15-03-1972 అవ్యక్త మురళి

* 15-03-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

త్యాగం మరియు భాగ్యం.

మిమ్మల్ని మీరు త్యాగముర్తులుగా తపస్వీముర్తులుగా భావిస్తున్నారా? అన్నింటి కంటే శ్రమతో కూడుకున్న అతి పెద్ద త్యాగము ఏది? (దేహ-అభిమానము). జ్ఞాన అభిమానము లేక బుద్ధి యొక్క అభిమానము కూడా ఎందుకని వస్తాయి? పాత సంస్కారాల త్యాగము కూడా ఎందుకని ఉండదు? దాని ముఖ్య కారణము దేహ-అభిమానము. దేహ అభిమానమును వదలటము అతి పెద్ద త్యాగము. దీనిని ప్రతి క్షణము మీకు మీరు పరిశీలించుకోవలసి ఉంటుంది. స్థూల త్యాగము ఏదైతే ఉందో అది ఒకసారి త్యాగము చేసిన తరువాత వదిలేస్తారు. కానీ ఈ దేహ అభిమాన త్యాగమేదైతే ఉందో దానికి ప్రతి క్షణము దేహ ఆధారమును తీసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ కేవలము ఉంటూ అతీతంగా ఉండాలి. ఈ కారణంగా ప్రతి క్షణము దేహముతోటి ఆత్మకు గాఢమైన సంబంధము ఉన్న కారణంగా దేహ అభిమానము కూడా చాలా గాఢంగా అయిపోయింది. ఇప్పుడు దీనిని తొలగించేందుకు శ్రమ అనిపిస్తుంది. అన్ని రకాల త్యాగము చేసామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఎంతగా త్యాగము చేస్తారో అంతగానే భాగ్యమును ప్రాప్తి చేసుకుంటారు, వర్తమాన సమయములో మరియు భవిష్యత్తులో కూడా. సంగమయుగములో కేవలము త్యాగము చెయ్యాలి మరియు భవిష్యత్తులో భాగ్యమును తీసుకోవాలి అని భావించకండి, అలా కాదు. ఎవరు ఎంతగా త్యాగము చేస్తారో మరియు ఏ ఘడియ త్యాగము చేస్తారో ఆ ఘడియే ఎంతటి త్యాగమో అంతటి భాగ్యము రిటర్న్ లో తప్పక ప్రాప్తిస్తుంది. సంగమయుగములో త్యాగమునకు ప్రత్యక్ష రూపంలో ఏ భాగ్యము లభిస్తుంది. అన్నది తెలుసా మీకు? ఇప్పుడిప్పుడే ఎటువంటి భాగ్యము లభిస్తుంది? సత్యయుగములో అయితే జీవన్ముక్తి పదవి లభిస్తుంది, ఇప్పుడు ఏం లభిస్తుంది? మీకు మీ త్యాగమునకు భాగ్యము లభిస్తుంది, సంగమయుగములో త్యాగమునకు అతి పెద్ద భాగ్యముగా భాగ్యమును తయారుచేసే వారు స్వయం మీవారుగా అయిపోతారు. ఇది అతి పెద్ద భాగ్యము కదా! స్వయం భగవంతుడే మీవారుగా అవ్వటమన్నది కేవలము సంగమయుగములోనే ప్రాప్తమవుతుంది. ఒకవేళ త్యాగము లేనట్లయితే తండ్రి కూడా మీవారు కారు. దేహభానము ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉంటుందా? ఎప్పుడైతే దేహభానమును త్యాగము చేస్తారో అప్పుడే తండ్రి సమీప సంబంధముయొక్క అనుభవము ఉంటుంది. దేహభానమును త్యాగము చెయ్యటం ద్వారానే దేహీ అభిమానిగా అవుతారు, దేహీ అభిమానిగా అవ్వటం ద్వారా మొదట ఏ ప్రాప్తి లభిస్తుంది? ఈ ప్రాప్తే కదా, నిరంతరము తండ్రి స్మృతిలో ఉంటారు అనగా ప్రతి క్షణపు త్యాగము ద్వారా ప్రతి క్షణము కొరకు తండ్రి యొక్క సర్వ సంబంధాలను, సర్వ శక్తులను తమతోటి అనుభవము చేసుకుంటారు. మరి ఇది అన్నింటికన్నా పెద్ద భాగ్యము కాదా? ఈ భాగ్యము భవిష్యత్తులో లభించదు. కావుననే ఈ సహజ జ్ఞానము మరియు సహజ రాజయోగము భవిష్య ఫలము కాదు కానీ ప్రత్యక్షఫలమును ఇచ్చేది అని అంటారు. భవిష్యత్తు అయితే వర్తమానముతో జోడింపబడే ఉంది కానీ సర్వ శ్రేష్ఠ భాగ్యము మొత్తము కల్పములో మరెక్కడా ప్రాప్తి చేసుకోరు. ఈ సమయములోనే త్యాగము మరియు తపస్సులతో తండ్రి తోడును ప్రతి క్షణము అనుభవము చేసుకుంటారు అనగా తండ్రిని సర్వ సంబంధాలతో మీవారిగా చేసుకుంటారు. ఇలా పిలవలేదు, పిలిచింది. మరొకవిధంగా కానీ ప్రాప్తి ఏం లభించింది? సంకల్పములో కానీ, స్వప్నములో గానీ ఊహించనటువంటి ఆ ప్రాప్తి లభించింది కదా? కావున సంకల్పములోనూ, స్వప్నములోనూ కూడా లేని విషయము ప్రాప్తి అవ్వటము... దీనినే భాగ్యము అని అంటారు. ఏ వస్తువైతే చాలా కష్టముతో లభిస్తుందో దానిని భాగ్యము అని అనరు. స్వతహాగనే లభిస్తుంది, అసంభవము సంభవమవుతుంది, నిరాశావాదుల నుండి, ఆశావాదులుగా అయిపోతారు, కావున దీనినే భాగ్యము అని అంటారు. ఈ భాగ్యము లభించలేదా? పిలిచింది మరోవిధంగా మమ్మల్ని కేవలం ఏదోవిధంగా మీవారిగా చేసుకోండి అని పిలిచారు. ఇంత ఉన్నతంగా అవ్వటమును కోరుకోలేదు, కానీ లభించింది ఏమిటి? స్వయమైతే తయారయ్యారు, కానీ తండ్రిని కూడా సర్వస్వంగా చేసుకున్నారు. మరి ఇది భాగ్యము కాదా? సంగమయుగపు శ్రేష్ఠ భాగ్యము ఈ త్యాగము ద్వారానే లభిస్తుంది. ఎల్లప్పుడూ ఒకవేళ దేహభానమును త్యాగము చెయ్యనట్లయితే అనగా దేహీ అభిమానిగా అవ్వనట్లయితే భాగ్యమును కూడా మీదిగా చేసుకోలేరు అనగా సంగమయుగపు శ్రేష్ఠ భాగ్యమేదైతే ఉందో దాని నుండి వంచితులుగా ఉండిపోతారు అన్నది గుర్తుంచుకోండి. ఒకవేళ మొత్తము రోజంతటిలో కొంత సమయము దేహఅభిమానముయొక్క త్యాగము ఉంటూ మరియు కొంత సమయము కింద ఉంటారనుకోండి అనగా దేహభానపు త్యాగము ఉండనట్లయితే అంతగానే సంగమయుగములో శ్రేష్ఠ భాగ్యము నుండి వంచితులౌతారు. భాగ్యమును తయారు చేసే తండ్రి ప్రతి క్షణము భాగ్యమును తయారుచేసుకొనే విధిని వినిపిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఆ విధి ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకోవాలి. విధిని అనుసరించని కారణంగా రిజల్ట్ ఏముంటుంది? స్థితిలోనూ వృద్ధి ఉండదు మరియు సర్వ ప్రాప్తుల సిద్ది ఉండదు. మరేం చెయ్యాలి? విధాత ద్వారా లభించిన విధులను సదా అనుసరించాలి. దీని వలన వృద్ధి కూడా ఉంటుంది మరియు సిద్ది కూడా ఉంటుంది. కావున సంకల్పాల రూపములో వ్యర్థ సంకల్పాలను ఎంతవరకు త్యాగము చేసాను అని, వృత్తి సదా భాయీ-భాయిగా ఉండాలి, అటువంటి వృత్తిని ఎంతవరకు అనుసరిస్తున్నాను మరియు దేహములో దేహధారిని అనే వృత్తిని ఎంతవరకు త్యాగము చేసాను? అని పరిశీలించుకోండి. మైసూరు వారు అర్థం చేసుకున్నారా? ఈరోజు ముఖ్యంగా వీరితో మిలనము చేసేందుకు వచ్చారు కదా! ఎందుకంటే అంత దూరము నుండి, శ్రమ తీసుకుని, స్నేహముతో వచ్చారు కదా! కావున తండ్రి కూడా దూరదేశము నుండి రావలసి వచ్చింది. మరి సంతోషంగా ఉంది కదా? ఈరోజు ముఖ్యంగా దూరదేశము నుండి వచ్చేవారి కోసం తండ్రి కూడా దూరదేశము నుండి వచ్చారు. కావున ఎవరితో అయితే స్నేహము ఉంటుందో, స్నేహుల స్నేహములో త్యాగము ఏమంత గొప్ప విషయము కాదు. వికారాల స్నేహములోకి వచ్చి మీ తెలివితేటలను కూడా వదిలేసారు, కావున మీ శరీరమును కూడా త్యాగము చేసారు. పిల్లల స్నేహములో