11-07-1970 అవ్యక్త మురళి

 * 11-07-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రాలబ్దము.

ఈరోజు బాప్ దాదా విద్యార్థులందరూ చదువు తర్వాత ఏ ఏ డిగ్రీలు పొందారు అని చూస్తున్నారు. ఈ చదువుకు ఏ డిగ్రీ లభిస్తుంది? డిగ్రీ లభించిందా లేక లభించాలా? చదువు తర్వాత డిగ్రీ లభిస్తుంది కదా. మరి ఈ సంగమంలో మీకు ఏమి లభిస్తుంది? సంపూర్ణ ఫరిస్తా లేక అవ్యక్త ఫరిస్తా - ఇది సంగమయుగపు డిగ్రీ, మరియు దైవీ పదవి భవిష్య ప్రారబ్దము. కావున ఇప్పటి డిగ్రీ సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా. ఈ డిగ్రీకి ముఖ్యమైన యోగ్యతలు ఏమిటి, ఎంత వరకు ప్రతి ఒక్కరూ యోగ్యులుగా అయ్యారు అని చూస్తున్నారు. ఎంత యోగ్యులుగా అవుతారో అంతగా ఇతరులను కూడా యోగ్యులుగా చేస్తారు. యోగ్యత ఉన్నవారు క్వాలిటీ(నాణ్యత)ను తయారు చేస్తారు. అలా లేని వారు క్వాన్టిటీ(సంఖ్య)ను తయారు చేస్తారు. మరి ఈరోజు అందరి క్వాలిటీలను చూస్తున్నారు. ఏయే క్వాలిటీలో యోగ్యత పొంది ఉన్నారని చూడటం జరుగుతుంది కదా! ఇక్కడ క్వాలిటీలో ముఖ్యంగా ఎంత వరకు, నాలెడ్జ్ ఫూల్ గా అయ్యారు అని చూస్తున్నారు. నాలెడ్జ్ ఫూల్ తో  పాటు ఫెయిత్ ఫూల్(విశ్వాన పాత్రులు), సక్సెస్ ఫుల్(విజయవంతులు), పవర్ ఫుల్(శక్తిశాలురు) మరియు సర్సీస్ బుల్ (సేవాధారులు)గా ఎంతవరకు అయ్యారు? ఇన్ని క్వాలిటీలు ఒకవేళ అందరిలో వచ్చేస్తే అప్పుడు డిగ్రీ లభించేస్తుంది. ఈ క్వాలిటీలల్లో నాలో ఏయే క్వాలిటీలు వచ్చాయి అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి, నాలెడ్జ్ ఫుల్ అనగా బుద్ధిలో ఫుల్ (పూర్తి) జ్ఞాన ధారణ. ఎంతగా నాలెడ్జ్ ఫూల్ గా ఉంటారో అంతగా వారు సక్సెస్ ఫుల్ గా  ఉంటారు. ఒకవేళ సక్సెస్ తక్కువగా ఉంది అంటే జ్ఞానము తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సక్సెస్ ఫుల్ గా ఉండకపోవడానికి కారణము ఏమిటి? ఫెయిత్ ఫూల్ గా తక్కువగా ఉండటము ఫెయిత్ ఫూల్ అనగా నిశ్చయబుద్ది. ఒకటి - స్వయంపై ఫెయిత్, రెండు- బాప్ దాదా మరియు మూడు పరివారంలోని ఆత్మలందరిపై ఫెయిత్ ఫుల్ గా ఉండవలసి ఉంటుంది. ఎంతగా ఫెయిత్ ఫుల్ గా అయి నిశ్చయబుద్ధితో ఏ కర్తవ్యమునైనా చేసినప్పుడు అంతగా నిశ్చయబుద్ధికి విజయము ప్రాప్తిస్తుంది. అనగా ఫెయిత్ ఫుల్ గా కారణంగా సక్సెస్ ఫుల్గా అవుతారు. వారి ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇటువంటి యోగ్యత కలిగినవారికే ఈ డిగ్రీ ప్రాప్తిస్తుంది. ఒకవేళ డిగ్రీని ప్రాప్తించుకోకపోతే ఏమవుతుందో తెలుసా? కోర్టు ద్వారా ఏమి వెలువడుతుంది? డిక్రీ(నోటీసు). అయితే డిగ్రీ లభిస్తుంది లేక డిక్రీ లభిస్తుంది. ధర్మరాజపురిలో బంధింపబడే డిక్రీ వెలువడుతుంది. కావున పురుషార్థం చేసి డిగ్రీని తీసుకోవాలి, డిక్రీ తీసుకోకూడదు. ఎవరి పేరు మీద అయితే డిక్రీ వెలువడుతుందో వారు అవమానంగా భావిస్తారు. కావున ఎంత వరకు యోగ్యులుగా అయ్యాము అని సదా పరిశీలించుకుంటూ ఉండండి. ముఖ్యమైన యోగ్యతల గురించి ఇప్పుడు చెప్పాము. కానీ లిస్టు అయితే చాలా పెద్దది. ప్రతి క్వాలిటీ వెనుక పుల్ అన్న మాట ఉంది. ఫేయిత్ ఫుల్, పవర్ ఫుల్.... ఈ విధంగా అన్ని గుణాలలో ఫుల్(పూర్తిగా) ఉన్నట్లయితే అప్పుడు డిగ్రీ లభిస్తుంది. అందరూ సక్సెస్ ను పొందుతారు కానీ సక్సెస్ ఫుల్ గా, పవర్ ఫుల్ గా ఉన్నామా లేక తక్కువగా ఉన్నామా అని చూసుకోవాలి. ఎవరైతే ఈ గుణాలన్నింటిలో ఫుల్ గా ఉంటారో వారికే అవ్యక్త ఫరిస్తా అన్న డిగ్రీ లభిస్తుంది. అందరూ ఈ లక్ష్యాన్నే పెట్టుకున్నారు కదా. ఇప్పుడు వర్తమానం ఎటువంటి సమయముగా ఉంది?ఇప్పుడు ఇది చాలా నాజూకు సమయము. ఇప్పడు నాజ్ తో (గారాబంగా) నడిచే సమయము కాదు. ఆ గారాబాలు చిన్నతనపు సమయానికి చెందినవి. ఒకవేళ నాజూకు సమయంలో కూడా ఎవరైనా గారాబంగా నడుచుకుంటే రిజల్టులో నష్టమే జరుగుతుంది. కావున ఇప్పుడు సంహారీమూర్తిగా అవ్వాలి. వికరాళరూపధారిగా కావాలి. ఇప్పుడు సమయము రోజురోజుకూ నాజూకుగా అవుతూ ఉండడం వలన సంహారీమూర్తిగా అవ్వాలి. దేని సంహారం? తమ సంస్కాారాలను. ఈ సమయంలో ఉన్న తమ వికర్మలపై మరియు వికర్మీ ఆత్మలపై ఇవ్పుడు వికరాల రూపాన్ని ధరించి ఒక్క క్షణంలో భస్మం చేయాలి. శంకరుడు నేత్రం తెరవగానే ఒక్క క్షణంలో వినాశనం జరిగినట్లుగా చెప్తారు కదా. ఇది సంహారమూర్తి చేసే కర్తవ్యానికి గుర్తు, ఎవరి మీదనైనా వికరాళ రూపంగా అయి దృష్టి ఇవ్వగానే వారి వీకారి సంస్కారాలు భస్మం చేసేయ్యలి. కావున వికర్మలు మరియు వ్యర్థ కర్మలు, వికర్ములపై ఇప్పుడు వికరాళ రూపాన్ని ధారణ చెయ్యాలి. ఇప్పుడు స్నేహమూర్తిగా కూడా కాదు, ఇప్పడు కాళి రూపం కావాలి. వికరాళ సంహారి రూప కావాలి, ఇది అంతిను సమయము. ఇప్పటిి వరకు ఒకవేళ వికరాళ రూపధారిగా కాకపోతే తమ వికర్మలను మరియు వికర్ములను ఎదుర్కోలేరు. ఇప్పడు ఇముడ్చుకునే సమయము కాదు. వికర్మలను వ్యర్థ సంకల్పాలను మరియు వికర్ములను, వికారీ నడవడికను ఇముడ్చుకునే సమయము కాదు, సంహారం చెయ్యాలి, ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి, శక్తిరూపాన్ని ప్రత్యక్షం చేయ్యాలి, శక్తులు ఒకే సమయంలో మూడు విషయాలను ధారణ చెయ్యాలి. ఒకటి - మస్తకంలో మాతృ స్నేహ గుణాన్ని, రూపంలో ఆత్మికతను మరియు వాణిలో వజ్రమును ధారణ చెయ్యాలి. ఒక్కొక్క మాట వికర్మలను మరియు వికర్ములను సమాప్తం చేసేదిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు విషయాలు ఒకేసారి ధారణ అవుతాయో అప్పుడు ఏమి జరుగుతుంది? వికర్మలు మరియు వికర్ములు భష్మమైపోతారు. శక్తుల దృష్టితో వికర్మీ ఆత్మలు వణికిపోతారు. దేనివలన? తమ వికర్మల వలన. కావున ఇప్పుడు సంహారకారిగా అయి త్వరత్వరగా సంహారం చెయ్యండి. ఒక్కోసారి సింగారంలో పడిపోయి సంహారమును మర్చిపోతున్నారు. సింగారం చాలా చేసుకున్నారు, ఇప్పడు సంహారం చెయ్యండి. పాలన విషయంలో మాస్టర్ బ్రహ్మాగా కూడా అయ్యారు, పాలన చేసారు, సింగారం చేసారు కానీ ఇప్పుడు ఇది సంహారం చేసే పాత్ర, శక్తుల అలంకారము, శక్తుల గర్జన, ఇంకా శక్తుల ఏ కర్తవ్యానికి గాయనము ఉంది? గజ్జెల ఝంకారము. గజ్జెలు ధరించి అసురులపై నాట్యం చెయ్యండి. నాట్యం చెయ్యడం ద్వారా ఏమవుతుంది? ఏది ఉన్నా అది అణిగి క్రిందకు వెళ్ళిపోయి అంతమైపోతుంది. నిర్బయతకు, వినాశనానికి గుర్తు ఈ గజ్జెల ఝంకారము. పాండవులు చెయ్యలేదు అని కాదు. పాండవులు కూడా శక్తిరూపులు. శక్తిరూపంలో ఇద్దరూ వచ్చేస్తారు. మరి ఈ మూడు కర్తవ్యాలు ప్రాక్టీకల్ గా మరియు ప్రత్యక్ష రూపంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు బలహీనుల పని కాదు. మైదానంలోకి బలహీనులు రారు, శూరవీరులు వస్తారు. మరి ఇప్పుడు మైదానంలో ప్రత్యక్షమయ్యే సమయము. శూరవీరులై, శక్తిరూపులై ప్రత్యక్ష రూపంలో ముందుకు రండి. ఈ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగుతుంది? ప్రత్యక్షత. బాబా మరియు పిల్లల ప్రత్యక్షత జరుగుతుంది. ఎంతగా ప్రత్యక్షమవుతారో అంతగా ప్రత్యక్షత జరుగుతుంది. కావున తండ్రిని ప్రఖ్యాతి చెయ్యడానికి ప్రత్యక్షం కావాలి. ఇప్పటి వరకు తమలోని బలహీనతలకే వీడ్కోలు ఇవ్వకపోతే సృష్టికి కళ్యాణకారులుగా ఎలా అవుతారు? కావున తమలోని బలహీనతలకు ఇప్పుడు వీడ్కోలు చెప్పండి, అప్పుడు సృష్టికి కళ్యాణకారులుగా అవ్వగలరు. అచ్ఛా!

పార్టీలతో

1.వర్తమాన సమయంలో అందరూ ఏ విశేష పురుషార్ధాన్ని చేస్తున్నారు? సందేశమును ఇవ్వడమైతే సాధారణ విషయము. విశేష ఆత్మగా కావడానికి విశేష కార్యాన్ని కూడా చెయ్యాల్సి ఉంటుంది. ఈరోజుల్లో ప్రపంచంలోని విశేష ఆత్మలపై విశేషమైన శ్రద్ధ ఉంచాలి, ఒక్క విశేష ఆత్మపై శ్రద్ధను పెట్టడం ద్వారా స్వతహాగా అనేకుల శ్రద్ధ అటువైపుకు వెళ్తుంది. విశేష ఆత్మపై శ్రద్ధ పెట్టడం వలన వారు విశేషంగా కాదు, మీరు విశేషంగా అవుతారు. విశేషమైన ధ్యానమును ఉంచడం ద్వారా ఎటువంటి సంకల్పము, కర్మ మరియు సమయము వ్యర్థం అవ్వవు. శక్తి ఒకవేళ జమ అయినటైతే విశేషమైన సేవ కూడా సహజంగా జరుగుతుంది. కావున ఇప్పుడు పాత లెక్కాచారాల పుస్తకాన్ని సమాప్తం చేసి క్రొత్త పుస్తకాన్ని తయారు చెయ్యాలి. ఎవరు ఎంతగా యోగ్యులుగా ఉంటారో అంతగా వారి విలువ ఉంటుంది. విలువైన వస్తువును ఎప్పుడూ సాధారణ స్థానంలో ఉంచడం జరుగదు. దానికి విశేషమైన స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కావున యోగ్యతలను ముందుంచుకుని అవి ఎంత శాతం ఉన్నాయి అని నోట్ చేసుకుంటూ ఉండండి. ఎప్పడైతే సెంట్ (వంద) పర్సెంట్ అవుతుందో అప్పుడు ఈ సేయింట్(సాధుసన్యాసులు) కూడా వంగుతారు. వారు వంగడం ద్వారా ఆ ఝంకారము దూర దూరాల వరకు అందరి చెవులకు చేరుతుంది. యథార్థమైన పురుషార్థానికి అర్థం - అక్కడే పురుషార్థము, అక్కడే ప్రాప్తి. ఈ సంగమయుగానికి ప్రత్యక్ష ఫలాన్ని పొందే విశేష వరదానము ఉంది. ఫలము కూడా ఎటువంటిదంటే పురుషార్థం తక్కువ, ప్రారబ్ధము ఎక్కువ, కావున సమయపు విశేషతను తెలుసుకుని స్వయంలో విశేషతను నింపుకోవాలి. ఒకవేళ లోపం ఉండిపోతే ఆ లోపానికి గుర్తు ఏమిటి? కమాన్(విల్లు). ఒకవేళ కమాల్ (అద్భుతం) చెయ్యకపోతే కమాన్ లభిస్తుంది. ఒక్క క్షణం యొక్క ఫలాన్ని కూడా ఒకవేళ ప్రాప్తి చేసుకోకపోతే ఫుల్ గా అవ్వలేరు. ఫేల్ లిస్టులోకి వచ్చేస్తారు.

2. ఢిల్లీని బాప్ దాదా దిల్(హృదయము) అని అంటారు. ఎలా అయితే హృదయపు చప్పుడుతో ఆరోగ్యం గూర్చి తెలుస్తుందో అలాగే ఢిల్లీలోని ధ్వనితో సమాప్తి ధ్వనిని వింటాము. ఢిల్లీ దర్పణం వంటిది. మరి ఢిల్లీ వారికి ఎంతటి బాధ్యత ఉంది! ఎంత పెద్ద బాధ్యత కిరీటము ఉంటుందో అంతగా సత్యయుగములో పెద్ద కిరీటము లభిస్తుంది. దీనిని అనంతమైన బాధ్యత అని అంటారు. బాబా కూడా మధువనంలో ఉంటూ అనంతమైన సేవ చేసేవారు కదా. కావున ఒక్కొక్కరిపై అనంతమైన బాధ్యత ఉంది. అనంతమైన బుద్ధి ఎలా వస్తుంది? అనంతమైన విషయాన్ని ఆలోచించడము, అనంతమైన పరివారంతో సంబంధము, స్నేహము, సర్వ స్థానాలు మనవే..., ఇటువంటి వారిని అనంతమైన సర్వీసబుల్ అని అనడం జరుగుతుంది. హద్దులో సేవచేసే వారిని సర్వీసబుల్ అని అనరు.

3.మధువనాన్ని సేఫ్ (ఇనుపపెట్టె) అని అంటారు. మధువన నివాసులు సేఫ్ లో ఉన్నారు. సేఫ్ లో ఉండేవారు ఎటువంటి మణులు? అన్నిటికన్నా గొప్ప మణి మస్తకమణి. మస్తకమణులు తక్కువగా ఉంటాయి, హృదయమణులు ఎక్కువగా ఉంటాయి. ఎవరు ఎక్కువగా సేఫ్ లో ఉంటారో వారు మస్తకమణులు. యోగయుక్తంగా మరియు నిశ్చయబుద్ధితో కర్తవ్యం చేసినప్పుడు సఫలత ప్రాప్తిస్తుంది. చేస్తున్నాము కానీ కష్టంగా లభిస్తుంది అన్న సంకల్పము ముందు నుండే ఉన్నట్లయితే ఈ సంకల్పము కూడా నిశ్చయం యొక్క శాతాన్ని తగ్గించేస్తుంది. నిశ్చయబుద్ధిగా అయి చేసినట్లయితే ఫేల్ అవ్వరు. సమస్యలను ఎదుర్కోవడం ద్వారా సఫలత లభిస్తుంది. విఘ్నాలు వస్తాయి కానీ తపన అన్న అగ్నితో విఘ్నాలు భస్మం అయిపోతాయి. అచ్ఛా!

Comments