12-06-1972 అవ్యక్త మురళి

* 12-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "రిఫైన్ స్థితికి గుర్తు"

ఏ విధంగా సైన్స్ రిఫైన్ అవుతూ ఉందో అలాగే మీలో మీకు సైన్స్ శక్తి లేక మీ స్థితి రిఫైన్ అవుతూవుందా? ఎప్పుడైతే ఏదైనా రిఫైన్ గా  అవుతుందో అప్పుడు అందులో ఏ విశేషతలు ఉంటాయి? రిఫైన్ అయిన వస్తువు క్వాంటిటీ తక్కువగా ఉన్నా, దాని క్వాలిటీ శక్తిశాలిగా ఉంటుంది. ఏ వస్తువైతే రిఫైన్ గా ఉండదో దాని క్వాంటిటి ఎక్కువగా, క్వాలిటి తక్కువగా ఉంటుంది. కావున ఇక్కడ కూడా రిఫైన్ అవుతూ ఉన్నప్పుడు తక్కువ సమయంలో, తక్కువ సంకల్పాలలో, తక్కువ శక్తిలో ఏ కర్తవ్యమైతే  జరుగుతుందో అది 100 రెట్లు ఎక్కువగా జరుగుతుంది మరియు అందులో తేలికతనం కూడా ఉంటుంది. తేలికగా వుండేది ఎప్పుడూ క్రిందకు రాదు. అది కోరుకోకపోయినా స్వతహాగానే పైనే స్థిరమై ఉంటుంది. ఇది రిఫైన్ గా ఉన్నదాని అర్హత కావున స్వయములో ఈ రెండు విశేషతలు అనుభవమవుతూ ఉన్నాయా? భారీగా ఉన్న కారణంగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. తేలికగా ఉన్నట్లయితే శ్రమ తక్కువవుతుంది. కావున ఈ విధంగా సహజంగా పరివర్తన అవుతూ ఉంటుంది. ఈ రెండు విశేషతలు సదా అటెన్షన్లో ఉండాలి. వీటిని మీ ముందు ఉంచుకుంటూ మీలోని రిఫైన్నెస్ ను  పరిశీలించుకోగలరా? రిఫైన్ గా  ఉన్నది ఎక్కువగా భ్రమించదు, అది వేగాన్ని అందుకుంటుంది. రిఫైన్ లేకపోతే, అందులో ఏదో చెత్త కలిసి ఉంటే స్పీడ్ అందుకోజాలదు, నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళలేరు. ఒకవైపు ఎంతగా రిఫైన్ గా అవుతున్నారో అంతగా ఇంకొకవైపు చిన్న చిన్న విషయాలు లేక పొరపాట్లు లేక సంస్కారాలేవైతే ఉన్నాయో వాటి ఫైన్(జరిమానా) కూడా పెరిగిపోతోంది. ఒకవైపు ఆ దృశ్యము, ఇంకొకవైపు రిఫైన్ గా అయ్యే దృశ్యము రెండింటి యొక్క ఫోర్స్ ఉంది. ఒకవేళ రిఫైన్  గా లేకపోతే ఫైన్ వేయబడుతుందని భావించండి. రెండు దృశ్యాలు జతలో కనిపిస్తున్నాయి. అది కూడా అతిలోకి వెళుతోంది మరియు ఇది కూడా అతి ప్రత్యక్ష రూపంలో కనిపిస్తూ పోతోంది. గుప్తము ఇప్పుడు ప్రఖ్యాతమవుతోంది, కావున ఎప్పుడైతే రెండు విషయాలు ప్రత్యక్షమవుతాయో దాని అనుసారంగానే నెంబర్ తీసుకుంటారు కదా!

 మాలను చేతితో తిప్పకూడదు. నడవడిక ద్వారానే స్వయం తమ నెంబర్ ను తీసుకుంటారు. ఇప్పుడు నెంబర్ ఫిక్స్ అయ్యే సమయం వస్తోంది. కావుననే రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరియు రెండింటినీ చూస్తూ, సాక్షిగా ఉంటూ హర్షితంగా ఉండాలి. దేనిలోనైతే ఏదైనా విషయం అతిగా ఉంటుందో ఆ ఆటయే మంచిగా అనిపిస్తుంది అదే దృశ్యము అతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇటువంటి ఘర్షణతో కూడిన దృశ్యం జరుగుతోంది. చూడడంలో మనోరంజకంగా ఉంటుంది కదా! లేక దయ కలుగుతుందా? ఒకవైపు చూసి సంతోషిస్తారు, ఇంకొకవైపు చూసి దయ కలుగుతుంది. రెండింటి యొక్క ఆట జరుగుతోంది. పరదాపై ఏమి జరుగుతోందో ఈరోజు ఆట చూపించారు. వతనం నుండైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంత ఎత్తయిన స్థానంలో ఉంటారో అంతగా వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే క్రింద స్థితిలో పాత్రధారులుగా ఉంటారో వారికి ఏమీ కనిపించదు. సాక్షిగా అయి చూస్తే పైనుండి అందరి పాత్రా స్పష్టముగా కనిపిస్తుంది. ఈ రోజు వతనంలో వర్తమాన సమయపు ఆట యొక్క దృశ్యమును చూస్తున్నారు. అచ్ఛా!

Comments