15-09-1971 అవ్యక్త మురళి

* 15-09-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మల కర్తవ్యము."

          ఈ సంగఠనను ఏ సంగఠన అని అందాము? ఈ సంగఠన విశేషత ఏమిటి? ఏ విశేషత అయితే ఉందో దాని అనుసారంగానే ఆ పేరుతో పిలుస్తారు. ఇతర సంగఠనలో లేని ఏ విశేషత ఈ సంగఠనలో ఉంది? మీకు మీ సంగఠనలోని విశేషతను గూర్చి తెలుసా? ఈ సంగఠన మొత్తము బ్రాహ్మణ పరివారములోని విశేష ఆత్మల సంగఠన. ఈ విశేష ఆత్మల సంగఠన విశేషత ఏమిటంటే - ఇందులో ప్రసిద్ధమైన అన్ని నదుల మేళా ఉంది. నదులకు అనేక రకాల విశేష దినాలలో మేళాలు జరుగుతాయి. కానీ ఈ మేళా ప్రసిద్ధ నదుల మేళా. జ్ఞానసాగరుని నుండి వెలువడిన పతిత పావని నదుల మిలనము ఇది. మిమ్మల్ని మీరు పతితపావనులుగా భావిస్తున్నారా? పతితపావనిగా అయ్యేందుకు ముఖ్యంగా ఏ విషయమును స్మృతిలో ఉంచుకోవాలి? దాని ద్వారా ఎటువంటి పతితులయినా పావనంగా అయిపోవాలి! ఎటువంటి పతిత ఆత్మల సంకల్పము కూడా ఇమిడిపోవాలి. ఇందుకొరకు ముఖ్య విషయంగా సదా బుద్ధిలో - నేను సర్వ ఆత్మల పతిత సంకల్పాలను మరియు వృత్తులను మరియు దృష్టిని భస్మము చేసే మాస్టర్ జ్ఞాన సూర్యుడిని అన్నదానినే ఉంచుకోవాలి. ఒకవేళ మాస్టర్ జ్ఞాన సూర్యునిగా అయ్యి ఏ పతిత ఆత్మనైనా చూసినట్లయితే, ఏవిధంగా సూర్యుడు తన కిరణాల ద్వారా చెత్త, మురికిలోని కీటకాలను భస్మము చేసేస్తాడో అలా ఏ పతిత ఆత్మ యొక్క పతిత సంకల్పము కూడా పతితపావని ఆత్మ పైన యుద్ధము చేయజాలదు. అంతేగాక పతిత ఆత్మలు పతితపావని ఆత్మలైన మీపై బలిహారమైపోతారు. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మకు పతితపావని ఆత్మ పట్ల పతిత సంకల్పమైనా కూడా ఉత్పన్నమైనట్లయితే మైక్ గా అయ్యారు గానీ మైట్ హౌస్ గా అవ్వలేదు అని భావించాలి. కావున మైక్ శబ్దము చాలా మధురంగా కూడా అనిపిస్తుంది మరియు మైక్ అనగా శబ్దము కర్ణరస ప్రాప్తిని కూడా కలిగిస్తుంది, కానీ మైట్ హౌస్ స్థితి మనోరస అనుభూతిని చేయిస్తుంది. ఒకవేళ ఒక్కసారైనా కూడా ఇంద్రియ రసాన్ని అనుభవము చేసినట్లయితే ఈ ఇంద్రియాల రసము అనేక అల్పకాలికమైన రసాల వైపుకు ఆకర్షితము చేసేస్తుంది.

           ఏ పతిత ఆత్మ యొక్క ఎటువంటి ఇంద్రియ రసము వైపుకు అనగా వినాశీ రసము వైపుకు ఆకర్షణ ఉండకూడదు. రావటంతోనే అలౌకిక అతీంద్రియ సుఖము లేక మనోరసము యొక్క అనుభవమును చేసుకోవాలి. ఇందుకొరకు మొదట పతితపావనిల మన్మనాభవ స్థితి అవసరము. ఒకవేళ స్వయమే ఏదైనా దేహ-అభిమానము లేక దేహ ప్రపంచము అనగా పాత ప్రపంచములోని ఏదైనా వస్తువు రసములో కొంచెమైనా ఇరుక్కొని పోయినట్లయితే వారు ఇతరులకు మనోరసమును ఎలా అనుభవము చేయించగలరు? కలియుగీ స్థూల వస్తువుల రసము లేక మనస్సు యొక్క ఆకర్షణ అయితే తొలగిపోయింది కూడా. కానీ దీని తరువాత మళ్ళీ ఎటువంటి స్టేజ్ ను దాటాలో, అది తెలుసా? లోహపు సంకెళ్ళు, పెద్ద పెద్ద సంకెళ్ళనైతే వదిలించుకున్నారు, కానీ చాలా సూక్ష్మమైన దారాలు అక్కడక్కడ బంధనముక్తముగా తయారవ్వనివ్వటం లేదు. ఆ సూక్ష దారాలు ఏమిటి? ఈ గ్రూపుకు దీనిని తెలుసుకోవటము పెద్ద విషయము కూడా కాదు. తెలుసు కూడా, కోరుకుంటారు కూడా, మళ్ళీ ఇంకేం మిగిలిపోతుంది? జ్ఞానిగా అయిన తరువాత క్రొత్త బంధనము మొదలవుతుంది, అందరిలో ఉన్న ఆ అతిసూక్ష్మమైన దారము ఏమిటి?(ప్రతిఒక్కరూ వినిపించారు) వీటన్నింటినీ నోట్ చెయ్యాలి. ఈ నోట్ పనికి వస్తుంది, ఇంకా ఏమైనా ఉందా? ఈ గ్రూపులో గంగా-యమున కలిసిపోయాయి. ఇది విశేషతయే కదా! సరస్వతి అయితే గుప్తంగా ఉంటుంది, గంగ ఎవరు, యమున ఎవరు అన్నదానికి కూడా పెద్ద గుహ్యమైన రహస్యము ఉంది! మొదటైతే అన్నింటి కంటే సూక్ష్మమైన దారము ఏది? అన్నది ఇది చెప్పండి. అప్పుడు దీనితో గంగ ఎవరు, యమున ఎవరు అన్నది మీరే తెలుసుకోగలరు. అన్నింటికంటే సూక్ష్మమైన మరియు అతి సుందరమైన దారము ఒక్క మాటలో చెప్పాలంటే 'నేను' అన్న మాటే. నేను అన్న మాట దేహఅభిమానము నుండి దూరంగా తీసుకొని వెళుతుంది. మరియు 'నేను' అన్న పదమే దేహీ అభిమానములోకి తీసుకొని వచ్చేది కూడా. నేను శరీరమును అన్నదాని నుండి దూరంగా వెళ్ళే అభ్యాసమునైతే చేస్తూనే ఉన్నారు, కానీ ఇదే నేను అన్న పదము యొక్క.... నేను ఫలానాను, నాకు అన్నీ తెలుసు, నేను ఏ విషయములోనూ తక్కువ కాదు, నేను అన్నీ చెయ్యగలను, నేను వీటిని వీటిని చేస్తాను మరియు చెయ్యగలను.... నేను ఎవరు, ఏమిటి అన్నది నాకు తెలుసు, నేను ఎలా సహనము చేస్తున్నాను, ఎలా సమస్యలను ఎదుర్కొంటాను, చస్తూ ఎలా నడుస్తున్నాను, త్యాగము చేసి నేను ఎలా నడుస్తున్నాను అన్నది నాకు తెలుసు.... ఇలా నేను అన్న లిస్టు సరియైన పద్ధతికి బదులుగా వ్యతిరేకమైన రూపంలో సూక్ష్మమైన, సుందరమైన దారంగా తయారవుతుంది. ఇది అన్నింటికన్నా పెద్ద సూక్ష్మమైన దారము. అతీతంగా అయ్యేందుకు బదులుగా, తండ్రికి ప్రియంగా అయ్యేందుకు బదులుగా ఎవరో ఒక ఆత్మకు లేక ఏదైనా వస్తువుకు ప్రియమైనవారిగా తయారుచేస్తుంది. గౌరవము పట్ల ప్రేమ, పేరు పట్ల ప్రేమ, ప్రతిష్టల పట్ల ప్రేమ, ఎవరైనా విశేష ఆత్మలకు ప్రియమైన వారిగా చేస్తుంది. ఈ దారాన్ని త్రేంచేందుకు లేక ఈ దారము నుండి బంధనముక్తముగా అయ్యేందుకు ఏం చెయ్యవలసి ఉంటుంది? ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి?

           బాధ్యతా కిరీటమును ధరించిన గ్రూపునే తీసుకువచ్చారు కదా! బాధ్యత కలవారి లక్ష్యమును ధారణ చేసే గ్రూపుగా అయితే ఉండనే ఉన్నారు, ఇంకేం కావాలి? నిరహంకారులేనా? నిరాకారులేనా? ఒకవేళ నిరాకారీ స్థితిలో స్థితులై నిరహంకారులుగా అయినట్లయితే నిర్వికారులుగా ఆటోమేటిక్ గానే అయిపోతారు. నిరహంకారులుగా అయితే తప్పకుండా అవుతారు కానీ నిరాకారులుగా అయ్యి నిరహంకారులుగా అవ్వరు. యుక్తులతో స్వయమును అల్పకాలము కొరకు నిరహంకారులుగా తయారుచేసుకుంటారు, కానీ నిరంతర నిరాకారీ స్థితిలో స్థితులై సాకారములో ఆకారినై ఈ కార్యమును చేస్తున్నాను - అన్న ఈ స్మృతి లేక అభ్యాసము నేచురల్ మరియు నేచర్ గా అవ్వని కారణంగా నిరంతర నిరహంకారీ స్థితిలో స్థితులవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోటు నుండి వస్తారు, ఎవరు ఎక్కడి నుండి వచ్చినా గానీ నేను ఇక్కడి నుండి వచ్చాను అన్నది సదా స్మృతిలో ఉంటుంది. అలా నేను నిరాకారము నుండి సాకారములోకి వచ్చి ఈ కార్యమును చేస్తూ ఉన్నాను అన్న స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి కర్మను చేస్తూ కూడా మధ్యమధ్యలో ఈ స్థితిని అభ్యాసము చేస్తూ ఉన్నట్లయితే నిరాకారులై సాకారములోకి రావటం ద్వారా నిరహంకారులుగా మరియు నిర్వికారులుగా తప్పకుండా అయిపోతారు. ఈ అభ్యాసము అల్పకాలము కొరకు చేస్తూ ఉన్నారు కూడా, కానీ ఇప్పుడు దీనిని సదాకాలములోకి ట్రాన్స్ ఫర్ చెయ్యండి. మీరు వైరాగులుగా కూడా అయ్యారు, వైరాగ్య వృత్తి కూడా ఉంది, కానీ సదాకాలము కొరకు అనంతమైన వైరాగులుగా అవ్వండి. లేనట్లయితే ఏదైనా హద్దులోని వస్తువు వైరాగ్య వృత్తి నుండి తొలగిపోయేందుకు నిమిత్తముగా అవుతుంది. యోగయుక్తులు కూడా, కానీ యోగయుక్తము యొక్క గుర్తును ప్రాక్టికల్ కర్మలో చూపించండి. మీ ప్రతి కర్మ, ప్రతి మాట ఏ ఆత్మనైనా భోగి నుండి యోగిలాగా తయారు చెయ్యాలి. ప్రతి సంకల్పము, ప్రతి కర్మ యుక్తియుక్తముగా, రాజయుక్తముగా, రహస్య యుక్తముగా ఉండాలి, దీనినే ప్రాక్టికల్ యోగయుక్తము అని అంటారు. మీ సంకల్పము మరియు మాటలో, కర్మలో ఒకవేళ ఈ మూడు విషయాలు లేనట్లయితే వ్యర్థమే. ఒకవేళ రాజయుక్తముగా లేనట్లయితే ఏమవుతుంది? వ్యర్థము. ఇప్పుడు ప్రాక్టికల్ యోగిని కాదు, కానీ ప్రాక్టీసు చేసే యోగిని అని అర్ధం చేసుకోవాలి కావున ఇప్పుడు ఈ విషయముపై అటెన్షన్ యొక్క అవసరము ఉంది. అప్పుడిక ఎటువంటి సమస్య లేక విఘ్నము, పరిస్థితులు మీపై యుద్ధమును చెయ్యజాలవు. ప్రాక్టికల్ లో యోగయుక్తముగా, జ్ఞానయుక్తముగా, స్నేహయుక్తముగా, దివ్య అలౌకిక మూర్తి ద్వారా విశ్వము ముందు ప్రమాణంగా అయిపోతారు. ఎవరైతే 'విశ్వము ముందు జ్ఞానయోగముల ప్రూఫ్ గా అవుతారో వారే మాయాప్రూఫ్ గా అవుతారు. కావున మాయాప్రూఫ్ గా అయ్యేందుకు నేను జ్ఞానము మరియు యోగముల ప్రూఫ్ ను అని స్వయాన్ని భావించండి, ఇది ప్రమాణరూపముగా అవ్వటము, ఆత్మల కోరికలనింటినీ సమాప్తము చేస్తుంది. సదా ప్రతి సంకల్పమును మరియు అడుగును తండ్రి ఆజ్ఞానుసారముగా నడిపించేవారు ఇతర ఆత్మల ఆశలన్నింటినీ సమాప్తము చెయ్యగలరు. మీ లోపల కూడా పురుషార్థము, సఫలతకు చెందిన కోరికలు ఉంటాయి, దీనికి కూడా కారణము ఎక్కడో అక్కడ, ఏదో ఒక ఆజ్ఞను పాటించకపోవటము. కావున ఏ క్షణమైతే మీ పురుషార్థముపై లేక సేవా సఫలతపై లేక సర్వుల స్నేహము మరియు సహయోగపు ప్రాప్తిపై కొంచెమైనా లోటు లేక చిక్కులు వచ్చినట్లయితే - ఏ ఆజ్ఞ యొక్క లోటు ఉంది అని పరిశీలించుకోండి. దాని ప్రత్యక్షఫలమును ఒక్క క్షణము కోసమైనా అనుభవము చేస్తున్నాము! ఆజ్ఞ అన్నది కేవలము ముఖ్య విషయాలకే కాదు, ఆజ్ఞ ప్రతి సమయములోని ప్రతి కర్మ కొరకు లభించి ఉంది. ఉదయము అమృతవేళ నుండి మొదలు రాత్రి వరకు మీ దినచర్యలో ఏ ఆజ్ఞలైతే లభించి ఉన్నాయో వాటిని పరిశీలించుకోండి. వృత్తిని, దృష్టిని, సంకల్పమును, స్మృతిని, సేవను, సంబంధమును అన్నింటినీ పరిశీలించుకోండి. ఏవిధంగా ఏదైనా మిషినరీ నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దాని స్పీడు ఢీలా అయిపోయినట్లయితే అన్ని పనిముట్లను పరిశీలిస్తారు. నలువైపులా పరిశీలిస్తారు. అలా నలువైపుల చెకింగ్ చేయటం ద్వారా స్పీడ్ ను తీవ్రం చెయ్యగలరు, ఎందుకంటే ఇప్పుడు ఆగిపోయే విషయము సమాప్తమైపోయింది, ఇప్పుడు ఉన్నది స్పీడ్ ను తీవ్రం చేసే విషయము. ఏ స్టేజ్ నైతే విన్నారో దానిపై నిలుస్తారు కూడా మరియు పురుషార్థములో విశేష ఆత్మలు కూడా.

           స్టేజ్ ను పరిశీలించుకోవటంలో సరిగ్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? పర్సంటేజ్ (శాతము)ను పెంచండి. పర్సెంటేజ్ తక్కువగా ఉంది. ఏ పేపరునైతే ఇచ్చామో దాని రిజల్టు ఇది. జ్ఞాన శక్తి ద్వారా స్టేజ్ ను తయారుచేసుకుంటారు, కానీ పర్సేంటేజ్ తో స్వయము కూడా సంతుష్టంగా లేరు. ఇప్పుడు దీనిని సంపూర్ణము చెయ్యాలి. జ్ఞాన ఫోర్స్ తో పాటు మహీనత గురించి ఏదైతే వినిపించామో దాని కారణంగా నకిలీ, నష్టాన్ని కలుగచేసే ఫోర్స్ కూడా మిక్స్ అయిపోతుంది. నకిలీ ఫోర్స్, నష్టపరిచే ఫోర్స్ రాకుండా ఉండేందుకు ఏ విషయమును స్మతిలో ఉంచుకుంటారు? ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల దయా భావన సదాకాలము కొరకు ఉన్నట్లయితే ఎవ్వరినీ తిరస్కరించరు, ఎవ్వరి ద్వారా తిరస్కరింపబడరు. ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడ ఎప్పుడూ ఫోర్స్ ఉండజాలదు. ఎక్కడైతే దయాహృదయులుగా అవ్వవలసి ఉంటుందో అక్కడ దయాహృదయమునకు బదులుగా అధికార దర్పము కలవారిగా అవుతారు. కానీ ఇక్కడ విశ్వ మహారాజులు కాదు, స్వయాన్ని స్టేట్ లకు యజమానులుగా భావిస్తారు కదా! ఇక్కడ అన్ని స్టేట్ (రాష్ట్రా)ల మినిస్టర్లు వచ్చారు, స్టేట్ యజమానిని అని భావించటం ద్వారా నిరాకారీ మరియు నిరహంకారీ స్టేజ్ ను మర్చిపోతారు. స్టేట్ సేవాధారియే కానీ ఏ ఆత్మ నుండీ సేవను తీసుకొనేవారు కాదు. నేను ఇంత చేసాను, నాకు వీరి కంటే ఎక్కువ గౌరవ మర్యాదలు లేక మహిమ లభించాలి అని ఎవరికైన ఈ సంకల్పము వచ్చినట్లయితే - ఇది కూడా తీసుకోవటమే అయింది, తీసుకోవాలనే భావన ఉంది. దాత పిల్లలు ఒకవేళ దీనిని కూడా తీసుకొనే సంకల్పము చేసినట్లయితే దాతలుగా లేరు. ఇది కూడా తీసుకోవటము, ఇచ్చేవారి ముందు శోభించదు. వీరినే అనంతమైన వైరాగులు అని అంటారు. సేవధారికి ఈ సంకల్పము కూడా ఉత్పన్నమవ్వకూడదు. అప్పుడు స్టేట్ నుండి మీ అనంతమైన విశ్వ మహారాజన్ యొక్క స్టేటస్ ను పొందగలరు. అచ్ఛా! ఎవరైతే నిష్కాములుగా ఉంటారో, వారే విశ్వ కల్యాణకారులుగా అవుతారు, దయాహృదయులుగా ఉంటారు. కర్తవ్య ప్రాప్తి స్వతహాగా ఉండటము వేరే విషయము, కానీ కోరికతో ప్రాప్తింపచేసుకోవటము - ఈ అల్పకాలిక ప్రాప్తి అయితే ఉంటుంది కానీ అనేక జన్మలకు కూడా అనేక ప్రాప్తుల నుండి వంచితముగా చేసేస్తుంది. ప్రాప్తి అప్రాప్తికి సాధనంగా అవుతుంది. ఫల ప్రాప్తి కలగటము వేరే విషయము, ప్రకృతి దాసిగా అవ్వటము వేరే విషయము. ఇలా అల్పకాలపు ప్రాప్తి రూపాన్ని పరిశీలిస్తూ నడవాలి. శక్తి లేదని కొందరు భావిస్తారు, ఎందుకని? వేస్టేజ్ (వ్యర్థము) ఎక్కువగా ఉంది. వేస్టేజ్ ఉన్న కారణంగా స్టేజ్ పెరగదు. అచ్ఛా!

Comments