12-11-1972 అవ్యక్త మురళి

* 12-11-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"అలౌకిక కర్మను చేసే కళ"

            అవ్యక్తమూర్తులుగా అనగా ఈ శరీరములో పాత్రను అభినయించే అతి అతీతమైన మరియు అతి ప్రియమైన స్థితిలో స్థితులై ఉండే అనుభవీమూర్తులుగా అయ్యారా? ఈ సమయములో యజమానులు మరియు బాలకులు, రెండింటినీ తోడుతోడుగా పాత్రను అభినయించే ప్రయత్నము చేసేవారు కాదు కానీ సహజ స్వరూపులుగా అయిపోయారు కదా? లేక యజమానులుగా అయినట్లైతే బాలకత్వమును మర్చిపోవటము లేక బాలకులుగా అయినట్లైతే యజమానత్వమును మర్చిపోతారా? ఇప్పుడిప్పుడే యజమాని, ఇప్పుడిప్పుడే బాలకులు. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే దేహము నుండి కూడా దూరము, కర్మ నుండి కూడా దూరము, లగనములో మగ్నమై ఉండే యోగీలుగా అవ్వగలరా? సంకల్పము మరియు కర్మ రెండూ సమానంగా అయ్యాయా లేక సంకల్పము మరియు కర్మలో అంతరము ఉందా? సంకల్పము చేసారు మరియు ప్రాక్టికల్ రూపములో వచ్చింది, ఇటువంటి అభ్యాసము ఉందా? స్మృతియాత్రలో నడిచే యాత్రికులు ఇంతటి సమీపంగా వచ్చారా? సహజము కూడా మరియు సమీపము కూడా, ఈ రెండూ అనుభవమవుతున్నాయా? ఈ స్మృతియాత్రలో అనేక అనుభవములను చేస్తూ చేస్తూ ఇప్పుడు జ్ఞానసంపన్నులుగా మరియు శక్తిసంపన్నులుగా అయ్యారా? యాత్రలో మధ్యమధ్యలో మజిలీలు వస్తుంటాయి, వాటి వలన మనము ఎంతవరకు చేరుకున్నాము మరియు ఇంకా ఎంతవరకు చేరుకోవాలి అన్నది తెలుస్తుంది. స్మృతియాత్రలోని యాత్రికులైన మీరు ఈ యాత్రలో ఎన్ని మజిలీలు దాటారు అనగా సృతిలో ఎన్ని స్టేజీలను దాటేసారు? చివరి స్టేజ్ లేక ఫైనల్ స్టేజ్ ఏది? ఏవిధంగా ఏదైనా వస్తువు చాలా సమీపంగా మరియు సమ్ముఖంగా వచ్చినట్లయితే దానిని సహజంగానే తెలుసుకోగలరు మరియు చూడగలరు, అలాగే మీ గమ్యము మరియు లక్ష్యములను స్పష్టముగా మరియు సహజముగా తెలుసుకుంటున్నారా మరియు చూస్తున్నారా? లేక చూడటానికి దూరంగా ఉందా? చూస్తూ ఉంటారా లేక కేవలము తెలుసుకున్నారా? లేక అనేకసార్లు గమ్యమునకు చేరుకొని, కొంత సమయము అనుభవము కూడా చేస్తూ ఉండేంత సమ్ముఖముగా మరియు సమీపంగా వచ్చేసారా? అనుభవము ఉంటుందా? మళ్ళీ అదే అనుభవములో ఎందుకని ఉండరు? స్థితి యొక్క అనుభవము ఉంటుంది, స్థితి అయ్యి ఉండటము రాదు, అలానా? సదా ఎందుకని స్థితులై ఉండరు, కారణము ఏమిటి? సేవ లేక బ్రాహ్మణుల కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మను అలౌకిక కర్మ అని అంటారు, ఇటువంటి అలౌకిక కర్మ మరియు ఈశ్వరీయ సేవ ఎప్పుడు కూడా స్థితి నుండి క్రిందికి తీసుకొని వచ్చేందుకు నిమిత్తముగా అవ్వజాలదు. అలౌకిక కర్మ కారణంగా క్రిందకు వస్తాము అని ఒకవేళ ఎవరికైనా అటువంటి అనుభవము కలిగినట్లయితే దాని అర్థము, ఆ ఆత్మకు అలౌకిక కర్మ చేసే కళ రాదు అని. కళను చూపించే కళాకారులు లేక సర్కస్ లో పనిచేసే వారు ప్రతి కర్మను చేస్తూ, ప్రతి కర్మలో తమ కళాకౌశల్యాన్ని చూపిస్తారు, వారి ప్రతి కర్మ కళగా తయారవుతుంది, మరి శ్రేష్ఠ ఆత్మలు, కర్మయోగులు, నిరంతర యోగులు, సహజయోగులు, రాజయోగులు అయిన మీరు ప్రతి కర్మను అతీతంగా మరియు ప్రియంగా ఉండే కళలో చెయ్యలేరా?వారి శరీర కళను చూసేందుకు ఎంతమంది కోరిక కలవారుగా ఉంటారు! మీ బుది కళ, అలౌకిక కర్మను చేసే కళను చూసేందుకు మొత్తము విశ్వములోని ఆత్మలు ఇచ్చుకులై వస్తారు. మరి ఇప్పుడు ఆ కళను చూపించరా? ఏవిధంగా ఆ మనుష్యులు తమ శరీరములోని ఏ అంగమునైనా ఎలా కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎంత సమయము కావాలంటే అంత సమయము అలా చెయ్యగలరు, ఇదే కళ. మీరందరు కూడా బుద్ధిని ఎప్పుడు కావాలంటే, ఎంత సమయము కావాలంటే, ఎక్కడ స్థితి చెయ్యాలనుకుంటే అక్కడ స్థితి చెయ్యలేరా? అది శరీరముతో చేసే ఆట, ఇది బుద్ధికి చెందినది. ఎవరికైతే ఈ కళ వస్తుందో వారే 16 కళల సంపన్నంగా అవుతారు. ఈ కళ ద్వారానే ఇతర అన్ని కళలు స్వతహాగనే వచ్చేస్తాయి. ఇలా ఒక్క దేహీ అభిమాని స్థితి సర్వ వికారాలను సహజంగానే శాంతపరిచేస్తుంది. అలా ఈ బుద్ధికళను సర్వ కళలను స్వయములో నింపగలదు మరియు సర్వ కళా సంపన్నంగా తయారు చెయ్యగలదు. కావున ఈ కళలో ఎంతవరకు అభ్యాసులుగా మరియు అనుభవజ్ఞులుగా అయ్యారు? క్షణకాలములో అశరీరులుగా అవ్వండి అని ఇప్పుడిప్పుడే డైరెక్షన్ లభించినట్లయితే అలా అవ్వగలరా? కేవలము ఒక్క క్షణములో స్థితులవ్వగలరా? కర్మలో చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా అటువంటి సమయములో డైరెక్షన్ లభించినా కూడా స్థితులవ్వగలరా? ఏవిధంగా యుద్ధము ప్రారంభమైనప్పుడు, ఇప్పుడు అందరూ ఇళ్ళను వదిలి బయటకు వెళ్ళిపోండి అని అకస్మాత్తుగా ఆర్డర్ వెలువడుతుంది, అప్పుడిక ఏం చెయ్యవలసి వస్తుంది? తప్పకుండా చెయ్యవలసి వస్తుంది. కావున బాప్ దాదా కూడా అకస్మాత్తుగా ఈ శరీరరూపీ ఇంటిని వదిలి, ఈ దేహఅభిమానీ స్థితిని వదిలి దేహీ అభిమానిగా అవ్వండి, ఈ  ప్రపంచము నుండి దూరంగా మీ మధురమైన ఇంటికి వెళ్ళండి అని డైరెక్షన్‌ను ఇచ్చినట్లయితే చెయ్యగలరా?యుద్ధస్థలములో ఆగనైతే ఆగరు కదా? యుద్ధము చేస్తూ, చేస్తూ వెళ్ళాలా, వద్దా అని సమయమునైతే గడిపేయరు కదా! వెళ్ళటము మంచిదా, కాదా? దీనిని తీసుకొని వెళ్ళాలా లేక వదిలి వెళ్ళాలా అనే ఆలోచనలో సమయాన్ని పోగొట్టుకుంటారు. అలాగే అశరీరిగా అవ్వటంలో ఒకవేళ యుద్ధము చెయ్యటంలోనే సమయము పట్టిందంటే మరి అంతిమ పరీక్షలో ఏ మార్కులు వస్తాయి లేక ఏ డివిజన్ లో వస్తారు? యుద్ధం చేస్తూ చేస్తూ ఉండిపోతే మొదటి డివిజన్ లోకి రాగలరా? అటువంటి ఉపరామముగా, ఎవర్రెడీగా అయ్యారా? సేవ చేస్తూ ఉంటే స్థితి మరింత శక్తిశాలిగా అవుతుంది. ఎందుకంటే మీ శ్రేష్ఠ స్థితియే ఈ సమయములోని పరిస్థితులను పరివర్తనలోకి తీసుకువస్తుంది. సేవ చెయ్యటంలోని లక్ష్యము ఏమిటి? సేవ ఎందుకని చేస్తారు? పరిస్థితులను పరివర్తన చేసేందుకే సేవ చేస్తారు కదా, సేవలో స్థితి సాధారణంగా ఉన్నట్లయితే అది సేవ అవుతుందా? ఎంతవరకు చేరుకున్నాము అని ఈ సృతియాత్రలోని ముఖ్యమైన 4 సబ్జెక్ట్ లను పరిశీలించుకోండి. మొదట్లోని స్థితి ఏదైతే ఉందో దానిని ఇప్పుడు కూడా కొంతమంది చేసారు, అది ఏది? వియోగి. వియోగి తరువాత రెండో స్టేజ్ యోగిగా అవుతారు, మూడో స్టేజ్ యోగి తరువాత సహయోగిగా అవుతారు. సహయోగిగా అయిన తరువాత చివరి స్టేజ్ గా సర్వత్యాగిగా అవుతారా? ఎన్ని మెట్లను దాటాము, ఎంతవరకు పైకి ఎక్కాము? అని ఈ నాలుగు సబ్జెక్ట్ లను ఎదురుగా ఉంచుకొని చూసుకోండి. ఇప్పటివరకు కూడా పదేపదే వియోగిగా అయితే అవ్వటం లేదు కదా? సదా యోగీలుగా మరియు సహయోగులుగా అయ్యి నడుస్తున్నారా? ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చినట్లయితే, విఘ్నమునకు వశమవ్వటము అనగా వియోగిగా అవ్వటము, మరి వియోగిగా అయితే అవ్వటం లేదు కదా? విఘ్నము యోగయుక్త స్థితిని సమాప్తము చెయ్యగలదా? బాబా స్మృతిని విస్మృతిలోకి తీసుకువచ్చేస్తుందా? విస్మృతి అనగా వియోగి. కావున యోగీతనపు స్థితి, ఏవిధంగా శరీరము మరియు ఆత్మకు ఎంతవరకు పాత్ర ఉందో అంతవరకు వేరవ్వవో అలా  నిరంతరముగా ఉండాలి. అలాగే బాబా స్మృతి బుద్ధి నుండి వేరుగా ఉండకూడదు. బుద్ధి తోడు ఎల్లప్పుడూ స్మృతితో అనగా తండ్రితో ఉండాలి - అటువంటివారినే యోగులు అని అంటారు, వీరిని మరే ఇతర స్మృతి తన వైపుకు ఆకర్షితము చెయ్యలేకపోతుంది. ఎలా అయితే చాలా ఎక్కువ లేక శ్రేష్ఠమైన పవర్ కలవారి ముందు తక్కువ పవర్ కలిగినవారు ఏమీ చెయ్యలేకపోతారో, అలా ఒకవేళ సర్వశక్తివంతుని స్మృతి సదా తోడు ఉన్నట్లయితే మరే ఇతర స్మృతి బుద్ధి లోపలకు రాజాలదు. వీరినే సహజ మరియు స్వతహ యోగి అని అంటారు. ఆ మనుష్యులు కేవలము అంటారు మరియు ఇక్కడ ప్రాక్టికల్ గా స్వతహ యోగులుగా ఉన్నారు. మరి అటువంటి యోగులుగా అయ్యారా? అటువంటి యోగులు సదా ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి వచనము, ప్రతి కర్మలో తప్పకుండా సహయోగిగా ఉంటారు. ఒకవేళ సంకల్పములో సహయోగిగా ఉండి, కర్మలో లేనట్లయితే లేక కర్మలో సహయోగిగా ఉండి, వేరే విషయములో లేనట్లయితే అటువంటి వారిని సహయోగి స్థితి వరకు చేరుకొనే ఆత్మలు అని అనరు. ఒక్క సంకల్పము కూడా సహయోగము లేకుండా నడిచినట్లయితే దానిని వ్యర్థమని అంటారు.

            ఎవరైతే వ్యర్థముగా పోగొట్టేవారుగా ఉంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ సహయోగిగా అవ్వజాలరు, స్వయమూ శక్తిశాలురుగా అవ్వజాలరు. అలాగే సర్వ స్నేహులుగా, సహయోగులుగా, సర్వంశ త్యాగులుగా మరియు సర్వత్యాగులుగా సహజముగానే అయిపోతారు. భక్తిలో కూడా కేవలము ఈశ్వరార్థము ఏదైనా దానము చేసినట్లయితే వారికి కూడా వినాశీ రాజ్యపదవి ప్రాప్తిస్తుంది మరి ఆలోచించండి, ఎవరైతే ప్రతి సంకల్పమును మరియు ప్రతి క్షణమును ఈశ్వరీయ సేవలో వినియోగిస్తారో, వారికి మరెంతటి శ్రేష్ఠ ప్రాప్తి ఉంటుంది! అటువంటివారు మహాదానిగా సర్వత్యాగిగా సహజముగానే అయిపోతారు. అటువంటి సర్వత్యాగులు వర్తమానము మరియు భవిష్యత్తులో సర్వ శ్రేష్ఠ భాగ్యశాలిగా అవుతారు. కేవలము భవిష్యత్తులోనే కాకుండా వర్తమాన సమయములో కూడా అటువంటి శ్రేష్ఠ భాగ్యశాలీ ఆత్మల భాగ్యమును చూస్తూ, అనుభవము చేస్తూ ఇతర ఆత్మలు వారి భాగ్యపు గుణమును గానము చేస్తారు మరియు అనేక ఆత్మలను తమ శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆధారముతో భాగ్యశాలురుగా తయారుచేసేందుకు నిమిత్తులుగా అవుతారు. కావున నాలుగు సబ్జెక్ట్ ల ద్వారా ఏ స్టేజ్ వరకు చేరుకున్నాము మరియు లక్ష్యమునకు ఎంత సమీపంగా వచ్చాము అన్నదానిని చూడండి, అచ్ఛా! అటువంటి సహజ మరియు స్వతహ యోగి ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments