13-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విశ్వపరివర్తనయే బ్రాహ్మణ జీవనం యొక్క విశేష కర్తవ్యం.
విశ్వపరివర్తకులు, విశ్వకళ్యాణకారి, సదా సాక్షిస్వరూప శివబాబా విశ్వపరివర్తనలో సహయోగి పిల్లలను చూస్తూ మాట్లాడుతున్నారు -
విశ్వ రచయిత తండ్రి ఈరోజు తన సహయోగి విశ్వపరివర్తక శ్రేష్ఠ ఆత్మలను చూస్తున్నారు. ఎలాగైతే బాబా విశ్వ పరివర్తన కోసం నిమిత్తమయ్యారో అలాగే మీరందరూ కూడా సదా స్వయాన్ని ఈ కార్యార్ధం నిమిత్తం అయినట్లుగా భావించి నడుస్తున్నారా? నేను పరివర్తన చేయాలి, సదా ఇది స్మృతి ఉంటుందా? విశ్వాన్ని పరివర్తన చేసేవారు మొదట స్వయాన్ని పరివర్తన చేసుకుంటారు. ఎవరైతే ఏ విషయంలో అయినా స్వయాన్ని పరివర్తన చేసుకోలేరో వారు విశ్వపరివర్తనా కార్యార్థం ఏవిధంగా నిమిత్తం కాగలరు? ఒక్క సెకెనులో మీ స్మృతిని పరివర్తన చేసుకోండి. అనగా స్వయాన్ని దేహంగా కాదు, ఆత్మస్వరూపంలో స్థితులై చూడండి అని బాప్ దాదా డైరెక్షన్ ఇస్తే ఒక్క సెకెనులో స్వయం యొక్క స్మృతిని పరివర్తన చేసుకోగలుగుతున్నారా? అదేవిధంగా మీ వృత్తిని సెకెండులో పరివర్తన చేసుకోలుగుతున్నారా? మీ స్వభావ సంస్కారాలను సెకెనులో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఆత్మ అయిన మీ యొక్క ఏ సంప్రదింపులు అయినా సెకెనులో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? మీ సంకల్పాలను సెకెనులో వ్యర్థం నుండి సమర్థంలోకి పరివర్తన చేసుకోగలుగుతున్నారా? మీ పురుషార్ధం యొక్క వేగాన్ని సెకెనులో సాధారణం నుండి తీవ్రం చేసుకోగలుగుతున్నారా? సెకెనులో సాకార వతనం నుంచి అతీతంగా నిరాకారి పరంధామ నివాసిగా స్వయాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా? దీనినే పరివర్తనా శక్తి అని అంటారు. సంగమయుగంలో విశేషమైన ఆటయే - పరివర్తన. ఎలాగైతే ఇతర శక్తుల గురించి పరిశీలన చేసుకుంటున్నారో అలాగే పరివర్తనా శక్తి ఈ అన్ని విషయాల్లో ఎంత వరకు స్వయంలో వచ్చిందో పరిశీలించుకుంటున్నారా? పురుషార్ధంలో విఘ్న రూపాలు పరివర్తనా శక్తి యొక్క లోపం. సర్వ ప్రాప్తులకు ఆధారం - పరివర్తనా శక్తి. స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతున్న కారణంగానే ఎంత ఉన్నత లక్ష్యం పెట్టుకుంటున్నారో అంతగా ఆ లక్ష్యాన్ని ప్రాప్తింప చేసుకోలేకపోతున్నారు. పరివర్తన చేసుకునే శక్తి లేని కారణంగానే కావాలనుకున్నా కాని, సాధన చేస్తున్నా కానీ, సాంగత్యం చేస్తూ కూడా శక్తిని అనుసరించి నియమాల్లో నడుస్తూ కూడా మరియు స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలిపించుకుంటూ కూడా మీతో మీరు సంతుష్టంగా లేరు. ఒక్క పరివర్తనా శక్తి సర్వశక్తివంతుడైన తండ్రికి మరియు సర్వ శ్రేష్ఠ ఆత్మలకు సమీపంగా వెళ్ళే సాధనం అవుతుంది. పరివర్తనాశక్తి లేకపోతే సదా ప్రతి ప్రాప్తి నుండి వంచితంగా స్వయాన్ని ఒడ్డున నిల్చున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. అన్ని విషయాలలో దూరం దూరం నుండే చూసేవారిగా మరియు వినేవారిగా అనుభవం చేసుకుంటారు. స్నేహం, సహయోగం మరియు శక్తి యొక్క అనుభవాన్నిచేసుకునేటందుకు సదా దప్పికతో ఉంటారు. అనేక రకాలైన స్వార్ధ కోరికలు లేదా ఆశలు లేదా కామనల యొక్క విస్తారం తుఫాను వలె స్వయం ఎదుట వస్తూ ఉంటుంది. ఈ తుఫాను కారణంగా ప్రాప్తి అనే గమ్యం సదా దూరంగా కనిపిస్తుంది.
ఈరోజు ఇలాంటి విశ్వపరివర్తకులైన పిల్లల యొక్క దృశ్యాన్ని చూశారు. సాకార ప్రపంచంలో నీటి యొక్క తుఫాను వస్తే ఆ దృశ్యాల గురించి వింటుంటారు. వింటున్నప్పుడు ఆనందం వస్తుందా లేక దయ వస్తుందా లేక భయం కూడా వస్తుందా, ఏమవుతుంది? అప్పుడప్పుడు భయం అనిపిస్తుందా, అప్పుడప్పుడు దయ వస్తుందా, పాండవులకు భయం వేస్తుందా లేక ఆనందం వస్తుందా? భయం అయితే ఉండకూడదు. నేను స్త్రీని ఆ సమయంలో ఈ సృతిలో ఉండడం కూడా పొరపాటు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఒంటరివారిగా భావించకూడదు.మీ కంబైండ్ రూపాన్ని అనగా శివశక్తి రూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. కేవలం శివశక్తి, కంబైండ్ రూపం యొక్క స్థితి ద్వారా ఎలాగైతే స్థూలంలో ఇద్దరిని చూసేటందుకు సంకోచిస్తారో అలాగే కంబైండ్ స్థితి యొక్క ప్రభావం ఆ సమయంలో ప్రకృతి మరియు వ్యక్తిపై పడుతుంది. అనగా ఏ రకంగా అయినా సరే యుద్ధం చేయడానికి సంకోచిస్తారు. కేవలం వ్యక్తియే కాదు, ప్రకృతి యొక్క తత్వాలు కూడా సంకోచిస్తాయి. అనగా అవి యుద్ధం చేయలేవు. ఒక్క అడుగు దూరంలో అయినా కూడా సురక్షితులైపోతారు. శాస్రాలు ఉన్నా కానీ శక్తిశాలి శస్త్రాలు కూడా నిర్బలం అయిపోతాయి. కానీ ఆ సెకను పరివర్తనా శక్తిని ఉపయోగించండి. నేను ఒంటరిని కాదు, నేను స్త్రీని కాను, శివశక్తిని, బాబాతో కలిసి ఉన్నాను అని భావించాలి. దీనిలో కూడా పరివర్తనా శక్తి కావాలి కదా! అనగా స్వయం యొక్క శక్తిశాలి స్మృతి మరియు వృత్తి ద్వారా వ్యక్తిని లేదా ప్రకృతిని పరివర్తన చేయాలి. ఇప్పుడు వచ్చేవన్నీ రెండు మూడు తరగతుల యొక్క పరీక్షలు. అంతిమ పరీక్ష యొక్క రూపురేఖ వీటికంటే ఎన్నో రెట్లు భయానక రూపంలో ఉంటుంది. అప్పుడేమి చేస్తారు? కొందరికి ఒక సంకల్పం నడుస్తుంది, ఏమిటది? కొంతమంది స్నేహంతో అంటున్నారు - ఇలాంటి దృశ్యాల కంటే ముందుగానే మమ్మల్ని పిలిచేయండి, మేము కూడా వతనం నుండి చూస్తామని. కానీ శక్తిస్వరూపం యొక్క ప్రత్యక్ష పాత్ర లేదా శక్తి అవతారం యొక్క ప్రత్యక్ష పాత్ర స్వయం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర ఇలాంటి పరిస్థితుల్లోనే జరుగుతుంది. అందువలన ఇలాంటి దృశ్యాలను, అకాల మృత్యువుల యొక్క నగాఢాను చూసేటందుకు, వినేటందుకు పరివర్తనా శక్తిని పెంచుకోండి. ఒక్క సెకెనులో పరివర్తన చేయండి, ఎందుకంటే ఆట అంతా ఒక్క సెకెను పైనే ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో ఒకవైపు కొత్తదేమీ కాదు అనే పాఠాన్ని గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం వంటి స్థితి ఉంటుంది. కనుక సాక్షి స్థితిలో చూడడంలో ఆనందం కూడా వస్తుంది మరియు వెనువెంట విశ్వకళ్యాణకారీ స్థితిలో దయ కూడా వస్తుంది. రెండింటి సమానత ఉండాలి. సాక్షి స్థితి ఉండాలి, విశ్వకళ్యాణకారి స్థితి ఉండాలి. అర్థమైందా? ఇది సాకారీ ప్రపంచం యొక్క సమాచారం. ఆకారీ వతనం యొక్క సమాచారం ఏమిటి? ఇంతకు ముందు చెప్పాను కదా! పరివర్తనా శక్తి లోపంగా ఉండడం వలన అనేక రకాలైన కోరికల యొక్క తుఫాను కనిపిస్తుందని వాటిలో ఎక్కువమంది పిల్లలు నెంబర్ వారీగా కనిపిస్తున్నారు. వారి యొక్క పిలుపు ఏమి వినిపిస్తుంది? మేం అనుకుంటున్నాము అయినా కానీ ఎందుకు అవ్వడం లేదు. ఇలా జరగాలి కానీ జరగలేదు. చాలా పురుషార్థం చేశాము ఇలా అనేక రకాలైన మనసు యొక్క ధ్వనులు వినిపిస్తున్నాయి.అందువలన ఈ తుఫాను నుండి తొలగించుకునే సాధనం - పరివర్తనా శక్తిని పెంచుకోండి. అప్పుడు ప్రత్యక్షఫలాన్ని పొందగలరు. సదా స్మృతి ఉంచుకోండి - నేను బాబాకి సహయోగిని. విశ్వపరివర్తన చేసే విశ్వ పరివర్తకుడిని, పరివర్తన చేయటమే నా కార్యం, అనగా ఈ కార్యార్థం బ్రాహ్మణ జీవితం ప్రాప్తించింది. కనుక మీ నిజ కార్యాన్ని స్మృతిలో ఉంచుకుని నడవండి.
ఈవిధంగా ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకెను బాబాతో పాటు ఉండే సహయోగి ఆత్మలకు, ప్రకృతి మరియు పరిస్థితి లేదా వ్యక్తులను పరివర్తన చేసేవారికి, సదా బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులై ఉండేవారికి, స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సదా కళ్యాణం యొక్క భావన ఉంచుకునేవారికి, విశ్వ కళ్యాణకారి, విశ్వపరివర్తక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment