14-04-1973 అవ్యక్త మురళి

* 14-04-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సంఘటన యొక్క శక్తి - ఏకసంకల్పము"

          సర్వ శ్రేష్టమతాన్ని ఇచ్చేవారు, సదా పొరపాటు చేయనివారిగా  తయారుచేసే శివబాబా చెప్తున్నారు.... 

           అందరూ ఏ సంకల్పంలో కూర్చున్నారు? అందరికీ ఒకే సంకల్పము ఉంది కదా! ఏ విధంగా ఇప్పుడు అందరికీ ఒకే సంకల్పము కలుగుతుందో అలాగే అందరూ ఒకే లగనము అనగా ఒకే బాబాతో మిలనము యొక్క, అశరీరిగా అయ్యే ఒకే శుభసంకల్పంలో స్థితులైపోండి, అప్పుడు అందరి సంగఠిత రూపములోని ఈ ఒక్క శుద్ధసంకల్పము ఏం చేయలేదు? ఎవ్వరికీ ఇంకే ఇతర సంకల్పమూ కలుగకూడదు. అందరూ ఏకరస స్థితిలో స్థితులవ్వాలి, అప్పుడు ఆ ఒక్క క్షణపు శుద్ధ సంకల్పపు శక్తి ఏ అద్భుతమును చేయగలదో చెప్పండి? కావున ఇటువంటి సంగఠిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పమును అనగా ఏకరస స్థితిని తయారుచేసుకునే అభ్యాసము చేయాలి, అప్పుడే విశ్వంలో శక్తిసేన పేరు ప్రఖ్యాతమౌతుంది.

          ఏ విధంగా స్థూల సైనికులు యుద్ధమైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకే ఆర్డర్ తో, ఒకే సమయంలో వారు నలువైపులా తమ తుపాకులను కాల్చడం మొదలుపెడతారో అలా ఒకే సమయంలో, ఒకే ఆర్డర్ తో  నలువైపులా చుట్టుముట్టకపోతే ఏ విధంగా వారు విజయులుగా అవ్వలేరో అలాగే ఆత్మిక సేన సంగఠిత రూపంలో ఒకే సూచనతో, ఒకే క్షణంలో అందరూ ఏకరస స్థితిలో స్థితులైనప్పుడే విజయఢంకా మ్రోగుతుంది. సంగఠిత రూపంలో అందరకీ ఒకే సంకల్పము మరియు ఒకే శక్తిశాలీ స్థితి యొక్క అనుభవము కలుగుతోందా లేక ఎవరైనా తమను తాము స్థిరము చేసుకోవడంలోనే మగనమై ఉన్నారా? కొందరు స్థితిలో స్థిరమై, మరికొందరు విఘ్నాలను వినాశనం చేయడంలోనే మగ్నమై ఉంటున్నారా? ఇటువంటి సంగఠన యొక్క రిజల్టులో మరి విజయఢంకా మ్రోగగలదా?

           ఎప్పుడైతే అందరి సర్వసంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడే విజయఢంకా మ్రోగుతుంది. మరి ఇటువంటి స్థితి ఉందా? ఏదో కొద్దిమంది విశేష ఆత్మలు మాత్రమే ఏకరస స్థితి రూపీ వేలుతో కలియుగ పర్వతమును ఎత్తుతారా లేక అందరి వేలుతోనూ ఎత్తుతారా? ఈ చిత్రములో అందరి వేలునేదైతే చూపించారో అది కూడా సంగఠన రూపంలో ఏక సంకల్పము, ఐకమత్యము మరియు ఏకరస స్థితికి గుర్తు. కావున ఈ కలియుగ పర్వతమును ఎప్పుడు ఎత్తుతారు మరియు ఎలా ఎత్తుతారు అని ఈ రోజు బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు. అదైతే వినిపించారు, కాని ఎప్పుడు ఎత్తుతారు? (ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో అప్పుడు). మరి ఏకరస స్థితిలో ఎవర్రడీగా ఉన్నారా? ఏమి ఆర్డర్ చేస్తారు? అందరూ ఒక్క క్షణంలో ఏకరస స్థితిలో స్థితులవ్వండి అనే ఆర్డర్ ఇస్తారు కదా! మరి ఇటువంటి ఆర్డర్‌ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు ఎవర్రడీగా ఉన్నారా? ఆ ఒక్క క్షణము సదాకాలికమైన క్షణంగా ఉంటుంది, అంతేకాని ఒక్క క్షణము అలా స్థిరమై మళ్ళీ క్రిందకు వచ్చేయడం కాదు.

          ఏ విధంగా ఇతర అజ్ఞానీ ఆత్మలకు జ్ఞాన ప్రకాశమును ఇచ్చేందుకు సదా శుభభావనను, కళ్యాణ భావనను ఉంచుతూ ప్రయత్నము చేస్తూ ఉంటారో అలాగే మీ ఈ దైవీ సంగఠనను కూడా ఏకరస స్థితిలో స్థితులయ్యేందుకు, సంగఠనా శక్తిని పెంచేందుకు పరస్పరం భిన్న భిన్న రూపాలతో ప్రయత్నము చేస్తున్నారా? ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఎవ్వరికైనా ఏకరస స్థితి యొక్క ప్రత్యక్ష రూపము సాక్షాత్కారమయ్యే విధంగా ఇటువంటి ప్లానులను కూడా తయారు చేస్తున్నారా? ఎప్పటివరకైతే ఈ దైవీ సంగఠన యొక్క ఏకరస స్థితి ప్రఖ్యాతమవ్వదో అప్పటివరకు బాప్ దాదాల ప్రత్యక్షత సమీపంగా రాదు. ఈ విధంగా ఎవర్రడీగా ఉన్నారా? విశ్వమహారాజులుగా అవ్వాలి అన్న లక్ష్యమును ఉంచారే కాని ఇండిపెండెంట్ రాజులుగా అవ్వాలని కాదు కదా! కావున ఇప్పటినుండే లక్షణాలను ధారణ చేయడం ద్వారా లక్ష్యమును పొందుతారు కదా! ఇది బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం స్వయమును ఏకరసముగా చేసుకోవడమే కాదు మొత్తం సంగఠననంతటినీ ఏకరస స్థితిలో స్థిరము చేసేందుకు సహయోగులుగా అవ్వాలి. నా రూపంలో సరిగ్గానే ఉన్నాను అని సంతోషపడడం కాదు.

          సంగఠనలో లేక మాలలో ఒక్క మణి అయినా భిన్నముగా ఉన్నట్లయితే మాలకు శోభ ఉండదు. కావున ఇటువంటి సంగఠిత శక్తియే ఈ పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత, ఆత్మ జ్ఞానము మరియు పరమాత్మ జ్ఞానంలో తేడా ఇదే. అక్కడ సంగఠిత శక్తి ఉండదు. ఇక్కడ సంగఠిత శక్తి ఉంటుంది. కావున పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏదైతే ఉందో దీని ద్వారానే విశ్వంలో మొత్తం కల్పంలో ఆ సమయము గాయనము చేయబడుతుంది. ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఐకమత్యము. దీని స్థాపన ఎక్కడి నుండి జరుగుతుంది? ఈ బ్రాహ్మణ సంగఠన యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్ గా కొనసాగుతుంది. కావున ఈ ఏ విశేషత ద్వారానైతే అద్భుతము జరుగనున్నదో, పేరు ప్రఖ్యాతమవ్వనున్నదో, ప్రత్యక్షత జరుగనున్నదో, సాధారణ రూపము, అలౌకిక రూపము ప్రత్యక్షమవ్వనున్నదో అది ఇప్పుడు ప్రత్యక్షంగా ఉందా? ఈ విశేషతలో ఎవర్రడీగా ఉన్నారా? సంగఠిత రూపంలో ఎవర్రడీగా ఉన్నారా? కల్పపూర్వపు స్థితి నిశ్చితమయ్యే ఉంది. కాని, ఇప్పుడు ఆ ముసుగును తొలగించండి. ప్రేయసులందరూ మేలిముసుగులో ఉన్నారు. ఇప్పుడు ఈ నిశ్చయమును సాకార రూపంలోకి తీసుకురండి. అక్కడక్కడా సాకార రూపంలోను, అక్కడక్కడా ఆకార రూపంలోను ఉంటుంది. దీనిని సాకార రూపంలోకి తీసుకురావడము అనగా సంపూర్ణ స్థితిని ప్రత్యక్షం చేయడము. అందరిలోకి పరివర్తన వచ్చింది. కాని, ఇప్పుడు సంపూర్ణ పరివర్తనను ప్రత్యక్షం చేయండి అని ఆ రోజు వినిపించాము కదా! మిమ్మల్ని గూర్చి వర్ణన చేసేటప్పుడు కూడా ఎంతో పరివర్తన అయ్యాము, అయినా కాని... అసలు ఈ కాని అన్న పదము ఎందుకు వస్తుంది? ఈ పదము కూడా సమాప్తమైపోవాలి. ప్రతి ఒక్కరిలో ఏ మూలసంస్కారమైతే ఉందో దేనినైతే మీరు నేచర్ అని అంటారో ఆ మూలసంస్కారము అంశమాత్రంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు విడిపించుకుంటూ ఉంటారు. ఏదైనా విషయము జరిగితే నా భావము అలా లేదు అని అంటారు. నా నేచర్ అలా ఉంది, నా సంస్కారము అలా ఉంది, అంతేకాని అటువంటి విషయమేదీ లేదు అని అంటారు. మరి ఇది సంపూర్ణమైన నేచరా?

           ప్రతి ఒక్కరి మూలసంస్కారమేదైతే ఉందో అదే ఆది సంస్కారము. దానిని కూడా ఎప్పుడైతే పరివర్తనలోకి తీసుకువస్తారో అప్పుడే సంపూర్ణంగా అవుతారు. ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లను పరివర్తన చేయడము సహజమే. కాని, ఇప్పుడు చివరి పురుషార్థము - తమ మూలసంస్కారాలను పరివర్తన చేసుకోవడము, అప్పుడే సంగఠిత రూపంలో ఏకరస స్థితి తయారవుతుంది, ఇప్పుడర్థమైందా? ఇది చేయడం సహజమే కదా! కాపీ చేయడం సహజమే కదా! మీమీ మూలసంస్కారాలేవైతే ఉన్నాయో వాటిని అంతం చేసి బాప్ దాదాల సంస్కారాలను కాపీ చేసుకోవడం సహజమా లేక కష్టమా? ఇందులో కాపీ చేయడం కూడా రియలైపోతుంది. అందరూ బాప్ దాదాల సంస్కారాలతో సమానంగా ఉన్నారా? ఒక్కొక్కరూ బాప్ దాదాల సమానంగా అయిపోతే ఒక్కొక్కరిలో బాప్ దాదాల సంస్కారాలు కనిపిస్తాయి. అప్పుడు ఎవరి ప్రత్యక్షత జరుగుతుంది? బాప్ దాదాల ప్రత్యక్షత జరుగుతుంది. ఏ విధంగా భక్తిమార్గంలో ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారో అలా ఇక్కడ ప్రత్యక్ష రూపంలో ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా బాప్ దాదాల సంస్కారాలే ప్రత్యక్షంగా కనిపించాలి. ఇదేమైనా కష్టమా? ఎప్పుడైతే ఫాలో చేసేందుకు బదులుగా మీ బుద్ధిని నడిపిస్తారో అప్పుడే ఇది కష్టమనిపిస్తుంది. ఇందులో మీ సంకల్పాల జాలములోనే చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఎలా బయటపడాలి అని అడుగుతారు. అలాగే ఎప్పుడైతే పూర్తిగా చిక్కుకుపోతారో అప్పుడు బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కావున సమయం కూడా పడుతుంది మరియు శక్తి కూడా పడుతుంది. అనుసరిస్తూ ఉన్నట్లయితే సమయము మరియు శక్తి రెండూ మిగిలిపోతాయి మరియు జమ అవుతుంది. కష్టమును సహజం చేసేందుకు, చివరి పురుషార్థంలో సఫలతను ప్రాప్తించుకునేందుకు ఏ పాఠమును పక్కా చేసుకుంటారు? ఇప్పుడు ఫాలో ఫాదర్ అని వినిపించారు కదా! ఇదైతే మొట్టమొదటి పాఠము. కాని, మొదటి పాఠమే చివరి స్థితిని తీసుకువస్తుంది. కావున ఈ పాఠమును పక్కా చేసుకోండి, దీనిని మర్చిపోకండి. కావున సదాకాలికము కొరకు పొరపాట్లు లేనివారిగా, ఏకరసస్థితి కలవారిగా అయిపోతారు.

           కావున ఇటువంటి తీవ్రపురుషార్థులకు సదా ఏకరసముగా, ఐకమత్యంతో మరియు ఒక్కరి లగనములోనే ఉండే శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే.

Comments