13-10-1975 అవ్యక్త మురళి

13-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగంలో తోడు నిలుపుకోవడమే కల్పమంతటికి ఆధారం అవుతుంది.

                   క్రొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారింపచేసేవారు, విశ్వపరివర్తకులు అయిన శివబాబా మాట్లాడుతున్నారు -
                   మీ క్రొత్త ప్రపంచంలో కృష్ణునితో పాటు ఊయల ఎవరు ఊగుతారు, ఉగడంలో మజా ఉంటుంది, ఊపే వారి పాత్ర అయితే వేరుగా ఉంటుంది. ఎవరైతే ఇక్కడ తమ జీవితంలో అనగా జీవితం యొక్క ఆది నుండి అంతిమం వరకు బాబాతో పాటు ఉన్నారో, అంటే బుద్ధియోగంలో తోడుగా ఉన్నారో; సాకార రూపంలో తోడుగా ఉండడం అనేది అదృష్టమే కాని, సాకార తోడుతో పాటు బుద్ధి యొక్క తోడు కూడా సదా ఉన్నట్లయితే జీవితం యొక్క ఆది నుండి అంతిమం వరకు తోడు పెట్టుకున్నట్లయితే వారే అక్కడ కూడా ప్రతి జీవితం యొక్క భిన్న భిన్న ఆయుష్షులలో పాత్ర ఉంటుంది. అంటే బాల్యంలో కూడా తోడుగా ఉంటారు, చదువులో కూడా తోడుగా ఉంటారు. ఆడుకోవడంలో కూడా మరియు తిరిగి రాజ్యం చేయడంలో కూడా తోడుగా ఉంటారు. ఇక్కడ సదా తోడుగా ఉండేవారే అక్కడ కూడా సదా తోడుగా ఉంటారు. మొదటి ఆత్మకు ఎంత నషా, సంతోషం ఉంటుందో ఆ ఆత్మతో పాటు ఉండే ఆత్మలకు కూడా అంతే నషా సంతోషం ఉంటుంది. ఇప్పుడు బాబా సమానంగా ఎవరు అవుతారో వారే అక్కడ కూడా సమాన నషాలో ఉంటారు. కనుక అన్ని స్వరూపాలతో తోడుగా ఉండడం, ఇది కూడా విశేష పాత్ర. బాల్యం, యవ్వనం మరియు వానప్రస్థ అన్ని స్థితుల్లో తోడు. దీనికి ఆధారం ఇక్కడ జీవితం యొక్క ఆదిలోను, మధ్యలోను మరియు అంతిమంలోను తోడు నిలుపుకోవాలి. దీంట్లో మజా ఉంది కదా? ఎవరైతే మొదట్లో తోడుగా ఉంటారో వారే 84 జన్మల్లో కూడా అనగా భక్తికాలంలో, అల్పకాలిక రాజుగా అవ్వడంలో లేదా ఏ పాత్ర అభినయించడంలో అయినా ఏదో ఒక రకంగా దగ్గర సంబంధం స్థిరంగా ఉంటూ ఉంటుంది. భక్తి కూడా కలిసే మొదలుపెడతారు, ఎక్కేది కూడా కలిసే తిరిగి పడిపోయేది కూడా కలిసే. కనుక ఇప్పుడు తోడు నిలుపుకునే ఆధారంగానే కల్పమంతా తోడుగా ఉండడం అనేది ఆధారపడి ఉంటుంది. మంచిది. 

Comments