తల్లి తనువును కూడా త్యాగము చేస్తుంది కదా! దేహధారుల సంబంధము యొక్క స్నేహములో మీ కిరీటము, సింహాసనము మరియు మీ అసలు స్వరూపము అన్నింటినీ వదిలేసారు కదా, కావున ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి స్నేహులుగా అయ్యారో అప్పుడు ఈ దేహఅభిమానమును త్యాగము చెయ్యలేరా? కష్టమా? పైనుండి కిందకు పడేసే అల్పకాలికమైన సంబంధాలలో ఎంత శక్తి ఉంది! అన్నదాని గురించి ఆలోచించాలి. దీనివలననే పై నుండి కిందకు వచ్చారు కదా, ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే చెప్పారో మరియు తండ్రితో సర్వ సంబంధాలు జోడింపడ్డాయో అప్పుడు మరి తండ్రి స్నేహములో ఈ ఉల్టా దేహ అభిమానమును త్యాగము చెయ్యటమన్నది ఏమైనా పెద్ద విషయమా? చిన్న విషయము కదా! అయినా కూడా ఎందుకని చెయ్యలేకపోతున్నారు? దీనినైతే ఒక్క క్షణములో చేసేసెయ్యాలి. ఒకవేళ తన బిడ్డకు ఒక నెల అనారోగ్యముగా ఉన్నట్లయితే తల్లి తన అల్పకాలిక సంబంధాలేవైతే ఉన్నాయో, దేహ సంబంధాలు ఉన్నాగానీ తల్లి ఒక నెల కొరకు అన్నింటినీ త్యాగము చేసేస్తుంది. దేహ స్మృతిని, సుఖమును త్యాగము చెయ్యటంలో ఆలస్యము చెయ్యదు. కష్టమని కూడా భావించదు. మరి ఇక్కడ ఏం చెయ్యాలి? ఇక్కడైతే సదాకాలపు సంబంధము మరియు సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తుల సంబంధము ఉన్నాయి కావున ఇక్కడ త్యాగము చెయ్యటములో ఒక్క క్షణము కూడా ఆలశ్యము చెయ్యకూడదు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేహభానమును త్యాగము చెయ్యటంలో ఎన్ని సంవత్సరాలు గడిపారు? ఎన్ని సంవత్సరాలైపోయాయి? పట్టాల్సింది ఒక్క క్షణము మరియు పట్టింది ఎన్ని సంవత్సరాలు?(అర్థకల్పపు అభ్యాసము పట్టింది) ఎవరైతే అర్థకల్పము దేహభానము నుండి అతీతంగా ఉన్నారో వారు అర్థకాలపు అభ్యాసమును ఒక్క క్షణములో మర్చిపోయారా? దీనికేమన్నా సమయం పట్టిందా? (త్రేతాలో కూడా రెండు కళలు తక్కువైపోతాయి) అయినప్పటికీ వికారాల నుండి దూరంగా అయితే ఉన్నారు కదా! సత్య, త్రేతాయుగాలలో నిర్వికారులుగా అయితే ఉన్నారు కదా. రెండు కళలు తక్కువైన తరువాత కూడా త్రేతాలో నిర్వికారులు అనే అంటారు కదా, వికారాల ఆకర్షణ నుండి దూరంగా ఉన్నారు కదా. ఇది కూడా అర్థకల్పపు సంస్కారమైపోయింది కదా, మరి ఎందుకని అవి త్వరగా స్మృతిలోకి రావు? ఆత్మ అసలైన రూపము కూడా ఏమిటి? ఆత్మలైన మీ అసలైన నిజ సంస్కారము లేక గుణము ఏది? తండ్రిలో ఏదైతే ఉందో అదే కదా! జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు, శాంతి సాగరులు అని తండ్రి గుణాలేవైతే ఉన్నాయో వాటిలో వారు సాగరులు కానీ మీరు స్వరూపులు. కావున ఆత్మ యొక్క నిజ గుణమేదైతో ఉందో అది శాంతి స్వరూపమే కదా. ఇదైతే సాంగత్యపు రంగులో పరివర్తనలోకి వచ్చారు. కానీ వాస్తవికంగా ఆత్మ స్వరూపపు గుణము ఏదైతే ఉందో అదైతే తండ్రి సమానమైనదే కదా, అది కూడా ఎందుకని త్వరగా స్మృతిలోకి రాదు? ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోండి. అర్థమైందా? ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అనగా ఆత్మిక సంభాషణను చేస్తూ చేస్తూ ఆత్మికతలో స్థితులైపోతారు. ద్వాపరములోని పాత సంస్కారము ఉంది, కావున ఇది జరిగింది అని దానిని ఇప్పుడు ఆలోచించకండి. దీనిని ఆలోచించేందుకు బదులుగా ఆత్మనైన నా ఆది సంస్కారము మరియు అనాది సంస్కారము ఏది అని దానిని గురించి ఆలోచించండి. సృష్టి ఆదిలో ఆత్మలు వచ్చినప్పుడు ఏ సంస్కారము ఉండేది? దైవీ సంస్కారము ఉంది కదా! కావున ఆదిలో ఆత్మ సంస్కారము మరియు గుణము ఎటువంటివి అని ఆలోచించండి. మధ్యనున్నదానిని గురించి ఆలోచించకండి. అనాది మరియు ఆది సంస్కారాలను గురించి ఆలోచించినట్లయితే మధ్యమధ్యలో ప్రజ్వలించే మధ్యమ సంస్కారాలేవైతో ఉన్నాయో అవి మధ్యమమైపోతాయి. మధ్యమమని ఢీలాగా ఉండేవాటిని అంటారు. వీరి నడవడిక మధ్యమముగా ఉంది అని అంటారు కదా. కావున మధ్యలోని సంస్కారాలు మధ్యమమైపోవాలి, అలాగే అనాది మరియు అది సంస్కారాలెవైతో ఉన్నాయో అవి ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. అర్థమైందా? ఎల్లప్పుడూ అనాది మరియు ఆదిలనే ఆలోచించండి. ఎటువంటి సంకల్పమును చేస్తారో అటువంటి స్మృతియే ఉంటుంది మరియు ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి సమర్థత ప్రతి కర్మలో వస్తుంది, కావున స్మృతిని ఎల్లప్పుడూ శ్రేష్ఠంగా ఉంచుకోండి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ప్రతి క్షణపు త్యాగము ద్వారా ప్రతి క్షణమూ ప్రాప్తిని పొందుతూ నడవండి. ఎందుకంటే భాగ్యమును ప్రాప్తి చేసుకొనేందుకు ఉన్నది - ఈ సంగమయుగమే. ఇప్పుడు భాగ్యమునేదైతే తయారుచేసుకున్నారో దానిని మొత్తము కల్పమంతా అనుభవించవలసి ఉంటుంది. అది శ్రేష్టమైనదైనా లేక నీచమైనదైనా సరే. కానీ ఈ సంగమయుగము ఉండనే ఉంది, దీనిలో భాగ్యమును తయారుచేసుకోగలరు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోగలరు. ఎందుకంటే భాగ్యమును తయారుచేసే తండ్రి తోడు ఉంది. మరిక తరువాత ఈ తండ్రి తోడూ ఉండదు, ఈ ప్రాప్తి ఉండదు. ప్రాప్తిని చేయించేవారు కూడా ఇప్పుడు ఉన్నారు మరియు ప్రాప్తి కూడా ఇప్పుడు కలిగేదుంది. "ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు" ఈ స్లోగన్ ను స్మృతిలో ఉంచుకోండి. స్లోగన్ వ్రాయబడి ఉంది కదా! ఈ స్లోగన్ మా కొరకే అని భావిస్తున్నారా? ఇప్పుడు కాకున్న మరెప్పుడూ లేదు అన్నది ఎల్లప్పుడూ సృతిలో ఉన్నట్లయితే అప్పుడిక ఏం చేస్తారు? ఏది చేసేదుందో దానిని ఇప్పుడే చెయ్యాలి అని ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. కావున ఎల్లప్పుడూ ఈ స్లోగన్ ను స్మృతిలో పెట్టుకోండి. మీ స్థితిని సదా త్యాగము మరియు సదా భాగ్యశాలిగా తయారుచేసుకొనేందుకు చెకింగ్ నైతే చేసుకోవాలి, కానీ చెకింగ్ లో కూడా ముఖ్యమైన ఏ చెకింగ్ చేసుకోవాలి, ఈ చెకింగ్ చేసుకోవటం ద్వారా ఆటోమేటిక్ గానే చేంజ్ వచ్చేస్తుంది? ఏ చెకింగ్ చేసుకోవాలి అన్నదానికి ఒక స్లోగన్ ఉంది. అది ఏ స్లోగన్? దీనిని చాలాసార్లు వినిపించి ఉన్నాము - కమ్ ఖర్చ్ బాలా నషీన్ (తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి) ఇప్పుడు కమ్ ఖర్చ్ బాలా నషీన్గా ఎలా అవ్వాలి?

