16-01-1975 అవ్యక్త మురళి

16-01-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్వాలా రూప స్థితి.

               విశ్వపరివర్తనకు ఆధారమూర్తి, సర్వ సంబంధాలు మరియు ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణలకు అతీతమైన ఆకర్షణామూర్తి బాప్ దాదా ఙ్ఞాన రత్నాలైన పిల్లలతో మాట్లాడుతున్నారు- 
              స్వయాన్ని నయనాలలో నిండి ఉన్న కంటి వెలుగుగా లేదా నయన రత్నాలుగా భావిస్తున్నారా? స్వయాన్ని బాప్ దాదా యొక్క నయన సితారగా భావిస్తున్నారా? నయనాల ఎదురుగా ఉన్నారా? లేక నయనాలలో నిండి ఉన్నారా? రెండురకాలైన సితారలు ఈ సమయంలో మెరుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని అడగండి నేను ఏ సితారను. లీనమై ఉన్నవారి లక్షణాలు ఏమిటి? నయనాల ఎదురుగా ఉన్న వారి మధ్యలో అనగా ఇద్దరి మధ్యలో మూడవవారు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక విఘ్నం నిరంతరంలో అంతరం తీసుకువస్తుంది. కాని ఎవరైతే నయనాలలో లీనమై ఉంటారో, వారు బాబా సమానంగా ఉంటారు. ఏ పరిస్థితి, లేదా ప్రకృతి అనగా పంచతత్వాలు కూడా బాబా నుండి వారిని వేరు చేయలేవు. వారు సదా విజయీ నిరంతరం ఏకరసంగా మరియు ఒకరి సంలగ్నతలోనే నిమగ్నమై ఉంటారు. ఒకే బాబా మరియు బాబా సమానంగా సదా ఈశ్వరీయ సేవ అంతే. ఇవి తప్ప ఇంకేమీ వారికి కనిపించవు. వారి దృష్టి, వృత్తి మరియు స్మృతి ఈ మూడు సదా సమర్థంగా ఉంటాయి. అంటే వ్యర్ధం సమాప్తి అయిపోతుంది. ఈ విధంగా అయ్యారా లేక అవ్వాలా, విశ్వపరివర్తనకు ఆధారమూర్తులైన వారు స్వయాన్ని పరివర్తన చేసుకున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా. ఒకవేళ ఆధారమూర్తులు సంపూర్ణంగా పరివర్తన కాకుండా ఇప్పటికీ స్వయంలో లోపాలను అనుభవం చేసుకున్నట్లయితే తిరిగి విశ్వపరిర్తన ఎలా జరుగుతుంది? ఆధారమూర్తులు స్వయం కోసం కొంచెం సమయం అవసరం అని భావిస్తున్నారా లేక విశ్వ పరివర్తన కోసం ఇప్పుడు సమయం కావాలా? ఆధారమూర్తులైన వారి దృఢ సంకల్పంలో అప్పుడప్పుడు అలజడి గల సంకల్పాలు ఉంటున్నాయి. కనుక వినాశనార్థం నిమిత్తమైన ఆత్మల్లో కూడా అప్పుడప్పుడు ఆవేశం, అప్పుడప్పుడు తెలివిలోకి రావడం... ఇలా జరుగుతుంది. ఆధారమూర్తి ఆత్మల యొక్క సంకల్పమే వినాశనార్థం నిమిత్తమైన ఆత్మల ప్రేరణకు ఆధారం. కనుక మిమ్మల్ని మీరు అడగండి. ప్రేరక శక్తి సేన యొక్క సంకల్పం దృఢ నిశ్చయబుద్దిగా ఉందా మరియు స్వయం తయారుగా ఉన్నారా? ఎలాగైతే యజ్ఞం రచించడానికి బ్రహ్మబాబాతో పాటు బ్రాహ్మణులు నిమిత్తం అయ్యారో, ఆలాగే యజ్ఞం నుండి ప్రజ్వలితమయ్యే వినాశీ జ్వాలకు కూడా స్వయం జ్వాలారూపంగా అవ్వనంత వరకు వినాశన జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా రూపం తీసుకోదు. ఒకసారి అగ్ని చెలరేగుతుంది, మరలా శీతలం అయిపోతుంది. కారణం ఏమిటి? ఎందుకంటే జ్వాలామూర్తి ప్రేరక ఆధారమూర్తి ఆత్మలు స్వయం ఇంకా సదా జ్వాలారూపంగా అవ్వలేదు. జ్వాలారూపంగా అవ్వాలనే దృఢ సంకల్పం స్మృతిలో ఉండడం లేదు. జ్వాలా రూపంగా అయ్యేటందుకు ముఖ్య మరియు సహజ పురుషార్థం ఎమిటి? ( నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు) ఈ స్మృతి సదా ఉండాలంటే దీనికోసం ఏమి పురుషార్థం చేయాలి? ఇప్పుడు అంతిమ విశేష పురుషార్థం ఏమి మిగిలి ఉంది (ఉపరామ స్థితి) ఇదైతే ఫలితం కానీ దానికి కూడా పురుషార్థం ఏమిటి? (అతీత స్థితి) అతీత స్థితి కూడా దేని ద్వారా వస్తుంది? ఏ సంలగ్నతలో ఉంటే వస్తుంది? ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇదే ధ్యాసలో ఉండాలి. వెళ్ళడం అంటే ఉపరామం అవడం, ఎక్కడికి వెళ్ళాలో అలాంటి పురుషార్ధం స్వతహాగానే నడుస్తుంది. ఈ నిరాకారి ఇంటికి వెళ్ళాలి అంటే మీ వేషం కూడా ఆవిధంగా తయారుచేసుకోవాలి. కనుక ఈ కొత్త సంవత్సరంలో ఇదే విశేష పురుషార్థం చేయాలి, అదేమిటంటే తిరిగి వెళ్లాలి మరియు అందరిని తీసుకువెళ్ళాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే సర్వసంబంధాలు,  ప్రకృతి యొక్క సర్వ ఆకర్షణల నుండి ఉపరామం అనగా సాక్షి అయిపోతారు. సాక్షి అవడం ద్వారా సహజంగానే బాబాకి తోడు అయిపోతారు, లేదా బాబా సమానంగా అయిపోతారు. సర్వులకు సదా జ్వాలారూపం కనిపిస్తుంది. అప్పుడే ఈ వినాశి జ్వాల కూడా మీ జ్వాలా రూపంతో పాటు స్పష్టంగా కనిపిస్తుంది. స్థాపనకు నిమిత్తం అయిన వారు ఎంత జ్వాలారూపంగా అవుతారో అంతగానే వినాశనం యొక్క జ్వాలా రూపం కూడా ప్రత్యక్షం అవుతుంది. దృఢ సంకల్పం అనే నిప్పు అంటించండి. అప్పుడే వినాశన జ్వాల పెరుగుతుంది. ఇప్పుడు శీతలంగా ఉంది. ఆధారమూర్తులు కూడా ఇప్పుడు శీతలంగా ఉన్నారు. సంఘటన రూపంలో జ్వాలారూపం విశ్వ వినాశన కార్యాన్ని సంపన్నం చేస్తుంది. అల్ప ఆత్మల యొక్క దృడ సంకల్పం అల్పకాలికంగానే అక్కడక్కడ వినాశన జ్వాల ప్రజ్వలించడానికి నిమిత్తం అవుతుంది. కానీ మహావినాశనం మరియు విశ్వపరివర్తన అనేది సంఘటన యొక్క ఒకే శ్రేష్ఠ సంకల్పంతో తప్ప సంపన్నం అవ్వదు. అందువలన ఈ సంవత్సరంలో మీ అంతిమ స్థితి, సర్వ కర్మ బంధనాల నుండి ముక్తి, కర్మాతీత స్థితి అతీతము మరియు ప్రియము యొక్క సమానత సదా సరిగ్గా ఉండాలి. ఇలాంటి నిరాకారి స్థితిని సంఘటనా రూపంలో తయారు చేసుకోండి. అప్పుడు వినాశనం యొక్క దృశ్యాలు మరియు వెనువెంట కొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సంవత్సరం అందరూ ఈ పురుషార్థం చేయాలి. ఈ అంతిమ పురుషార్ధం ద్వారానే స్వయం యొక్క మరియు వినాశనం యొక్క వేగం తీవ్రం అవుతుంది. సంకల్పం నడుస్తుందా? లేక సమాప్తం అయిపోయిందా ఏమవుతుందో, ఎలా అవుతుందో అని భయపడడం లేదు కదా? అవ్వాలి, కానీ అనే మాట రావడం లేదు కదా! ఒకవేళ అవ్వకపోతే అని అనుకోవడం లేదు కదా! కొందరు అవ్వాల్సిందే అంటారు. కొందరు అవ్వకపోతే అంటారు. కానీ జరిగేది ఏమిటి? కొందరు అనుకుంటున్నారు బాబా అయితే అవ్యక్తం అయిపోయారు. వ్యక్తంలో ఎదుర్కోవల్సింది మేమే కదా అని, కానీ మీరు కూడా అవ్యక్తం అయిపోండి. అంటే ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వ్యక్త భావం యొక్క విషయాలు వారికి కనిపించకూడదు. లేదా చేయాలనే ధైర్యం చాలకూడదు. ఇలా ఇతరుల యొక్క వ్యక్త భావం కూడా తొలగించే అవ్యక్త ఫరిస్తాగా తయారవ్వండి. ఇలాంటి అవ్యక్త స్థితి లేదా వాయుమండలం అంటే పాండవుల కోటను తయారు చేయండి. అప్పుడు ఈ అలజడి సమాప్తి అయిపోతుంది. బాప్ దాదా అంతిమం వరకు మీ తోడుగా ఉంటారు మరియు సదా పిల్లలపై స్నేహం మరియు సహయోగం అనే ఛత్రఛాయ ఉంటుంది. అందువలన భయపడకండి. వెన్నెముక అయిన బాప్ దాదా ఎదుర్కునేటందుకు ఎవరో ఒక వ్యక్తి ద్వారా సమయానుసారం ప్రత్యక్షం అయిపోతారు మరియు ఇప్పుడు కూడా అవుతున్నారు. మంచిది.
                     ఈవిధంగా సదా ధైర్యం మరియు ఉల్లాసంలో ఉండేవారికి, ప్రతి పరిస్థితిలో శ్రేష్ఠ స్థితిలో ఉండేవారికి, ప్రకృతి యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉండేవారికి, ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక ఆకర్షణలో ఉండేవారికి, ఆత్మిక ఆకర్షణామూర్తులకు, సదా నిశ్చింత మరియు నిశ్చయబుద్ధి, బాబాకి సదా సాథీ, సర్వులకు సదా స్నేహీ సహయోగీ ఆత్మలకు, బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments