* 15-07-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఆకర్షణ మరియు స్వభావమును మార్చుకోవటం ద్వారా విశ్వ పరివర్తన.”
శబ్దములోకి వచ్చే స్థితి ఎంత ప్రియమైనదిగా అనిపిస్తుందో అలా శబ్దము నుండి దూరంగా ఉండే శాంతిమయ స్థితి కూడా అంతగానే ప్రియమైనదిగా అనిపిస్తుందా? శబ్దములోకి రావటము మరియు శబ్దము నుండి దూరంగా వెళ్ళటము ఈ రెండూ ఒకేవిధంగా సహజమనిపిస్తాయా లేక శబ్దము నుండి దూరంగా వెళ్ళటము కష్టమనిపిస్తుందా? వాస్తవానికి స్వధర్మము శాంతి స్వరూపము అయిన కారణంగా శబ్దము నుండి దూరంగా వెళ్ళటము చాలా సహజమనిపించాలి. ఇప్పుడిప్పుడే, ఒక్క క్షణములో స్థూల శరీరము ద్వారా ఎక్కడికైనా వెళ్ళేందుకు సూచన లభించినట్లయితే వెళ్ళటము మరియు రావటము ఈ రెండూ ఏవిధంగా సహజమని అనుభవమవుతాయో, అలా ఈ శరీరపు స్మృతి నుండి బుద్ధి ద్వారా దూరంగా వెళ్ళటము మరియు రావటము ఈ రెండూ కూడా సహజముగా అనుభమవుతాయా? అనగా క్షణకాలములో ఇలా చెయ్యగలరా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరమును ఆధారముగా తీసుకోవటము మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరపు ఆధారమును వదిలివేసి తమ అశరీరీ స్వరూపములో స్థితులవ్వటము - ఇటువంటి అనుభవమును నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉంటారా? ఏవిధంగా శరీరమును ధారణ చేసారో అలాగే మళ్ళీ ఈ శరీరము నుండి అతీతంగా అయిపోవటము - ఈ రెండింటినీ ఒకే విధంగా అనుభవము చేసుకుంటున్నారా? ఈ అనుభవమే అంతిమ పరీక్షలో ఫస్ట్ నంబర్‌ను తీసుకు వచ్చేందుకు ఆధారము. మరి చివరి పరీక్షను ఇచ్చేందుకు ఇప్పటినుండే సిద్ధమైపోయారా లేక తయారవుతూ ఉన్నారా? వినాశనము చేసేవారు ఏవిధంగా అయితే ఒక్క సూచన లభించటంతోనే వారి కార్యమును సంపన్నము చేసేస్తారో అనగా వినాశనకారి ఆత్మలు ఎంత ఎవర్ రెడీగా ఉంటారంటే క్షణ కాలపు సూచనతో వారి కార్యమును ఇప్పుడు కూడా ప్రారంభము చెయ్యగలరు. మరి విశ్వ నవ నిర్మాణము చేసేవారు అనగా స్థాపనకు నిమిత్తముగా అయిన ఆత్మలు అలా ఎవర్ రెడీగా ఉన్నారా? వినాశనకారులకు సూచన లభించేలా తమ స్థాపన కార్యమును అంతగా చేసారా?
ఏవిధంగా యాదవసేన ఫుల్ ఫోర్స్ తో ఏర్పాట్లు చేసుకొని ఉన్నారో అలా పాండవసేన కూడా తమ ఏర్పాట్లనన్నింటినీ చేసుకొని సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? అంత ఎవర్ రెడీగా ఉన్నారా? లైట్ హౌస్ మరియు పవర్ హౌస్ స్విచ్ ఆన్ చెయ్యటంతోనే ఏవిధంగా ఒక్క క్షణములో నలువైపులా లైట్ మరియు మైట్ లను వ్యాపింప చేస్తుందో అలా పాండవసేన ఒక్క క్షణములో డైరక్షన్ ప్రమాణంగా లైట్ హౌస్ మరియు మైట్ హౌసులుగా అయ్యి ఆత్మలందరికీ లైట్ మరియు మైట్ ల వరదానమును ఇవ్వగలరా? ఒకే స్థానములో కూర్చొని ఉన్నా కూడా స్థూల దృష్టి ఒక్క క్షణములో ఏవిధంగా నలువైపులా చూస్తుందో అలాగే మూడవ నేత్రము ద్వారా ఒక్క క్షణములో మీరు నలువైపులా, కేవలము భారతదేశమే కాదు, పూర్తి విశ్వములోని ఆత్మలందరినీ దృష్టి ద్వారా పూర్తి సంతృప్తులుగా చెయ్యగలరా? సరళము మరియు సహజమైన పద్ధతి ద్వారా స్థూల నేత్రముల ద్వారా ఏవిధంగా దృష్టిని వ్యాపింప చెయ్యగలరో అలా మీరు దృష్టి ద్వారా పూర్తి సంతృప్తులుగా చెయ్యగలరా? మూడవ నేత్రము తెరవటము ద్వారా ఒక్క క్షణములో వినాశనమై పోయింది అన్న గాయనము కూడా ఉంది. వినాశనముతో పాటుగా స్థాపన అయితే ఉండనే ఉంది. బాబాతో పాటుగా పిల్లలకు కూడా గాయనము ఉంది. దూరము వరకు కూడా దృష్టి వెళ్లగలిగేంతగా మూడవ నేత్రము అంతటి శక్తిశాలిగా ఉందా? స్థూల నేత్రముల దృష్టి తక్కువైనట్లయితే దూరము వరకు ఏవిధంగా చూడలేకపోతారో, అలా మీ మూడవ నేత్రము యొక్క శక్తిని చూసుకుంటూ ఉంటారా?
