* 13-03-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“బంధనముక్త ఆత్మల గుర్తులు"
ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో వారందరూ తమను బంధనముక్త ఆత్మలుగా భావిస్తున్నారా అనగా అందరూ బంధనముక్తులుగా అయ్యారా లేక ఇప్పటివరకూ ఏదో ఒక బంధనము ఉందా? శక్తి సేన బంధనముక్తంగా అయ్యిందా? అన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సేవ కారణంగా నిమిత్త మాత్రంగా ఉండటమన్నది వేరే విషయము. కానీ మీ బంధనమును సమాప్తము చేసారా? మీ రూపము నుండి బంధనముక్తముగా అయ్యి కేవలము నిమిత్తమాత్రముగా సేవ కారణంగా ఈ శరీరములో కర్తవ్యము కొరకు కూర్చుని ఉన్నాము అని భావించేవారు చేతులెత్తండి. (మెజారిటీ వారు చేతులెత్తారు) ఎవరైతే చేతులెత్తారో వారు ఎప్పుడూ సంకల్పమాత్రముగా కూడా సంకల్పమునకు లేక శరీరమునకు, పరిస్థితులకు అధీనమయ్యారా లేక సంకల్పములో కొద్ది సమయము కొరకైనా వ్యాకులతను లేక కొద్దిగా అయినా దానిని లేశమాత్రము అనుభవము చేస్తారా లేక దాని నుండి కూడా దూరమైపోయారా? ఎప్పుడైతే బంధనముక్తులో అప్పుడు మనస్సుకు వశమవ్వరు అనగా వ్యర్థ సంకల్పాలకు వశమవ్వరు. వ్యర్థ సంకల్పాలపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. పరిస్థితులకు కూడా వశమవ్వరు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంపూర్ణ శక్తి ఉంటుంది. ఎవరైతే చేతులెత్తారో వారు అలా ఉన్నారా? మరి ఈ బంధనాలలో కూడా ఇప్పుడు బంధింపబడి ఉన్నారు కదా. ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో వారి గుర్తులేమిటి? ఎవరైతే బంధన ముక్తులుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ యోగయుక్తులుగా ఉంటారు. బంధనముక్తమునకు గుర్తు - యోగయుక్తము. మరియు ఎవరైతే యోగులుగా ఉంటారో అటువంటి యోగుల ముఖ్య గుణంగా ఏది కనిపిస్తుంది? ఉద్దేశపూర్వకంగానే బుద్ధితో ఈరోజు ఆటను ఆడిస్తున్నారు. మరి అటువంటి యోగుల ముఖ్య గుణము లేక లక్షణము ఏమిటి? ఎంతగా యోగులుగా ఉంటారో అంతగా సర్వుల సహయోగిగా మరియు సర్వుల సహయోగమునకు అధికారులుగా స్వతహాగనే అయిపోతారు. యోగి అనగా సహయోగి. ఎవరు ఎంతటి యోగిగా ఉంటారో అంతగా వారికి సహయోగము తప్పకుండానే ప్రాప్తిస్తుంది. ఒకవేళ సర్వుల సహయోగమును ప్రాప్తి చేసుకోవాలనుకుంటే యోగిగా అవ్వండి. యోగికి సహయోగము ఎందుకు ప్రాప్తిస్తుంది? ఎందుకంటే బీజముతో యోగమును జోడిస్తారు. బీజముతో కనెక్షన్ అనగా స్నేహము ఉన్న కారణంగా స్నేహమునకు రిటర్న్ గా సహయోగము ప్రాప్తిస్తుంది. కావున బీజముతో యోగమును పెట్టుకున్నవారు, బీజమునకు స్నేహమనే నీటిని ఇచ్చేవారు సర్వ ఆత్మల ద్వారా సహయోగము రూపీ ఫలాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. ఏవిధంగా సాధారణ వృక్షము నుండి ఫలాలను పొందేందుకు ఏం చేస్తారు? అలాగే ఎవరైతే యోగీగా ఉంటారో వారికి ఒక్కొక్కరితో యోగమును జోడించవలసిన ఆవశ్యకత ఉండదు. ఒక్కొక్కరి నుండి సహయోగమును ప్రాప్తి