15-05-1972 అవ్యక్త మురళి

* 15-05-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "శ్రేష్ఠస్థితిని తయారుచేసుకునేందుకు సాధనములు, మూడు పదాలు- నిరాకారి, అలంకారి మరియు కళ్యాణకారి.''

              స్వయమును పదమా పదమ భాగ్యశాలురుగా భావిస్తూ ప్రతి అడుగునూ వేస్తున్నారా? పదమములు అని కమలపుష్పాలను కూడా అంటారు. ప్రతి అడుగులోను పదమముల వలే అతీతముగా మరియు ప్రియముగా అయి నడుచుకోవడం ద్వారానే ప్రతి అడుగులోను కోటానురెట్ల సంపాదన జమ అవుతుంది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారా? ఈ రెండు రకాల స్థితులనూ తయారుచేసుకున్నారా? ఒక్క అడుగులో కోటానురెట్ల సంపాదన అంటే ఎన్ని ఖజానాలకు అధిపతులుగా అయిపోతారు! ఈ విధంగా స్వయమును అవినాశీ ధనవంతులుగా లేక సంపదవంతులుగా, అతి అతీతంగా మరియు ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? ఒక్క అడుగు కూడా పదమ సమానమైన స్థితిలో ఉంటూ పదమాల(కోటానురెట్ల) సంపాదన లేకుండా వేయకూడదు. ఈ సమయంలో ఇటువంటి పదమాపదమపతులుగా అనగా అవినాశీ సంపదవంతులుగా అవుతారు, కావున మొత్తం కల్పమంతా సంపదవంతులుగా గాయనం చేయబడతారు. అర్థకల్పము స్వయం విశ్వరాజ్యానికి, అఖండ రాజ్యానికి, నిర్విఘ్న రాజ్యానికి అధికారులుగా అవుతారు. మళ్ళీ అర్థకల్పం భక్తులు మీ యొక్క ఈ స్థితిని గుణగానం చేస్తూ ఉంటారు. ఏ భక్తులకైనా తమ జీవితంలో ఏ విధమైన లోటు అనుభవమైనా వారు ఎవరివద్దకు వెళతారు? మీ స్మృతిచిహ్న చిత్రాలవద్దకు వెళతారు. చిత్రాల ద్వారా కూడా అల్పకాలికమైన ప్రాప్తిని పొందుతూ తమ లోపాలు లేక బలహీనతలను అంతం చేసుకుంటూ ఉంటారు. కావున మొత్తం కల్పమంతా ప్రాక్టికల్ రూపంలో లేక స్మృతిచిహ్న రూపంలో సదా సంపదవంతులుగా, శక్తివంతులుగా, గుణవంతులుగా, వరదానీ మూర్తులుగా అయిపోతారు. కావున ఎప్పుడైతే ఒక్క అడుగును వేస్తారో లేక ఒక్క సంకల్పమునైనా చేస్తారో, అప్పుడు ఇటువంటి స్మృతిలో ఉంటూ ఇటువంటి మీ శ్రేష్ఠ స్వరూపంలో స్థితులవుతూ నడుచుకుంటున్నారా? ఏ విధంగా ఎవరైనా హద్దులోని రాజు తన రాజధాని వైపుకు చూసినప్పుడు తాను ఏ స్థితిలో మరియు ఏ దృష్టితో చూస్తాడు? ఏ నషాతో చూస్తాడు? వీరందరూ నా ప్రజలు లేక నా పిల్లలవంటివారు అని భావిస్తాడు. అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైతే ఇప్పుడు సృష్టివైపుకు చూస్తారో లేక ఏ ఆత్మవైపుకైనా మీ దృష్టి వెళ్ళినప్పుడు మీరు వారిని ఏ విధంగా భావిస్తూ చూస్తారు? ఇది మా విశ్వము, దీనికి మేము అధిపతులుగా ఉండేవారము, వారు నేడు ఎలా అయిపోయారు! మళ్ళీ ఇప్పుడు విశ్వాధిపతికి పిల్లలమైన మేము మళ్ళీ విశ్వాన్ని సుసంపన్నముగా చేస్తున్నాము, సంపదవంతులుగా చేస్తున్నాము, సదా సుఖవంతులుగా చేస్తున్నాము అన్న ఈ నషాలో స్థితుల్లో ఉంటూ అదే రూపంతో, అదే వృత్తితో, అదే దృష్టితో ప్రతీ ఆత్మను చూస్తున్నారా? ఏ ఆత్మనైనా ఏ స్థితిలో ఉంటూ చూస్తున్నారు? ఆ సమయంలోని స్థితి ఏ విధంగా ఉంటుంది? (ప్రతిఒక్కరూ వినిపించారు). మీరు ఏదైతే వినిపించారో అవన్నీ యథార్థమే, ఎందుకంటే ఇప్పుడు అయథార్థమైనవాటిని వదిలేసారు. మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతారో అదంతా యథార్థమే మాట్లాడుతారు. ఇప్పుడు అయథార్థము అన్న పదము కూడా మీ నోటినుండి వెలువడజాలదు.

       ఇప్పుడు ఏ ఆత్మను చూసినా, ఈ ఆత్మలందరి పట్లా బాబా మమ్మల్ని వరదానులుగా మరియు మహాదానులుగా నిమిత్తం చేశారు అన్న వృత్తినే ఉంచాలి. వరదానీ లేక మహాదానీ వృత్తితో చూడడం ద్వారా ఏ ఆత్మనైనా వరదానము, లేక మహాదానము నుండి వంచితులుగా వదలరు. ఎవరైతే మహాదానులుగా లేక వరదానులుగా ఉంటారో వారి ముందుకు ఎవరు వచ్చినా, ఆ ఆత్మలకు ఏదో ఒకటి దాతగా అయి తప్పకుండా ఇస్తారు. ఎవ్వరినీ ఖాళీగా పంపించరు. కావున ఇటువంటి వృత్తిని ఉంచడం ద్వారా ఏ ఆత్మ అయినా మీ ముందు నుండి ఒట్టి చేతులతో వెళ్ళదు. ఏదో ఒకటి తీసుకునే వెళుతుంది. స్వయమును ఈ విధంగా భావిస్తూ ప్రతి ఆత్మనూ చూస్తున్నారా? దాత పిల్లలు దాతగానే ఉంటారు. ఏ విధంగా బాబా ముందుకు ఎవరు వచ్చినా వారిని బాబా ఒట్టి చేతులతో పంపించరు కదా! కావున అదేవిధంగా బాబాను అనుసరించండి. ఏ విధంగా స్థూలరీతిలో కూడా ఎవ్వరినైనా ఎటువంటి కానుకనైనా తీసుకోకుండా పంపించరు కదా! ఏదో ఒక కానుకను తప్పకుండా ఇస్తారు కదా! అలా ఆ స్టూలమైన ఆచారము కూడా ఎందుకు కొనసాగింది? సూక్ష్మ కర్తవ్యముతో పాటు సహజముగా స్మృతిని కలిగించేందుకు ఒక సహజ సాధనము తయారుచేయబడి ఉంది. ఏ విధంగా ఏదైనా స్థూల కానుకను తీసుకోకుండా వెళ్ళకూడదు అని భావిస్తారో అలాగే తక్కువలో తక్కువైనా కొద్దిగానైనా తీసుకొని వెళ్ళాలి అన్న లక్ష్యమును సదా ఉంచండి. అప్పుడే కదా వారు మీ విశ్వరాజ్యములోకి వస్తారు. ఇటువంటి సదాచారులు మరియు సదా మహాదానీ దృష్టి, వృత్తి మరియు కర్మలతో అయే వారే విశ్వాధిపతులుగా అవుతారు. కావున సదా ఇటువంటి స్థితి ఉండాలి అనగా సదా సంపదవంతులుగా అయి నడుచుకోవాలి. దీని కొరకు మూడు పదాలను గుర్తుంచుకోవాలి. ఈ మూడు పదాలను గుర్తుంచుకోవడం ద్వారా సదా మరియు స్వతహాగానే ఈ స్మృతి ఉంటుంది. ఆ మూడు పదాలు ఏమిటి? 'సదా నిరాకారి', 'అలంకారి' మరియు 'కళ్యాణకారి' ఈ మూడు పదాలూ గుర్తున్నట్లయితే మీ శ్రేష్ఠ స్థితిని సదా తయారుచేసుకోగలుగుతారు. మనసాలో కాని, కర్మణాలో కాని, సేవలోకాని మూడు స్థితులలోను మీ ఉన్నత స్థితిని తయారుచేసుకోవచ్చు. ఏ సమయంలోనైతే కర్మలోకి వస్తారో ఆ  సమయంలో సదా అలంకారీమూర్తులుగా ఉంటున్నామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అలంకారీమూర్తులు దేహ అలంకారులుగా ఉండరు. అలంకారంతో అహంకారము సమాప్తమైపోతుంది. కావున  మా స్వదర్శనచక్రము తిరుగుతోందా అని మీ అలంకారాలను సదా చూసుకుంటూ ఉండండి. స్వదర్శనచక్రము తిరుగుతూ ఉన్నట్లయితే అనేక రకాల మాయావీ విఘ్నాల వలయాలలోకి ఏదైతే వచ్చేస్తారో అది జరగదు. స్వదర్శనచక్రం ద్వారా అన్ని చక్రాలనుండి రక్షింపబడతారు. కావున