15-10-1975 అవ్యక్త మురళి

15-10-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సాధారణత యొక్క సమాప్తి, విశేషత యొక్క ప్రాప్తి.

                          మహారథీ పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                   మహారథీల ప్రతి కర్మలో ఇతరాత్మల కంటే విశేషత ఉండాలి అంటే సాధారణత సమాప్తి అయిపోతూ ఉండాలి. ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో నామమాత్రంగా విశేషాత్మలుగా ఉన్న వారి మొత్తం దినచర్య అంతా విశేషంగా ఉంటుంది, అంటే వారి ప్రతి కర్మ నిశ్చితమై ఉంటుంది. ఎలా వస్తే అలా చేసేయడాన్ని సాధారణత అని అంటారు. నిశ్చితమై ఉండటాన్ని విశేష మహనత అని అంటారు. వారు దేహాభిమానంలో ఉన్నారు. కనుక వారికి స్థూల కర్మ యొక్క దినచర్య నిర్ణయమై ఉంటుంది మరియు ఇక్కడ ఆత్మాభిమాని స్థితి. కనుక ఆత్మ యొక్క విశేషమైన శక్తులు - మనస్సు, బుద్ధి మరియు సంస్కారం. అంటే నిర్ణయశక్తి, సంకల్పశక్తి మరియు సంస్కారశక్తి. సంస్కారం కూడా ఒక శక్తి అది తన వశం చేసుకుంటుంది. సంస్కారాలకు వశమైతే ఎక్కేకళ కూడా ఉంటుంది మరియు పడిపోయేకళ కూడా ఉంటుంది. సంకల్పశక్తి, బుద్ధి యొక్క నిర్ణయశక్తి ఎలాగో అలాగే సంస్కారం కూడా ఒక శక్తి. ఆత్మ యొక్క ఈ విశేష శక్తుల యొక్క ప్రోగ్రామ్ కూడా నిర్ణయమై ఉండాలి. అంటే ఏమి సంకల్పం చేయాలి? బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా మరియు సంస్కారాల ద్వారా ఏమి చేయాలి? ఈ దినచర్య కూడా నిర్ణయమై ఉండాలి. ఎలాంటి సంకల్పం వస్తే అది చేయటం కాదు. ఇది మహారథీలకు విశేషమైన మహనత యొక్క కార్యం.
                      ఇది ఆలోచించాము కానీ ఇది అయ్యింది అని మహారథీలు అనరు. ఇలా అనుకుంటున్నాము కాని ఇలా అవుతుంది. ఇవి సాధారణాత్మల యొక్క మాటలు. విశేషాత్మలు ఇలా మాట్లాడరు, ఆలోచించరు కూడా. అటువంటి కర్మ అయితే వారికి స్వతహగానే సమాప్తి అయిపోతుంది. ఆలోచించటం ఒకటి, చేయటం ఇంకొకటి, అవ్వటం ఇంకొకటి ఇది కూడా సోమరితనం. సోమరితనం అంటే చిన్నతనం. మహారథీల స్థితి చిన్నతనంగా ఉండదు. సాకార బాబా కర్మను చూసి అందరు కాపీ చేస్తారు కదా! సాకారంలో నేను ఏ కర్మ చేస్తే నన్ను చూసి అందరు చేస్తారు అనే మహిమ ఉంది. ఇది నిరాకారుని మాట కాదు. ఎలా అయితే సాకార బాబా కర్మకి నిమిత్తంగా అయ్యారు, సాకారాన్ని చూసి కర్మలో కాపీ చేసారు. అలాగే శ్రేష్టకర్మ అంటే ఏమిటి? దానికి గుర్తు లేదా ఉదాహరణ - మహారథీలు. ఒకవేళ దినచర్య నిశ్చితం అవ్వకుండా లేదా ఏ విశేషత లేకపోతే ఇతరులు ఎలా కాపీ చేస్తారు? అందువలనే మహారథీల యొక్క సంకల్పం, మనస్సు, బుద్ధి, సంస్కారం మరియు కర్మ అన్నింటి దినచర్య నిర్ణయమై ఉంటుంది. వీరినే మహారథీ అంటే మహాన్ పురుషార్థీ అని అంటారు. మంచిది.

Comments