11-07-1972 అవ్యక్త మురళి

11-07-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిర్ణయ శక్తిని పెంచుకునే గీటురాయి - సాకార బాబా యొక్క చరిత్ర.

                  వర్తమాన సమయంలో విశేషతలను తెలుసుకుని, మీలో ఆ సర్వశక్తులు ధారణ చేసి, స్వయాన్ని విశేష ఆత్మగా తయారుచేసుకున్నారా? ఎలా అయితే ఈ సమయం యొక్క విశేషతలను వర్ణన చేస్తున్నారో, అలాగే మీలో కూడా ఆ విశేషతలను చూసుకుంటున్నారా? ఎంతగా సమయంలో విశేషతలు ఉన్నాయో, అంతగా స్వయంలో కూడా ఉన్నాయా? లేదా సమయంలో ఎక్కువగా మరియు స్వయంలో తక్కువగా ఉన్నాయా? సమయం మరియు స్వయంలో ఎంత తేడా ఉందని భావిస్తున్నారు? తేడా ఉందా? స్వయం మీరు శక్తిశాలిగా ఉన్నారా లేదా సమయం శక్తిశాలిగా ఉందా? (ఇప్పుడు సమయం శక్తిశాలిగా ఉంది, కానీ స్వయం శక్తిశాలిగా ఉండాలి) ఒకవేళ అలా ఉండాలి అంటున్నారు అంటే ప్రపంచం వారు అయితే అజ్ఞానులు, నిర్బల ఆత్మలు మరియు మీరు ఙ్ఞానీ ఆత్మలు మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలలో ఇక తేడా ఏముంటుంది? ఇలా అవ్వాలి, ఇది అవ్వాలి ఇదైతే వారు కూడా చెప్తారు. మీరు కూడా ఇది అవ్వాలి అని చెప్తే ఇక తేడా ఏముంది? జ్ఞానీ మరియు అజ్ఞానిలో ఇదే తేడా. ప్రజలు కావాలి, కావాలి అంటారు, కానీ ఙ్ఞానీ ఆత్మలు కావాలి అనటం లేదు. కానీ ఏది అవ్వాలనుకుంటున్నారో అది చేసి చూపిస్తున్నారు. వారు చెప్తారు. జ్ఞానులు చేస్తారు ఇదే తేడా. వారు కేవలం చెప్తున్నారు, మీరు చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇది అవ్వాలి అంటే ఇక తేడా ఏముంది? స్వయాన్ని అడగండి - సమయానికి ఏమేమి విశేషతలు ఉన్నాయి, మరియు ఆ విశేషతలలో నాలో ఏ విశేషత తక్కువగా ఉంది? అని. ఒకవేళ ఏదైనా ఒక విశేషత తక్కువైనా విశేషాత్మలలో వస్తారా? రారు కదా! ఈ సమయం యొక్క విశేషతలు తీస్తే అనేకమైన విశేషతలు కనిపిస్తాయి. వాటిలో ఈ సమయం యొక్క శ్రేష్ట విశేషత ఏమిటి? సంగమం యొక్క సమయం నడుస్తుంది కదా! శ్రేష్టంగా అయ్యే సమయమే కానీ ఏ సమయానికి లేని శ్రేష్టత ఈ సమయానికి ఉంది. అది ఏమిటి? ఈ సంగమయుగం యొక్క విశేషత ఇదే - సంగమయుగం యొక్క ప్రతి సెకను మధురమేళా. ఈ మేళాలో ఆత్మలకు బాబాతో కలయిక జరుగుతుంది. ఈ విశేషత ఇక ఏ యుగంలో ఉండదు. అది ఇదే. బాబా మరియు పిల్లల యొక్క మేళా అనండి లేదా మిలనం అనండి. మరి ఈ విశేషతను స్వయంలో ధారణ చేస్తూ నడుస్తున్నారా? ఎలా అయితే సంగమయుగంలో ప్రతి సెకను మేళా జరుగుతుందో, అలాగే ప్రతి సమయం స్వయాన్ని బాబాతో మిలనం చేసుకునే అనుభవం చేసుకుంటున్నారా? లేదా ఈ మహాన్ శ్రేష్ట మేళాలో నడుస్తూ, నడుస్తూ అప్పుడప్పుడు బాప్ దాదా చేతిని వదిలి మేళా లేదా కలయిక జరుపుకోవటం నుండి వంచితం అయిపోతున్నారా? ఎలా అయితే మేళాలో కొంతమంది పిల్లలు తప్పిపోతారు కదా! తల్లి, తండ్రుల చేతిని వదిలేస్తారు. మేళా అంటే సంతోషం జరుపుకునేది. ఒకవేళ మేళాలో కొంతమంది పిల్లలు తల్లి, తండ్రి నుండి వేరైపోయారు లేదా చేతిని- తోడుని వదిలేస్తే వారికి ఏమి లభిస్తుంది? సంతోషానికి బదులు మరింత అశాంతి అయిపోతారు. కనుక ఇలా స్వయాన్ని చూసుకోండి - మేళాలో సదా సంతోషాన్ని పొందుతున్నానా, సదా మిలనంలో ఉంటున్నానా? అని. ఎవరైతే సదా కలయికలో ఉంటారో వారి గుర్తు ఏమి ఉంటుంది? వారి విశేషత ఏమి ఉంటుంది? అతీంద్రియ సుఖంలో ఉండేవారు లేదా సదా కలయిక జరుపుకునే వారి గుర్తు ఏమి ఉంటుంది? వారి విశేషత ఏమి ఉంటుంది? ఎవరైతే సదా మిలనంలో నిమగ్నమై ఉంటారో, వారు ఎప్పుడు ఏ విఘ్నాలలో ఉండరు. మిలనం విఘ్నాలను తొలగిస్తుంది. మిలనాన్నే సంలగ్నత అని అంటారు. ఏ రకమైన విఘ్నం అయినా వస్తుంది లేదా విఘ్నానికి వశం అవుతున్నారు. అంటే దీని ద్వారా ఏమి సిద్ధి అవుతుంది? సదా మిలనమేళా జరుపుకోవటంలేదు. ఎలా అయితే ఇతరులకు సమయాన్ని గ్రహించండి, సమయం యొక్క లాభాన్ని పొందండి అని చెప్తారో, అలాగే స్వయానికి కూడా ఈ సూచన ఇచ్చుకుంటున్నారా? లేదా కేవలం ఇతరులకే ఇస్తున్నారా? ఒకవేళ స్వయానికి కూడా ఈ సూచన ఇచ్చుకుంటే ఒక సెకను కూడా మిలనం నుండి దూరంగా ఉండలేరు. ప్రతి సెకను మిలనం జరుపుకుంటూ ఉంటారు. ఎలా అయితే ఏదైనా పెద్ద మేళా జరుగుతున్నప్పుడు ఇంత సమయం ఈ మేళా జరుగుతుంది అని సమయం నిర్ణయిస్తారు. తర్వాత అది సమాప్తి అయిపోతుంది. ఒకవేళ ఏదైనా శ్రేష్టమేళా కొద్ది సమయమే ఉంటుంది అంటే ఏమి చేస్తారు? మేళా జరుపుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ సంగమం యొక్క మేళాను ఒకవేళ ఇప్పుడు జరుపుకోకపోతే మరలా ఎప్పుడైనా ఈ మేళా ఉంటుందా? కల్పమంతటిలో ఈ కొద్ది సమయమే బాబా మరియు పిల్లల మేళా ఉంటుంది. ఈ కొద్ది సమయం యొక్క మేళాలో ఏమి చేయాలి? ప్రతి సెకను జరుపుకోవాలి కదా! కనుక సమయం యొక్క విశేషతలు తెలుసుకుంటూ మీలో కూడా ఆ విశేషతలను ధారణ చేయండి. అప్పుడు స్వతహాగానే శ్రేష్టాత్మగా అయిపోతారు. అందరి లక్ష్యమైతే శ్రేష్ట ఆత్మగా అవ్వాలి అని కదా! లక్ష్యం శ్రేష్టంగా ఉన్నప్పటికీ పురుషార్ధం సాధారణంగా ఎందుకు నడుస్తుంది? లక్ష్యం శ్రేష్టంగా ఉన్నప్పుడు మరలా లక్షణాలు సాధారణ ఆత్మగా ఎందుకు ఉంటున్నాయి? దీనికి కారణం ఏమిటి? లక్ష్యాన్నే మర్చిపోతున్నారు. లక్ష్యం పెట్టుకునేవారు మరలా లక్ష్యాన్నే మర్చిపోతారా? ఏ విఘ్నం యొక్క నివారణశక్తి ఎందుకు తక్కువ అవుతుంది? దీనికి కారణం ఏమిటి? నివారణ ఎందుకు చేయలేకపోతున్నారు? నివారణ చేయలేకపోతున్న కారణంగానే ఏదైతే లక్ష్యం పెట్టకున్నారో దానిని పొందలేకపోతున్నారు. కనుక నివారణాశక్తి ఎందుకు తక్కువ అవుతుంది? శ్రీమతం ప్రకారం నడిచేవారికి ఎలాంటి లక్ష్యమో అలాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ లక్ష్యం శ్రేష్టం లక్షణాలు సాధారణంగా ఉంటే దీనికి కారణం ఏమిటి? ఎందుకంటే విఘ్నాలను నివారణ చేయలేకపోతున్నారు. నివారణ చేయకపోవటానికి కారణం ఏమిటి? ఏ శక్తి లోపంగా ఉంది? నిర్ణయ శక్తి, ఇది మంచిదే. ఎప్పటి వరకు నిర్ణయం చేయరో అప్పటి వరకు నివారణ చేయలేరు. ఒకవేళ నిర్ణయం చేస్తే నివారణ కూడా చేస్తారు. కానీ నివారణ చేయటంలో లోపం వచ్చేస్తుంది. నిర్ణయం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే నిర్వికల్పంగా అవ్వటం లేదు. వ్యర్ధ సంకల్పాలు, వికల్పాలు బుద్ధిలో ఉన్న కారణంగా, బుద్ధి స్పష్టంగా లేని కారణంగా నిర్ణయం చేయలేకపోతున్నారు. మరియు నిర్ణయం చేయలేని కారణంగా నివారణ చేయలేకపోతున్నారు. నివారణ చేయలేకపోతున్న కారణంగా ఏదోక ఆవరణకు వశం అయిపోతున్నారు. నివారణ లేకపోతే ఆవరణ తప్పనిసరి. మీ నిర్ణయశక్తిని పెంచుకునేటందుకు ఏ సాధనం ఇవ్వటం జరిగింది? ఎలా అయితే బంగారాన్ని పరిశీలించేటందుకు గీటురాయిని పెడతారు. దాని ద్వారా సత్యమైనదా, అసత్యమైనదా అనేది తెలుస్తుంది. అలాగే నిర్ణయశక్తిని పెంచుకునేటందుకు మీ ఎదురుగా ఏ గీటురాయి ఉంది? సాకార బాబా యొక్క ప్రతి కర్తవ్యం, ప్రతి చరిత్ర ఇదే - గీటురాయి. ఏ కర్మ చేస్తున్నా, ఏ సంకల్పం చేస్తున్నా - ఈ గీటురాయితో ఇది యదార్ధమా, అయదార్థమా, వ్యర్ధమా, సమర్థమా అని ఈ గీటురాయితో చూసిన తర్వాత కర్మ చేస్తే అది సహజం మరియు శ్రేష్టం అవుతుంది. ఈ గీటురాయిని వెంట ఉంచుకోవటం లేదు, అందువలనే శ్రమ అనిపిస్తుంది. సహజయుక్తి ఏదైతే ఉందో దానిని మర్చిపోతున్నారు. దీని కారణంగా విఘ్నాల నుండి ముక్తి కాలేకపోతున్నారు. ఒకవేళ బంగారపు పని చేసేవారి దగ్గర గీటురాయి సరిగ్గా లేకపోతే ఏమౌతుంది? మోసపోతారు. అలాగే ఈ గీటురాయి సదా స్మృతిలో మరియు సదా వెంట ఉంచుకోవటం లేదు. కనుకనే శ్రమను అనుభవం చేసుకుంటున్నారు. అసలైతే సహజమే కదా! మరలా కష్టంగా ఎందుకు అవుతుంది? ఎందుకంటే యుక్తిని ఉపయోగించటం లేదు, యుక్తిని ఉపయోగిస్తే తప్పకుండా ముక్తి అయిపోతారు. సంకల్పాల తుఫాను నుండి, ఏదోక సంబంధం ద్వారా అయినా, లేదా ప్రకృతి లేదా సమస్యల ద్వారా ఏదైనా తుఫాను లేదా విఘ్నాలు వస్తున్నాయి .అంటే వాటి నుండి ముక్తి పొందకపోవటానికి కారణం యుక్తి లేనట్లే. యుక్తియుక్తంగా కాలేదు. ఎంతగా యోగయుక్తంగా, యుక్తీయుక్తంగా అవుతారో అంతగా సర్వ విఘ్నాల నుండి తప్పకుండా ముక్తి అవుతారు. సర్వ విఘ్నాల నుండి ముక్తులా లేదా యుక్తులా? యోగయుక్తంగా ఉండటం లేని కారణంగానే విఘ్నాల యుక్తులుగా అవుతున్నారు. ఏదైనా ప్రోగ్రామ్ పెడుతున్నారు లేదా ఉపన్యాసం చెప్తున్నారు లేదా ఎవరికైనా చెప్తున్నారు. దానిలో కూడా ముఖ్య విషయం ఏది చెప్తారు? ముక్తి, జీవన్ముక్తి మీ జన్మసిద్ధ అధికారం అని చెప్తారు. మీ జన్మసిద్ద అధికారం. కనుక దానిని పొందండి. మరలా ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అంటున్నారు. ముక్తీ, జీవన్ముక్తి మీ జన్మసిద్ధ అధికారం అని ముఖ్య స్లోగన్ ఏదైతే ఉందో దానిని మీరు పొందారా? పిల్లలుగా అయ్యారు మరియు అధికారం పొందలేదా? ఇతరులకు పిల్లలుగా అయ్యారు అంటే వారసత్వానికి అధికారులుగా అయ్యారు అని చెప్తారు కదా! ఇది కేవలం చెప్పటం వరకేనా లేదా ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విషయమా? యోగ్యులుగా అవ్వటం ఇది రెండవ విషయం. కానీ ముక్తి, జీవన్ముక్తి, యొక్క వారసత్వం లభించిందా లేక లేదా? ఇక్కడే పొందారా లేదా ముక్తిధామంలో ముక్తి మరియు స్వర్గంలో జీవన్ముక్తి తీసుకుంటారా? భవిష్యత్తులో అయితే లభిస్తుంది కానీ భవిష్యత్తుతో పాటు ఇప్పుడు ముక్తి, జీవన్ముక్తి లభించ లేదా? బాబా ఇప్పుడే లభించారు, వారసత్వం ఇప్పుడే లభించింది. భవిష్యత్తుపై నమ్మకంతో నడుస్తున్నారా? (చెక్ లభించిందా?) పిల్లలకు చెక్ ఇవ్వరు, పిల్లలకు బాబా యొక్క ప్రతి వస్తువుపై అధికారం ఉంటుంది. అధికారులకు చెక్ యొక్క నమ్మకం ఇవ్వరు. ప్రత్యక్ష వారసత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు లభిస్తుంది. జీవన బంధనతో పాటు జీవన్ముక్తి యొక్క అనుభవం అవుతుంది. అక్కడైతే జీవన బంధన యొక్క విషయమే ఉండదు. అక్కడ కేవలం దాని ప్రాలబ్దంలో ఉంటారు. ముక్తిధామంలో ముక్తి యొక్క అనుభవం, ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నారో అది అక్కడ చేసుకోలేరు. ముక్తి, జీవన్ముక్తి యొక్క జన్మసిద్ధ అధికారం భవిష్యత్తులో లభిస్తుంది అని అనుకోకండి. ఎప్పుడైతే పిల్లలుగా అయ్యారో వారసత్వం కూడా పొందారు. ఇక ఆజ్ఞాకారిగా, నమ్మకదారిగా, ఎంత వరకు అవుతున్నారు. దీనిలో నెంబర్ తయారవుతుంది. వారసత్వానికి అధికారిగా అయితే అవుతున్నారు. ఆ వారసత్వాన్ని జీవితంలో ధారణ చేసి దాని నుండి లాభం తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి స్థితిపై ఆధారపడి ఉంటుంది. వారసత్వం ఇవ్వటంలో బాబా ఏమీ తేడా చూపించరు. యోగ్యులుగా మరియు యోగ్యులుగా అవ్వకపోవటంలో తేడా వస్తుంది. అందువలనే జన్మసిద్ధ అధికారం సదా పొందుతున్నారు. సదా ముక్తిగా ఉండాలి కదా! దేహంతో, దేహ సంబంధీకులతో కూడా ముక్తి మరియు పాత ప్రపంచం యొక్క స్మృతి నుండి కూడా ముక్తి అవ్వాలి. ముక్తి అవ్వలేదా? ఒకవేళ ముక్తి స్థితి యొక్క అనుభవం చేసుకుంటే ముక్తి తర్వాత జీవన్ముక్తి యొక్క అనుభవం స్వతహాగా అవుతుంది. ఎందుకంటే జీవితంలో ఉన్నారు కదా! శరీరధారులు కదా! జీవితంలో ఉంటూ దేహం మరియు దేహ సంబంధాలు మరియు పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి ముక్తి అవ్వాలి - దీనినే జీవన్ముక్తి స్థితి అంటారు. ముక్తి- జీవన్ముక్తి యొక్క అనుభవం ఇప్పుడే చేసుకోవాలి, భవిష్యత్తులో కాదు. భవిష్యత్తులో ఇక్కడి ప్రాప్తి యొక్క ప్రాలబ్దం లభిస్తుంది. కానీ ప్రాప్తి యొక్క అనుభవం ఇప్పుడే అవుతుంది. భవిష్యత్తులో అయితే తప్పకుండా వస్తుంది. అది శ్రేష్ట కర్మల యొక్క ప్రాలబ్దం. కానీ శ్రేష్టకర్మ అయితే ఇప్పుడే జరుగుతుంది కదా! ప్రాప్తి యొక్క అనుభవం కూడా ఇప్పుడే అవుతుంది కదా! కేవలం భవిష్యత్తు యొక్క నమ్మకంతో ఉండకూడదు. చెక్ పెట్టుకుని ఆ పరిశీలనలో ఉండకూడదు. స్వయాన్ని బాబా ద్వారా ఏదైతే వారసత్వం లభించిందో దీనిని ఎంత వరకు పొందుతున్నాను? అని చూసుకోండి. బాబా అయితే ఇచ్చేసారు. అధికారి యొక్క అధికారం ఎవరు లాక్కోలేరు. మేము అధికారులం - ఈ నషా మరియు నిశ్చయంలో ఉండండి. లభించిన వారసత్వాన్ని ఎక్కడ వ్యర్ధంగా పోగొట్టుకోవటం లేదు కదా? అని చూసుకోండి. కొంతమంది పిల్లలు వారికి చాలా లభిస్తుంది, కానీ చాలా పోగొట్టుకుంటున్నారు కూడా! పోగొట్టుకున్న కారణంగా లభిస్తున్నా కూడా బికారీగా అయిపోతున్నారు. అధికారిగా ఉన్నప్పటికీ ఆధీనం అయిపోతున్నారు. అధికారం లేకపోతే అధీనత తప్పకుండా ఉంటుంది. విఘ్నాలకు ఆధీనం అయిపోతున్నారు కదా! ఎందుకంటే అధికారం పొందలేదు. ఒకవేళ సదా అధికారి అయ్యి నడిస్తే ఏ విఘ్నం రావటానికి అధికారం ఉండదు. ఈ ప్రకృతికి కూడా ఆధీనం కాకూడదు. ఎలా అయితే బాబా ప్రకృతిని ఆధీనం చేసుకుని వస్తారు, కానీ ఆధీనం అవ్వరు అలాగే ఈ దేహం లేదా ఈ ప్రకృతిని ఆధీనం చేసుకుని నడవాలి, అధీనం కాకూడదు. మంచిది.
                 పిల్లిమొగ్గల ఆట చూసారా? భట్టీలో ఈ రోజు పిల్లిమొగ్గల ఆట మంచిగా చూపించారు. ఇప్పుడు సమాప్తిలో అన్ని బలహీనతలు సమాప్తి అయిపోతాయి కదా! ఈ పిల్లిమొగ్గల ఆట ఆడటం లేదు కదా! సదా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అధికారి నిశ్చయం మరియు నషాలో ఉండేవారికి, సదా శ్రేష్టతలను ధారణ చేసి శ్రేష్ట ఆత్మగా అయ్యే ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments