16-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ప్రసిద్ధి అవ్వడం అనేది సంకల్పం మరియు మాట యొక్క సిద్ధి ఆధారంగా ఉంటుంది.
జ్ఞాన ధారణల యొక్క గుహ్యత మరియు మహీనతలోకి తీసుకువెళ్ళేవారు, ఆనందసాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
మహారథీ పిల్లలు వర్తమాన సమయంలో ఏ లెక్కల ఖాతా పెట్టుకోవాలి? ఇప్పుడు మహారథీలు సిద్ధి స్వరూపంగా అవ్వాల్సిన సీజన్. వారి యొక్క ప్రతి మాట మరియు సంకల్పం సిద్ధించాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే వారి యొక్క ప్రతి మాట మరియు ప్రతి సంకల్పం డ్రామానుసారం సత్యం అనగా సమర్ధంగా ఉంటుందో అప్పుడు. కనుక మహారథీలు ఇప్పుడు పెట్టుకోవాల్సిన లెక్కలఖాతా ఏమిటంటే రోజంతటిలో అనేక సంకల్పాలు నడుస్తుంటాయి. నోటితో మాటలు వెలువడుతూ ఉంటాయి, వాటిలో ఎన్ని సిద్ధిస్తున్నాయి? సంకల్పం అనేది బీజం. బీజం సమర్థంగా ఉంటే దానికి మంచి ఫలితం లభిస్తుంది. దానినే సంకల్ప సిద్ధి పొందడం అని అంటారు, కనుక రోజంతటిలో ఎన్ని సంకల్పాలు మరియు మాటలు సిద్ధిస్తున్నాయి? డ్రామానుసారం ఏదైతే మాట్లాడారో ఏదైతే జరగాలో అదే మాట్లాడారా? దీనికోసం ప్రతి మాట మరియు సంకల్పాన్ని సమర్థంగా తయారుచేసుకోవడంపై ధ్యాస పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక మహారథీల యొక్క లెక్కాచారం ఇప్పుడు ఈ విధంగా ఉండాలి. సంకల్పం అనేది బీజం. ఆ బీజం సమర్థంగా ఉంటే దానికి ఫలం మంచిగా లభిస్తుంది. దానినే సంకల్ప సిద్ది అని అంటారు. డ్రామానుసారం ఏదైతే మాటాడారో ఏది జరగాలో అదే మాట్లాడారా, దీని కొరకు ప్రతి మాట సంకల్పాన్ని సమర్థంగా తయారు చేసుకోవడంపై ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. మహారథీల లెక్కలఖాతా ఎప్పుడో దీనికి సంబంధించి ఉండాలి. భక్తి మార్గంలో కూడా వీరు సిద్ధి స్వరూపులు అని అంటారు కదా! అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరి సంకల్పము మరియు మాట సిద్ధిస్తాయో ఆ సిద్ధి ఆధారంగా వారు ప్రసిద్ధులు అవుతారు. సిద్ది లేకపోతే ప్రసిద్ధులు కాలేరు. భక్తిలో కొంతమంది దేవీ దేవతలు ప్రసిద్ధులుగా ఉంటారు. కొందరు ప్రసిద్ధులుగా ఉండరు. వారు కూడా దేవీదేవతలుగానే అంగీకరించబడతారు కానీ ప్రసిద్ధులుగా ఉండరు. కనుక సంకల్పం మరియు మాట సిద్ధించడం - ప్రసిద్ధి అవ్వడానికి ఇదే ఆధారం. దీని ద్వారా స్వతహగానే అవ్యక్త ఫరిస్తాగా అయిపోతారు మరియు సమయం మిగులుతుంది. వాచాలోకి రావడం అనేది స్వతహగానే సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే శాంతిధామానికి వెళ్లాల్సి ఉంది కదా! శాంతి లేదా ఆకారీ ఫరిస్తా స్థితి యొక్క సంస్కారం తనవైపుకు ఆకర్షిస్తుంది. సేవ కూడా ఎంతగా పెరిగిపోతుందంటే వాచా ద్వారా సేవ చేసే అవకాశమే లభించదు. నయనాల ద్వారా మరియు మీ యొక్క హర్షితముఖం ద్వారా మస్తకంలో మెరిసే మణి ద్వారా సేవ చేయగలుగుతారు. పరివర్తన అయితే జరుగుతుంది కదా? ఎప్పుడైతే మీ లెక్కాచారం చూసుకుంటారో అప్పుడే అభ్యాసం పెరుగుతుంది. మహరథీల యొక్క లెక్కలఖాతా ఇదే. ఎవరికి దు:ఖం ఇవ్వలేదు కదా, ఏ వికారానికి వశం అవ్వలేదు కదా, ఇది మహారథీల లెక్కలఖాతా కాదు. ఇది గుర్రపు సవారీల పని, మహారథీల లెక్కలఖాతా కూడా మహాన్ గా ఉండాలి. ఇలా పరస్పరం గుహ్య పురుషార్థానికి ప్లాన్స్ తయారుచేసుకోండి. దీని కోసమే మధ్యమధ్యలో సమయం లభిస్తుంది. మేళాలో అయితే సమయం లభించదు కదా? మేళాలో అయితే మరో రకమైన సేవలో తత్పరులై ఉంటారు. మేళాలలో ఇచ్చేటటువంటి సమయం, మేళా తరువాత స్వయం నింపుకునే సమయం లభిస్తుంది. మేళాలలో ఇవ్వడంలోనే రాత్రి, పగలు సమాప్తం అయిపోతాయి. బాప్ దాదాకు కూడా తెలుసు ఇంతమంది ఆత్మలకు ఇవ్వటానికి నిమిత్తంగా అయినప్పుడు ఇచ్చేటటువంటి ప్లాన్స్ లేదా సంకల్పాలు నడుస్తుంటాయి కదా, అప్పుడే సంతుష్టత యొక్క సర్టిఫికెట్ స్వతహగానే లభిస్తుంది. అందరి యొక్క సంతుష్టత ఇది కూడా మీ పురుషార్ధంలో హైజంప్ చేయించడంలో సహయోగం ఇస్తుంది. ఇదైతే చేయవలసి ఉంటుంది అంటారు. ఇవన్నీ తరువాత విషయాలు అందరూ నోట్ చేసుకుంటున్నారు కదా? మరలా వాళ్ళను కూర్చోపెట్టి రివైజ్ చేయండి. ఇప్పుడు లభించేది అంతా బుద్దిలో నిండిపోతుంటుంది కదా, తిరిగి మరలా కూర్చుని రివైజ్ చేసుకుంటూ మహీనతలోకి లేదా గుహ్యతలోకి వెళ్ళినప్పుడే ఇతరులను కూడా గుహ్యతలోకి తీసుకురాగలరు. ఇప్పటి వరకు ఏదైతే నడుస్తుందో, ఏవిధంగా అయితే నడుస్తున్నారో బాప్ దాదా దాంతో సంతుష్టంగా మరియు హర్షితంగా ఉన్నారు. మంచిది.
OM SHANTHI MERE BABA
ReplyDelete