మూడవ నేత్రమును శక్తిశాలిగా తయారు చేసుకొనేందుకు ముఖ్యంగా రెండు మాటలపై అటెన్షన్ ఉండాలి. మూడవ నేత్రములో బలహీనత రావటానికి కూడా రెండు విషయాలు ఉన్నాయి. అవి ఏవి? స్థూలదృష్టిలో బలహీనత రావటానికి కారణము ఏముంటుంది? (బ్రెయిన్ కార్యము ఎక్కువ కావటమువలన) విషయమైతే అదే కానీ ఈ అన్ని విషయాలను రెండు మాటల సారములోకి తీసుకురావటము ద్వారా అటెన్షన్ ఉంచటము సహజమైపోతుంది. మరి బలహీనత రావటానికి గల రెండు పదాలు - ఒకటి ఆకర్షణ, రెండవది పాత స్వభావము. కొందరిని తమ పాత స్వభావము బలహీనపరుస్తుంది, కొందరిని ఏదో ఒక విధమైన ఆకర్షణ బలహీన పరుస్తుంది. ఇవి ముఖ్యమైన రెండు బలహీనతలు. వీటి విస్తారము చాలా ఉంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధమైన ఆకర్షణ ఉంది మరియు ప్రతి ఒక్కరిలో నంబర్ వారిగా శాతములో ఇప్పటి వరకూ స్వభావము ఉంది. ఒకవేళ ఈ స్వభావము మరియు ఆకర్షణ మారినట్లయితే విశ్వము కూడా మారిపోతుంది ఎందుకంటే విశ్వ పరివర్తకులు స్వయమే మారనట్లయితే వారు ఇక విశ్వమును ఎలా మార్చగలరు?
మాలో ఎటువంటి ఆకర్షణ అయినా ఉందా అని మీలో మీరు పరిశీలించుకోండి. అది సంకల్ప రూపములో ఆకర్షణ కావచ్చు, సంపర్కరూపములో కావచ్చు, లేక తమ విశేషత వైపుకు ఆకర్షణ కావచ్చు. ఒకవేళ తమ విశేషతపై ఏదైనా ఆకర్షణ ఉన్నట్లయితే ఆ ఆకర్షణ కూడా బంధన యుక్తంగా చేసేస్తుంది, బంధన ముక్తులుగా అవ్వనియ్యదు. ఎందుకంటే ఆకర్షణ అశరీరిగా అవ్వనివ్వదు మరియు వారు విశ్వ కల్యాణకారులుగా కూడా అవ్వలేరు. ఎవరైతే స్వ ఆకర్షణలోనే ఇరుక్కుని ఉంటారో వారు విశ్వమునకు ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వమును ఎలా ఇవ్వగలరు? ఆకర్షణ ఉన్నవారు ఎప్పుడూ సర్వ శక్తి సంపన్నులుగా అవ్వలేరు, ఆకర్షణ ఉన్నవారు ధర్మరాజు శిక్షల నుండి సంపూర్ణ ముక్తులయ్యేవారుగా అవ్వజాలరు. ఆకర్షణ ఉన్నవారు నమస్కరించవలసిందే మరియు ఆకర్షణ ఉన్నవారు మొదటి జన్మలోని సంపూర్ణమైన రాజ్యభాగ్యమును పొందజాలరు. ఇదేవిధంగా పాత స్వభావము కలవారు నూతన జీవితము, నూతన యుగములోని సంపూర్ణతను సదాకాలము అనుభవము చేసుకోలేరు. ప్రతి ఒక్క ఆత్మపై సోదరత్వ భావనను ఉంచని కారణంగా స్వభావము ఒక విఘ్నంగా తయారవుతుంది. విస్తారమైతే స్వయమునకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? విస్తారమును జీవితములో ఇముడ్చుకొని తండ్రి సమానంగా అవ్వాలి. ఎటువంటి పాత స్వభావమూ ఉండకూడదు మరియు ఎటువంటి ఆకర్షణా ఉండకూడదు. ఎప్పుడైతే తనువు, మనసు మరియు ధనము అన్నింటినీ తండ్రికి సమర్పణ చేసేసారో, ఇక ఇచ్చేసిన తరువాత మళ్ళీ నా ఆలోచన, నా వివేకము మరియు నా స్వభావము - ఈ మాటలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? నావి అన్నవి ఇప్పటి వరకూ ఉన్నాయా లేక నావి అన్నీ నీవైపోయాయా? నావి అన్నీ నీవే అని అన్నట్లయితే, మరి నా మనసు అనేది సమాప్తమైపోయింది కదా? మనసు మరియు తనువు తండ్రి అమానతు (తాకట్టు పెట్టబడినవి) మీవైతే కావు కదా? నా మనసు చంచలంగా ఉంది - ఇలా అనటము ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటి వరకు కూడా నాది అన్నది వదలలేదా? మేరాపన్ (నాది అన్న భావము) ఎవరిలో ఉంటుంది? కోతిలో, అది చనిపోయినా కానీ దాని మోహము చావదు కావుననే చిత్రకారులు మహావీరులకు కూడా తోక గుర్తును ఇచ్చారు. ఉన్నది మహావీరులుగానే కానీ తోక తప్పకుండా ఉంది. మరి ఈ తోక ఏమిటి? ఆకర్షణ మరియు స్వభావములది. ఎప్పటి వరకైతే ఈ తోకకు నిప్పును అంటించరో అప్పటివరకు లంకకు నిప్పు అంటుకోజాలదు. మరి వినాశనపు వార్నింగుకు సహజమైన గుర్తు ఏది? ఈ తోకకు నిప్పంటించాలి. మహావీరులందరి లగనమనే నిప్పు అంటుకున్నట్లయితే ఇక ఈ పాత ప్రపంచము ఉంటుందా? కావున ఇప్పుడు అన్ని రకాల ఆకర్షణలు మరియు స్వభావములను సమాప్తము చెయ్యండి.
వినాశనకారీ ఆత్మలు వినాశనము కొరకు ఏవిధంగా తపిస్తూ ఉంటారో, అలా స్థాపన చేసే మీరు విశ్వ కల్యాణము కొరకు అంతగా తపిస్తుంటారా? అలా స్వ సేవ మరియు విశ్వ సేవ - ఈ రెండింటి కొరకు క్రొత్త క్రొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఉన్నారా? వినాశనము సహజంగా మరియు శీఘ్రంగా జరగాలని చాలా శక్తిశాలీ యంత్రాలను తయారు చేసేందుకు వారు ఏవిధంగా ఇన్వెన్షన్ ను చేస్తున్నారో అలా మహావీరులు, సైలెన్స్ శక్తి యొక్క ఇన్వెస్టర్లు అయిన మీరు పూర్తి విశ్వము పరివర్తన అయ్యేందుకు మరియు ముక్తి మరియు జీవన్ముక్తి వారసత్వమును తీసుకోవటంలో కేవలము ఒక్క క్షణము పట్టేటట్లుగా మరియు సహజముగా కూడా అయ్యేందుకు అటువంటి ప్లానునేదైనా తయారు చేస్తున్నారా? అలా చేసినట్లయితే ఇటువంటి రిఫైన్ ఇన్వెన్షన్ ద్వారా ఒక్క క్షణములో దృష్టి ద్వారా పూర్తి సంతృప్తులుగా అవ్వటము, ఒక్క క్షణములో దు:ఖితుల నుండి సుఖవంతులుగా, నిర్బలుల నుండి శక్తివంతులుగా అవ్వటము మరియు అశాంతి నుండి శాంతి అనుభవమును చేయించలగలరు. క్షణకాలములో వారి తపించటమును సమాప్తము చేసేంతటి రిఫైన్ ఆత్మిక శస్త్రాలు మరియు యుక్తులను ఆలోచిస్తున్నారా? బాంబు వలన ఏవిధంగా ఒక్క క్షణములో మరణిస్తారో, అలా ఒక్క క్షణములో వారికి వరదానము, మహాదానములను ఇవ్వగలిగేంతటి మహాదానులు మరియు అంతటి వరదానులుగా అయ్యారా? సర్వుల మనో కామనలను పూర్తి చేసే కామధేనువుగా అయ్యారా, ఇప్పటివరకు స్వయములో ఏదైనా కామన (కోరిక) అయితే లేదు కదా? ఒకవేళ మీకు ఏదైనా కామన ఉన్నట్లయితే కామధేనువులా ఎలా అవ్వగలరు? నా పేరు ఉండాలి, నాకు గౌరవము ఉండాలి - ఇటువంటి కామనలు కూడా ఉండకూడదు. అర్థమైందా?
ఇలా ఒక్క క్షణములో మూడవ నేత్రము ద్వారా విశ్వమును దృష్టి ద్వారా పూర్తి సంతృప్తముగా చేసేవారు, ఒక్క క్షణములో అశాంతి మరియు దుఃఖముల నుండి దూరంగా తీసుకొని వెళ్ళేవారికి, ఆకర్షణ మరియు స్వభావముల నుండి అతీతులై కర్మాతీత స్థితిలో స్థితులై ఉండేవారికి, ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వమును ప్రాప్తిగా కలిగిన జీవితములో సదా ఉండేవారికి, ముక్తి మరియు జీవన్ముక్త ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment