11-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
విజయీగా అయ్యేటందుకు ముఖ్య ధారణలు.
కొన్ని గ్రూపులను కలుసుకున్న సందర్భంలో బాప్ దాదా వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు మరియు వారిచ్చినటువంటి సమాధానాల యొక్క సారాంశం ఇక్కడ రాయబడి ఉంది -
ప్రశ్న: విజయీగా అయ్యేటందుకు ఏ ముఖ్య ధారణ అవసరం?
జవాబు: విజయీగా అయ్యేటందుకు అలర్ట్ గా ఉండే అవసరం ఉంది. ఒకటి అలర్ట్ గా ఉండడం, రెండు సోమరిగా ఉండడం. ఎవరైతే అలర్ట్ గా ఉంటారో వారెప్పుడూ మాయతో మోసపోరు, సదా విజయీగా ఉంటారు.
ప్రశ్న: 108 మాలలోకి మరియు 16వేల మాలలోకి వచ్చేవారి చిహ్నాలు లేదా గుర్తులు ఏమిటి? .
జవాబు: ఎవరైతే ఇక్కడ సదా విజయీగా ఉంటారో వారే విజయీ మాలలోకి వస్తారు. అందువలనే వైజయంతీ మాల అనే పేరు ఉంది. ఎవరైతే అప్పుడప్పుడు విజయం పొందుతారో వారు 16వేల మాలలోకి వస్తారు.
ప్రశ్న: ఏ లక్ష్యం పెట్టుకోవడం ద్వారా సదా విజయీగా అవ్వగలరు?
జవాబు: మేము ఇప్పటి విజయులం కాదు, కల్పకల్పము అనేకసార్లు విజయీ ఆత్మలం. ఏ విషయమైతే అనేకసార్లు చేస్తామో ఆ స్వభావ సంస్కారం స్వతహగానే తయారైపోతుంది. ఈనాటి ప్రపంచంలో ఏదైతే చేయకూడదో అది చేసేస్తున్నారు, అది నా సంస్కారం అయిపోయిందంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అనేకసార్లు విజయీ అయ్యాము అనేటటువంటి స్మృతి విజయీ సంస్కారాన్ని తయారుచేస్తుంది.
ప్రశ్న: వ్యర్ధాన్ని సమర్ధంగా తయారుచేసే తీవ్ర కర్మాగారం ఏది?
జవాబు: ఏ కర్మాగారమైనా, యంత్రమైనా శక్తివంతంగా ఉంటే పని త్వరగా జరిగిపోతుంది, అదేవిధంగా ఇక్కడ కూడా వ్యర్ధ సంకల్పాలను సమర్థంగా చేసుకునేటందుకు బుద్దిరూపీ యంత్రం శక్తివంతంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు శక్తివంతంగా ఉంటుందంటే బుద్ధి యొక్క సంబంధం సర్వశక్తివంతునితో ఉన్నప్పుడు. ఇక్కడ సంబంధం తెగిపోవడం లేదు కానీ వదులు అవుతుంది. కనుక ఇప్పుడు లూజ్ గా కూడా ఉండకూడదు. అప్పుడు వ్యర్థాన్ని సమర్థంగా తయారుచేసుకోగలరు.
రెండవ గ్రూప్ తో సంభాషిస్తూ..
ప్రశ్న: బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి?
జవాబు: బాబా స్మృతిలో సదా స్మృతిస్వరూపులై ఉండడం, ఎలాగైతే చెరకు చెక్కర రూపంలో ఉంటుందో అలాగే ఎలాంటి స్మృతి స్వరూపంగా అవ్వాలంటే స్మృతి మీ నుండి వేరుకాకూడదు. ఒకవేళ బాబా స్మృతిని వదిలేస్తే ఏమి మిగిలింది? ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే దానిని శవం అని అంటారు కదా, అదేవిధంగా బ్రాహ్మణ జీవితం నుండి స్మృతి తొలగిపోతే బ్రాహ్మణ జీవితం ఏమైంది? కనుక స్మృతి స్వరూపంగా అవ్వాలి, బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యమే స్మృతి స్వరూపంగా అవ్వడం.
మూడవ గ్రూపుతో సంభాషిస్తూ...
ప్రశ్న: ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది, యమునా నది ఒడ్డు యొక్క మహిమ ఏమిటి?
జవాబు: ఎలాగైతే ఇప్పుడు సాకార రూపంలో యమునా నది ఒడ్డున నివసిస్తున్నారో అదేవిధంగా బుద్ధియోగం ద్వారా స్వయాన్ని ఈ దేహం మరియు దేహం యొక్క పాత ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతంగా అనుభవం చేసుకోండి. సంగమయుగి అనగా కలియుగి ప్రపంచం నుండి దూరం అవ్వడం. దూరం అవ్వడం అనగా అతీతం అవ్వడం, పాత ప్రపంచం నుండి అతీతం అయిపోయారా ఇప్పుడు కూడా దానితో ప్రేమ ఉందా?
ప్రశ్న: దసరాకి అందరూ రావణుని యొక్క దహన సంస్కారాలు చేస్తారు, కాని ఇప్పుడు మీరేం చేయాలి?
జవాబు: స్వయంలో ఏవైతే రావణ సంస్కారాలు ఉన్నాయో ఆ రావణ సంస్కారాల యొక్క సంస్కారం చేయాలి, అనగా రావణ సంస్కారాలకు సదాకాలికంగా సెలవు ఇచ్చి లాభాన్ని పొందాలి. ఎముకలను లేదా బూడిదను మూటగట్టుకుని తీసుకువెళ్ళకూడదు. బూడిద అనగా సంకల్ప రూపంలో కూడా రావణ సంస్కారాలు తీసుకువెళ్ళకూడదు.
కొంతమంది ముఖ్యమైన అక్కయ్యలతో సంభాషిస్తూ..
ప్రతి సమయం మిమ్మల్ని మీరు నిమిత్తమైనవారిగా భావిస్తున్నారా? ఎవరైతే స్వయాన్ని నిమిత్తమైనవారిగా భావిస్తారో వారిలో ముఖ్యంగా ఏ విశేషత ఉంటుందంటే ఎంత మహనతయో అంత నమ్రత ఉంటుంది. రెండింటి యొక్క సమానత ఉంటుంది. అప్పుడే నిమిత్తంగా అయిన కార్యంలో సఫలతామూర్తిగా కాగలుగుతారు. ఎక్కడైతే నమ్రతకు బదులు మహనత ఎక్కువగా లేదా మహానతకు బదులు నమ్రత ఎక్కువగా ఉంటే కూడా సఫలతామూర్తిగా అవ్వలేరు. సఫలతామూర్తిగా అయ్యేటందుకు రెండు విషయాలు సమానంగా ఉండాలి. టీచర్ అనగా స్వయాన్ని సదా బాబా సమానంగా విశ్వసేవాధారిగా భావించి నడిచేవారు. విశ్వసేవాధారులే విశ్వకళ్యాణ కార్యం చేయగలరు. టీచర్స్ కి సదా ఇది స్మృతి ఉండాలి. టీచర్స్ స్వయానికి స్వయం టీచర్‌గా భావించకూడదు. టీచర్ యొక్క నషా ఉంటే ఆత్మిక నషా ఉండదు. ఈ నషా కూడా దేహభిమానం. అందువలన సదా ఆత్మిక నషాలో ఉండాలి - నేను విశ్వకళ్యాణకారి బాబాకు సహయోగి విశ్వకళ్యాణకారి ఆత్మను, స్వయం సంపన్నంగా ఉన్నప్పుడే కళ్యాణం చేయగలరు. స్వయం సంపన్నంగా లేనప్పుడు విశ్వకళ్యాణం చేయలేరు. సదా బేహద్ దృష్టి పెట్టుకోవాలి, బేహద్ సేవార్థం బేహద్ నషా ఉంటే బేహద్ రాజ్యాన్ని ప్రాప్తింపచేసుకోగలరు. సఫలత టీచర్ అనగా సదా హర్షితంగా ఉండాలి మరియు సర్వులను హర్షితముఖీగా తయారుచేయాలి, సఫలతా మూర్తి యొక్క గుర్తులు అర్థమైందా? టీచర్స్ సఫలతామూర్తులుగా అవ్వాల్సిందే. బాబా మరియు సేవ తప్ప మరే విషయం స్మృతిలో ఉండకూడదు, ఇలాంటి స్మృతిలో ఉండే టీచర్ సదా సమర్థంగా ఉండగలరు, బలహీనంగా ఉండరు. ఇలాంటి టీచరేనా, స్వయాన్ని ఇలాంటి సమర్థులుగా భావిస్తున్నారా? సమర్థ టీచరే సఫలతామూర్తిగా ఉండగలరు, ఇలాగే ఉన్నారు కదా? బలహీన మాటలు మాట్లాడడం టీచర్స్ కి శోభించదు, సంస్కారాలకు వశీభూతం అవ్వలేదు కదా, సంస్కారాలను మీ వశంలో ఉంచుకునేవారేనా, ఫిర్యాదులు చేసే టీచర్స్ కాదు కదా! టీచర్స్ అనేకుల యొక్క ఫిర్యాదులను సమాప్తం చేసేవారిగా ఉండాలి, కనుక మీరు ఫిర్యాదులు చేసేవారిగా ఉండకూడదు కదా! టీచర్స్ కి అవకాశాలు చాలా లభిస్తాయి, ఫిర్యాదులు సమాప్తం అయిపోతే సంపూర్ణం అయిపోయినట్లే. ఇక ఏమి కావాలి? మంచిది.
We get this murli with the dt.11.10.75 when we click on 12.10.75. But we get 2 avyakt murlis when we click on 11.10.75 with the same date. To find Hindi avyakt murli of this murli, I checked the contents of all the Hindi Avyakt murli books for the title स्वयम पर राज्य करने वाले ही विश्व महाराजाएं हैं, but couldn't find. Please inform the date of the Hindi Avyakt murli.
ReplyDelete