* 13-04-1973 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"భక్తి మరియు భావనకు ఫలము"
విశ్వకళ్యాణకారి, సర్వశక్తివంతుడు, వరదాత సర్వాత్మల పిత మరియు భావనకు ఫలమిచ్చే భగవంతుడు చెబుతున్నారు...
ఏవిధంగా భక్తులకు భావనా ఫలమును ఇస్తారో, అలా ఏ ఆత్మ అయినా భావనను పెట్టుకొని, తపిస్తూ మీవద్దకు వచ్చి ప్రాణదానమును ఇవ్వండి లేక మా మనస్సుకు శాంతిని ఇవ్వండి అని అడిగినట్లయితే మీరు వారి భావనకు ఫలమును ఇవ్వగలరా? వారికి తమ పురుషార్థము ద్వారా ఏ ప్రాప్తి అయితే కలుగుతుందో అది వారి పురుషార్థము, వారి ఫలము. కానీ, నేను నిర్బలుడిని, నాలో శక్తి లేదు అని ఎవరైనా మీతో అన్నట్లయితే అటువంటివారికి మీరు భావనకు ఫలమును ఇవ్వగలరా? తండ్రి ద్వారా! తండ్రినైతే తర్వాత తెలుసుకుంటారు, మొదలైతే వారికి ఓదార్పు, ధైర్యము లభించాలి. కానీ ఒకవేళ భావనకు ఫలము ప్రాప్తించగలిగినట్లయితే, అప్పుడు వారి బుద్ధియోగము డైరెక్షన్ అనుసారముగా నిలవగలదు! ఇటువంటి భావన కలిగిన భక్తులు అంతిమములో చాలామంది వస్తారు. ఒకరేమో, పురుషార్థము చేసి పదవిని పొందేవారు, వారైతే వస్తూనే ఉంటారు, కానీ అంతిమములో పురుషార్థమును చేసేందుకు సమయమూ ఉండదు మరియు ఆత్మలలో శక్తి ఉండదు, ఇటువంటి ఆత్మలకు మళ్ళీ మీరు మీ సహయోగము ద్వారా మరియు మహాదానము చేసే మీ కర్తవ్యము ఆధారముతో వారి భావనకు ఫలమును ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వవలసి ఉంటుంది. దృష్టి ద్వారా పూర్తి సంతృప్తులుగా అవ్వటము అన్న గాయనములా శక్తుల ద్వారా మాకు ఈ వరదానము లభించింది అనే వారు భావిస్తారు.
ఏవిధంగా చాలా పవర్ ఫుల్ కరెంట్ ఉన్నట్లయితే స్విచ్ ఆన్ చెయ్యటంతోనే ఎక్కడైతే కరెంటును పెడతారో ఆ స్థానములోని క్రిములు క్షణకాలములో భస్మమైపోతాయో అదే విధంగా ఆత్మలైన మీరు మీ సంపూర్ణ పవర్‌ఫుల్ స్థితిలో ఉన్నట్లయితే, ఎవరైనా రావటంతోనే ఒక్క క్షణములో స్విచ్ ఆన్ చేస్తారు, అనగా ఈ ఆత్మకు మంచి జరగాలి అన్న శుభ సంకల్పము చేస్తారు మరియు శుభభావనను ఉంచుతారు - ఇదే సంకల్పరూపీ స్విచ్. దీనిని ఆన్ చెయ్యటంతోనే అనగా సంకల్పమును రచించటంతోనే వెంబడే వారి భావన పూర్తి అయిపోతుంది, వారు ఆనందముతో పులకరించిపోతారు. ఎందుకంటే వెనుక వచ్చే ఆత్మలు కొంచమునకే ఎక్కువ సంతోషపడిపోతారు. సర్వ ప్రాప్తులు లభించాయి అని భావిస్తారు ఎందుకనంటే వారికి ఉన్నదే చాలా కొంచెము తీసుకొనే పాత్ర. వారి లెక్కలో వారికి అదే సర్వస్వము. కావున సర్వ ఆత్మలకు వారి భావనకు ఫలము ప్రాప్తించాలి మరియు ఎవ్వరూ వంచితులుగా ఉండకూడదు, ఇందుకొరకు ఎంతటి శక్తిశాలీ స్థితి కావాలంటే, అనగా సర్వశక్తులనూ ఇప్పటినుండే మీలో జమ చేసుకోవాలి, అప్పుడే జమ చేసుకున్న ఈ శక్తుల ద్వారా ఒకరికి ఇముడ్చుకునే శక్తి మరియు మరొకరికి సహనము చేసే శక్తిని ఇవ్వగలరు అనగా ఎవరికి ఏ ఆవశ్యకత ఉంటుందో దానినే వారికి ఇవ్వగలరు.
ఏవిధంగా డాక్టర్ తన వద్దకు ఎటువంటి రోగి వస్తాడో అతడి అనుసారంగానే వారికి డోస్ ను ఇస్తాడు మరియు ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు. అదే విధంగా సర్వశక్తులను మీవద్ద జమ చేసుకొనేందుకు మీరు ఇప్పటినుండే పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే విశ్వమహారాజులుగా అవుతారో వారి పురుషార్థము కేవలం తమ కొరకే ఉండదు. తమ జీవితములో వచ్చే విఘ్నాలు లేక పరీక్షలను పాస్ అవ్వటము - ఇదైతే చాలా సాధారణము కానీ ఎవరైతే విశ్వమహారాజులుగా అవ్వనున్నారో వారి వద్ద ఇప్పటినుండే విశ్వమంతటిలో ప్రయోగించగలిగేంతటి స్టాక్ నిండుగా ఉంటుంది. కావున ఈవిధంగా ఇక్కడ కూడా విశేష ఆత్మలు ఎవరైతే నిమిత్తులుగా అవుతారో వారిలో కూడా అన్ని శక్తుల స్టాక్ లోపల అనుభవమవ్వాలి, అప్పుడు ఇక సంపూర్ణ స్థితి యొక్క లేక ప్రత్యక్షత యొక్క సమయము దగ్గరగా ఉంది అని భావిస్తారు. ఆ సమయములో ఏమీ గుర్తు ఉండదు. ఇతరుల కొరకే ప్రతి క్షణము, ప్రతి సంకల్పము ఉంటుంది. ఇప్పుడైతే మీ పురుషార్థము కొరకు లేక మీ తనువు కొరకు సమయమును ఇవ్వవలసి వస్తుంది, శక్తిని కూడా ఇవ్వవలసి ఉంటుంది, మీ పురుషార్థము కొరకు మనస్సును కూడా పెట్టవలసి వస్తుంది, మళ్ళీ తరువాత ఈ స్థితి సమాప్తమైపోతుంది. తిరిగి ఈ పురుషార్థము మారిపోయి ఎలా అనుభమవుతుందంటే - ఒక్క క్షణము మరియు ఒక్క సంకల్పము కూడా మీ కొరకు వెచ్చించరు, విశ్వ కల్యాణము కొరకే ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి స్థితినే సంపూర్ణత లేక సంపన్నత అని అంటారు. ఒకవేళ సంపన్నత లేనట్లయితే సంపూర్ణత కూడా ఉండదు ఎందుకంటే సంపన్న స్థితియే సంపూర్ణస్థితి, కావున ఈ విధంగా మీ పురుషార్థమును ఇంకా సూక్ష్మంగా చేసుకుంటూ వెళ్ళాలి. విశేష ఆత్మల పురుషార్థము కూడా తప్పకుండా అతీతంగా ఉంటుంది. మరి పురుషార్థములో ఇటువంటి పరివర్తనను అనుభవము చేస్తూ వెళ్తున్నారా? ఇప్పుడైతే దాత పిల్లలు దాతృత్వపు స్టేజ్ పైకి రావాలి. ఇవ్వటమే వారు తీసుకోవటము. కావున ఇప్పుడు సమయ సమీపతతో పాటు సంపన్న స్థితి కూడా కావాలి. ఆత్మలైన మీ సంపన్న స్థితియే సంపూర్ణతను సమీపంగా తీసుకువస్తుంది. కావున ఇప్పుడు మీరు స్వయమును ఇలా పరిశీలించుకోండి - మొదట్లో స్వ పురుషార్థములో సమయము గడిచింది, ఇప్పుడు దిన ప్రతిదినము ఇతరుల పట్ల ఎక్కువగా సమయము గడుస్తోందా? మీ అభిమానము డ్రామా అనుసారముగా సహజముగానే సమాప్తమైపోతూ ఉంటుంది. పరిస్థితుల అనుసారంగా కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గానే ఆత్మ అభిమానము ఉంటుంది. కార్యములో ఉండటము అనగా సోల్ కాన్షస్(ఆత్మఅభిమానము)లో ఉండటము. సోల్ కాన్షస్ లేకుండా కార్యము సఫలమవ్వదు. కావున నిరంతరము ఆత్మఅభిమానిగా అయ్యే స్థితి స్వతహాగానే తయారవుతుంది. విశ్వ కల్యాణకారులుగా అయ్యారా లేక ఆత్మ కల్యాణకారులుగా అయ్యారా? మీ లెక్కాచారాలను చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారా లేక విశ్వములోని సర్వ ఆత్మల కర్మబంధనాలు మరియు లెక్కాచారాలను సమాప్తము చేయించటంలో బిజీగా ఉన్నారా? ఎందులో బిజీగా ఉన్నారు? లక్ష్యము ఉంచినప్పుడు మరి సదా విశ్వ కల్యాణము కొరకు తనువు-మనస్సు-ధనము అన్నింటినీ పెట్టండి. అచ్ఛా! ఓంశాంతి.
Comments
Post a Comment