14-07-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అంతిమసేవ కొరకు రమతాయోగిగా అవ్వండి.
ఎలా అయితే గవర్నమెంట్ యొక్క గుప్త అనుచరులు క్రొత్త, క్రొత్త పద్ధతులు తయారుచేస్తున్నారో ఎక్కడ ఉంటున్నప్పటికి ఒకవేళ ఆ పద్ధతులకు వ్యతిరేకంగా కర్తవ్యం జరుగుతుంటే పరిశీలిస్తూ ఉంటారు. అలాగే మీరందరు కూడా పాండవ గవర్నమెంట్ యొక్క గుప్త అనుచరులు. ఏ ఆత్మలైతే మోసంలో చిక్కుకుంటున్నారో లేదా వ్యతిరేక కర్తవ్యం చేస్తున్నారో లేదా కల్తీ చేస్తున్నారో లేదా పడేయడానికి నిమిత్తం అవుతున్నారో వారి కొరకు మీరు కూడా క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేస్తున్నారా? గవర్నమెంట్ సదా క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారుచేస్తుంది. దాని ద్వారా ఆత్మలను కల్తీ నుండి విడిపిస్తుంది. వారి దృష్టి నుండి కూడా రక్షిస్తుంది. అలాగే ఇప్పుడు నలువైపుల ధ్వనినైతే వ్యాపింపచేసారు. కానీ ఈ విద్వాంసులు, ఆచారులు ఎవరైతే నిమిత్తం అయ్యారో వారు యదార్థ జ్ఞానానికి బదులు అయదార్థ రీతిలో జ్ఞానాన్ని ఇస్తున్నారు. మరి మీకు వారి వైపు ధ్యాస వెళ్తుందా? ఒకరి ద్వారా కూడా అనేకులకు ధ్వని చేరుకుంటుంది. మరి దానికి ఎవరు నిమిత్తంగా అవుతారు? సాధారణ జనులకైతే మీరు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు తమ శక్తిననుసరించి పురుషార్థం చేస్తూ ముందుకి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులకు ఎవరి ద్వారా ధ్వని వ్యాపిస్తుంది? శక్తుల యొక్క అంతిమ మహిమ కేవలం ఈ సాధారణ ప్రజలను తయారు చేయటం వలన వచ్చేది కాదు. శక్తుల యొక్క శక్తి ఈ సాధారణ జనం ద్వారా ప్రత్యక్షం అవుతుందా? ఎవరైతే ప్రత్యక్షమైన ఆత్మలు ఉన్నారో వారిని మనం తీసుకురావాలి. అలాగే రాజకీయ వ్యక్తుల ద్వారా కూడా ఇంత ధ్వని వ్యాపింపచేయ లేదు .ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైతే నేతలు ఉన్నారో వారి యొక్క చెడు అందరికి తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు కూడా ప్రజలపై రాజ్యం చేసుకుంటున్నారు. నేతల యొక్క ప్రభావం కూడా ఎవరిపై లేదు. ఇలా ఒకరి ద్వారా అనేకులకు వ్యాపింపచేయాలి. దానికి ఎవరు నిమిత్తంగా అవుతారు? గురువుల యొక్క సంకెళ్ళల్లో అందరూ చిక్కుకుని ఉన్నారు. లోపల ఎలా ఉన్నప్పటికి కూడా ఆ గురువుల యొక్క శిష్యులు అంధ శ్రద్ధతో సతమతవుతూ ఉన్నారు. నేతల వెనుక తిరుగుతూ ఉన్నారు. మరి శక్తుల యొక్క మహిమ ఏదైతే ఉందో అది ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది? దాని కొరకు ఇప్పుడు మీరు భూమిని తయారు చేయలేదా? గుప్త అనుచరులు ఏం చేస్తారు? కల్తీ చేసే వ్యక్తులను,కల్తీని తొలగిస్తారు కదా! కల్తీ చేసేవారు కూడా పెద్ద పెద్ద వ్యక్తులుగా ఉంటారు.వారి ద్వారా గవర్నమెంటుకు కూడా చాలా ప్రాప్తి వస్తుంది. సాధారణమైన వారి వెనుక పడరు. క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారుచేస్తూ ఉంటారు ఈ కల్తీని ఎలా ప్రసిద్ధం చేయాలి అని.ఇలా మీరు కూడా ఉన్నతమైన ఆత్మలను తయారు చేయాలనుకుంటున్నారా? సాధారణ ప్రజలను తయారు చేయటంలోనే సంతోషపడిపోతున్నారా? మరి ప్రభావం వేయాలంటే ముఖ్య సాధన ఏదైతే ఉందో దానిని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి కదా! అది ఎప్పుడు తీసుకువస్తారు? మొదట బుద్ధిలో మేము ఈ రోజు ఇది చేయాలి అని ప్లాన్స్ రావాలి, ఉత్సాహం రావాలి. మరి ఈ సంకల్పం వస్తుందా లేదా గుప్తంగా ఉందా? ఇప్పుడు సేవ చేస్తున్నారు.సాధారణ ప్రజలను తయారు చేయగలుగుతున్నారు. కానీ మీరు వ్యాపింపచేసే ధ్వని ద్వారా ప్రత్యక్షత జరగాలి. ప్రత్యక్షంలోకి తీసుకురావాలి.ఈ విమ్ముఖంగా చేసేవారు సన్ముఖంగా రావాలి అప్పుడే ప్రభావం పడుతుంది. విముఖంగా అయినవారు సన్ముఖంలోకి వస్తే గొప్ప విషయం కాదు. విముఖంగా చేసినవారు సన్ముఖం లోకి రావాలి. అందువలన బాబా కూడా ఎక్కువగా శక్తులకు, కుమారీలకు మహిమ చేస్తున్నారు. బాబా కంటే ఎక్కువ మహిమ శక్తులకే జరుగుతుంది. కన్యలు అంటే బ్రహ్మాకుమారీలు కదా! అందరు బ్రహ్మాకుమారీ,కుమారులు. కన్యల ద్వారా బాణం వేయాలి. బాబా ఎదురుగా రారు,సన్ముఖంగా వ్యక్తులనే పెట్టారు. ఎప్పుడైతే ప్రత్యక్షంగా శక్తిసేన నిమిత్తమైందో శక్తుల యొక్క కర్తవ్యానికి విశేష మహిమ జరుగుతుంది. మరి ఈ ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయా? లేదా ఈ సెమినర్ చేసి సంతోషపడిపోతున్నారా? ఇది నెంబర్ వన్ ప్రజలను తయారుచేసే సాధనం. ఎవరోకరు సంబంధంలోకి వస్తారు. ప్రజలుగా అయిపోతారు కానీ ఇప్పుడు మీరు సేవలో దీని కంటే ముందుకి వెళ్ళాలి. అంతిమ సేవను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే తయారీ చేయండి. మొదట సంకల్పం చేయండి తర్వాత ప్లాన్ తయారుచేయండి తర్వాత ఆ ప్లానుని ప్రత్యక్షంలోకి తీసుకురండి. దీనిలో సమయం కావాలి కదా! ఇప్పటి నుండే ప్రారంభం చేయాలి. ఆదిలో చాలా సంతోషముండేది. ఎవరైతే మమ్మల్ని పడేసారో వారికి సందేశమివ్వాలి అని కాని మీరు మధ్యలో ప్రజల విస్తారంలోకి ఎక్కువగా వెళ్ళిపోయారు కానీ ఆదిలో ఏదైతే జరిగింది అదే అంతిమంలో జరగనున్నది. ఎలా అయితే మాయా సంకెళ్ళ నుండి విడిపించుకోవడానికి శ్రమ చేస్తున్నారో అలాగే ఇవి కూడా పెద్ద సంకెళ్ళు రోజు రోజుకి ఈ సంకెళ్ళు మోహిని రూపం ధరిస్తున్నాయి, తమ వైపు ఆకర్షితం చేసుకుంటున్నాయి. అల్పకాలిక బుద్ధి ద్వారా ప్రాప్తిని పొందుతూ ఆ సంకెళ్ళలో చిక్కుకుపోతున్నారు మరి వారందరిని ఎప్పుడు విడిపిస్తారు?అంతిమ ప్రభావం యొక్క సాధన ఇదే. మహారథీని చిన్న చీమ కూడా పడేసింది అని చెప్తారు కదా! అంటే ఈ మహిమ అనేది అద్భుతానికి సంబంధించినది. సాధారణ ప్రజలు వినటం పెద్ద విషయం కాదు. ఇది అందరు చేస్తున్నారు. సాధారణమైన ప్రజలు అందరికి ఆకర్షితం అవుతున్నారు. మీకు ఆకర్షితం అవుతున్నారు కానీ ఇప్పుడు మహారథీలని ఎవరినైతే భావిస్తున్నారు వారికి జ్ఞానం చెప్పండి. వారిని బాబా ముందు ఒంగింపచేయండి ఇదే అద్భుతం. మరి ఇలాంటి అద్భుతం చూపించేటందుకు బుద్ధిని నడిపిస్తున్నారా? అసత్యమైన ఆత్మలకు అసత్యాన్ని సిద్ది చేసి చెప్పండి అప్పుడే జయజయకారాలు వస్తాయి. సత్యానికి జయ జయకారాలు వస్తాయి. అప్పుడు మీరు ఇంత శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. వారి వెనుక వారి ప్రజలు, వారి శిష్యులు స్వతహాగానే వచ్చేస్తారు. దీని కొరకు ప్లానులు తయారుచేయండి..మేము గుప్త అనుచరులం అనే నషా ఉండాలి. ఈ అసత్యాన్ని సిద్ది చేయటనేది మా పని అని భావించండి. దీనికి మేము నిమిత్తమయ్యాము అని భావించండి. లోలోపల ఉత్సాహ, ఉల్లాసాలు రావాలి అప్పుడే ఈ పని జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ ద్వారా జరుగదు. ఇది చేయండి, ఇది చేయండి అని ప్రోగ్రాముని ఇవ్వండి కానీ ప్రత్యక్షంలోకి తీసుకురండి. మీ మనస్సు నుండి నషా రావాలి. నేను ఇది చేయాలి అని అప్పుడే ఆ కర్మ ప్రత్యక్షంలోకి వస్తుంది. సంకల్పాన్ని రచించారు అంటే ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు అందరి దృష్టి ఏదోక అద్భుతం వైపు వెళ్తుంది. శక్తులు, పాండవులు అందరు ఈ కార్యం చేయాలి. శక్తులు లేకుండా ఈ కార్యం ఎవరు చేయలేరు.నిమిత్తంగా శక్తులే తయారవ్వాలి. ఎలా అయితే ఆదిలో రమతాయోగిగా అయ్యేవారో సంకల్పం రాగానే సంతోషంలోకి వెళ్ళిపోయేవారు. శక్తిననుసరించి సఫలత కూడా పొందేవారు అలాగే ఈ విషయం కొరకు కూడా రమతాయోగిగా అవ్వండి. ఇప్పుడు ప్రజలను తయారుచేయటంలో బిజీ అయిపోయారు. ఏదైతే రచన రచిస్తున్నారో ఆ రచనను పాలన చేయటంలోనే సమయం గడిచిపోతుంది కానీ ఇప్పుడు ఉన్నతమైన సేవ చేయండి. మహాత్మలను మేల్కొల్పండి. అప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది.
Comments
Post a Comment