18-01-1971 అవ్యక్త మురళి

* 18-01-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 అవ్యక్త స్థితి ద్వా రా సేవ.
     
          ఈ రోజును శబ్దము నుండి దూరంగా వెళ్ళే రోజుగా నిర్ణయించారు. కావున బాప్ దాదా కూడా శబ్దములోకి ఎలా వస్తారు? శబ్దము నుండి దూరంగా ఉండే అభ్యాసము చాలా అవసరము. శబ్దములోకి వచ్చి ఆత్మలకు ఏ సేవనైతే చేస్తారో దాని కంటే కూడా అధికంగా శబ్దము నుండి దూరంగా ఉండే స్థితిలో స్థితులై సేవ చెయ్యటం ద్వారా సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణమును చూడగలరు. మీరు అవ్యక్త స్థితిలో ఉండటం ద్వారా అన్య ఆత్మలకు కూడా ఒక్క క్షణములో అవ్యక్త స్థితిని అనుభవం చేయించినట్లయితే ఆ ప్రత్యక్ష ఫల స్వరూపము మీ ఎదురుగానే కనిపిస్తుంది. శబ్దము నుండి దూరంగా ఉండే స్థితిలో స్థితులై శబ్దములోకి రావటం ద్వారా ఆ శబ్దము, శబ్దములాగా అనిపించదు, కానీ ఆ శబ్దములోని అవ్యక్త వైబ్రేషన్స్ ప్రవాహము ఎవ్వరినైనా తండ్రి వైపుకు ఆకర్షితము చేస్తాయి. ఆ శబ్దమును వినటంతోనే వారికి మీ అవ్యక్త స్థితి అనుభవము కలుగుతుంది. ఏవిధంగా ఈ సాకార సృష్టిలో చిన్నపిల్లలకు జోలపాటను పాడినప్పుడు, ఆ పాట కూడా శబ్దమును కలిగి ఉంటుంది కానీ ఆ శబ్దము, శబ్దము నుండి దూరంగా తీసుకొని వెళ్ళే సాధనమౌతుంది. అలాగే అవ్యక్త స్థితిలో స్థితులై శబ్దములోకి వచ్చినట్లయితే శబ్దము నుండి దూరంగా ఉండే స్థితిని అనుభవము చేయించగలరు. ఒక్క క్షణకాలపు అవ్యక్త స్థితి అనుభవము ఆత్మను అవినాశీ సంబంధములో జోడింపచెయ్యగలదు మాయ కూడా ఆ అనుభవీ ఆత్మను కదిలించలేనంతగా అవిచ్ఛన్నమైన సంబంధము జోడింపబడుతుంది. కేవలము శబ్దము(మాటల)ద్వారా ప్రభావితమైన ఆత్మలు అనేక మాటలను వినటం ద్వారా రాకపోకలలోకి వచ్చేస్తారు. కానీ అవ్యక్త స్థితిలో స్థితులై శబ్దము ద్వారా అనుభవీ ఆత్మలుగా అయినవారు రావడము, పోవడముల నుండి విముక్తులవుతారు. ఇటువంటి ఆత్మపై ఏవిధమైన రూప ప్రభావము పడజాలదు. ఎల్లప్పుడూ స్వయమును కంబైండుగా భావించుకొని, కంబైండు రూపపు సేవను చెయ్యండి అనగా అవ్యక్త స్థితి, ఆ తరువాత శబ్దము.

           కంబైండు రూపములో చేసే ఈ రెండు సేవలు వారసులుగా తయారుచేస్తాయి. కేవలం మాటల ద్వారా సేవ చెయ్యటం ద్వారా ప్రజలు తయారవుతూ ఉన్నారు. కావున ఇప్పుడు సేవలో నవీనతను తీసుకురండి. (ఈవిధమైన సేవను చేసేందుకు సాధనము ఏమిటి?) ఏ సమయములో అయితే సేవ చేస్తారో ఆ సమయములో మంథనము జరుగుతుంది, కానీ స్మృతిలో మగ్నమై ఉండే స్థితి మంథనములో ఉన్నప్పటి స్థితి కన్నా తక్కువైపోతుంది. ధ్యానము(అటెన్షన్) మరొకవైపు ఎక్కువగా ఉంటుంది, మీ అవ్యక్త స్థితివైపు ధ్యానము తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జ్ఞాన విస్తారపు ప్రభావమైతే పడుతుంది కానీ లగనములో మగనమై ఉండేదాని ప్రభావము తక్కువగా కనిపిస్తుంది. రిజల్టులో జ్ఞానము చాలా ఉన్నతమైనది అని అంటారు, కానీ మగనమై ఉండాలి అన్న ధైర్యమును ఉంచరు ఎందుకంటే అవ్యక్త స్థితి ద్వారా లగనమై ఉండే అనగా సంబంధమును జోడించే అనుభవమును చెయ్యలేదు. కాకపోతే ఏదో కొద్దిగా, ఒక్క మెతుకంత తీసుకున్న కారణంగా ప్రజలుగా అవుతారు. ఇప్పటి ఈ సంబంధమును జోడించటం ద్వారానే భవిష్య సంబంధములోకి వస్తారు. లేకపోతే ప్రజలలోకే వస్తారు. కావున ఒక్క క్షణములో అవ్యక్త అనుభవము ద్వారా సంబంధమును జోడింపచెయ్యాలి అన్న ఈ నవీనతనే తీసుకురావాలి. సంబంధము మరియు సంపర్కము, ఈ రెండింటిలో అంతరము ఉంది. సంపర్కములోకి వస్తారు కానీ సంబంధములోకి రారు, అర్ధమైందా!

           ఈరోజు అవ్యక్త స్థితిని అనుభవము చేసుకున్నారు, ఇదే అనుభవమును సదాకాలము స్థిరంగా ఉంచుకుంటూ ఉన్నట్లయితే ఇతరులకు కూడా అనుభవము చేయించగలరు. ఈ రోజుల్లో వాణి మరియు సాధనాలు అనేక రకాలుగా అనేకుల ద్వారా ఆత్మలను ప్రభావితము చేస్తూ ఉన్నాయి. కానీ అనుభవము అన్నదానిని మీరు తప్ప ఇతరులెవ్వరూ చెయ్యలేరు, చేయించలేరు కావున ఈ సమయములో ఈ అనుభవమును చేయించే ఆవశ్యకత ఉంది. అందరిలో అభిలాష కూడా ఉంది, కొద్ది సమయములో అనుభవమును చేసుకునేందుకు ఇచ్చుకులు(కోరిక కలవారి)గా కూడా ఉన్నారు, వినేందుకు ఇచ్చుకులుగా లేరు. అనుభవములో స్థితులై అనుభవమును చేయించండి, అందరి స్నేహము వతనములో లభించింది. మూడు రకాల స్మృతి మరియు స్నేహము వతనములో చేరుకున్నాయని వినిపించడం జరిగింది. వియోగి, యోగి మరియు స్నేహి. మూడు రూపాలలోని ప్రియస్మృతులు బాప్ దాదాకు లభించాయి. రివైజ్ కోర్సు చేసే సంవత్సరము కూడా సమాప్తమవుతూ ఉంది. సంవత్సరము సమాప్తమయినప్పుడు విద్యార్థులు తమ రిజల్టును చూసుకోవలసి ఉంటుంది. మరి ఈ సంవత్సరపు రిజల్టులో ప్రతి ఒక్కరూ ఎటువంటి రిజల్టును చూసుకోవాలి? దీని కొరకు ముఖ్యంగా నాలుగు విషయాలను ధ్యానములో ఉంచుకోవాలి - 1. తమలో అన్ని రకాల శ్రేష్ఠత ఎంతవరకు ఉంది? 2. సంపూర్ణతలో మరియు సర్వుల సంబంధములో సమీపత ఎంత వరకు వచ్చింది? 3. స్వయములో మరియు ఇతరుల సంబంధములో సంతుష్టత ఎంతవరకు వచ్చింది? 4. స్వయములో శూర వీరత్వము ఎంతవరకు వచ్చింది? ఈ నాలుగు విషయాలను స్వయములో పరిశీలించుకోవాలి. మీ రిజల్టును పరిశీలించుకొనే కర్తవ్యాన్ని ఈరోజు ముందుగా చెయ్యాలి. ఈరోజును కేవలము స్మృతిదివసంగా జరుపుకోవద్దు, కానీ ఈ రోజును సమర్థతను పెంచుకొనే రోజుగా జరుపుకోవాలి. ఈ రోజును స్థితి  స్టేజ్ ను ట్రాన్స్ ఫర్ చేసే రోజుగా భావించండి. ఈ రోజుల్లో ట్రాన్స్ పరెంట్ (పారదర్శకం)గా ఉండే వస్తువులు ఏవిధంగా మంచిగా అనిపిస్తాయో అలా మిమ్మల్ని కూడా అటువంటి ట్రాన్స్ పరెంట్ స్థితిలోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. ఈనాటి మహత్వాన్ని అర్థం చేసుకొన్నారా! మీ శరీరములో విరాజమానమై ఉన్న ఆత్మ స్పష్టంగా అందరికీ కనిపించేంత ట్రాన్స్ పరెంట్ గా అవ్వండి. మీ ఆత్మిక స్వరూపము వారికి వారి ఆత్మిక స్వరూపపు సాక్షాత్కారమును చేయించాలి. దీనినే అవ్యక్త లేక ఆత్మిక స్థితి అనుభవమును చేయించటము అని అంటారు.
             