చేసుకోవాలన్న ఆశ ఉండదు. కానీ ఒక్క బీజముతో యోగము అనగా కనెక్షన్ ఉన్న కారణంగా సర్వ ఆత్మలు అనగా మొత్తము వృక్షముతోటి కనెక్షన్ ఉండనే ఉంటుంది. కావున కనెక్షన్‌పై అటెన్షన్ ను ఉంచండి. కావున సహయోగిగా అయ్యేందుకు మొదట ఎంతగా మరియు ఎలాంటి యోగిగా అయ్యాను? అని తమను తాము ప్రశ్నించుకోండి. ఒకవేళ సంపూర్ణ యోగిగా అవ్వనట్లయితే సంపూర్ణ సహయోగిగా అవ్వజాలరు. సహయోగము కూడా లభించజాలదు. ఎవరు ఎంతగా ప్రయత్నించినాగానీ బీజముతో యోగమును పెట్టుకోకుండా ఆకుల నుండి అనగా ఏ ఆత్మనుండైనా సహయోగము ప్రాప్తించటము, ఇది జరగజాలదు. కావున సర్వులకు సహయోగిగా అయ్యే మరియు సర్వుల సహయోగమును తీసుకొనేందుకు సహజ పురుషార్థము ఏది? బీజరూపముతో కనెక్షన్ అనగా యోగము. అప్పుడిక ఒక్కొక్కరితో శ్రమ చేసి ప్రాప్తి చేసుకొనే ఆశ సమాప్తమైపోతుంది, శ్రమ నుండి తొలగిపోతారు. దగ్గరి దారి ఇది. ఒకవేళ సర్వుల సహయోగిగా, సదా యోగయుక్తముగా ఉన్నట్లయితే బంధనముక్తముగా కూడా తప్పకుండా అవుతారు ఎందుకంటే ఎప్పుడైతే సర్వ శక్తుల సహయోగము, సర్వ ఆత్మల సహయోగము ప్రాప్తిస్తుందో అటువంటి శక్తిరూప ఆత్మకు ఏదైనా బంధనము తొలగించటము కష్టమౌతుందా? బంధనముక్తులుగా అయ్యేందుకు యోగయుక్తులుగా అవ్వాలి. యోగయుక్తముగా అవ్వటం ద్వారా స్నేహయుక్తంగా మరియు సహయోగయుక్తంగా అయిపోతారు. కావున అటువంటి బంధనముక్తులుగా అవ్వండి. సహజం-సహజం అని అంటూ కూడా ఎంత సమయం పట్టింది!
అటువంటి స్థితి ఇప్పుడు తప్పకుండా ఉండాలి. బంధనముక్త స్థితినిగూర్చి ఏదైతే వినిపించామో శరీరములో ఉంటూ కేవలము నిమిత్తంగా ఈశ్వరీయ కర్తవ్యము కొరకు ఆధారమును తీసుకుంటారు, అధీనతతో కాదు. నిమిత్తముగా ఆధారమును తీసుకుంటారు. ఎవరైతే శరీరాన్ని నిమిత్త ఆధారంగా భావిస్తారో వారు ఎప్పుడూ అధీనులుగా అవ్వరు. నిమిత్త ఆధారమూర్తులే సర్వ ఆత్మల ఆధారమూర్తులుగా అవ్వగలరు. ఎవరైతే స్వయమే అధీనులుగా ఉంటారో వారు ఏం ఉద్ధారము చేస్తారు? కావున ప్రతి ఒక్కరూ అధీనత నుండి ఎంత దూరంగా ఉంటారో అంతగా సేవా సఫలత కూడా ఉంటుంది. కావున సర్వుల సఫలత కొరకు సర్వ అధీనతల నుండి దూరంగా ఉండటము చాలా అవసరము. ఈ స్థితిని తయారుచేసుకొనేందుకు రెండు మాటలను గుర్తు ఉంచుకోండి, దీనితో సహజంగానే అటువంటి స్థితిని పొందగలరు. ఆ రెండు పదాలు ఏమిటి? ఎప్పుడైతే బంధనముక్తులుగా అయిపోతారో అప్పుడు ఏవిధంగా టెలిఫోన్ లో ఇతరుల మాటలను క్యాచ్ చెయ్యగలరో అలా ఇతరుల సంకల్పములో ఏముంది అన్నదానిని కూడా క్యాచ్ చెయ్యగలరు. ఇప్పుడు ఇంకా తయారవుతూ ఉన్నారు, కావున ఆలోచించాల్సి వస్తుంది. ఆ రెండు పదాలు -1. సాక్షి 2. సాథి(సహచరుడు). ఒకటేమో సహచరుడిని ఎల్లప్పుడూ తోడుగా ఉంచుకోండి, రెండవది సాక్షిగా అయ్యి ప్రతి కర్మను చెయ్యండి. కావున సాథీ మరియు సాక్షి, ఈ రెండు పదాలను అభ్యాసములోకి తెచ్చినట్లయితే బంధనముక్త స్థితి చాలా త్వరగా తయారవ్వగలదు. సర్వశక్తివంతుని తోడు ఉన్న కారణంగా సర్వశక్తులు కూడా ప్రాప్తిస్తాయి. మరియు తోడుతోడుగా సాక్షిగా అయ్యి నడవటం ద్వారా ఏ బంధనములోనూ చిక్కుకోరు. కావున బంధనముక్తముగా అయ్యేందుకు ఈ రెండు పదాలను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. యోగము మరియు సహయోగము - రెండు విషయాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇటువంటి పురుషార్థమును ఎంత సమయంలో చేస్తారు? పూర్తి బంధనముక్తులుగా అయిపోయి సాక్షి స్థితిలో నిమిత్తమాత్రముగా ఈ శరీరములో ఉంటూ కర్తవ్యమును చెయ్యాలి. ఇప్పుడు ఈసారి మీతో మీరు సంకల్పము చేసి వెళ్ళాలి ఎందుకంటే మీకు(టీచర్లకు) సహజము కూడా. టీచర్లకు విశేషంగా ఎందుకు సహజము? ఎందుకంటే మీ పూర్తి జీవితమే నిమిత్తము. అర్థమైందా! టీచర్లు ఉన్నదే నిమిత్తముగా. ఈ శరీరములో కూడా మేము నిమిత్తమాత్రులము అన్న సంకల్పమును మీరు చెయ్యాలి. ఇదైతే సహజమౌతుంది కదా! వీరికైతే(గోపులకు) ఇంకా డబుల్ బాధ్యత ఉంది, కావున తొలగించుకొనేందుకు వీరికి యుద్ధము చెయ్యవలసి ఉంటుంది. మిగిలినవారికి ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారికైతే ఇది సహజము. మీ కొరకు (మాతలకు)కూడా ఎందుకని సహజము? ఏవిధంగా వారికి ఈ విశేష విషయము కారణంగా సహజమైందో అలా మీకు కూడా ఒక విషయము కారణంగా సహజమైంది. ఎవరైతే ప్రవృత్తిలో ఉంటారో వారి కొరకు సహజ విషయము ఎందుకైందంటే, వారి ఎదురుగా ఎల్లప్పుడూ కాంట్రాస్ట్ (రెండింటి తేడాను పోల్చుకునే అవకాశము) ఉంటుంది. కాంట్రాస్ట్ ఉన్న కారణంగా నిర్ణయము చేయటము సహజమౌతుంది. నిర్ణయము చేసే శక్తి తక్కువగా ఉంది, కావుననే సహజమనిపించదు. దీని ద్వారా లభించే ప్రాప్తి ఏమిటి అన్నదానిని ఒక్కసారి అనుభవము చేసుకున్నట్లయితే మళ్ళీ ఇక నిర్ణయము తీసుకోవడము సహజమవుతుంది. దెబ్బ అనుభవమును ఒక్కసారి చేసినట్లయితే మళ్ళీ పదే పదే దెబ్బలు తినరు. నిర్ణయ శక్తి తక్కువైనట్లయితే మళ్ళీ కష్టమైపోతుంది. కావున వీరు ప్రవృత్తిలో మరియు పరివారములో ఉంటారు, అనుభవజ్ఞులుగా ఉన్న కారణంగా, ఎదురుగా కాంట్రాస్ట్ ఉన్న కారణంగా మోసపోవటము నుండి రక్షింపబడతారు. ఎవరైతే వరదానమునకు అధికారిగా అవుతారో వారు ఎవ్వరి అధీనములో ఉండరు. అర్థమైందా! కావున ఇప్పుడు అధీనత సమాప్తమై అధికారము మొదలైంది. ఎప్పుడూ ఎటువంటి అధీనతా సంకల్పము కూడా రాకూడదు. అటువంటి దృఢ నిశ్చయము ఉందా? నిశ్చయములో ఎప్పుడూ పర్సంటేజ్ (శాతము) ఉండదు, శక్తిసేన తమలో ఏ ధారణను చేసారు? ఎప్పుడైతే స్నేహము మరియు శక్తి సమానంగా ఉంటాయో అప్పుడిక సంపూర్ణంగా అయిపోయినట్లే. మీ శూరవీర రూపమును సాక్షాత్కారము చేసారా? శూరవీరులు ఎప్పుడూ దేనికీ గాభరా చెందరు, కానీ శూరవీరుల ఎదురుగా వచ్చేవారు గాభరా చెందుతారు. కావున ఇప్పుడు ఏ శూరవీరతా సాక్షాత్కారమునైతే చేసారో ఎల్లప్పుడూ దానినే ఎదురుగా ఉంచుకోవాలి. మరియు ఈరోజు ఏ రెండు పదాలనైతే వినిపించామో వాటిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. అచ్ఛా!
Thankyou so must
ReplyDelete