14-05-1977 అవ్యక్త మురళి

* 14-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వమానము మరియూ శాసనము.

సదా భాగ్యవిధాత అయిన బాబా ద్వారా ప్రాపించిన మీ భాగ్యమును స్మరిస్తూ హర్షితముగా ఉంటున్నారా? ఎందుకంటే మొత్తం కల్పమంతటిలోనూ సర్వ శ్రేషమైన భాగ్యము ఈ సమయంలోనే ప్రాప్తమవుతుంది. ఈ సమయంలోనే సదా భాగ్వశాలీ స్థితిని అనుభవం చేసుకోగలుగుతారు. భవిష్య కొత్త ప్రపంచములో కూడా అటువంటి భాగ్యము ప్రాప్తమవ్వదు. కావున బాబా పిల్లలను ఎంతగా శ్రేష్ట భాగ్యశాలులుగా భావిస్తారో అంతగానే ప్రతి ఒక్కరూ స్వయాన్ని భావిస్తూ నడుస్తున్నారా? దీనినే స్వమానములో స్థితులవ్వడము అని అంటారు. మనసా, వాచా, కర్మణా మూడింటిలోనూ ధ్యానమును ఉంచండి. ఒకటేమో సదా స్వమానములో ఉండడం, రెండవది ఒక్క బాబా యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకోవడం. స్వమానము మరియు ఆజ్ఞ - ఈ రెండింటి యొక్క ధ్యానమును ఉంచాలి. దానికి తోడుగా సర్వుల యొక్క సంపర్కములోకి వచ్చినప్పుడు గౌరవమును ఇవ్వాలి. 

స్వమానములో స్థితులై ఉండడం ద్వారా సదా విఘ్న వినాశక స్థితిలో ఉంటారు. స్వమానమంటే ఏమిటో మీకు బాగా తెలుసా? బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అదే మీ యొక్క స్వమానము. కేవలం ఒక్క మహిమను స్మృతిలో ఉంచుకున్నా కానీ స్వమానములో స్థితులైపోతారు. స్వమానములో స్థితులవ్వడం ద్వారా ఎటువంటి అభిమానములైనా, అనగా దేహము యొక్క లేక బుద్ధి యొక్క, పేరు ప్రతిష్టల యొక్క, సేవ యొక్క అభిమానము లేక విశేష గుణముల యొక్క అభిమానము స్వతహాగానే సమాప్తమైతాయి. కావున సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. ఇటువంటి స్వమానములో స్థితులై ఉండేవారు సదా నిర్మాణులుగా ఉంటారు. అభిమానములో ఉండరు, నిర్మాణచిత్తులుగా ఉంటారు. దీని ద్వారా సదా స్వతహాగానే సర్వుల ద్వారా గౌరవం లభించాలి అన్న కోరిక నుండి అతీతముగా ఉన్న కారణముగా సర్వుల ద్వారా శ్రేష్ఠ గౌరవము లభించేందుకు పాత్రులుగా అయిపోతారు. ఇది అనాది నియమము. సర్వుల ద్వారా గౌరవము అడగడం ద్వారా లభించదు, అందుకు బదులుగా గౌరవము ఇవ్వడం ద్వారా, స్వమానములో స్థితులై ఉండడం ద్వారా, ప్రకృతి దాసి సమానముగా, స్వమానము యొక్క అధికారం యొక్క రూపములో గౌరవం ప్రాప్తమవుతుంది. గౌరవము యొక్క త్యాగములో నర్వులకు మాననీయులుగా అయ్యే భాగ్యము ప్రాప్తమవుతుంది. స్వమానములో ఉండేవారికి కేవలం ఈ ఒక్క జన్మలో గౌరవం లభించదు, అందుకు బదులుగా మొత్తం కల్పమంతటిలో అర్ధకల్పం తమ రాయల్ రాజ్య కుటుంబం ద్వారా మరియు ప్రజల ద్వారా గౌరవము ప్రాప్తమవుతుంది. అలాగే మళ్ళీ అర్ధకల్పం భక్తుల ద్వారా గౌరవం ప్రాప్తమవుతుంది. చివరి జన్మలో కూడా చైతన్య రూపములో మీకు ప్రాప్తమైన గౌరవము యొక్క ప్రాలబ్ధాన్ని స్వయమే చూస్తున్నారు. చైతన్యముగా మీ జడచిత్రాలను చూసుకుంటున్నారు కదా! కావున మొత్తం కల్పమంతటిలోనూ ప్రాప్తమయ్యే గౌరవానికి ఆధారము ఏమిటి? అల్పకాలికమైన వినాశీ గౌరవమును త్యాగం చేయడమే అనగా స్వమానములో స్థితులైనిర్మాణులుగా అయి గౌరవమును ఇవ్వడం. ఇది ఇవ్వడమే తీసుకోవడంగా అయిపోతుంది. స్వమానమును ఇవ్వడం అనగా ఆ ఆత్మను ఉల్లాన ఉత్సాహాలలోకి తీసుకువచ్చి ముందుకు తీసుకువెళ్ళడం. అల్పకాలికమైన పుణ్యము, అల్పకాలికమైన వస్తువును ఇవ్వడం ద్వారా లభిస్తుంది లేక అల్పకాలికంగా సహయోగమును ఇవ్వడం ద్వారా లభిస్తుంది కానీ సదాకాలికమైన ఉల్లాస, ఉత్సాహాలు అనగా సంతోషం యొక్క ఖజునా లేక స్వయం యొక్క సహయోగము ఆత్మను సదా కాలికంగా పుణ్యాత్మ గా చేసేస్తుంది. కావున ఇది అన్నింటికన్నా పెద్ద పుణ్యమైపోతుంది. ఒక జన్మలో చేసిన పుణ్యఫలం కల్పమంతా లభిస్తుంది. ఈ కారణంగానే గౌరవమును ఇవ్వడం, ఇవ్వడం కాదు తీసుకోవడం అని చెప్పడం జరిగింది. లౌకిక రూపములో కూడా ఎవరైనా పుణ్య కర్మలు చేస్తే అందరి ముందు మాననీయులుగా అవుతారు కానీ ఈ శ్రేష్ఠ పుణ్యము యొక్క ఫలము వల్ల పూజ్యనీయులుగా మరియు మాననీయులుగా కూడా అవుతారు. కావున ఇటువంటి పుణ్వాత్మగా ఆయి ఎల్లప్పుడూ పుణ్యము యొక్క కార్యమును చేస్తున్నామా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు గౌరవముమ ఇవ్వండి లేక గౌరవం లభించాలి లేక నాపై గౌరవమును ఎందుకు ఉంచడం లేదు, ఇతడికి ఎందుకు ఉంచుతున్నారు? అని అనకండి. మీరు తీసుకునేవారా లేక ఇచ్చేవారా? ఇది తీసుకోవాలి అన్న భావన కూడా రాయల్ బికారీతనమే. కావున సమానము మరియు గౌరవము, స్వమానములో ఉండాలి, గౌరవమును ఇవ్వాలి.
 
ఇంకేమి చేయాలి? ప్రతి అడుగూ ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. ప్రతి అడుగులోనూ ఆజ్ఞపై నడిచేవారి ముందు మొత్తం విశ్వమంతా సదా బలిహారమవుతుంది. దానితో పాటు మాయ కూడా తన వంశ సహితముగా బలిహారమైపోతుంది. అనగా సరెండర్ అయిపోతుంది. మాయ పదే పదే యుద్ధం చేస్తుంది. తద్వారా ప్రతి అడుగూ ఆజ్ఞానుసారముగా లేదు అని అర్థమవుతుంది. సదా ఆజ్ఞానుసారముగా నడువని కారణముగా మాయ కూడా ఒక్క వేటుతో బలి అవ్వదు. కావునవే పదే పదే యుద్ధం చేస్తుంది మరియు పదే పదే మీరు పిలిచేందుకు నిమిత్తులుగా అయిపోతారు. మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అనడం ఆర్తనాదం చేయడం కదా. ఈరోజు ఈ రూపంలో వచ్చేసింది, ఏం చేయాలి? మాయను అనగా విఘ్నాన్ని ఏవిధంగా అంతం చేయాలి? కావున ఒక్క వేటుతో బలి అవ్వని కారణముగా మాయ కూడా ఆర్తనాదం చేస్తుంది. మీరూ ఆర్తనాదాలు చేస్తారు. కావున ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. అప్పుడు అది బలిహారమైపోతుంది. మీరు బాబాపై బలిహారమవ్వండి, మాయ మీపై బలిహారమవుతుంది. ఆజ్ఞానుసారముగా నడుచుకోవడం ఎంత సహజమైన విషయం, స్వమానము మరియు ఆజ్ఞ సహజమైనవే కదా. వీటిని ధారణ చేయడం ద్వారా జన్మజన్మాంతరాలు  యొక్క కష్టాల నుండి విముక్తులైపోతారు. ఇప్పుడు సహజయోగులుగా అవుతారు మరియు భవిష్యత్తులో సహజ జీవితము ఉంటుంది. ఇటువంటి సహజమైన జీవితాన్ని తయారుచేసుకోండి. అర్థమయ్యిందా? అచ్చా! 

ఇటువంటి సదా ఆజ్ఞపై నడిచే ఆజ్ఞాకారులకు, సదా స్వమానములో ఉండేవారికి అల్పకాలికమైన వినాశీ గౌరవమును త్యాగం చేసేవారికి, సదా మానవీయ మరియు పూజ్యనీయపాత్ర ప్రాప్తమయ్యేవారికి, ఇటువంటి బాబాపై సదా బలిహారమయ్యే ఆత్మలకు, సదా సర్వులకు గౌరవమును ఇచ్చే, స్నేహమును తీసుకునే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
 
పాండవ సైన్యము యుద్ధమైదానములో ఉందా? పాండవులను మహావీరులు అని అంటారు. మహావీరులు అనగా సదా మాయాజీతులు. మహావీరులు ఎప్పుడూ మాయను చూసి భయపడరు, ఛాలెంజ్ చేస్తారు. మాయ ఏ రూపములో వచ్చినా కాని పరిశీలించే శక్తి ద్వారా మాయను పరిశీలిస్తూ విజయాన్ని పొందుతాము. కావున మరి ఆ పరిశీలనా శక్తి వచ్చిందా? మాయ రావడం దూరం నుండే పరిశీలించగలుగుతున్నారా? లేక ఎప్పుడే మాయ యుద్ధం చేయడం మొదలుపెడుతుందో అప్పుడు పరిశీలిస్తున్నారా? ఎంతెంతగా పరిశీలనా శక్తి తీవ్రమవుతు ఉంటుందో అంతంతగా దూరం నుండే మాయను పారద్రోలగలుగుతారు. అది వచ్చేసాక దానిని పారద్రోలినట్లయితే అందులో కూడా సమయం వ్యర్థమైపోతుంది, మళ్ళీ వస్తూ, వస్తూ ఎప్పుడైనా కూర్చుండిపోతుంది కూడా. కావున  దానిని అసలు రానివ్వకూడదు. ఈరోజుల్లో దూరదృష్టి కలవారిగా అయ్యే అభ్యాసం చేయాలి. సైన్స్ యొక్క సాధనాలు కూడా దూరం నుండే పరిశీలించే ప్రయత్నం చేస్తాయి. మొదట తుఫానులు వచ్చాక వాటి నుండి రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు తుఫాన్ రాబోతోంది అని ముందుగానే తెలుసుకుని దానిని పారద్రోలే ప్రయత్నం చేస్తున్నారు. సైన్స్ ఇంతగా ముందుకు వెళుతున్నప్పుడు మరి సైలెన్స్ యొక్క శక్తి ఎంతవరకు ముందుకు వెళ్ళింది? దూరంనుండే పారద్రోలేందుకు ఎల్లప్పుడూ త్రికాలదర్నీ స్థితిలో స్థితులవ్వండి. ప్రతి విషయాన్నీ ఆదిమధ్యాంతము పరిశీలించండి , అసలు ఈ విషయం ఏమిటి? దీని వర్తమాన రూపమేమిటి? ఇంతకుముందు కూడా ఈ రూపములో వచ్చింది మరియు ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీనిని సమాప్తము చేయాలి? అని పరిశీలించండి. కావున మూడు కాలాలను చూడడం ద్వారా మాయ యొక్క యుద్ధం ఎప్పుడూ మీకు ఓటమిని చవిచూపించేందుకు నిమిత్తమవ్వజూలదు. కానీ మీరు త్రికాలదర్శులుగా అయి చూడరు, వర్తమానాన్ని చూస్తారు. కావుననే కాసేపు ఓటమి, కాసేపు విజయం లభిస్తుంది. సదా విజయులుగా అవ్వలేరు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండేవారి నుండి మాయ ఎప్పుడూ తప్పించుకోలేదు. పదే పదే మాయ యొక్క యుద్ధం జరుగుతూ ఉన్నట్లయితే అతీంద్రియ సుఖము యొక్క అనుభవమును కావాలనుకున్నా చేసుకోలేరు. అతీంద్రియ సుఖము సంగమయుగము యొక్క వరదానము. ఇది ఇంకేయుగములోనూ లభించజాలదు అన్న గాయనము ఉంది. ఇది ఈ సమయం యొక్క అనుభవమే. కావున అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకోకపోతే బ్రాహ్మణులుగా అయి ఏమి చేసినట్లు? కావున అతీంద్రియ సుఖము బ్రాహ్మణత్వము యొక్క విశేషత. అది అనుభవం చేసుకోకపోతే ఏమీ లేనట్లే. కావున ఎల్లప్పుడూ సదా అతీంద్రియ సుఖములో ఉంటున్నానా?  అని పరిశీలించుకోండి. 

అతీంద్రియ సుఖములో ఉండే వారి యొక్క గుర్తులు ఏమిటి? 

అతీంద్రియ సుఖములో ఉండేవారు ఎప్పుడూ అల్పకాలికమైన ఇంద్రియ సుఖాల వైపుకు ఆకర్షితులవ్వరు. సుసంపన్నులు దారిలో నడుస్తున్నప్పుడు ఏ వస్తువు పైనా ఆకర్షితులవ్వరు. ఎందుకంటే తాము సంపన్నముగా, నిండుగా ఉన్నారు. అదేవిధంగా అతీంద్రియ సుఖములో ఉండేవారు ఇంద్రియాల యొక్క సుఖాన్ని విష సమానముగా భావిస్తారు. కావున ఎవరైనా విషం వైపుకు ఆకర్షితులవుతారా? ఇటువంటి ఇంద్రియ సుఖాల నుండి సదా అతీతముగా ఉంటారు. కష్టపడవలసిన అవసరం ఉండదు. జ్ఞానస్వరూపులుగా ఉన్న కారణముగా వారి ముందు ఇవన్నీ తుచ్చముగా కనిపిస్తాయి. నడుస్తూ, నడుస్తూ ఇంద్రియ సుఖాల వైపు ఆకర్షితులయితే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిలో ఏదో లోపం ఉందని నిరూపింపబడుతుంది. కోరిక ఉంది కానీ ప్రాప్తి లేదు. జిజ్ఞాసులుగా ఉన్నారు కానీ పిల్లలుగా లేరు. పిల్లలు అనగా అదికారులు, జిజ్ఞాసులు అనగా కోరిక ఉంచుకునేవారు. పిల్లలకు ప్రాప్తి కావాలి అన్న కోరిక ఉండదు, అన్నీ ప్రాప్తమయ్యాయి అన్న అధికారం యొక్క సంతోషంలో వారు ఉంటారు. సదా ఈ అతీంద్రియ సుఖములో ఉండండి. ఇంద్రియ సుఖాల యొక్క అనుభూతిని ఎన్ని జన్మల నుండి పొందుతున్నారు! వాటి ద్వారా లభించిన ప్రాప్తి యొక్క జ్ఞానం కూడా ఉంది కదా! ఏమి ప్రాప్తించింది? సంపాదించారు మరియు పోగొట్టుకున్నారు. అందులో పోగొట్టుకోవడమే ఉన్నప్పుడు, మరి ఇప్పుడు కూడా ఎందుకు ఆకర్షితులవుతున్నారు? అతీంద్రియ సుఖ ప్రాప్తి యొక్క సమయం ఇప్పుడు కూడా ఇంకొద్దిగా ఉంది. అది ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ లభించదు. ఈ వ్యాపారమును ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చేయలేరు. అయినా, వదలాలా వదలకూడదా అని ఆలోచిస్తూనే ఉంటారు. మీరు వదిలితే అదీ వదులుతుంది అని బాబా అంటారు. కానీ వదలడం లేదని పిల్లలు అంటారు. తామే పట్టుకొని అది వదలడం లేదు అని అంటారు. రచయిత అయితే  మీరే కదా! పదే పదే ఎదురుదెబ్బలు తినకండి. 

సదా అచలముగా, కదలిక లేని విధంగా ఉండేందుకు విశేషముగా ఏ గుణము యొక్క ధారణను చేయాలి? 

సదా గుణగ్రాహకులుగా అవ్వండి. ఇప్పుడు ప్రతి విషయములోనూ గుణగ్రాహకులుగా ఉన్నట్లయితే అలజడిలో రారు. గుణగ్రాహకులు అనగా కళ్యాణకారీ భావన. అవగుణాలను చూడడం ద్వారా అకళ్యాణము యొక్క భావనలో మరియు అలజడిలొ ఉంటారు. అవగుణములో గుణం చూసేవారిని గుణగ్రాహకులు అని అంటారు. అవగుణాలను చూస్తూ కూడా మనం గుణాలనే చూడాలి. అవగుణాలు కలవారి నుండి కూడా, వీరు ఏవిధంగా అవగుణములో దృఢంగా ఉన్నారో అలాగే నేను గుణములో దృఢముగా ఉండాలి అని గుణమునే స్వీకరించండి. గుణగ్రాహకులుగా అవ్వండే కానీ అవగుణ గుణగ్రాహకులుగా అవ్వకండి. 
 
ఏ భోజనము ఆత్మను సదా శక్తిశాలిగా చేస్తుంది?
 
సంతోషము యొక్క భోజనము. సంతోషము వంటి మందు లేదు అని అంటారు, సంతోషములో ఉండేవారు శక్తిశాలిగా ఉంటారు. డ్రామా యొక్క డాలును కార్వములోకి బాగా తీసుకురావడం ద్వారా సదా సంతోషంగా ఉంటారు, వాడిపోరు. సదా డ్రామా యొక్క స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ వాడిపోజాలరు. సదా సంతోషం బుద్ధి వరకూ, జ్ఞానం యొక్క రూపములో మాత్రమే ఉండకూడదు, ఎటువంటి దృశ్యం జరిగినా కూడా అందులోనూ మీ కళ్యాణమును తీసుకోవాలి. తద్వారా సదా సంతోషంగా ఉంటారు. 

ఇటువంటి శ్రేష్ఠ భూమి పైకి రావడం అనగా భాగ్యశాలులుగా అవడం. ఇటువంటి భాగ్యమును సదా నిలుపుకునేందుకు సదా అటెన్షన్ యొక్క స్థితి ఏకరసముగా ఉండాలి. ఏకరస స్థితి అనగా ఒక్కరి రసములోనే ఉండడం. ఇంకే రసమూ తన వైపుకు ఆకర్షించకూడదు. ఇంకే ఇతర రసము వైపుకు అయినా బుద్ది వెళ్ళినట్లయితే ఏకరసముగా ఉండలేరు.
 
బాబా సమానముగా స్వయాన్ని జ్ఞాన స్వరూపులుగా అనగా జ్ఞానం యొక్క సాగరులుగా అనుభవం చేసుకుంటున్నారా? జ్ఞానస్వరూపులు అనగా సదా సత్యకర్మను చేస్తారే కానీ వ్యర్ధమును చేయరు. ఎప్పుడైతే సత్యమైన తండ్రికి  పిల్లలుగా అయ్యారో, సత్య యుగమును స్థాపిస్తున్నారో అప్పుడు కర్మలు కూడా సత్యముగా ఉండాలి. మాటలు, కర్మ, సంకల్పము అన్నీ సత్యముగా ఉండాలి. వారినే బాబా సమానులు, మాస్టర్ జ్ఞానస్వరూపులు అని అంటారు. అచ్ఛా!  

Comments