. పర్‌ఫెక్ట్ గా ఉండాలి ఎందుకంటే దీని ద్వారానే సర్వ ఆత్మల భాగ్యము లేక లక్ ను మేల్కొలపగలరు. లక్ అనే లాక్(తాళము)కు తాళంచెవి ఏది? 'లవ్' (ప్రేమ). ప్రేమయే తాళమునకు 'కీ' (తాళపుచెవి). ఇది మాస్టర్ కీ. ఇది ఎటువంటి దుర్భాగ్యశాలినైనా భాగ్యశాలిగా తయారుచేస్తుంది. మరి ఇందులో స్వయం అనుభవజ్ఞులేనా?

           ఎంతెంతగా బాప్ దాదాతో ప్రేమ జోడింపబడుతందో, అంతగానే బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. ప్రేమ తక్కువ అయినట్లైతే లక్ కూడా తక్కువౌతుంది. మరి ఆత్మలందరి లక్ అనే లాక్ ను తెరిచే తాళపుచెవి మీవద్ద ఉందా? ఈ లక్ యొక్క తాళపుచెవిని ఎక్కడా పోగొట్టుకోలేదు కదా! లేక మాయ యొక్క భిన్న భిన్నరూపాలలో లేక రంగులలో ఈ తాళపుచెవినైతే దొంగలించబడలేదు కదా? మాయ దృష్టి కూడా ఈ తాళపుచెవిపైనే ఉంది, కావున ఈ తాళపుచెవిని ఎల్లప్పుడూ పదిలంగా ఉంచుకోవాలి. ప్రేమ అనేది అనేక వస్తువులపై ఉంటుంది. ఒకవేళ ఏ వస్తువులోనైనా ప్రేమ ఉన్నట్లయితే బాబాపై ప్రేమ శాతములో ఉంటుంది. తమ దేహముపై, తమ ఏ వస్తువులపైనన్నా మోహము ఉన్నట్లయితే ప్రేమలో శాతము ఉందని భావించండి. నాది అన్న భావమును తొలగించటమే తండ్రి సమానతలోకి తీసుకురావటము. ఎక్కడైతే నాది అన్న భావము ఉంటుందో, అక్కడ బాప్ దాదా సదా తోడుగా ఉండరు.

          పర్సెంటేజ్ (శాతము) ఉన్నవారు ఎప్పుడూ పర్‌ఫెక్ట్ గా అవ్వజాలరు. శాతము అనగా డిఫెక్ట్ (లోపము) కలిగినవారు ఎప్పుడూ పర్‌ఫెక్ట్ గా అవ్వజాలరు, కావున ఈ సంవత్సరములో పర్సెంటేజ్ ను తొలగించి పర్ ఫెక్ట్ గా అవ్వండి. అప్పుడు ఈ సంవత్సరము వినాశన సంవత్సరమును తీసుకువస్తుంది. ఒక సంవత్సర కాలమును ఇస్తున్నాము, మళ్ళీ "మాకేం తెలుసు" అన్న ఫిర్యాదును ఇవ్వకూడదు. ఒక్క సంవత్సరము అనేక సంవత్సరముల శ్రేష్ఠ ప్రాలబ్దమును తయారుచేసుకొనేందుకు నిమిత్తముగా అవుతుంది. మీకు మీరే పరిశీలకులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ఒకవేళ ముఖ్యంగా ఈ విషయంలో మిమ్మల్ని పర్‌ఫెక్ట్ గా చేసుకున్నట్లయితే అనేక రకాలైన లోపాలు స్వతహాగనే సమాప్తమైపోతాయి, ఇదైతే సహజ పురుషార్థము కదా? ఒకవేళ స్వయం తండ్రి తోటి ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే ఇతరులను కూడా సహజముగానే మీ సమానంగా మరియు తండ్రి సమానంగా తయారు చేయగలరు. ఈ సంవత్సరము తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమును ఉంచుకొని నడిచినట్లయితే బాప్ దాదా కూడా అటువంటి పిల్లలకు "తతత్వమ్" వరదానాన్ని ఇచ్చేందుకు డ్రామానుసారంగా నిమిత్తమయ్యారు. తండ్రి సమానంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావటమే ఈ సంవత్సరపు విశేషత. సమయపు విశేషతను స్వయంలో తీసుకురావాలి. అచ్ఛా!

          ఇలా సదా లవ్ లీగా మరియు లవ్ లీనులుగా ఉండే తండ్రి సమానంగా నిర్మానముగా ఉండే మరియు నిర్మాణ కర్తవ్యములో సదా తత్పరులై ఉండేవారికీ, సమయపు విశేషతను స్వయంలోకి తీసుకువచ్చేవారికి, శ్రేష్ఠ స్వమానములో సదా స్థితులై ఉండేవారికి, శ్రేష్ఠమైన మరియు సమానమైన ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. అచ్ఛా!

Comments