16-05-1973 అవ్యక్త మురళి

* 16-05-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అంతిమ పురుషార్థము - నష్టోమోహా స్మృతిర్లబ్ధ”

          స్వయమును సర్వశక్తులతో సంపన్నమూర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? బాప్ దాదా ద్వారా ఈ శ్రేష్ఠజన్మలో వారసత్వము ఏమి లభించింది? వారసత్వపు అధికారులుగా అవ్వడం అనగా సర్వశక్తులకు అధికారులుగా అవ్వడము. మరి సర్వశక్తుల అధికారులుగా అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా? మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం ద్వారా ఏ ప్రాప్తి స్వరూపమునైతే అనుభవం చేసుకుంటారో అదే అనుభవంలో నిరంతరము స్థితులై ఉంటారా లేక అందులో తేడా ఉంటుందా? వారసత్వపు అధికారులుగా అవ్వడంలో కేవలం రెండు విషయాలను బుద్ధిలో ఉంచుకోవడం ద్వారా అంతరం సమాప్తమై నిరంతరం ఆ స్థితిని తయారు చేసుకోగల్గుతారు. ఆ రెండు పదాలు ఏమిటో మీకు కూడా తెలుసు మరియు దాని అనుసారంగా చేస్తున్నారు కూడా. కాని నిరంతరంగా చేయడం లేదు. ఒకటేమో - స్మృతిని యథార్థంగా చేసుకోవడము, ఇంకొకటి - కర్మలను శ్రేష్ఠంగా తయారుచేసుకోవడము. ఆ రెండు పదాలూ ఏమిటి? ఒకటేమో - స్మృతిని శక్తిశాలిగా చేసుకునేందుకు సదా కనెక్షన్ ఉండాలి మరియు కర్మను శ్రేష్ఠంగా తయారుచేసుకునేందుకు సదా తమ కరెక్షన్ సరిగ్గా ఉండాలి. ప్రతి కర్మలోను కరెక్షన్ సరిగ్గా లేని కారణంగానే మాస్టర్ సర్వశక్తివాన్,లేక ఆల్ మైటీ అథారిటీ యొక్క స్థితిలో నిరంతరము స్థితులవ్వలేకపోతారు. ఈ రెండు పదాలు వాస్తవికమైనవే. ఇక్కడకు వచ్చింది కూడా అందుకే కదా! ఏ కర్తవ్యం కొరకైతే వచ్చారో దానిని చేయడం ఏమైనా కష్టమా?

           ఎవరికి కష్టంగా అనుభవమవుతుంది? ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు కష్టంగా అనుభవం చేసుకుంటారు. ఎందుకు కష్టంగా అనుభవం చేసుకుంటారు? కనెక్షన్ జోడించి కూడా అప్పుడప్పుడు కష్టంగా అనుభవం చేసుకుంటారు. వారు కష్టంగా ఎందుకు అనుభవం చేసుకుంటారంటే వారు కష్టపడరు. వారికి తెలుసు, అర్థం చేసుకుంటారు కూడా, దాని అనుసారంగా నడుస్తారు కూడా. కాని, నడుస్తూ, నడుస్తూ మళ్ళీ విశ్రాంతి ప్రియులుగా అయిపోతారు. బాప్ దాదాలకు పసందైన వారిగా అవ్వరు, విశ్రాంతి ప్రియులుగా అయిపోతారు. కావుననే తెలిసి ఉంటూ కూడా అటువంటి స్థితి తయారైపోతుంది. కావున బాబా సమానంగా శ్రేష్ఠ కర్మలను చేయడంలో విశ్రాంతి ప్రియులు శ్రేష్ఠ స్థితిని పొందలేరు. కావున ప్రతి సంకల్పమును మరియు ప్రతి కర్మను కరెక్షన్ చేయండి మరియు బాప్ దాదాల కర్మలతో కనెక్షన్ జోడించండి. తరువాత బాబా సమానంగా ఉన్నామా అని పరిశీలించుకోండి. ఇప్పుడు శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క ఏ చివరి పురుషార్థం మిగిలి ఉంది? చివరి స్థితి యొక్క, చివరి పేపర్ యొక్క ప్రశ్న ఏమిటో తెలుసా? అదేమిటో తెలిసినవారు తప్పకుండా పాసవుతారు కదా! మీ అందరికీ ఫైనల్ పరీక్షలోని చివరి ప్రశ్నను గూర్చి తెలుసా? మీ చివరి ప్రశ్నను గూర్చి మీమీ భక్తులకు కూడా తెలుసు. వారు కూడా వర్ణన చేస్తారు. మీ భక్తులకు తెలిసి మీకు తెలియకుండా ఉందా? భక్తులు మీకన్నా చురుకైనవారిగా అయిపోయారా? 

           శ్రేష్ఠ ఆత్మలైన మీ కల్పపూర్వపు రిజల్టును గూర్చి భక్తులకు తెలుసు మరియు మీరు మీ వర్తమాన పురుషార్థపు ఫైనల్ స్టేజీని మర్చిపోయారు. ఆ చివరి స్థితిని పదే పదే వినిపిస్తారు, గాయనం కూడా చేస్తారు. గీతా భగవానుడి ద్వారా గీతా జ్ఞానమును విన్న తర్వాత ఏ ఫైనల్ స్థితిని గూర్చి వర్ణిస్తారు? (నష్టోమోహా స్మృతిర్లబ్ధ). భక్తులు తమ స్థితిని గూర్చి అయితే వర్ణన చేస్తారు కదా! కావున చివరి పరీక్షలోని ప్రశ్నలు ఏమిటి? ఏ స్థితి వరకు స్మృతి స్వరూపులుగా అయ్యారు? మరియు ఎంతవరకు నష్టోమోహులుగా అయ్యారు? ఇదే చివరి ప్రశ్న. ఈ చివరి ప్రశ్నను పూర్తి ప్రాక్టికల్ గా చేసేందుకు ఈ రెండు పదాలను ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. ఇప్పుడైతే అందరూ పాస్ విత్ హానర్ గా అయిపోయారు కదా! ఫైనల్ రిజల్ట్ కన్నా ముందే ప్రశ్నలు బహిర్గతమవుతున్నాయి. అయినా 108 మందే వెలువడుతారు, మరి ఇది అంత కష్టమా? మొదటి రోజు నుండే ఆ ప్రశ్నలు లభిస్తాయి. ఏ రోజైతే జన్మించారో ఆ రోజునే చివరి ప్రశ్నను గూర్చి కూడా వినిపించేయడం జరుగుతుంది. శ్రేష్ఠ ఆత్మలైన మీరెవరైతే కూర్చున్నారో వారంతా పాసయ్యేవారే కదా! పాసయ్యేందుకు ఈ “పాస్" అనే పదం యొక్క రెండవ అర్థమును ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి అని వినిపించడం జరిగింది కదా! ఏదైతే జరిగిపోయిందో అదంతా పాస్ అయిపోయింది. ఏదైతే గతించిపోయిందో దానిని పాస్ అయిపోయింది అని భావిస్తూ నడుచుకున్నట్లయితే ఏ విషయము మీ దరికి చేరకుండా ఉంటుంది? ఇదే పాస్ అన్న పదమును హిందీ భాషలో ప్రయోగించినట్లయితే పాస్ అనగా తోడుగా ఉండడం అనగా మీరు బాప్ దాదాలకు సమీపంగా ఉన్నారు. కావున ఈ ఒక్క పదమును మూడు రూపాలలోను స్మృతిలో ఉంచుకోండి.. ఒకటి పాసైపోయింది(జరిగిపోయింది), ఇంకొకటి పాస్ అనగా సమీపంగా ఉండాలి మరియు మూడవది పాసవ్వాలి. కావున మరి ఎటువంటి రిజల్ట్ వెలువడుతుంది? సంగఠన స్మృతి చిహ్నమేదైతే విజయమాల రూపంలో గానం చేయబడ్డదో ఆ విజయమాలలోని మణులుగా తప్పకుండా అయిపోతారు. బాప్ దాదా పిల్లలకు తమ సమీపంగా ఉండే ఆహ్వానమును ఇస్తారు. తమతో పాటు ప్రతి చరిత్రను అనుభవంచేయించే ఆహ్వానమును ఇస్తారు, కావున ఇటువంటి శ్రేష్ఠ ఆహ్వానమును మరి మీరు స్వీకరించరా? మొత్తం కల్పం లోపల ఆత్మలకు శ్రేష్ఠ ఆత్మ ద్వారా, సాధారణ ఆత్మ ద్వారా భిన్న భిన్న రకాల ఆహ్వానాలు లభిస్తూ ఉన్నాయి. కాని ఈ ఆహ్వానమైతే ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లభించదు. ఆహ్వానమును స్వీకరించడము అనగా తమను తాము తండ్రికి సమీపంగా ఉంచుకోవడము, ఇదేమైనా కష్టమా? ఆహ్వానంపై కేవలం స్వయమును అక్కడకు చేర్చుకోవలసి ఉంటుంది, ఆ తర్వాత మిగిలినదంతా ఆహ్వానమును పంపించినవారి బాధ్యత. కావున మిమ్మల్ని మీరు బాబా సమీపంగా తీసుకువెళ్ళడము అనగా బుద్ధి ద్వారా బాబాకు సమీపంగా ఉండడము. ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఈనాటి ప్రపంచంలో ఎవరైనా సాధారణ వ్యక్తికి ఈ రోజు నుండి మీరు నా దగ్గర ఉండండి అని ప్రసిడెంట్ ఆహ్వానమును ఇస్తే వారు ఏం చేస్తారు? (సాహసించలేరు). ఆ ధైర్యమును కూడా వారే ఇస్తే ఏం చేస్తారు? ఏమైనా ఆలస్యం చేస్తారా? కావున బాబా ఆహ్వానమును సదా ఎందుకు స్వీకరించరు? మిమ్మల్ని లాగే తాళ్ళు ఏమైనా ఉన్నాయా? పిల్లలు శక్తివంతులా లేక తండ్రి శక్తివంతులా? అందరికన్నా శక్తివంతులు ఎవరు? ఎవరు ఎంత శక్తివంతులైనా కాని దాని ద్వారా లభించేది ఏమిటి? ప్రాప్తి యొక్క అనుభవీ స్వరూపపు ఆధారంపై ఆ ఆకర్షణలో ఆకర్షితులవ్వడము బ్రాహ్మణ ఆత్మలకు శోభిస్తుందా? బ్రాహ్మణ ఆత్మల కొరకు లేక శ్రేష్ఠ ఆత్మల కొరకు ప్రభావశాలీ మాయ కూడా ఏ రూపంలో కనిపిస్తుంది? అది ఒక కాగితపు పులిలా అనుభవమవుతుందా? ఎవరైతే ఆ ప్రభావశాలీ మాయ కూడా మా కొరకు కాగితపు పులే అనగా ఒక బొమ్మయే అని భావిస్తారో వారు చేతులెత్తండి.

          మాయను ఇంకా కాగితపు పులిలా చేయలేదా? అందులో ఇంకా ఏమైనా ప్రాణం ఉందా? ఎవరైతే స్వయం అలంకరణ కొరకు ఉపయోగిస్తారో వారు భయపడరు, అది చూసి ఇతరులు భయపడతారు. ఇప్పుడు అందులో ఏమైనా ప్రాణం ఉందా? అది అప్పుడప్పుడు ప్రాణం ఉన్నదానిలా అయిపోతుందా? ఇప్పుడు ఇంకా దానిని మూర్చితం చేయలేదా? అది మూర్చితము అయిందా లేక ఇంకా జీవించే ఉందా? మూర్ఛితంచేసారా? మీ కొరకైతే అది మరణించింది. అది ఏ స్థితిలో ఉంది? అది మరణించిందా,  తగులబడిపోయిందా లేక మూర్ఛితమై ఉందా? మూడు స్థితులు ఉన్నాయి కదా! కొందరి కొరకు మూర్ఛిత రూపంలో ఉంది, మరికొందరి కొరకు మరణించి ఉంది, మరికొందరి కొరకు తగులబడిపోయింది కూడా అనగా దాని నామరూపాలు కూడా లేవు. కావున ప్రతి ఒక్కరూ మేము ఏ స్థితి వరకు చేరుకున్నాము అని తమనుతాము పరిశీలించుకోవాలి. మూర్ఛితం చేసేందుకు బదులుగా స్వయమే మూర్చితమైపోవడంలేదు కదా! సదా సంజీవనీ మూలిక మీ తోడుగా ఉన్నట్లయితే ఎప్పుడూ మూర్చితమవ్వజాలరు. మూర్ఛితం చేసేవారు ఎప్పుడూ మూర్ఛితమవ్వరు. బ్రాహ్మణ జన్మ యొక్క కర్తవ్యమే ఇది. జన్మ తీసుకునే ముందు ఏం ప్రతిజ్ఞ చేశారు? మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవుతాము అన్న ప్రతిజ్ఞను చేశారు కదా! ఇదైతే జన్మ యొక్క కర్తవ్యమే. ఏ కర్తవ్యమునైతే జన్మించడం నుండీ చేస్తూ వస్తున్నారో అదేమన్నా కష్టమవుతుందా? అచ్ఛా!

