* 13-06-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఆత్మిక యోధులుగా అవ్వడము”
స్వయమును ఆత్మిక సైన్యంలో మహారథులుగా భావిస్తున్నారా? సైన్యములోని మహారథులు అని ఎవరిని అంటారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? మహారథులు అనగా ఈ రథంపై స్వారీ చేస్తూ స్వయమును రథికునిగా భావించేవారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయమును రథికునిగా భావిస్తూ ఈ రథమును నడిపిస్తున్నాను అని అనుభవం చేసుకుంటున్నారా? యుద్ధమైదానంలో ఎవరైనా మహారథి తమ రథమునకు వశమైపోతే ఆ మహారథులు విజయులుగా అవ్వగలరా? లేక ఇంకా తమ సైన్యమునకు విజయీ రూపంగా అయ్యేందుకు బదులుగా విఘ్నరూపంగా అయిపోతారా? అలజడులను వ్యాపింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. కావున ఇక్కడ ఈ ఆత్మిక సైన్యమునకు యోధులుగా ఎవరైతే ఉన్నారో వారు ఈ రథమునకు సారథులుగా అయ్యారా? ఏ విధంగా యోధులు సర్వ వ్యక్తులను, సర్వ వైభవాలను త్యాగంచేసి యుద్ధము మరియు విజయము కేవలం ఈ రెండు విషయాలను బుద్ధిలో ఉంచుకుంటూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు నిమగ్నమై ఉంటారో అలాగే ఈ రెండు విషయాల లక్ష్యం ఉందా లేక ఇంకేవైనా విషయాలు స్మృతిలో ఉంటున్నాయా? ఇటువంటి యోధునిగా అయ్యానా అని స్వయమును పరిశీలించుకోండి. మీరు ఎక్కడున్నా కాని మేము యుద్ధమైదానంలో ఉపస్థితులై ఉన్న యోధులము అన్నది సృతిలో ఉండాలి. యోధులు ఎప్పుడూ విశ్రాంతిప్రియులుగా ఉండరు. యోధులు ఎప్పుడూ బద్దకము మరియు నిర్లక్ష్య స్థితిలో ఉండరు. యోధులు ఎప్పుడూ శస్త్రాలు లేకుండా ఉండరు, ఎల్లప్పుడూ శస్త్రధారులుగానే ఉంటారు. యోధులు ఎప్పుడూ భయానికి వశీభూతులవ్వరు, నిర్బయులుగా ఉంటారు. యోధులు ఎప్పుడూ యుద్ధమును తప్ప ఇంకే విషయమునూ బుద్ధిలో ఉంచుకోరు. ఎల్లప్పుడూ యోధత్వపు వృత్తి మరియు విజయులుగా అయ్యే స్మృతిలో ఉంటారు. మనమందరం కూడా పరస్పరంలో విజయులుగా ఉంటున్నామా? ఈ దృష్టితో ఒకరినొకరు చూసుకుంటున్నామా? అలాగే ఆత్మిక యోధుల దృష్టిలో కూడా మేమందరం పరస్పరం మహావీరులము, విజయులము అన్నది ఉంటుంది. మేము ప్రతిక్షణము, ప్రతి అడుగులోను యుద్ధమైదానంలో ఉపస్థితులమై ఉన్నాము, విజయులుగా అవ్వాలి అన్న ఒక్క లగనమే ఉంటుందా? సర్వసంబంధాలతో, ప్రకృతి యొక్క సర్వ సాధనాల నుండి మీ బుద్ధిని నివృత్తపర్చుకున్నారా? ప్రక్కకు తప్పుకున్నారా? లేక యుద్ధమైదానంలో ఉన్నా కాని బుద్ధి తాళ్ళు, సంబంధాలలో లేక ఏదో ఒక ప్రకృతి సాధనాలలో చిక్కుకొని ఉందా? స్వయమును సంపూర్ణ స్వతంత్రంగా భావిస్తున్నారా లేక ఏదైనా విషయంలో పరతంత్రంగా కూడా ఉన్నారా?
సంపూర్ణ స్వతంత్రులు అనగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ దేహపు ఆధారమును తీసుకోవడము మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ దేహపు భావం నుండి అతీతంగా ఎంతగా అయిపోవాలంటే ఈ దేహం కొద్దిగా కూడా తనవైపుకు ఆకర్షించజాలకూడదు. ఈ విధంగా స్వయమును దేహం యొక్క భానము అనగా దేహపు మోహం నుండి ముక్తంగా భావిస్తున్నారా? మీ ఏ పాత స్వభావం నుండైనా స్వతంత్రంగా ఉండాలి. స్వభావానికి కూడా బంధాయమానమై ఉండకూడదు. తమ సంస్కారాల నుండి కూడా స్వతంత్రులుగా ఉండాలి, తమ సర్వ లౌకిక సంపర్కాలు లేక అలౌకిక పరివారపు సంపర్కాల బంధనాల నుండి కూడా స్వతంత్రముగా ఉండాలి. ఈ విధంగా స్వతంత్రులుగా అయ్యారా? ఇటువంటివారినే సంపూర్ణ స్వతంత్రులు అని అంటారు. ఇటువంటి స్థితి వరకు చేరుకున్నారా లేక ఇప్పటివరకు చిన్న చిన్న కర్మేంద్రియాలు కూడా తమ బంధనలో బంధించేస్తున్నాయా?
చిన్న చీమ పెద్దపులిని అనగా మహారథిని కూడా విసిగించేస్తే అటువంటి మహారథిని లేక పులిని ఏమంటారు? ఒక్క వ్యర్థ సంకల్పము మాస్టర్ సర్వశక్తివంతులను హైరానా పర్చేస్తే లేక ఒక్క 84 జన్మల జఢజడీభూత పాత సంస్కారము మాస్టర్ సర్వశక్తివంతులను, మహావీరులను, విఘ్నవినాశకులను, త్రికాలదర్శీ స్వదర్శన చక్రధారులను విసిగించేస్తే, పురుషార్థంలో బలహీనంగా చేసేస్తే ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులను ఏమంటారు? ఏ సమయంలోనైతే అటువంటి స్థితిలో ఉంటారో ఆ సమయంలో స్వయమును చూసి ఆశ్చర్యమనిపించదా? నాకు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, పాత స్వభావాలు లేక సంస్కారాలు నన్ను వశీభూతం చేసుకుంటున్నాయి లేక బాబా స్మృతి యొక్క అనుభవం లేదు, బాబా ద్వారా ఎటువంటి ప్రాప్తి లభించడం లేదు లేక చిన్న విఘ్నం నుండి కూడా భయపడిపోతున్నాము, నిరంతర అతీంద్రియ సుఖము లేక సంతోషము ఉండడం లేదు, సంతోషము అనుభవమవ్వడం లేదు అని ఏవైతే అంటారో ఈ మాటలు బ్రాహ్మణ కులభూషణులకు సంబంధించినవేనా? ఇటువంటి బ్రాహ్మణులను ఏ బ్రాహ్మణులు అని అనాలి? నామమాత్రపు బ్రాహ్మణులు అని అనాలా? సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడుతూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నట్లయితే ద్వాపరయుగ బ్రాహ్మణులకు ఈ విధంగా పిలువబడే బ్రాహ్మణులకు మధ్య తేడా ఏమిటి?
వర్తమాన సమయంలో బ్రాహ్మణులుగా అయ్యే ఆత్మలు బ్రాహ్మణత్వపు మొదటి లక్ష్యణమును జీవితంలోకి తీసుకువచ్చామా అని తమను తాము పరిశీలించుకోవాలి. బ్రాహ్మణత్వపు మొదటి లక్షణం ఏమిటి? ఇతర సాంగత్యాల నుండి బుద్ధిని తెంచి ఒక్కరి సాంగత్యంలో జోడించడం, తమ కర్మేంద్రియాలతో జోడించినా కాని ఇది బ్రాహ్మణుల మొదటి లక్షణమా? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నది మొట్టమొదటి ప్రతిజ్ఞ లేక మరజీవ జన్మపు మొట్టమొదటి వాక్యము అయినప్పుడు ఇదే మొట్టమొదటి ప్రతిజ్ఞ లేక మొదటి లక్షణము అయినప్పుడు ఈ మొదటి లక్షణమును లేక ప్రతిజ్ఞను లేక మొదటి మాటను నిర్వర్తించారా లేక ఈ ఒక్కటి అంటూ కూడా అనేకవైపులకు బుద్ధి జోడింపబడి ఉందా? ఇటువంటి నామధారీ బ్రాహ్మణులు విజయులుగా పిలువబడతారా? బ్రాహ్మణుల కొరకు ఇంత పెద్ద విశ్వంలో తమ ఒక చిన్న ప్రపంచము ఉంది. ఇటువంటి చిన్న ప్రపంచంలో తమ ప్రతి కార్యమును చేస్తూ బ్రాహ్మణులు విశ్వంలోని ఏ ఆత్మలను చూసినా వారు ఒక్క కళ్యాణభావనతోనే చూస్తారు కాని మోహము లేక సంబంధం యొక్క భావనతో చూడరు. కేవలం ఈశ్వరీయ సేవాభావనతో చూస్తారు. పంచతత్వాలను చూస్తూ, ప్రకృతిని కూడా చూస్తూ ప్రకృతికి వశమవ్వరు. ప్రకృతిని సతో ప్రధానంగా చేసే కర్తవ్యంలో స్థితులై ఉంటారు. ఎవరైతే స్వయం ప్రకృతిని పరివర్తన చేస్తారో వారు స్వయం ప్రకృతికి వశమవుతారా? ఎవరైతే ఇప్పుడు ప్రకృతిని వశం చేయలేరో వారు భవిష్యత్తులో సతో ప్రధాన ప్రకృతి యొక్క సుఖమును పొందలేరు. కావున మరి మీరు ప్రకృతికైతే వశమవ్వడం లేదు కదా? ఇది ఎలా ఉందంటే డాక్టర్ రోగిని రక్షించేందుకు వెళ్ళి స్వయమే రోగిగా అయిపోయినట్లు ఉంది. ప్రకృతిని వరివర్తన చేసే కర్తవ్యము ఉంది, కాని దానికి బదులుగా ప్రకృతికి వశమైపోతున్నట్లయితే వారిని బ్రాహ్మణులు అని అంటారా? అందరూ బ్రాహ్మణులుగా అయ్యారు కదా? నేను బ్రాహ్మణుడిని కాను అని ఎవరైనా అంటారా? బ్రాహ్మణులుగా అవ్వడము అనగా ఇటువంటి లక్షణాలను ధారణ చేయడము. కావున ఇటువంటి లక్షణధారులుగా ఉన్నారా లేక నామధారులుగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఇంకే జన్మలోనూ లేని బ్రాహ్మణ జన్మ విశేషత ఏమిటి? ఇతర జన్మలన్నీ ఆత్మల ద్వారా ఆత్మలకు లభిస్తాయి. కాని, ఈ ఒక్క బ్రాహ్మణ జన్మయే నేరుగా స్వయం పరమపిత పరమాత్మ ద్వారా లభిస్తుంది. దేవతా జన్మ కూడా శ్రేష్ఠ ఆత్మల ద్వారా లభిస్తుందే కాని పరమాత్మ ద్వార లభించదు. కావున బ్రాహ్మణ జన్మ విశేషత ఏమిటంటే ఇటువంటి జన్మ మొత్తం కల్పంలో ఇంకెక్కడా లేదు. ఇది అంతటి విశేషతా సంపన్నమైన జన్మ. కావున ఆ ఆత్మల విశేషత ఎలా ఉండాలి? బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణ ఆత్మల గుణాలుగా ఉండాలి. గుణాలు కూడా ఈ బ్రాహ్మణ జన్మలో తప్ప ఇంకే జన్మలోను రాజాలవు. ఏ విధంగా ఈ బ్రాహ్మణ జీవితంలో త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా, జ్ఞానస్వరూపులుగా అవుతారో అలా వేరే జన్మలలో అవుతారా? కావున కేవలం ఈ బ్రాహ్మణ జన్మ గుణాలు లేక విశేషతలేవైతే ఉన్నాయో వాటిని ఈ బ్రాహ్మణ జీవితంలో అనుభవం చేసుకోకపోతే మరి ఇంకెప్పుడు అనుభవం చేసుకుంటారు? బ్రాహ్మణులుగా అయి బ్రాహ్మణ జీవితపు విశేషతలను అనుభవం చేసుకోకపోతే బ్రాహ్మణులుగా అయి చేసింది ఏమిటి?
పరమాత్మ సంతానంగా అయి తండ్రిని గూర్చి తెలుసుకోకపోతే గవ్వతుల్యంగా ఉన్నట్లే అని ఇతర ఆత్మలను గూర్చి అంటారు. మీరు అందరితో ఈవిధంగా అంటారు కదా! కాని ఎవరైనా వజ్రతుల్యమైన జన్మను తీసుకొని కూడా వజ్రతుల్యమైన జీవితమును తయారుచేసుకోకపోతే, వజ్రము చేతిలోకి దొరికిన తర్వాత కూడా దానిని రాయిగా భావిస్తూ దాని విలువను తెలుసుకోకపోతే అటువంటివారిని ఏమంటారు? చాలా వివేకవంతులు అని అంటారా? వేరే పదంలో చెప్పకూడదు కదా! వికృతరూపంలోని మహా వివేకవంతులుగా అయిపోవడంలేదు కదా! కావున బ్రాహ్మణ జన్మ విలువను తెలుసుకోండి. ఇదేమీ సాధారణ విషయం కాదు. మనం కూడా బ్రాహ్మణులుగా అయిపోయాము. ఎల్లప్పుడూ బ్రాహ్మణ జీవితమును నిర్వర్తిస్తున్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, అచ్ఛా!
ఇటువంటి శ్రేష్ఠ జన్మ, శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ జీవితము, శ్రేష్ఠ సేవలో సదా నడుచుకునే శ్రేష్ఠ ఆత్మలకు, విశ్వకళ్యాణకారీ ఆత్మలకు మరియు సర్వబంధనాల నుండి సంపూర్ణ స్వతంత్రులుగా ఉండే ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment