14-06-1972 అవ్యక్త మురళి

* 14-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"స్వస్తితిలో స్థితులయ్యే పురుషార్థము లేక చిహ్నాలు"

 మీ ఆది మరియు అనాది స్వస్థితిని గూర్చి మీకు తెలుసా? సదా మీ స్వస్థితిలో స్థితులై  ఉండే అటెన్షన్ ఉంటోందా? మీ స్వస్థితి అనగా అనాది స్థితి ఏదైతే ఉందో ఆ స్వస్థితిలో స్థితులవ్వడం కష్టమనిపిస్తోందా? ఇతర స్థితులలో స్థితులవ్వడం కష్టమవ్వవచ్చు కానీ స్వస్థితిలో స్థితులవ్వడం స్వతహాగా సహజము కదా! స్వస్థితిలో సదా స్థితులయ్యేందుకు ముఖ్యంగా నాలుగు విషయాలు అవసరము. ఆ నాలుగు విషయాలు సదా నిలిచి ఉన్నట్లయితే స్వస్థితి సదా ఉంటుంది. ఆ నాలుగింటిలోను ఏదైనా లోటు ఉన్నట్లయితే స్వస్థితిలో కూడా తక్కువగానే స్థితులవ్వగలరు. స్వస్థితి యొక్క వర్ణననేదైతే చేస్తారో దానిని మీముందు ఉంచుకొని ఏ నాలుగు విషయాలు సదా తోడుగా ఉండాలి అని ఆలోచించండి. స్వస్థితి యొక్క లక్షణాలు ఏమిటి? బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల యొక్క స్వరూపముగా అవ్వడమునే స్వస్థితి లేక అనాది స్థితి అని అంటారు. ఇటువంటి స్థితి సదా ఉండేందుకు ఏ నాలుగు విషయాలు అవసరం? ఇది స్మృతిలోకి వస్తుందా? ఏ నాలుగు విషయాలు ఉండడం ద్వారా అనాది స్థితి దానంతట అదే ఉంటుంది? సుఖము-శాంతి-ఆనందము-ప్రేమ. ఈ స్థితి స్వతహాగానే ఉంటుంది. అనాది స్థితి నుండి మధ్యస్థితిలోకి ఎందుకు వస్తున్నారు, దీనికి కారణం ఏమిటి? (దేహఅభిమానము). దేహ అభిమానంలోకి రావడం ద్వారా ఏమవుతుంది? దేహ అభిమానంలోకి రావడానికి  కారణాలేమిటి? పరస్థితి సహజముగా మరియు స్వస్థితి కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? ఈ దేహం కూడా స్వయం నుండి వేరుగా ఉంది కదా! దేహంలో సహజంగా స్థితులైపోతున్నారు మరియు స్వయంలో స్థితులవ్వలేకపోతున్నారు, కారణం ఏమిటి? ఎప్పుడైతే సదా సుఖశాంతిమయమైన జీవితం జీవితంలో ఆరోగ్యము, సంపద, సంతోషము మరియు పవిత్రత అనే నాలుగు విషయాలు ఉంటాయో అప్పుడే ఏర్పడగలదు. ఈ నాలుగు విషయాలు సదా నిలిచి ఉన్నట్లయితే జీవితంలో దుఃఖమును, అశాంతిని ఎప్పుడూ అనుభవం చేసుకోరు. అలాగే స్వస్థితి యొక్క స్వరూపము - సదా సుఖము-శాంతి-ఆనందము-ప్రేమ స్థితిలో స్థితులై ఉండడము. కావున స్వస్థితి నుండి కూడా విస్మృతిలోకి వస్తారు, దీనికి కారణం ఏమిటి? సంపదలో లోపము లేక ఆరోగ్యంలో బలహీనత లేక పవిత్రంగా అవ్వకపోవడం. ఈ కారణంగా వాటితోపాటు హ్యాపీగా అనగా హర్షితంగా ఉండలేరు. కావున ఏ ఆరోగ్యము, ఏ సంపద? ఆత్మ సదా నిరోగిగా ఉండాలంటే మాయ యొక్క ఎటువంటి వ్యాధి ఆత్మపై ప్రభావం చూపించకుండా ఉంటే దానిని ఆరోగ్యము అని అంటారు. అలాగే మీరు సుసంపన్నులు కూడా అనగా ఏ ఖజానాలైతే లభిస్తూ ఉంటాయో ఆ సర్వశక్తులు ఏవైతే బాబా ద్వారా ప్రాప్తించాయో ఆ ప్రాప్తించిన జ్ఞాన ఖజానాను లేక సర్వశక్తుల ఖజానాను నిలిపి ఉంచుకున్నట్లయితే స్వస్థితి నుండి క్రిందకు రాగలరా చెప్పండి? అంతగానే పవిత్రత, సంకల్పము. స్వప్నంలో కూడా ఎటువంటి అపవిత్రత ఉండకూడదు. అప్పుడు స్వస్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. ఈ నాలుగు విషయాల లోపము ఉన్న కారణంగా స్వస్థితిలో సదా ఉండలేరు. ఈ నాలుగు విషయాలను పరిశీలించండి. ఎంతవరకు హెల్దీగా, వెల్దీగా అయ్యారు? హెల్దీ, వెల్దీ మరియు హోలీ ఈ మూడు విషయాలు ఉన్నట్లయితే దానంతట అదే హ్యాపీగా అయిపోతారు. కావున ఈ నాలుగు విషయాలను సదా ధ్యానంలో ఉంచుకోండి. రోగులు ఎప్పుడూ స్వయమును సుఖవంతంగా భావించరు. రోగులుగా ఉన్న కారణంగా దు:ఖపు అల వద్దనుకుంటున్నా పైకి వస్తూ ఉంటుంది. కావున ఇక్కడ కూడా ఎప్పుడైతే సదా ఆరోగ్యవంతంగా ఉండరో అప్పుడు దు:ఖము లేక అశాంతి యొక్క అల ఉత్పన్నమవుతుంది. కావున ఈ నాలుగు విషయాలు సదా నిలిచి ఉండేందుకు, ఇవి ఎప్పుడూ మాయమవ్వకుండా ఉండేందుకు ఏ పురుషార్థము కావాలి? దీనికొరకు అందరూ చేయగలిగే సహజమైన పురుషార్థమునేదైనా వినిపించండి. కొద్దిగా అయినా కష్టమైన విషయం ఉంటే చేయలేరు. సహజంగా చేయాలనుకుంటున్నారు కదా! ఎందుకంటే ఆత్మలో ఆది దేవతా ధర్మపు సంస్కారాలు ఉన్న కారణంగా అర్థకల్పం చాలా సహజంగా సుఖాలలో ఉంటారు. ఎటువంటి శ్రమా పడరు. కావున ఆ అర్థకల్పపు సంస్కారాలు ఆత్మలో ఉన్న కారణంగా ఇప్పుడు ఏదైనా కష్టమైన విషయం ఉంటే దానిని చేయలేకపోతారు. సదా సహజముగా ఉండాలనే కోరిక ఉంటుంది. కావున ఆ సహజ పురుషార్థము ఏమిటి? స్మృతి కూడా సహజంగా ఎలా ఉండగలదు? 

స్మృతి కూడా సహజముగా ఉండాలి మరియు సదా ఉండాలి, అలాగే ఆరోగ్యవంతంగా, సుసంపన్నంగా, సంతోషముగా, పవిత్రముగా కూడా ఉండగలగాలి, అందుకు పురుషార్థమును వినిపించాలి. నాలుగు విషయాలు కలిసి ఉండాలి. ఏ విధంగా మీరు కూడా నిరాకారము మరియు సాకారము రెండు రూపాలలోను ఉన్నారు కదా! నిరాకార ఆత్మ మరియు సాకార శరీరం రెండింటి యొక్క సంబంధంతోనే ప్రతి కార్యమును చేయగలరు. రెండింటి సంబంధమూ లేకపోతే ఏ కార్యమూ చేయలేరు. అలాగే నిరాకార మరియు సాకర తండ్రి ఇరువురినీ తోడుగా లేక మీముందు ఉంచుకుంటూ ప్రతి కర్మను లేక ప్రతి సంకల్పమును చేయండి, అప్పుడు ఈ నాలుగు విషయాలు వాటంతట అవే వచ్చేస్తాయి. కేవలం నిరాకారుడైన తండ్రిని లేక కేవలం సాకారుడిని స్మృతి చేయడం ద్వారా ఈ నాలుగూ రాజాలవు. నిరాకారుడు మరియు సాకారుడు ఇరువురూ సదా తోడుగా ఉండాలి, అప్పుడు తోడుగా ఉండడం ద్వారా ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటిని మొదట తప్పకుండా వారితో వెరిఫై చేయిస్తారు. వెరిఫై చేయించిన తరువాత ఏ కర్మనైనా చేయడం ద్వారా నిశ్చయబుద్ధి కలవారిగా అయి చేస్తారు. సాకారంలో ఎవరైనా నిమిత్త శ్రేష్ఠ ఆత్మలు తోడుగా ఉన్నట్లయితే వారి ద్వారా ఏ విషయమునైనా వెరిఫై చేయించి ఆ తరువాత చేసినట్లయితే నిశ్చయబుద్ధి కలవారిగా అయి చేస్తారు కదా! నిర్భయత మరియు నిశ్చయము రెండు గుణాలను ముందు ఉంచుకొని చేస్తారు. కావున ఎక్కడైతే సదా నిశ్చయము మరియు నిర్భయత ఉంటాయో అక్కడ ఎల్లప్పుడూ శ్రేష్ఠ సంకల్పాల విజయము ఉంటుంది. కావున ఏ సంకల్పాలు చేసినా సదా నిరాకారుడు మరియు సాకారుడు తోడుగా మరియు సన్ముఖముగా ఉన్నట్లయితే వెరిఫై చేయించిన తరువాత నిశ్చయంతో మరియు నిర్భయతతో వాటిని చేస్తారు, సమయం కూడా వ్యర్థమవ్వదు. ఈ పని చేయాలా, వద్దా, సఫలం అవుతుందా, అవ్వదా? ఈ వ్యర్థ సంకల్పాలన్నీ సమాప్తమైపోతాయి. వర్తమాన సమయంలో ఆత్మలో బలహీనత యొక్క వ్యాధి ఏదైతే ఉందో అది ఏ వ్యాధి? వ్యర్థ సంకల్పాలలో సమయాన్ని వ్యర్థం చేసుకొనే వ్యాధి. ఇదే వర్తమాన సమయంలో ఆత్మల యొక్క బలహీనత. ఈ రోగము కారణంగా సదా ఆరోగ్యవంతంగా ఉండరు. కాసేపు ఉంటారు, కాసేపు బలహీనంగా అయిపోతారు. కావున సాకారుడిని మరియు నిరాకారుడిని సన్ముఖముగా ఉంచుకొని, వెరిఫై చేయించుకొని ప్రతి పనినీ చేయండి, ఇదే సదా ఆరోగ్యవంతముగా ఉండేందుకు సాధనము. దీనిద్వారా సమయం కూడా మిగులుతుంది. మీరు ప్రాక్టీకల్ గా సాకార రూపంలో ఎవరో వెరిఫై చేయిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇది సామాన్యమైన విషయమే అయినా ఈ సామాన్యమైన విషయమును ప్రాక్టికల్ లోకి తక్కువగా తీసుకువస్తారు. చాలాకాలం విన్నారు, కాని అనుభవజ్ఞులుగా అవ్వలేదు. బాప్ దాదా సదా తోడుగా ఉన్నారు అన్నది అనుభవం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతంగా మరియు సుసంపన్నంగా అవ్వరా? బాప్ దాదా నిరాకారుడు మరియు సాకారుడు, ఇరువురూ తోడుగా ఉండడం ద్వారా ఆరోగ్యము మరియు సంపద రెండూ వచ్చేస్తాయి, దానితోపాటు సంతోషము దానంతట అదే కలుగుతుంది. మరి సహజ పురుషార్థము ఏమిటి?

నిరాకారుడిని మరియు సాకారుడిని ఇరువురినీ సదా తోడుగా ఉంచుకోండి. సదా తోడుగా ఉంచుకోని కారణంగానే ఈ రిజల్ట్ ఏర్పడుతుంది. తోడుగా ఉంచుకోవడం కష్టమనిపిస్తుందా? సర్వ సంబంధాలు ఒక్కరితోనే, ఇంకొకరు ఎవరూ లేరు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో, గుర్తించారో మరియు ఒప్పుకున్నారో, అప్పుడిక అందులో నడవడంలో ఎందుకు కష్టమనిపిస్తుంది? తోడును ఎందుకు వదిలేస్తారు? సీత తోడును ఎందుకు వదిలేసింది, కారణమేమిటి? తను ఆ రేఖను ఉల్లంఘించింది. ఇది చంద్రవంశీయురాలైన సీత పనే కాని లక్ష్మిది కాదు. కావున మర్యాదరూపీ రేఖ బయటకు బుద్ధి కొద్దిగా కూడా వెళ్ళకూడదు, లేకపోతే చంద్ర వంశీయులుగా అయిపోతారు. బుద్ధిరూపీ పాదం మర్యాదరూపీ రేఖ నుండి సంకల్పము మరియు స్వప్నంలోనైనా బయటకు వెళ్ళినట్లయితే స్వయమును చంద్రవంశీ సీతగా భావించాలే కానీ సూర్యవంశీ లక్ష్మిగా కాదు. సూర్య వంశీయులు అనగా శూరవీరులు. ఎవరైతే శూరవీరులుగా ఉంటారో వారు ఎప్పుడూ ఎవరికీ వశమవ్వరు. కావున సదా తోడుగా ఉండేందుకు స్వయమును మర్యాద రేఖ లోపల ఉంచుకోండి. రేఖ నుండి బయటకు రాకండి. బయటకు వెళ్ళినట్లయితే ఫకీరులుగా అయిపోతారు, అప్పుడు ఈ సహాయం లభించాలి, ఈ పరిష్కారం అభించాలి అని అంటూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఇది కూడా యాచించడమే కదా! ఫకీరులుగా అవ్వడం అనగా ఆరోగ్యాన్ని, సంపదను పోగొట్టుకోవడం. కావుననే యాచించే వారిగా అయిపోతారు. కావున రేఖను దాటకండి, ఫకీరులుగా అవ్వకండి. రేఖ లోపల ఉండడం ద్వారా మాయాజీతులుగా అవ్వగలుగుతారు. రేఖను దాటి వెళ్ళడం ద్వారా మాయతో ఓడిపోతారు. కావున సదా ఆరోగ్యవంతంగా, సుసంపన్నంగా, సంతోషంగా మరియు పవిత్రంగా అవ్వండి. ఈ నాలుగింటిలోను ఈరోజు ఏ విషయం యొక్క లోపం ఉంది? ఈరోజు ఆరోగ్యం సరిగా ఉందా? సంపద ఉందా? సంతోషంగా ఉన్నారా? పవిత్రంగా ఉన్నారా? అలా లేకపోతే ఎందుకు లేరు? ఆ రోగమును తెలుసుకొని దానికి వెంటనే వైద్యం చేయండి. మిగిలిన అన్నిరకాల మందులు లభించాయి, అన్ని ప్రాప్తులు ఉన్నాయి కావున అన్ని ప్రాప్తులూ ఉంటూ కూడా సమయానికి ఎందుకు చేయలేకపోతున్నారు? సమయం గతించిపోయిన తరువాత స్మృతిలోకి ఎందుకు వస్తున్నాయి? సమయానికి పనిచేయకపోవడం ఇది బలహీనత. సమయం తరువాత చేసినట్లయితే సమయమైతే గతించిపోతుంది కదా! సమయానికి అని స్మృతులు ఉండేందుకు స్వయం యొక్క బుద్ధి అంత విశాలంగా మరియు జ్ఞాన సంపన్నంగా అవ్వలేదు. అప్పుడు ఏదో ఒక ఆధారమును కోరుకుంటారు. ఆ ఆధారమును సదా తోడుగా ఉంచుకున్నట్లయితే ఎప్పుడూ ఓటమి లభించదు. కావున ఇక ఎప్పుడూ స్వయమును రోగులుగా చేసుకోకండి. కొద్దిగా అయినా ఏ విధమైన రోగమైనా ప్రవేశించినట్లయితే ఒక్కొక్క వ్యాధి మళ్ళీ అనేక వ్యాధులను తీసుకువస్తుంది. ఆ ఒక్కదానిని అంతం చేసేస్తే ఇక అనేకం రానే రావు. ఒక్క విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు, దాన్ని తేలిక విషయంగా భావిస్తారు. కాని వర్తమాన సమయంలో తేలికైన వ్యాధి కూడా పెద్ద వ్యాధే. కావుననే తేలికైనదానిని కూడా పెద్దదానిగా భావిస్తూ దాన్ని అక్కడే సమాప్తం చేసినట్లయితే ఆత్మ ఎప్పుడూ నిర్బలంగా అవ్వదు, ఆరోగ్యవంతంగా ఉంటుంది.

సాకారంలో కూడా సదా తోడుగా ఉండే అనుభవజ్ఞులుగా ఉన్నారు, ఒంటరిగా ఉండడం ఇష్టపడరు. ఎప్పుడైతే సంస్కారాలే తోడుగా ఉండేవిధంగా ఉన్నాయో అప్పుడిక అలా తోడుగా ఉంచుకోవడంలో లోపమును ఎందుకు ఉంచుకుంటున్నారు? నివృత్తి మార్గం వారిగా ఎందుకు అవుతారు? ఏ విధంగా ఆ నివృత్తిమార్గం వారు ఎటువంటి ప్రాప్తిని పొందరో, కేవలం వెతుకుతూనే ఉంటారో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవికమైన ప్రాప్తిని పొండలేరు కావున సదా తోడుగా ఉంచుకోండి, సంబంధంలో ఉండండి, పరివారపు పాలనలో ఉండండి, అప్పుడు ఏ పాలన లోపలైతే ఎల్లప్పుడూ ఉంటారో అందులో సదా నిశ్చింతగా మరియు హర్షితముగా ఉంటారు. పాలన నుండి బయటకు ఎందుకు వెళతారు?  నివృత్తిలోకి ఎప్పుడూ వెళ్ళకండి. తోడును అనుభవం చేసుకోవడం ద్వారా స్వతహాగానే సర్వప్రాప్తులు కలుగుతాయి. ఏ సమయంలోనైతే మీరు బాప్ దాదా లేక పరివారపు తోడును వదిలివేస్తారో అప్పుడు ముళ్ళ అడవిలోకి వెళ్ళిపోతారు. ఏ విధంగా వారు అడవుల్లో వెదుకుతూ ఉంటారో అలా మాయ అడవిలో స్వయమే తోడును వదిలి వ్యాకులత చెంది, ఎక్కడైనా ఆధారం దొరుకుతుందేమో అని వెదుకుతూ ఉంటారు. నివృత్తిమార్గం వారు ఒంటరిగా ఉన్న కారణంగా ఎప్పుడూ కర్మ యొక్క సఫలతను పొందలేరు అని మీరు అంటూ ఉంటారు. కావున ఏ విధంగా వారికి ఏ కర్మ యొక్క సఫలత అయినా లభించదో అదేవిధంగా మీరు కూడా తోడును వదిలి ఒంటరిగా నివృత్తిమార్గం వారిగా అయిపోతే కర్మ యొక్క సఫలత లభించగలదు, ఒంటరితనంలో ఉదాసీనులుగా అయిపోతారు. కావున మాయకు దాసులుగా అయిపోతారు. కావున ఒంటరిగానూ అవ్వకండి, ఉదాసీనులుగానూ అవ్వకండి, మాయకు దాసులుగానూ అవ్వకండి. అచ్ఛా!

Comments