12-07-1972 అవ్యక్త మురళి

12-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మరజీవాజీవితం యొక్క స్మృతి ద్వారా గృహస్థీ లేదా  ప్రవృతి యొక్క విస్మృతి.

 అధర్ కుమారులు (కుటుంబంలో ఉండే అన్నయ్యలు) భట్టీలో శివబాబా తెలియచేసిన మహావాక్యాలు. 
                      స్వయాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా పరివర్తన చేసుకోగలుగుతున్నారా? భట్టీకి స్వయాన్ని పరివర్తన చేసుకునేటందుకే వస్తున్నారు కదా! మరి పరివర్తనా శక్తిని అనుభవం చేసుకుంటున్నారా? ఎటువంటి వాయుమండలం అయినా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ మీ స్వ స్థితి ఆధారంగా వాయుమండలాన్ని పరివర్తన చేసుకోగలుగుతున్నారా? వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చే ఆత్మలా లేదా వాయుమండలాన్ని సత్వ ప్రధానంగా చేసుకునే ఆత్మలా? స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు ఏ రకమైన వాయుమండలం మీ వైపు ఆకర్షితం అవ్వటం లేదు కదా? ఇలా అనుభవం అవతుందా? భట్టీకి వచ్చిన తర్వాత ఇంత ధైర్యం, శక్తి మీలో జమ అయ్యిందా? ఎక్కడ ఏ స్థానానికి వెళ్ళినా, జమ చేసుకున్న శక్తుల ఆధారంగా వాయుమండలం, పరిస్థితి మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మనైన నన్ను చలింపచేయలేదు అని. ఇలా మీ యొక్క స్థితి ఏకరసంగా, స్థిరంగా, అచంచలంగా  తయారు చేసుకున్నాము అన్నవారు చేతులు ఎత్తండి! ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితులు అతి తమో ప్రధానంగా అయిపోతాయి. ఈ విషయం బాబా స్పష్టంగా చెప్తున్నారు. పరిస్థితులు, వాయుమండలం ఇక సత్వ ప్రధానంగా అవ్వవు, తమో ప్రధానంగా అయిన తర్వాతే సత్వ ప్రధానంగా అవుతాయి. రోజు రోజుకి పరిస్థితులు పాడైపోతాయి. వాయుమండలం పాడైపోతుంది, కానీ బాగుపడదు. ఎలా అయితే కమలపుష్పం మురికిలో ఉంటూ అతీతంగా  ఉంటుందో, అలాగే మీరు కూడా అతి తమోప్రధాన తమోగుణీ వాయుమండలంలో ఉంటున్నప్పటికి  కూడా మీ స్థితి సదా సత్వ ప్రధానంగా ఉండాలి. ఇంత ధైర్యవంతులుగా భావించి చేతులు ఎత్తారు కదా! ఈ విషయం ఇలా ఉంది, కనుక మా స్థితి పైకి, క్రిందికి అయ్యింది అని మరలా చెప్పకూడదు. ప్రకృతి ద్వారా అయినా, లౌకిక సంబంధీకుల ద్వారా అయినా, దైవీ పరివారం ద్వారా అయినా ఏ పరీక్ష వచ్చినా లేదా ఏ పరిస్థితి ఎదురుగా వచ్చినా దానిలో కూడా స్వయాన్ని  అచంచలంగా, స్థిరంగా తయారుచేసుకోవాలి. ఇంత ధైర్యం ఉన్నట్లు భావిస్తున్నారు కదా! చాలా పరీక్షలు రానున్నాయి, పరీక్షలైతే వస్తాయి. ఎలా అయితే అంతిమ ఫలితం యొక్క సమయం సమీపంగా వస్తుందో అలాగే సమయానుసారం ప్రత్యక్ష పేపర్స్ కూడా స్వతహాగా  వస్తూ ఉంటాయి. పరీక్ష అనేది ప్రోగ్రామ్ ద్వారా రాదు. డ్రామానుసారం స్వతహాగా సమయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష పేపర్ ఉంటుంది. మరి ఆ పేపర్ లో పాస్ అయ్యేటువంటి  ధైర్యం ఉన్నట్లుగా స్వయాన్ని భావిస్తున్నారా? భయపడటంలేదు కదా? అంగదుని సమానంగా ఉన్నారా? మీ బుద్ధిరూపి పాదాన్ని ఎవరు కదిలించలేరు కదా? ఈ భట్టీ అధర్ కుమారులది (కుటుంబంలో ఉండే అన్నయ్యలది) స్వయాన్ని అధర్ కుమారుడిగా భావిస్తున్నారు కదా? సంకల్పంలో, సంబంధంలో అధర్ కుమారుడిని అనే స్మృతి ఉంటుందా? ఉండటంలేదా? మొదట సోదరి, సోదరులు అనే స్మృతి ఇప్పించేవారు. ఆ సోదరి, సోదరుల స్మృతిలో కూడా ఏదోక దేహాభిమానం తప్పకుండా వస్తుంది. అందువలన దాని కంటే ఉన్నతమైన స్థితి - అందరు సోదరాత్మలు అనే భావన. దీని గురించి బాబా చెప్పారు, అలాగే స్వయాన్ని అధర్ కుమారునిగా భావించి నడిచినట్లైతే కుటుంబంలో బంధన సమాప్తి అయిపోతుంది. మరి ఇలా స్వయాన్ని అధర్ కుమారునిగా భావించి నడుస్తున్నారా లేదా కుటంబం యొక్క బంధనలో బంధీ అయిన ఆత్మగా భావించి నడుస్తున్నారా? కనుక ఇప్పుడు  కుటుంబం యొక్క స్మృతికి అతీతంగా అవ్వాలి. మీరు అధర్ కుమారుడు కూడా కాదు, బ్రహ్మాకుమారుడు. ఇప్పుడు మరజీవగా అయిపోయారా? మరజీవా జీవితంలో అధర్ కుమారులైన మీకు సంబంధం  ఏమిటి? మరజీవా జీవితంలో కుటుంబం, గృహస్థం ఉంటుందా? మరజీవా జీవితంలో బాబా ఎవ్వరికి గృహస్థీ జీవితాన్ని ఇవ్వలేదు. బాబా అంటే మనందరికి తండ్రి మనం ఆయనకి పిల్లలం. ఇక దీనిలో గృహస్థం ఎక్కడి నుండి వస్తుంది? కనుక స్వయాన్ని బ్రహ్మాకుమారుడిగా భావించి నడవాలి. ఒకవేళ నేను అధర్‌ కుమారుడిని అనుకుంటే, ఎటువంటి స్మృతియో అటువంటి స్థితి తయారవుతుంది. కనుక అధర్ కుమారుడను అనే స్మృతిని కూడా సమాప్తి చేసుకోండి. మీరు అధర్ కుమారులు కాదు, బ్రహ్మాకుమారులు. బాబా మీకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత  ఆధారంగా, శ్రీమతం ఆధారంగా నడుస్తున్నారు. నా కుటుంబం, నా భార్య ఈ స్మృతి కూడా తప్పు. భార్యను భార్య అనే సంకల్పంతో చూడటం లేదా ఇంటిని కుటుంబం యొక్క స్మృతితో చూడటం దీనిని మరజీవా జీవితం అంటారా? బాబా ప్రతి వస్తువుని సంభాళించేటందుకు నిమిత్తంగా చేసి ఇచ్చారు. ఈ హద్దు యొక్క రచనను కూడా బాప్ దాదా నిమిత్తంగా చేసి సంభాళించేటందుకు ఇచ్చారు. కనుక ఇది నా రచన కాదు, బాప్ దాదా ద్వారా నిమిత్తంగా సంభాళించడానికి లభించిన రచన అని భావించండి. ఎందుకంటే నిమిత్త స్థితిలో నాది అనేది ఉండదు. కనుక ప్రవృతి మార్గం యొక్క సంకల్పం ఉండకూడదు. మీ పిల్లలను చూస్తున్నప్పుడు కూడా వీరు కూడా ఈశ్వరీయ ఆత్మలు, నా పిల్లలు కాదు అనుకోవాలి. భలే వారు చిన్న పిల్లలు అవ్వచ్చు. కానీ బాప్ దాదా చిన్న పిల్లలను పాలన చేయరా ఏమిటి?బాప్ దాదా చిన్న చిన్న పిల్లలను పాలన చేస్తూ ఇప్పుడు వారందరిని ఈశ్వరీయ కార్యానికి నిమిత్తంగా చేసారు. అలాగే చిన్న పిల్లలైనా, పెద్దవారైన, బాబా ద్వారా మీకు నిమిత్తంగా లభించారు. కనుక ఆ ఆత్మల పట్ల కూడా ఈ ఆత్మలను ఈశ్వరీయ సేవకు యోగ్యంగా తయారుచేయాలి. ఈశ్వరీయ సేవలో  ఉపయోగించాలి అనే సంకల్పం ఉంచుకోవాలి. ఇలా మీకు ఇంటిలో ఉంటూ ఇటువంటి స్మృతి ఉంటుందా? ఎలా అయితే ఈశ్వరీయ పరివారంలో అనేకాత్మల సంబంధ, సంపర్కంలోకి  వస్తున్నారో అలాగే ఏ ఆత్మల ద్వారా బాబా మీకు బాధ్యత ఇచ్చారో ఆ కుటుంబంలో ఆత్మల మధ్య ఉంటూ కూడా జ్ఞానీ ఆత్మల సంపర్కంలోలానే ఉంటున్నారా లేదా తేడా వస్తుందా? బాబా ఫలితం అడుగుతున్నారు. ఎలా అయితే సేవాకేంద్రంలో నిమిత్తమైన సోదరి, సోదరుల ద్వారా ఈశ్వరీయ వృత్తి, దృష్టితో సంపర్కంలోకి వస్తారో, అలాగే కుటుంబంలో ఆత్మల సంబంధ,సంపర్కంలోకి వస్తూ కూడా అదే వృత్తి,దృష్టి ఉంటుందా? లేదా వెనుకటి జన్మ యొక్క అధికారిగా భావించి నడుసున్నారా? ఇప్పుడు సమయానుసారం స్థితి, వృత్తి ఉన్నతంగా తయారవ్వాలి. అటు స్థితి, వృత్తి  ఎంత వరకు ఉన్నతంగా కావో, పరివర్తన కావో అంత వరకు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? సాకారంలో బ్రహ్మాబాబాని చూసారు కదా, బ్రహ్మాబాబాలో లౌకిక సంబంధం యొక్క స్మృతి, వృత్తి, దృష్టి స్వప్నంలో కానీ, సంకల్పంలో కానీ ఉండేది కాదు. మరి తండ్రిని అనుసరించాలి కదా! కనుక లౌకిక సంబంధీకులతో ఉంటూ కూడా  స్మృతి, వృత్తి, దృష్టిని మార్చుకోవాలి. ఈ భట్టీలో పరివర్తన చేసుకుని వెళ్తారా? నేను అధర్  కుమారుడిని అనే నామ రూపాలు సమాప్తి అయిపోవాలి. ఎలా అయితే అగ్నిలో వేయటం ద్వారా ప్రతి వస్తువు యొక్క రూపం పరివర్తన అయిపోతుందో అలాగే ఈ భట్టీలో నేను బ్రహ్మాకుమారుడిని అనే స్మృతితో  నేను అధర్ కుమారుడిని అనే స్మృతిని సమాప్తి చేయాలి. నేను బ్రహ్మాకుమారుడిని, ఈ ఆత్మలకు  సేవ చేయటం కోసం నిమిత్తంగా ఉన్నాను అని భావించాలి. ఈ స్మృతితో గట్టిగా అయి వెళ్ళాలి. ఇదే భట్టీ యొక్క పరివర్తన. ఇంత పరివర్తన యొక్క శక్తిని మీలో నింపుకున్నారా లేదా మరలా అక్కడికి వెళ్ళి కుటుంబం వారిగా అయిపోతారా? ఇప్పుడు మీరు కుటుంబంలో ఉండే ఆత్మలుగా భావించకూడదు. ఆ కుటుంబానికి అతీతంగా పరవృత్తి అంటే దూరంగా వెళ్ళాలి. గృహస్థీ  సంకల్పానికి అతీతంగా వెళ్ళాలి. ఇలా తయారై వెళ్ళటం ద్వారా అజ్ఞాని ఆత్మలు కూడా మీ నడవడిక ద్వారా, మీ అతీతమైన, ప్రియమైన స్థితి ద్వారా మహిమ చేస్తారు. ఇంత అతీతంగా,ప్రియంగా మీ స్థితిని తయారుచేసుకోవాలి. అప్పుడు విశ్వంలో ఆత్మలందరికి కూడా ప్రియంగా అవుతారు. ప్రియమైన వస్తువు అందరిని స్వతహాగానే ఆకర్షితం చేస్తుంది. కనుక ప్రపంచం మధ్యలో ఉంటూ ఇటువంటి అతీత స్థితిని తయారు చేసుకుంటే ప్రియమైన స్థితి కూడా స్వతహాగా తయారవుతుంది. ఇటువంటి ప్రియమైన స్థితి అనేకాత్మలను స్వతహాగా మీ  వైపు ఆకర్షితం చేస్తుంది. ఇప్పుడు ఈ శ్రమ చేయాలి, ఎందుకంటే  ప్రియమైన అతీతమైన స్థితి ప్రత్యక్షంలో లేదు. ఇప్పుడు స్వయాన్ని ప్రత్యక్షం చేయాలి. ప్రత్యక్ష రూపంలో ప్రత్యక్షం చేసే శ్రమ చేయాలి. ఇప్పుడు ఇది చేయటం లేదు. కనుక ఇప్పుడు మీ యొక్క శ్రేష్ట స్థితిని ప్రత్యక్ష కర్మలోకి తీసుకురండి. ఇప్పటి వరకు గుప్తంగా ఉంది. ప్రపంచం మధ్యలో అలౌకికంగా కనిపిస్తున్నారా? దూరంగా ఉన్నవారికి అలౌకికత యొక్క అనుభవం చేయిస్తున్నారా లేదా సాధారణంగా భావిస్తున్నారా? మీ ప్రత్యక్ష జీవితం యొక్క ప్రభావం పడాలి. ఎవరు చూసినా వీరు విశేషాత్మలు అని అనుభవం చేసుకోవాలి. స్థూలమైన డ్రెస్ చూసి వీరు మా కంటే అతీతమైనవారు అని భావిస్తారు కదా! అలాగే మీ ముఖం అవ్యక్త మూర్తి యొక్క, అతీత స్థితి యొక్క ప్రభావం పడాలి. అప్పుడే అందరు ఆకర్షితం అవుతారు. నడుస్తూ, తిరుగుతూ మీ శ్రేష్ట స్థితి, శ్రేష్ట స్మృతి, శ్రేష్ట వృత్తి నలువైపుల ఉన్న వృత్తులను తమ వైపు ఆకర్షితం చేయాలి. ఎలా అయితే ఆకర్షించే వస్తువు చుట్టుప్రక్కల ఉన్న వాటిని స్వతహాగానే ఆకర్షితం చేసుకుంటుంది.కదా! అన్నింటి ధ్యాస దాని వైపే వెళ్తుంది. అలాగే ఆత్మీయత, అలౌకికత చుట్టు ప్రక్కల ఉన్న వృత్తులను తన వైపు ఆకర్షితం చేసుకోలేదా? ఈ స్థితి అంతిమంలో వస్తుందా? సాధారణంగా రాయల్ కుటుంబీకుల పిల్లలను చూసినప్పుడు వారి నడవడిక ద్వారా, వారి మాట ద్వారా వారు చెప్పనప్పటికి కూడా వీరు ఉన్నత కుటుంబీకులు అని తెలిసిపోతుంది కదా! మరి అలౌకిక స్థితిలో స్థితులై ఉండేటువంటి మీ ప్రభావం శ్రేష్ఠాత్మల ప్రభావం దూరం నుండి  పడదా? కష్టమా? మరి సహజమైన విషయం చేయటంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?  కనుక ఈ భట్టీలో అందరు అలౌకికంగా, శక్తిశాలిగా, మాస్టర్ జ్ఞానసూర్యులై వెళ్ళండి. ఎలా అయితే సూర్యుడిని దాయలేరో అలాగే మాస్టర్ జ్ఞానసూర్యులైన మీ ప్రభావం, ప్రకాశం నలువైపులా వ్యాపింపచేయాలి. ఈ ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తారా? ఉదాహరణగా ఎవరు అవుతారు? అందరి ఆత్మలను ప్రభావితం చేయాలి, ఈ సమాచారాన్ని తీసుకురండి. మీరు రావటం కాదు, సమాచారం తీసుకుని రావాలి. ప్రతి ఒక్కరు ఒకొక్క వైపు వెళ్ళి ప్రభావం వేయండి. ఎన్ని సమాచార పత్రాలు వస్తాయో చూస్తాను. ఇలా ఉదాహరణగా అవుతారా? భట్టీ చేసుకుని  వెళ్తున్నారు. కొద్ది సమయం ప్రభావశాలిగా ఉంటున్నారు, మరలా ప్రభావంలోకి వచ్చేస్తున్నారు .బాబా పిల్లలపై సదా ఆశ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎంత వరకు అవినాశి ఫలితం చూపిస్తారు అనే ఫలితం చూస్తాను. ఎంత వరకు స్థిరంగా, అచంచలంగా ఉంటారు అని. మీరు వరదానభూమికి వచ్చారు. ఏవైతే వరదానాలు లభిస్తున్నాయో ఆ వరదానాల ద్వారా ఇప్పుడు వరదాన మూర్తి అయ్యి వెళ్ళాలి. ఏ ఆత్మ మీ సంబంధ సంసర్కంలోకి వచ్చినా మహాదాని, మహా వరదాని ఈ స్మృతిలో ఉంటూ ప్రతి ఆత్మకు ఏదోక ప్రాప్తి తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ ఆత్మ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మీరు మహాదాని ఆత్మలు కదా! మరి  దానాన్నిసంభాళించుకుంటూ వెళ్ళండి, చేసుకుంటూ వెళ్లండి. మీరు మహాదాని అయ్యి మీ కర్తవ్యం చేస్తూ వెళ్ళండి. కళ్యాణకారి వృత్తి, దృష్టితో ఆత్మలకు కళ్యాణ కారి అవ్వండి. నేను విశ్వకళ్యాణకారిని, మహాదాని ఆత్మను, వరదాని ఆత్మను, ఈ శక్తిశాలి వృత్తిలో ఉండటం ద్వారా ఆత్మలను పరివర్తన చేయగలుగుతారు కనుక ఇప్పుడు మీ వృత్తిని శక్తిశాలిగా తయారు చేసుకోండి.

Comments