ఆ మనుష్యులైతే స్థూల ధనములో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ మీకొరకు సంగమయుగములో ఎన్ని రకాల ఖజానాలు ఉన్నాయో తెలుసా? సమయము, సంకల్పము, శ్వాసలు ఖజానాలుగా ఉన్నాయి, కానీ వాటితో పాటు అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా కూడా ఉంది మరియు ఐదవ స్థూల ఖజానా తోటి కూడా దీనికి సంబంధము ఉంది. కావున సంకల్పాల ఖజానాలో కూడా తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవానిగా అయ్యానా? అని దీనిని చెక్ చేసుకోండి. ఎక్కువగా ఖర్చు చెయ్యకండి. మీ సంకల్పాల ఖజానాను వ్యర్థముగా పోగొట్టుకోనట్లయితే సమర్థమైన మరియు శ్రేష్ఠమైన సంకల్పములు తయారవుతాయి. శ్రేష్ఠ సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్ఠంగా అవుతుంది కదా! అలాగే సంగమయుగములోని సమయపు ఖజానా ఏదైతో ఉందో, ఈ సంగమయుగ సమయమును ఒకవేళ వ్యర్థముగా ఖర్చు చెయ్యనట్లయితే ఏమవుతుంది? ఒక్కొక్క క్షణములో అనేక జన్మల సంపాదనకు సాధనమును తయారుచేసుకోగలరు. కావున ఈ సమయమును వ్యర్థముగా పోగొట్టకూడదు. అలాగే శ్వాస ఏదైతే ఉందో అందులో ప్రతి శ్వాసలో తండ్రి స్మృతి ఉండాలి. ఒకవేళ ఒక్క శ్వాసలోనైనా తండ్రి స్మృతి లేనట్లయితే వ్యర్థముగా పోయిందని భావించండి. కావున శ్వాసను కూడా వ్యర్థముగా పోగొట్టకూడదు. అలాగే జ్ఞాన ఖజానా ఏదైతే ఉందో అందులో కూడా ఒకవేళ ఖజానాను సంభాళించటము రానట్లయితే, లభించింది మరియు పూర్తి చేసేసినట్లయితే వ్యర్థముగా పోయినట్లు, మననము చెయ్యలేదు కదా, మననము తరువాత ఆ ఖజానా ద్వారా ఏ సంతోషమైతే లభించిందో ఆ సంతోషములో స్థితులయ్యే అభ్యాసము చెయ్యనట్లయితే వ్యర్థముగా పోయినట్లే కదా. ఏవిధంగా భోజనం చేసారు, అరిగించుకొనే శక్తి లేనట్లయితే వ్యర్థముగా పోతుంది కదా. అదేవిధంగా ఈ జ్ఞాన ఖజానాను మీ కొరకు మరియు ఇతర ఆత్మలకు దానము చేసేందుకు వినియోగించనట్లయితే వ్యర్థముగా పోయినట్లే కదా. అలాగే ఈ స్థూల ధనము కూడా ఒకవేళ ఈశ్వరీయ కార్యములో ప్రతి ఆత్మ కళ్యాణ కార్యములో లేక తమ ఉన్నది కార్యములో లో వినియోగించకుండా వేరే స్థూలకార్యాలలో వినియోగించనట్లయితే వ్యర్థముగా పెట్టినట్లు కదా. ఎందుకంటే ఒకవేళ ఈశ్వరీయ కార్యములో పెట్టినట్లయితే ఈ స్థూల ధనము ఒకటికి లక్ష రెట్లుగా అయ్యి ప్రాప్తిస్తుంది మరియు ఒకవేళ ఒక్కదానిని వ్యర్థముగా పోగొట్టినట్లయితే ఒక్కదానిని వ్యర్థముగా పోగొట్టినట్లు కాదు, కానీ లక్షను వ్యర్థముగా పోగొట్టినట్లు. ఇదేవిధంగా సంగమయుగములోని సర్వ ఖజానాలేవైతే ఉన్నాయో ఆ ఖజానాలేవి కూడా వ్యర్థముగా అయితే పోలేదు కదా అని ఆ సర్వ ఖజానాలను చెక్ చేసుకోండి. మరి అలా తక్కువ ఖర్చు-ఎక్కువ ఖ్యాతి కలవారిగా అయ్యారా లేక ఇప్పటివరకూ నిర్లక్ష్యులుగా అయిన కారణంగా వ్యర్థంగా పోగొట్టారా? ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటారో వారు వ్యర్థముగా పోగొడతారు మరియు ఎవరైతే తెలివైనవారుగా ఉంటారో, నాలెడ్జ్ ఫుల్‌గా ఉంటారో, సెన్సిబుల్‌గా ఉంటారో వారు ఒక్క చిన్న వస్తువును కూడా వ్యర్థముగా పోగొట్టరు. తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి అని ఇటువంటివారినే అంటారు. మీరు అటువంటివారే కదా! సాకారతండ్రి తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారుగా అయ్యి చూపించారు కదా. మరి బాబాను ఫాలో చెయ్యరా? స్థూల ధనము, ఒకవేళ స్థూల ధనము లేనట్లయితే ఈ యజ్ఞ నివాసీలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఈ స్థూల యజ్ఞములోని ప్రతి వస్తువు కూడా స్థూల ధనముతో సమానము. ఒకవేళ యజ్ఞ వస్తువునేదైనా వ్యర్థము చేసినా కూడా తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారు అని అనరు. ప్రవృత్తిలో ఉండేవారెవరైతే ఉన్నారో వారు ఈ ఈవిధముగా స్థూలధనముతో తమ పదవిని ఉన్నతంగా చేసుకోగలరో, అలాగే యజ్ఞ నివాసులు కూడా ఒకవేళ యజ్ఞములోని స్థూల వస్తువులను తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారుగా అయ్యి తమ కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించినట్లయితే వారికి కూడా ఈ లెక్క ద్వారా భవిష్యత్తు చాలా ఉన్నతంగా తయారవుతుంది. స్థూల ధనమైతే ప్రవృత్తి వారి సాధనము అని ఇలా అయితే కాదు కానీ యజ్ఞ నివాసీల యజ్ఞ సేవ కూడా యజ్ఞ వస్తువుల పొదుపురూపీ ధనము స్థూల ధనము కంటే కూడా ఎక్కువ సంపాదనకు సాధనవమౌతుంది, కావున ఎప్పుడైతే యజ్ఞములోని ప్రతి వస్తువునూ యథార్థ రూపములో వినియోగించినట్లయితే లేక సంభాళించినట్లయితే, వ్యర్థము నుండి పొదుపు చేసినట్లయితే భవిష్య ప్రాప్తి కొరకు సమర్ధత వస్తుంది. వ్యర్థము నుండి పొదుపు చేసారు, కావున తమ భవిష్యత్తును తయారు చేసుకొనేందుకు ప్రాప్తి లభించింది కదా, కావున ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోవాలి మరి స్వయమును తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి కలవారిగా ఎంతవరకు తయారుచేసుకున్నారు? వ్యర్థము నుండి రక్షింపబడండి, సమర్థులుగా అవ్వండి. ఎక్కడైతే వ్యర్థము ఉంటుందో అక్కడ సమర్థము కొంచము కూడా ఉండదు మరియు ఎక్కడైతే సమర్థము ఉంటుందో అక్కడ వ్యర్థముగా పోవటమన్నది ఉండనే ఉండజాలదు. ఒకవేళ ఖజానా వ్యర్థముగా పోయినట్లయితే సమర్థత రాజాలదు. చూడండి, ఏదైనా లీకేజ్ ఉన్నట్లయితే ఎంతగా ప్రయత్నించినా కూడా లీకేజ్ కారణంగా శక్తిని నింపలేరు. కావున వ్యర్థమనే లీకేజ్ ఉన్న కారణంగా ఎంతగా పురుషార్ధము చేసినా, ఎంతగా శ్రమ చేసినా కానీ శక్తి శాలురుగా అవ్వజాలరు. కావున లీకేజ్ ను చెక్ చేసుకోండి. లీకేజ్ ను చెక్ చేసుకునేందుకు చాలా తెలివి కావాలి, చాలాసార్లు లీకేజ్ ఎక్కడ ఉందో దొరకనే దొరకదు. చాలా తెలివైనవారు ఉంటే, నాలెడ్జ్ ఫుల్ లు ఉంటే వారు లీకేజ్ ను చెక్ చెయ్యగలరు. నాలెడ్జ్ ఫుల్ లుగా లేనట్లయితే లీకేజ్ ను వెతుకుతూనే ఉంటారు. కావున ఇప్పుడు నాలెడ్జ్ ఫుల్ లుగా అయ్యి చెక్ చేసుకున్నట్లయితే వ్యర్థము నుండి సమర్థులుగా అయిపోతారు. అర్థమైందా? అచ్ఛా, మైసూరువారు ఏం గుర్తు పెట్టుకుంటారు? మాతలు కేవలము స్మృతియాత్రలో ఉంటారు కదా! ఎందుకంటే భాషను అర్థం చేసుకోలేరు. దీనినైతే గుర్తు పెట్టుకుంటారు కదా - తక్కువ ఖర్చు, ఎక్కువ ఖ్యాతి. అయినా కూడా భాగ్యశాలురుగా ఉన్నారు. మొత్తము సృష్టిలో మేము విశేష ఆత్మలము అనైతే అర్థం చేసుకున్నారు కదా? అచ్ఛా, ఇక్కడకు చాలాసార్లు వచ్చామని భావిస్తున్నారా లేక మొదటిసారి వచ్చామని భావిస్తున్నారా? ఎటువంటి బంధనము లేనట్లయితే స్వయమును భాగ్యశాలిగా భావిస్తారా లేక దుర్భాగ్యశాలిగా భావిస్తారా? నిర్బంధనులైనట్లయితే మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోగలరా? మీరైతే డబుల్ భాగ్యశాలురు - ఒకటేమో తండ్రి లభించారు. రెండవది భవిష్యత్తును తయారుచేసుకొనేందుకు నిర్బంధనులయ్యారు ఇంకా సంతోషము కలగాలి కదా! ఏమో తెలియదు అనైతే భావించడం లేదు కదా! దు:ఖమైతే అనుభవమవ్వటం లేదు కదా! సుఖమును అనుభవం చేసుకుంటున్నారు కదా! నిర్బంధనులుగా అయ్యారు, బాగుంది. ఇలా మిమ్మల్ని మీరు భాగ్యశాలురుగా భావిస్తున్నారా లేక ఎప్పుడైనా దుఃఖము కూడా వస్తోందా? ఇతరులెవరితోటైనా ఉంటే ఘర్షణ ఉంటుంది. ఒకవేళ శివబాబా తోడుగా ఉన్నట్లయితే ఘర్షణ ఉండదు కదా! సంగమయుగములో లౌకిక సౌభాగ్యపు త్యాగము శ్రేష్ఠ భాగ్యమునకు గుర్తు. ఆత్మ యొక్క ప్రవృత్తిలో ఈ సంబంధము లేదు. ప్రవృత్తిలో సంబంధములోకైతే రారు కదా? ఒకవేళ ప్రవృత్తిలో ఉండి ఆత్మ సంబంధములో ఉన్నట్లయితే మీ డబుల్ భాగ్యమును తయారుచేసుకోగలరు. ప్రవృత్తిలో ఉంటూ దేహ సంబంధాల నుండి అతీతంగా ఉంటున్నారా? మరి ప్రవృత్తిలో ఉండేవారు ఇటువంటి భాగ్యమును తయారుచేసుకుంటున్నారా? అచ్ఛా - ఓం శాంతి.

Comments