స్వదర్శనచక్రము తిరుగుతోందా అని సదా పరిశీలించుకోండి. ఏ విధమైన అలంకారాలు లేనట్లయితే సర్వశక్తులలో ఏదో ఒక శక్తిలో లోటు ఉన్నట్లు, సర్వశక్తులు లేనట్లయితే సర్వవిఘ్నాలు లేక సర్వబలహీనతల నుండి కూడా ముక్తులుగా ఉండరు. ఏ విధమైన విషయంలో కాని, విఘ్నాల నుండి కాని లేక మీ పాత సంస్కారాల నుండి కాని లేక సేవలో ఏదైనా అసఫలతకు కారణమైనట్లయితే మరియు ఆ కారణానికి వశమై ఏదో ఒక విఘ్నంలోకి వచ్చిసినట్లయితే ముక్తి లభించకపోవడానికి కారణం - ఏదో ఒక శక్తిలో లోపము ఉంది అని అర్థంచేసుకోండి. విఘ్నాల నుండి ముక్తులవ్వాలనుకుంటే శక్తిని ధారణ చేయండి అనగా అలంకారీ రూపులుగా అయి ఉండాలి. అలంకారులుగా భావిస్తూ నడవకపోతే లేక అలంకారాలను వదిలివేస్తే, శక్తులు లేకుండా ముక్తి లభించాలి అన్న కోరికను ఉంచినట్లయితే అది ఎలా పూర్ణమవ్వగలదు? కావున ఈ మూడు పదాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రతికార్యమును చేయండి. ఈ అలంకారాలను ధారణం చేయడం ద్వారా సదా స్వయమును వైష్ణవులుగా భావిస్తారు. భవిష్యత్తులో అయితే విష్ణువంశీయులుగా అవుతారు, కాని, ఇప్పుడు వైష్ణవులుగా అయితేనే విష్ణు రాజ్యంలో విష్ణు వంశీయులుగాఅవుతారు కదా! వైష్ణవులు అనగా ఎటువంటి అశుద్ధమైన వస్తువును ముట్టుకోనివారు. ఈ రోజుల్లోని వైష్ణవులు స్థూలమైన తామసిక వస్తువుల నుండి వైష్ణవులుగా ఉన్నారు, కాని, శ్రేష్ఠ ఆత్మలైన మీరు సదా వైష్ణవులు అనగా తమోగుణ సంకల్పాలను లేక తమోగుణ సంస్కారాలను కూడా స్పర్శించజాలరు. ఏవైనా అశుద్ధ సంకల్పాలను లేక సంస్కారాలను స్పర్శించినట్లయితే అనగా ధారణ చేసినట్లయితే మరి సత్యమైన వైష్ణవులుగా ఉన్నట్లా? అలాగే ఎవరైతే సత్యమైన వైష్ణవులుగా అవ్వరో వారు విష్ణురాజ్యంలో విశ్వాధిపతులుగా అవ్వజాలరు. కావున ఎంతవరకు సదాకాలికమైన వైష్ణవులుగా అయ్యాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వైష్ణవ కులానికి చెందినవారు ఎటువంటి అశుద్ధమైనవారిని తమను స్పర్శించనివ్వరు. అందరి నుండి తప్పుకుంటారు. అది స్థూలమైన విషయము. కాని ఎవరైతే సత్యమైన వైష్ణవులుగా అవుతారో వారు ఎటువంటి పాత విషయములు, పాత ప్రపంచము లేక పాత ప్రపంచానికి సంబంధించిన ఏ వ్యక్తులు లేక వైభవాలను తమ బుద్ధితో స్పర్శించనివ్వరు, ప్రక్కకు తప్పుకుంటారు, కావున ఇటువంటి వైష్ణవులుగా అవ్వండి. ఏ కారణంగానైనా అటువంటివారిని ముట్టుకుంటే వారు స్నానం చేస్తారు కదా, స్వయమును శుద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా! అలాగే ఏదైనా బలహీనత కారణంగా ఏదైనా పాత తమోగుణ సంస్కారము లేక సంకల్పమునైనా స్పర్శించినట్లయితే విశేషంగా జ్ఞానస్నానం చేయాలి అనగా బుద్ధిలో విశేష రూపంగా బాబాను స్మృతి చేయాలి లేక బాబాతో ఆత్మిక సంభాషణ చేయాలి. దీనిద్వారా ఏమి జరుగుతుంది? ఆ తమోగుణ సంస్కారము ఎప్పుడూ స్పర్శించదు, శుద్ధంగా అయిపోతారు. స్వయమును శుద్ధంగా చేసుకోవడం ద్వారా సదా శుద్ధస్వరూపపు సంస్కారాల తయారవుతాయి. మరి ఇలా చేస్తున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు అని అంటారు కదా!బలహీనత స్వయముదే కదా! ఎంతటి శక్తి ఉండాలంటే ఎవ్వరూ స్పర్శించను కూడా స్పర్శించకూడదు. ఎవరైనా శక్తిశాలిగా ఉన్నట్లయితే వారి ముందు బలహీనులు ఒక్క మాట కూడా మాట్లాడలేరు, వారి ముందుకు కూడా రాజాలరు. అజ్ఞానంలో కోపంగా ఉండే వారిముందుకు ఎవ్వరూ రాజాలరు. ఇక్కడ ఉండేది ఆత్మిక హుందాతనము.మీ ఆవేశమును ఆత్మికతలోకి మార్చినట్లయితే మిమ్మల్ని స్పర్శించే శక్తి కూడా ఎవ్వరికీ ఉండదు. భవిష్యత్తులో మీ అందరి ముందు ప్రకృతి దాసిగా అయిపోతుంది, అదే మీ సంపూర్ణ స్థితి కదా! మరి ప్రకృతి దాసిగా అవ్వగలిగినప్పుడు మరి పాత సంస్కారాలను దాసిగా చేయలేరా? ఏ విధంగా దాసదాసీయులు సదా జీ హాజిర్ అని అంటూ ఉంటారో అలాగే ఈ బలహీనతలు కూడా జీ హజూర్ అంటూ మీముందు నిలుచుంటాయి, మిమ్మల్ని స్పర్శించవు. ఇటువంటి స్థితిని సదాకాలికంగా తయారుచేసుకుంటున్నారా? ఇప్పుడు ఎంతవరకు చేరుకున్నారు? ఇది నిన్నటి విషయమా లేక ఇప్పటి విషయమా లేక సంవత్సరాల విషయమా? ఈ మధ్య అన్న పదానికి, ఇప్పుడు అన్న పదానికి సమయంలోనైతే చాలా తేడా ఉంటుంది కదా!

           టీచర్ అద్భుతమేమిటంటే వారు అందరినీ టీచర్లుగా తయారుచేశారు. మీరు టీచర్లు కాదా! మీకు మీరు టీచర్లుగా అయ్యారా? అయ్యారు కదా! మరి మీకు రిజల్టును గూర్చి తెలియదా? ఈ బాబా సమానంగా తయారుచేసే కర్తవ్యమునే చేయాలి. టీచరు టీచరుగా చేయకపోతే తాను టీచర్ గా ఎలా అయినట్లు? మీకు మీరు టీచర్లుగా అయి నడవకపోతే సంపూర్ణ స్థితిని పొందలేరు. ఎవరైతే తమ టీచర్లుగా అవ్వరో వారు బలహీనులుగా ఉంటారు. మన మహిమ ఏదైతే గాయనము చేయబడుతుందో అటువంటి మహిమాయోగ్యులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక్కొక్క విషయమును స్వయములో చూసుకోండి. మర్యాదా పురుషోత్తములుగా అయ్యామా, సంపూర్ణ నిర్వికారులుగా, సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ అహింసకులుగా... ఈ మహిమలన్నీ ప్రాక్టికల్ లో ఉన్నాయా? ఏదైనా లోపము ఉన్నట్లయితే ఆ లోటును పూర్తి చేయడం ద్వారా మహిమాయోగ్యులుగా అయిపోతారు. కావున ఈ విధంగా సదా మరియు సత్యమైన వైష్ణవులుగా అయ్యే లక్కీయస్ట్ మరియు హయ్యస్ట్ పిల్లలకు నమస్తే.

Comments