* 17-05-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"సంగఠనరూపీ కోటను దృఢముగా చేసేందుకు సాధనము”
పాండవ భవనమును పాండవుల కోట అని అంటారు. ఈ కోటకు గాయనం కూడా ఉంది. అలాగే ఈ ఈశ్వరీయ సంగఠన ఏదైతే ఉందో ఇది కూడా ఒక కోటయే. ఏ విధంగా స్థూలమైన కోటను శత్రువులెవ్వరూ ఆక్రమించకుండా చాలా శక్తివంతంగా నిర్మించడం జరుగుతుందో, అదేవిధంగా ముఖ్యమైన కోట - సంగఠన(ఐక్యత) యొక్క కోట. ఇందులో కూడా ఎంతటి దృఢత్వముండాలంటే, ఏ విధమైన వికారము శత్రువు రూపంలో యుద్ధము చేయజాలకూడదు. ఎవరైనా శత్రువు యుద్ధం చేస్తున్నాడంటే తప్పకుండా కోట యొక్క దృఢత్వంలో లోటు ఉన్నట్లే. ఇదైతే సంగఠనరూపీ కోట. దీని దృఢత్వము కొరకు మూడు విషయాల అవసరం ఉంది. మూడు విషయాలూ దృఢంగా ఉన్నట్లయితే ఈ కోట లోపలికి ఏ రూపములోనూ ఏ శత్రువూ యుద్ధము చేయలేడు, శత్రువు ప్రవేశించలేడు కూడా. ప్రవేశించేందుకు ధైర్యము చేయజాలరు. వేటి ద్వారానైతే దృఢముగా అవ్వగలరో ఆ మూడు విషయాలు ఏమిటి? 1. స్నేహము 2. స్వచ్ఛత మరియు 3. ఆత్మికత. ఈ మూడు విషయాలు దృఢంగా ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరి యుద్ధమూ జరుగదు. ఎక్కడైనా ఎవరైనా యుద్ధం చేస్తున్నారంటే దానికి కారణము - ఈ మూడింటిలోనూ ఏదో ఒక లోపము ఉంది లేక స్నేహములోనైనా, ఆత్మికతలోనైనా లోపము ఉంది. కావున సంగఠనరూపీ కోటను దృఢం చేసేందుకు ఈ మూడు విషయాలపై చాలా చాలా అటెన్షన్ కావాలి. ప్రతి స్థానంలోనూ ఈ విషయాలపై ఫోర్స్ ను ఉంచి కూడా వీటిని తీసుకురావాలి. ఏ విధంగా స్థూలంలో కూడా వాయుమండలమును శుద్ధం చేసేందుకు ఎయిర్ ఫ్రెషనర్ ను వాడుతారో, దాని ద్వారా వాయుమండలము అల్పకాలికంగానైనా మారిపోతుంది. అదేవిధంగా ఇందులో కూడా ఈ విషయాలలో ప్రెషర్ కలిగించాలి. తద్వారా వాయుమండలపు ప్రభావం కూడా తొలగిపోవాలి. ఎవరినైనా ఆకర్షించేందుకు ముఖ్యమైన విషయాలు ఇవే. స్నేహము మరియ స్వచ్ఛత ద్వారా ప్రభావితమైతే అవుతారు. కాని, ముఖ్యమైన మూడవ విషయము ఆత్మికత యొక్క విషయము.
ఒక్కొక్కరినీ సంగఠనలోకి తీసుకువచ్చేందుకు లేక సంగఠనలో శక్తిని పెంచేందుకు పరస్పరంలో కూడా ఈ మూడు విషయాలను ఒకరికొకరు అందించుకుంటూ అటెన్షనను ఇచ్చే అవసరం ఉంది. మూడు విషయాలలోను ఏదైనా విషయంలో లోటు ఉన్నట్లయితే తప్పకుండా ఏదో ఒక బలహీనత ఉంది, కావుననే ఏ సఫలత అయితే లభించాలో అది లభించడం లేదు. తప్పకుండా ఏదో ఒక లోటు ఉంది. కావున ఈ విషయాలను ఎంతో ధ్యానములో ఉంచుకోవాలి. పరస్పర ఐక్యత ద్వారా కోట దృఢంగా అవుతుంది. కోటగోడలోని ఒక్క ఇటుక లేక రాయి యొక్క సహయోగము పూర్తిగా లేకపోయినా ఆ కోట సురక్షితంగా ఉండజాలదు. అది కొద్దిగా చలించినా బలహీనత వచ్చేస్తుంది. చెప్పడానికి అది ఒక్క ఇటుక యొక్క లోటే - అయినా కాని, బలహీనత నలువైపులా వ్యాపిస్తుంది. అలాగే దృఢత్వము కొరకు మూడు విషయాలు ఎంతో అవసరం. అప్పుడిక ఎటువంటి వైబ్రేషన్లు కూడా స్పర్శించజాలవు. తమపై తమకు అటెన్షన్ తక్కువగా ఉంది. ఏ విధంగా సాకార బాబా సాకార రూపంలో లైట్ హౌస్ గా, మైట్ హౌస్ దూరం నుండే కనిపించేవారో, అలాగే ఆత్మికతలో దృఢత్వము ఉండడం ద్వారా లోపలికి ఎవరు వచ్చినా, లైట్ హౌస్ గా మరియు మైట్ హౌస్ గా అనుభవం చేసుకుంటారు. ఏ విధంగా స్నేహము మరియు స్వచ్ఛత బాహ్యరూపంలో కనిపిస్తుందో, అలాగే ఆతిక్మత లేక అలౌకికత బాహ్యరూపంలో ప్రత్యక్షంగా కనిపించాలి. అప్పుడే జయజయకారాలు జరుగుతాయి. డ్రామానుసారంగా ఏదైతే జరుగుతోందో దానిని యథార్థము అనే అంటారు. కాని, దానితో పాటు శక్తిరూపపు అనుభవం కూడా కలగాలి. ఈ అలౌకికత తప్పకుండా ఉండాలి.
ఈ స్థానము ఇతర స్థానాలకన్నా భిన్నమైనది. స్వచ్ఛత లేక స్నేహము ప్రపంచంలో కూడా అల్పకాలికంగా లభిస్తుంది, కానీ ఆత్మికత తక్కువగా ఉంది. ఇక్కడ ఈశ్వరీయ కార్యము జరుగుతోంది. ఇది సాధారణ విషయము కాదు అన్న ఈ అనుభవము ఇక్కడకు వచ్చి చేసుకోవాలి. ఎప్పుడైతే తమ అలౌకిక నషాలో ఉంటూ బాణం వేస్తారో అప్పుడు ఇది జరుగుతుంది. తమ చరిత్ర ద్వారా, నడవడిక ద్వారా, వాణి ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, అన్నిరకాల సాధనాల ద్వారా బాబా యొక్క ప్రాక్టికల్ పాత్ర యొక్క ప్రత్యక్షత అవతరణ భూమిలో ప్రత్యక్షంగా లభించాలి అన్న లక్ష్యమును తప్పకుండా ఉంచాలి. కేవలం స్నేహము, స్వచ్ఛత యొక్క ప్రశంసను ఎక్కడైనా చేయవచ్చు, చిన్న చిన్న స్థానాలలో కూడా ప్రభావము పడుతుంది. కాని కర్మభూమి, చరిత్రభూమి ద్వారా ఆ భూమిలోకి వచ్చే విశేషత ఉండాలి. ఎవరినైనా చుట్టుముట్టి నలువైపుల నుండి వారిని తమవైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు కదా! కావున బాబాతోపాటు స్నేహంలో కూడా సమీపంగా తీసుకువచ్చే పాయింట్లతో చుట్టుముట్టండి. దీనికొరకు విశేషంగా ఈ భూమిపై సంపర్కంలోకి వచ్చేవారిని సంబంధంలోకి సమీపంగా తీసుకురావాలి. ఎవరైతే సంపర్కంలోకి వస్తారో వారే సంబంధంలో సమీపంగా రాగలరు.
నలువైపులా ఇదే శబ్దము చెవులలో మారుమ్రోగుతూ ఉండాలి, నలువైపులా ఇదే వాయుమండలము వారికి శక్తిని ఇస్తూ ఉండాలి. దీనికొరకు మూడు విషయాల అవసరం ఎంతో ఉంది. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దానిని గూర్చి మంచిగానే జరిగింది అని అంటాము. మంచిగా అయితే అన్నీ జరుగుతాయి. కాని, ఇప్పటి స్టేజ్ అనుసారంగా చాలా చాలా మంచిగా జరగాలి. అచ్ఛా అద్భుతం ఏమిటంటే విస్తారం ద్వారా బీజమును ప్రకటితం చేయాలి. విస్తారంలో బీజమును గుప్తం చేసేస్తారు. ఇప్పుడైతే ఇది వృక్షపు అంతిమ స్థితి కదా! మధ్యలో గుప్తముగా ఉంటుంది. కాని, అంతిమం వరకు గుప్తంగా ఉండజాలదు. అతి విస్తారము తర్వాత అంతిమంలో బీజమే ప్రత్యక్షమవుతుంది కదా! మనుష్య ఆత్మల స్వభావం ఏమిటంటే వారు వెరైటీకి ఎక్కువగా ఆకర్షితులవుతారు. కాని మీరు దేనికొరకు నిమిత్తులుగా ఉన్నారు? అన్ని ఆత్మల వెరైటీ లేక విస్తారము యొక్క ఆకర్షణ నుండి వారి ధ్యానమును మళ్ళించి బీజమువైపుకు ఆకర్షితము చేసేందుకు నిమిత్తులుగా ఉన్నారు. అచ్ఛా!
Comments
Post a Comment