17-05-1973 అవ్యక్త మురళి

* 17-05-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు"

           బాబాలో ఏ విశేషతలైతే ఉన్నాయో వాటిని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా అందరికీ మీ ఈ చదువు యొక్క ముఖ్య నాలుగు సబ్జెక్టులను వినిపిస్తారు కదా! అలా ముఖ్యమైన విశేషతలు కూడా నాలుగు ఉన్నాయి, వాటిని గూర్చి మీకు తెలుసా? నాలుగు సబ్జెక్టుల అనుసారంగా నాలుగు విశేషతలు ఉన్నాయి. నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్, సర్వీసబుల్ మరియు బ్లిస్ ఫుల్. ఈ ముఖ్యమైన నాలుగు విశేషతలను మీరు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? ఈ నాలుగింటి శాతములో చాలా అంతరము ఉందా లేక తక్కువగా ఉందా? ఫాలో ఫాదర్ మీరు బాబాను అనుసరించేవారే కదా! ఈ నాలుగు సబ్జెక్టులేవైతే ఉన్నాయో అవి జీవితంలో సహజ రూపంలో ఉన్నాయా లేక ఇప్పటికీ ఎక్కుతూ దిగుతూ ఉండే నేచురల్ రూపం ఉందా? ఎంత శాతము నేచురల్ రూపంలో ఉంది? 14 కళల వరకు నేచురల్ రూపంలో ఉందా? సంపూర్ణ స్థితిని పొందేందుకు ఇప్పుడు పురుషార్థపు వేగము తీవ్రంగా ఉండకపోతే మరి సమయానుసారంగా స్వయమును సంపన్నంగా చేసుకోగల్గుతారా? టెంపరరీ కార్యం కొరకు బాప్ దాదాల అనుసారముగా లేక మీ మతం అనుసారంగా ఏ స్థితి అయితే తయారవుతుందో అది వేరే విషయము. కాని, చివరి స్థితి అనుసారంగా ఇటువంటి స్పీడ్ లో ముందుకు వెళుతున్నారా? మీ స్పీడ్ తో సంతుష్టంగా ఉన్నారా? దీని కొరకు కూడా ప్లాన్ తయారవుతోందా లేక కేవలం సేవ కొరకు ప్లాన్ లను తయారుచేస్తున్నారా?

          ఏవిధంగా సేవ కొరకు భిన్న భిన్న ప్లాన్లను తయారుచేస్తారో మరి అలాగే మీ స్పీడ్ తో సంతుష్టులుగా అయ్యేందుకు కూడా ఏదైనా క్రొత్త ప్లానును తయారుచేస్తున్నారా? ఏదైతే ప్రాక్టికల్ లో ప్రాప్తి లేక సఫలత లభిస్తుందో దాని అనుసారంగానే స్పీడు తీవ్రమవుతుంది. ఎప్పుడైతే మీ స్పీడ్ తో సంతుష్టమవుతారో మరి అప్పుడు పవర్‌ఫుల్ ప్లాన్లను తయారుచేయాలి కదా! సేవలో సఫలత తక్కువగా లభిస్తోందని గమనించినప్పుడు మరి దాని కొరకు ఏమైనా క్రొత్త విషయాలను ఆలోచిస్తారా? రకరకాలుగా హలమును నడిపించి ఈ ధరణిని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తున్నారా? స్వయం అలా చేయకపోయినా సంగఠన యొక్క సహయోగం ద్వారా కూడా దానిని సరిచేయవచ్చు కదా! ఈ విషయంలో అంతే స్పష్టంగా ఉన్నారా? మీ పట్ల అంతటి లగనము ఉందా? ఎంత చింత ఉంది, మరి ప్లాన్ లను తయారుచేస్తున్నారా? మీ స్పీడును పెంచేందుకు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారుచేశారా? ఏకాంతంలో ఉంటూ స్మృతియాత్రను పెంచే ప్లాన్‌ను తయారుచేస్తున్నారా? ఏవిధంగా విశేష సేవ యొక్క స్టేజీ పైకి వచ్చేవారెవరైతే ఉంటారో వారు తమ ప్రతి కార్యమును సెట్ చేసే, అనుభవం చేసే ప్లాన్‌ను తయారుచేయవలసి ఉంటుంది కదా! అలాగే అమృతవేళ తమ పురుషార్థపు ఉన్నతి యొక్క ప్లాన్ ను సెట్ చేసుకోవాలి. ఈ రోజు ఏ విషయంలో లేక ఏ బలహీనతపై విశేషమైన అటెన్షన్‌ను ఉంచి దీని శాతముని పెంచాలి అంటూ ప్రతి ఒక్కరూ తమ ధైర్యము అనుసారంగా ఆ ప్లాన్‌ను బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ రోజు ప్రాక్టికల్ లోకి ఏమి తీసుకురావాలి మరియు ఎంత పర్సంటేజీ వరకు ఈ విషయాన్ని పురుషార్థంలోకి తీసుకురావాలి అంటూ మీ దినచర్యతో పాటు ఇది సెట్ చేసుకోండి మళ్ళీ రాత్రివేళలో మీరు సెట్ చేసిన పాయింట్లను ఎంతవరకు ప్రాక్టికల్ లోకి మరియు ఎంత, పర్సంటేజీ వరకు ధారణ చేయగలిగారు అన్నది పరిశీలించండి. అలా చేయలేకపోయి ఉంటే దాని కారణం ఏమిటి మరియుచేసినట్లయితే ఏఏ విశేష యుక్తుల ద్వారా స్వయంలో ఉన్నతిని అనుభవం చేసుకున్నారు? ఈ రెండు రిజల్టులను మీ ముందుకు తీసుకురావాలి మరియు ఈనాటి లక్ష్యమునేదైతే ఉంచారో అందులో అంతటి సఫలత లేకపోతే మరియు ఎంత ప్లాన్ నైతే తయారుచేశారో అంతగా ప్రాక్టికల్ లో చేయకపోయినట్లయితే దానిని వదిలివేయకూడదు. ఏ విధంగా స్థూల కార్యంలో లక్ష్యమును ఉంచినప్పుడు ఏదైనా కారణానికి వశమై అది అసంపూర్ణంగా ఉండిపోతే దానిని సంపన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తారు కదా! అలాగే రోజూ చేసే ఈ కార్యంపై లక్ష్యమును ఉంచుతూ సంపన్నం చేయాలి. ఒక్క విషయంపై విశేష ధ్యానమును ఉంచడం ద్వారా విశేషమైన శక్తి లభిస్తుంది. ఏ కార్యమునైనా చేస్తూ స్మృతి వస్తుంది మరియు స్మృతి స్వరూపులుగా కూడా అయిపోతారు. ఏవిధంగా బాహ్యమైన జ్ఞానంలో కూడా ఏదైనా పాఠమును పక్కా చేసినప్పుడు దానిని రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు దృడం చేస్తారే కాని దానిని వదిలివేయరు. అలాగే ఇందులో కూడా మీ లక్ష్యమును ఉంచి ఒక్కొక్క విషయమును పూర్తి చేస్తూ ఉండండి. ఇందులో నిర్లక్ష్యం ఉండకూడదు. ఆలోచించాక, ప్లానును తయారుచేశాక దానిని ప్రాక్టికల్‌గా చేయడంలో ఏదైనా పరిస్థితి ముందుకు వచ్చినట్లయితే చేయవలసిందే అన్న సంకల్పం యొక్క దృఢత్వం ఉంటే అదే దృఢత్వము సంపూర్ణతకు సమీపంగా తీసుకువస్తుంది. వర్తమాన సమయంలో ప్లాను కూడా ఉంది, కాని ఇందులో లోపము ఏమిటి? దృఢత్వము యొక్క లోపము. దృఢసంకల్పమును చేయరు. విశేష రూపంగా అటెన్షన్ ను ఇచ్చి చూపడంలో లోపం ఉంది. మహారథులకు అనగా సర్వీసబుల్ శ్రేష్ఠ ఆత్మలకు సేవతో పాటు సెల్ఫ్ సర్వీస్ యొక్క అటెన్షన్ కూడా ఉండాలి.

          ఒకటేమో సెల్ఫ్ సర్వీస్, ఇంకొకటి విశ్వకళ్యాణం కొరకు సేవ, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ సర్రిగ్గా  ఉంటోందా? ఇప్పుడు ఈ విధంగా మీ శ్రేష్ఠ సంకల్పాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురండి, కేవలం ఆలోచించకండి.  ఏ విధంగా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ సమయం గడిచిపోకూడదు అని మీరు జనులకు చెబుతారో అదేవిధంగా మీ ఉన్నతి కొరకు ప్లానును ఆలోచించడంతో పాటు ప్రాక్టికల్ లో దృఢ సంకల్పంతో అది చేయండి. ప్రతిరోజూ ఒక విశేషతను మీ ముందు ఉంచుకుంటూ మీ ప్లానును ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే కొద్దిరోజులలోనే స్వయంలో మహాన్ అంతరమును అనుభవం చేసుకుంటారు.

          ఈ విశేష వరదాన భూమిలో విశేషంగా మీ ఉన్నతి కొరకు కూడా ఏదైనా ప్లానును తయారుచేస్తారా లేక కేవలం సేవ చేసి, మీటింగ్ చేసి వెళ్ళిపోతున్నారా? స్వఉన్నతి కొరకు రాత్రి సమయమైతే అందరి వద్దా ఉంది. ఎప్పుడైతే విశేషంగా సేవా ప్లాన్ లను ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారో మరి ఆ రోజులలో నిద్రాజీతులుగా అవ్వరా? మీ ఉన్నతి కొరకు నిద్రను కూడా త్యాగం చేసినట్లయితే మరి సమయం లభించజాలదా? ఇక్కడ ఇంకేం కార్యం ఉంది? ఏవిధంగా ఇతర ప్లాన్ లను తయారుచేస్తారో అలాగే మీ ఉన్నతి కొరకు కూడా ఏదైనా విశేష ప్లానును ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. ఇక్కడ ఏ ఉన్నతి యొక్క సాధనాలను ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారో వాటికి అన్ని వైపుల నుండి సహయోగం యొక్క లిస్టు లభిస్తుంది. ఏ లక్ష్యమునైతే ఉంచుతారో వాటి అనుసారంగా ఎప్పటివరకైతే కారణమును మరియు నివారణను కూడా అర్థంచేసుకోరో అప్పటివరకు ప్రాక్టికల్ లో లక్షణాలు ఏర్పడజాలవు. జ్ఞానస్వరూపులుగా అయితే అయిపోయారు, కాని ఏ లోపం కారణంగా ప్రాక్టికల్ గా అవ్వలేకపోతున్నారు? శక్తిశాలిగా లేని కారణంగా జ్ఞానమును ప్రాక్టికల్ లో చేయలేకపోతారు. శక్తిశాలిగా అయ్యేందుకు ప్రాక్టికల్ గా ఏమి చేయవలసి ఉంటుంది? ప్రాక్టికల్ ప్లాన్‌ను తయారుచేయవలసి ఉంటుంది. ఇప్పటివరకు మీరే తయారవుతూ ఉన్నట్లయితే మరి మీ వంశావళి ఎప్పుడు తయారవుతుంది, ప్రజలు ఎప్పుడు తయారవుతారు? ఈసారి ప్రాక్టికల్ గా ఏదైనా చేసి చూపించాలి. పురుషార్థంలో ప్రతి ఒక్కరికీ చాలా మంచి అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పరస్పరపు ఉన్నతి యొక్క సాధనాలను గూర్చి వింటూ స్వయంలో కూడా శక్తి నిండుతుంది. ఇటువంటి క్లాసులను ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? అచ్ఛా! ఓం శాంతి.

Comments