16-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంకల్ప శక్తిని అదుపు చేసుకుని సిద్ధిస్వరూపంగా అయ్యేటందుకు యుక్తులు.
జ్ఞానీ మరియు యోగీ పిల్లలతో సంఘటనా రూపంతో ఒకే సంకల్పం మరియు ఒకే ఆలోచన కలిగిన వారిగా తయారయ్యే విధి చెబుతూ బాప్ దాదా మాట్లాడుతున్నారు -
సదా బాబా సమానంగా నిరాకారి స్థితిలో స్థితులై ఈ సాకారీ శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఈ కర్మ క్షేత్రం పై కర్మయోగి అయి ప్రతి కర్మ చేస్తున్నారా? పేరే కర్మయోగి, ఈ పేరే రుజువు చేస్తుంది. మీరు యోగి అని అనగా నిరాకారీ ఆత్మిక స్వరూపంలో స్థితులై కర్మ చేసేవారు. కర్మ లేకుండా ఒక్క సెకెను కూడా ఉండలేరు. కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోవడం అనగా నిరంతరం కర్మ చేయడం. ఎలాగైతే కర్మ లేకుండా ఉండలేరో అలాగే స్మృతి, యోగం లేకుండా కూడా ఒక్క సెకను కూడా ఉండకూడదు. అందువలన కర్మతో పాటు యోగీ అనే పేరు కూడా వెనువెంట ఉంది. ఎలాగైతే కర్మ స్వతహగా జరుగుతుంటుందో కర్మ అనేది కర్మేంద్రియాల యొక్క సహజ అభ్యాసం అలాగే బుద్ధికి స్మృతి సహజ అభ్యాసంగా ఉండాలి. అది అనాదిగా ఈ కర్మేంద్రియాలకు తమతమ కార్యాలున్నాయి. చేతులు కదిలించడం లేదా పాదాలతో నడవడం. వీటిలో ఏ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా బ్రాహ్మణ జీవితం లేదా ఈ సంగమయుగీ జీవితంలో బుద్ధి యొక్క నిజకార్యం లేదా జన్మ యొక్క కార్యం ఏమిటంటే - స్మృతి. ఏదైతే జీవితం యొక్క నిజకార్యం ఉంటుందో అది సహజంగా మరియు స్వతహగానే జరుగుతూ ఉంటుంది. మరైతే స్వయాన్ని సహజ కర్మయోగిగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్టమనిపిస్తుందా? ఇతరులదైతే కష్టమనిపిస్తుంది. ఇదైతే కల్పకల్పాలుగా మీ కార్యం. అయినా కానీ కష్టం అనిపిస్తుంది. అనగా నిరంతర కర్మయోగి స్థితి అనుభవం అవ్వడం లేదంటే దానికి కారణం ఏమిటి?
ఒకవేళ యోగం కుదరడం లేదంటే తప్పకుండా ఇంద్రియాల ద్వారా అల్పకాలిక సుఖాన్ని ప్రాప్తింపచేసి సదాకాలిక ప్రాప్తి నుండి వంచితం చేసే ఏదో ఒక భోగాన్ని భోగించడంలో నిమగ్నం అయి ఉన్నారు. అందువలనే మీ నిజకార్యాన్ని మరిచిపోయారు. ఎలాగైతే ఈనాటి ధనవంతులు లేదా కలియుగీ రాజులు భోగవిలాసాల్లో నిమగ్నం అయిపోతే రాజ్యం చేయడం అనే తమ నిజకార్యాన్ని లేదా తమ అధికారాన్ని మరిచిపోతారు. అలాగే ఆత్మ కూడా భోగాన్ని భోగించడంలో నిమగ్నం అయిపోయిన కారణంగా యోగాన్ని మరిచిపోతుంది. అనగా తన అధికారాన్ని మరిచిపోతుంది. ఎప్పటి వరకు ఇలా అల్పకాలిక భోగాలు భోగించడంలో నిమగ్నం అయి ఉంటారో, ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ యోగం ఉండదు. అందువలనే కష్టం అనిపిస్తుంది.
వర్తమాన సమయంలో మాయ బ్రాహ్మణ పిల్లల బుద్ధిపైన మొదట యుద్ధం చేస్తుంది. బుద్ధి యొక్క సంబంధాన్ని మొదట తెంచేస్తుంది. ఎవరైన శత్రువులు యుద్ధం చేసేటప్పుడు మొదట టెలిఫోన్, రేడియో మొదలైనవాటి కనెక్షన్లు కట్ చేస్తారు. కరెంట్ మరియు నీరు మొదలైనవాటి కనెక్షన్ కూడా కట్ చేస్తారు. ఆ తరువాత యుద్ధం చేస్తారు. అలాగే మాయ కూడా మొదట బుద్ధి యొక్క కనెక్షన్ త్రెంచేస్తుంది. అప్పుడు లైట్ మైట్ శక్తులు మరియు జ్ఞానం యొక్క సాంగత్యం అన్నీ స్వతహగానే ఆగిపోతాయి. అంటే మూర్చితులుగా చేస్తుంది. అనగా స్వ స్వరూప స్మృతి నుండి వంచితం చేసేస్తుంది లేదా స్పృహ కోల్పోయేలా చేసేస్తుంది. అందువలన సదా బుద్ధి పైన అటెన్షన్ యొక్క కాపలా ఉండాలి. అప్పుడే నిరంతర కర్మయోగిగా సహజంగా కాగలుగుతారు.
బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలంటే అక్కడ స్థితి చేయాలి. ఇలాంటి అభ్యాసం చేయండి. సంకల్పం చేయగానే స్థితి రావాలి ఈ ఆత్మిక వ్యాయామాన్ని సదా బుద్ధి ద్వారా చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి, ఇప్పుడిప్పుడే సూక్ష్మ అవ్యక్త ఫరిస్తాగా అయిపోవాలి మరియు ఇప్పుడిప్పుడే సాకార కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుని కర్మయోగి అయిపోవాలి. సంకల్ప శక్తిని అదుపుచేయడం అని దీనినే అంటారు. సంకల్పాలను రచన అని అంటారు మరియు మీరు రచయిత. కనుక ఎంత సమయం ఏ సంకల్పాలు చేయాలంటే అంత సమయం అవే నడవాలి: బుద్ధిని ఎక్కడ జోడించాలంటే అక్కడే జోడించాలి వారినే అధికారి అని అంటారు. ఈ అభ్యాసం ఇప్పుడు తక్కువగా ఉంది. కనుక ఈ అభ్యాసం చేయండి. మీకు మీరే మీ కోసం కార్యక్రమం చేసుకోండి మరియు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఎంత సమయం నిర్ణయించుకున్నానో అంత సమయం ఆ స్థితిలో ఉన్నానా?
హఠయోగులు తమ యొక్క ఏ కర్మేంద్రియాన్ని అయినా కాళ్లను లేదా చేతులను ఏకాగ్రం చేసేటందుకు కొంత సమయం నిర్ణయించుకుంటారు. అంటే ఇంత సమయం ఒక కాలును లేదా ఒక చేతిని క్రిందకి ఉంచుతాను లేదా పైకి ఉంచుతాను, తలను కిందికి దించుతాను లేదా పైకి ఉంచుతాను అని నిర్ణయించుకుంటారు. కానీ ఇది తప్పు అనుసరణ (రాంగ్ కాపీ). బాబా నేర్పించారు. బుద్ధిలో ఒక సంకల్పాన్ని ధారణ చేసి కూర్చోండి అని, దానిని వ్యతిరేకంగా కాపీ చేసి ఒకకాలిని పైకి లేపి ఒంటికాలిపై నిలబడతారు. ఒక్క సంకల్పంలో స్థితులవ్వండని బాబా చెబుతారు, వారు ఒంటి కాలిపై నిల్చుంటారు. సదా జ్ఞానసూర్యునికి సన్ముఖంలో ఉండండి, విముఖం అవ్వకండి అని బాబా చెబుతారు వారు స్థూల సూర్యుని వైపు ముఖం పెట్టి కూర్చుంటారు అంటే తప్పుగా అనుసరించినట్లే కదా? యదార్ధ బుద్ధియోగం యొక్క అభ్యాసం ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. వారు మొండిగా చేస్తారు. మీరు అధికారికంగా చేస్తారు. అందువలన అది కష్టమైనది ఇది సహజమైనది ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. ఒక్క సెకెనులో అందరూ ఏకమతం అయిపోవాలి. సంఘటనగా అందరి సంకల్పం ఒకటే అయినప్పుడు ఒకే స్మృతిలో ఉన్నప్పుడు అందరి స్వరూపం ఒకటిగా అయినప్పుడు సంఘటన యొక్క జయజయకారాల యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది.
ఎలాగైతే స్థూల కార్యం లేదా సేవలో ఆలోచనలను కలుపుకుంటున్నారో అంటే అందరూ ఒకే ఆలోచన కలిగిన వారిగా అవుతున్నారు. అప్పుడే ఆ కార్యం సఫలం అవుతుంది. అదేవిధంగా సంఘటనరూపంలో అందరూ ఒకే సంకల్ప స్వరూపంగా అయిపోవాలి. బీజరూప స్మృతి లేదా స్థితి అని అనుకోగానే బీజరూప స్థితిలో స్థితులైపోవాలి, ఎప్పుడైతే అందరూ ఒకే స్మృతిస్వరూపంగా అయిపోతారో అప్పుడు ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని అనుభవం చేసుకుంటారు లేదా సిద్ది స్వరూపులుగా అయిపోతారు. ఏదైతే ఆలోచిస్తారో మరియు ఏదైతో మాట్లాడతారో అదే ప్రత్యక్షంలో కనిపిస్తుంది. దీనినే సిద్ది స్వరూపం అని అంటారు. జై జై కారాలకు ఇదే గుర్తు. దీనికి స్మృతిచిహ్నమే కలియుగీ పర్వతానికి అందరూ కలిసి వ్రేలు ఇవ్వడం, సంకల్పమే వ్రేలు, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు తయారుచేయండి.
సంఘటనరూపంలో ఒకే స్మృతిస్వరూపంగా అవ్వటం ద్వారా వాయుమండలం శక్తిశాలిగా అవుతుంది. సంలగ్నత యొక్క అగ్ని అనేది భట్టీవలె అనుభవం అవుతుంది, ఆ తరంగాలు నలువైపులా వ్యాపిస్తాయి. ఆటంబాంబును ఒక్క స్థానంలో ప్రయోగించడం ద్వారా నలువైపులా దాని యొక్క అంశం వ్యాపించబడుతుందో అది అణుబాంబు అయితే ఇది ఆత్మిక బాంబు. దీని ప్రభావం అనేక ఆత్మలను ఆకర్షితం చేస్తుంది. అప్పుడు సహజంగానే ప్రజలు వృద్ధి అవుతారు. ఆ అణుబాంబు యొక్క ప్రభావం భూమిపైన చాలాకాలం ఉంటుంది. అదేవిధంగా చైతన్యజీవితాలు అనే భూమిపైన కూడా బేహద్ వైరాగ్యం యొక్క ప్రభావం చాలా పడుతుంది. అందువలన సహజంగానే ప్రజలు తయారవుతారు మంచిది.
ఈ విధంగా ఆత్మిక వ్యాయామం యొక్క అభ్యాసీలకు, సదా అధికారి, విశ్వకళ్యాణి, ప్రతి సంకల్పాన్ని సిద్ధింపచేసుకునే సిద్ధిస్వరూప ఆత్మలకు, బాబా సమానంగా ప్రకృతిని కూడా ఆధీనం చేసుకుని నడిపించేవారికి మరియు సర్వ సమర్థ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు గుడ్ మార్నింగ్. మంచిది.
Comments
Post a Comment