           సదా జాగృతులుగా ఉండేవారికి, సదా సర్వశక్తులతో సంపన్నంగా ఉండేవారికి, సదా బాప్ దాదాల సాంగత్యములో ఉండేవారికి, సదా బాబా కర్తవ్యంలో సహయోగాన్ని అందించేవారికి, సదా సహయోగి, సదా విజయీ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

 పార్టీలతో:-                        

           బాప్ దాదాలకు ఇది గుల్ దస్తా (పూలగుచ్ఛితపు) పార్టీ, కావున నేను ఏ పుష్పమును? గులాబీ పువ్వునా లేక మల్లెపువ్వునా? ప్రతి ఒక్కరి విశేషతను గూర్చి మీకు తెలుసు కదా! కమలము మరియు గులాబి పువ్వుకు మధ్య తేడా ఏమిటి? కమల పుష్పము కమాల్ చేయడంలో ప్రావీణ్యమైనది, అనుభవం చేయించడంలో గులాబీ పుష్పము ప్రావీణ్యమైనది. ఇక్కడైతే బాప్ దాదా స్వయమే పుష్పాలలో అన్ని విశేషతలను నింపుతున్నారు. సైన్స్ వారు కూడా ఒక్కదానిలోనే అనేక వస్తువులను ప్రాప్తింపజేస్తారు కదా! ఇది ఎక్కడినుండి నేర్చుకున్నారు? ఇక్కడ ఒక్కొక్కరిలో అనేకరకాల పుష్పాల సుగంధమును నింపాలి. “మీ మతమును గూర్చి మీకే తెలియాలి". అన్న గాయనము ఉంది, ఎలా ఉన్నవారిని ఎలా చేసేశారు? ఇదే గతి కదా? ఒక్కొక్కరిలో సర్వరసాలను నింపేయడము, సర్వపుష్పాల విశేషతలేవైతే ఉన్నాయో వారిలోకి ఈ విశేషతలన్నింటినీ నింపాలి, అప్పుడే సర్వగుణ సంపన్నులుగా అవ్వడం అని అంటారు. వారే బాబాకు ప్రియంగా అనిపిస్తారు. బాప్ దాదా కూడా తమ తోటను చూసి హర్షిస్తారు. మీరు ఏది చూసినా, ఏది విన్నా మరియు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా మరియు ఏం మాట్లాడినా అందులో విశేషతయే ఉంటుంది. స్వయంలో అన్ని విషయాల యొక్క విశేషతను నింపుకోండి. ఎప్పుడైతే అన్ని విషయాలలోను విశేషతలను నింపుకుంటారో అప్పుడు మీరేమైపోతారు? విశేష ఆత్మలు ఎప్పుడూ చెత్తలో చిక్కుకోరు, ఎల్లప్పుడూ హర్షితంగా ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారిలో ప్రతి విషయంలోను నిశ్చయం ఉండాలి. మీరు చతురుడైన తండ్రికి సంతానము. ఎవరికైతే బహురూపిగా అవ్వడం తెలుసో వారు ప్రతి విషయంలోను సఫలతామూర్తులుగా ఉంటారు. అచ్ఛా!

Comments

Post a Comment