           ఈరోజు సృతి యాత్ర రిజల్టు ఎలా ఉంది? స్నేహ స్వరూపంగా ఉందా లేక శక్తి స్వరూపంగా ఉందా? ఈ స్నేహము కూడా శక్తి అనే వరదానమును ప్రాపింపచేయిస్తుంది. కావున ఈ రోజు స్నేహ వరదానమును ప్రాప్తి చేసుకొనే రోజు. పురుషార్థము ద్వారా లభించే ప్రాప్తి ఒకటైతే, వరదానము ద్వారా లభించే ప్రాప్తి మరొకటి. మరి ఈరోజు పురుషార్థము ద్వారా వరదానమును ప్రాప్తింప చేసుకోవటము కాదు కానీ స్నేహము ద్వారా శక్తి వరదానమును ప్రాప్తింపజేసుకొనే రోజు. ఈ రోజును విశేష వరదానపు రోజుగా భావించాలి. స్నేహము ద్వారా వరదాత నుండి ఏ వరమైనా లభించగలదు. అర్థమైందా, పురుషార్థము ద్వారా కాదు, స్నేహము ద్వారా. ఎవరు ఎన్ని వరదానాలను తీసుకున్నారు అన్నది వారి వారిపై ఆధారపడి ఉంది. కానీ స్నేహము ద్వారా సమీపంగా వచ్చి వరదానాలను అందరూ ప్రాప్తిచేసుకోవచ్చు. వరదానాల రోజున ఎవరు ఎంతగా అర్థం చేసుకోగలరో అంతగానే పొందగలరు. క్యాచ్ చేసే వారిదే కమాల్(అద్భుతము). వరదానపు రోజైన ఈ రోజు ఎవరు ఎంతగా క్యాచ్ చెయ్యగలరో అంతగా వారు వరదానమును ప్రాప్తి చేసుకొన్నారు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇతరులెవ్వరి స్మృతి ఆకర్షితము చెయ్యకూడదు అని ఏవిధంగా పురుషార్థము చేస్తారో అలా ఈ రోజు సహజ స్మృతి అనుభవము చేసుకున్నారు. అచ్ఛా!

Comments

Post a Comment