* 11-06-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"మూడు లోకాలలో, మూడు కాలాలలో బాప్ దాదాకు సమీపంగా ఉండాలంటే సాంగత్యదోషం నుండి రక్షించుకోండి."
ఇది ఏ గ్రూపు? ఈ గ్రూపును అలంకరించి ఎలా తయారుచేశారు? మీరు పరివర్తన చెంది తయారై వెళుతున్నారు కదా! కావున వీరిని పరివర్తన చేసి ఎలా తయారుచేశారు? మీరు ఎలా తయారయ్యారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సాక్షాత్కరింప చేసుకుంటారో అప్పుడే కదా ఇతరులను తయారుచేసేది. మేము ఆత్మిక సేవాధారులుగా అయి వెళుతున్నాము అని ఈ గ్రూపు వారు భావిస్తున్నారా? అందరూ తమను తాము సేవాధారిగా భావిస్తూ సేవా స్థానాలకు వెళుతున్నారా లేక మీమీ ఇళ్ళకు తిరిగి వెళుతున్నారా? మీరు ఏమని భావిస్తూ వెళుతున్నారు? మీరు మీ లౌకిక పరివారంలోకి వెళ్ళినట్లయితే దానిని ఏమని భావిస్తారు? అది కూడా సేవాస్థానమేనా లేక కేవలం సెంటరు మాత్రమే సేవాస్థానమా? ఇంటిని కూడా సేవాస్థానముగా భావించినట్లయితే స్వతహాగానే సేవ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సేవాధారులుగా ఉంటారో వారికి ప్రతిస్థానములోను సేవ ఉంది. ఎక్కడ ఉన్నా, ఎక్కడకు వెళ్ళినా సేవాదారులకు అన్నివేళలా మరియు అన్ని స్థానాలలోను సేవయే కనిపిస్తుంది మరియు సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఇంటిని కూడా సేవాస్థానంగా భావిస్తూ ఉంటారు. బుద్ధిలో సేవ గుర్తుండడం ద్వారా ఈ స్మృతి శక్తితో కర్మబంధనాలు కూడా స్వతహాగానే మరియు శీఘ్రంగానే అంతమైపోతాయి. కావున సేవాధారులుగా అయి వెళుతున్నప్పుడు ప్రతి సంకల్పంలోను సేవ చేయాలి. ఒక్క క్షణము లేక ఒక్క సంకల్పము కూడా సేవ జరుగకుండా పోజాలదు. అటువంటివారినే సత్యమైన ఆత్మిక సేవాధారులు అని అంటారు. ఆత్మిక సేవాధారులు ఆత్మ ద్వారా కూడా సేవ చేయగలరు. ఏ విధంగా లైట్ హౌస్ ఒక్క స్థానంలో ఉంటూ కూడా నలువైపులా తన ప్రకాశం ద్వారా సేవ చేయగలదో, అదేవిధంగా ఎవరైతే సేవాధారులుగా ఉంటారో వారు కూడా ఏదైనా ఒక స్థానంలో ఉంటూ కూడా బేహద్ సృష్టిలోని బేహద్ సేవలో తత్పరులై ఉంటారు. కావున లైట్ హౌస్ గా, మైట్ హౌస్ గా అయ్యారా? రెండింటిగాను అయ్యారా లేక లైట్ హౌస్ గా అయి ఇంకా మైట్ హౌస్ గా అవ్వవలసి ఉందా? జ్ఞానస్వరూప స్థితి లైట్ హౌస్ మరియు యోగయుక్త స్థితి మైట్ హౌస్. కావున ఇప్పుడు జ్ఞానీ ఆత్మలుగా, యోగీ ఆత్మలుగా అయి వెళుతున్నారు కదా! లేక ఇంకా ఏమైనా మిగిలి ఉందా? పూర్తిగా అలంకరించుకున్నారా? కుమారీ స్థితిలో స్వచ్ఛత మరియు తమను తాము సరిగ్గా అలంకరించుకోవడమనేది ఉంటుంది. కావున ఇక్కడ భట్టీలో కూడా జ్ఞానము మరియు గుణాల ద్వారా అలంకరించుకున్నారా? అలంకరించుకొని వెళుతున్నారా లేక అక్కడకు వెళ్ళి ఇంకా ఏమైనా చేయవలసి ఉందా? పూర్తిగా అస్త్రశస్త్రాలన్నింటితోను సంసిద్ధులై యుద్ధమైదానాలలోకి వెళుతున్నారా? ఎవరైతే అస్త్రశస్త్రధారులుగా ఉంటారో వారు సదా విజయులుగా ఉంటారు. శస్త్రాలు శత్రువును ముందుకు రానివ్వవు. కావున శత్రువులు దూరం నుండే చూసి పారిపోయే విధంగా శస్త్రధారులుగా అయ్యారా? అందరూ ఆ విధంగా అయ్యారా? వరదాన భూమి అయిన మధువనపు ప్రభావంలో మాట్లాడుతున్నారా లేక స్వయమును అవినాశీ శస్త్రధారిగా లేక అలంకరింపబడినట్లుగా భావిస్తున్నారా? రేపు క్రిందకు దిగితే స్థితి అదేవిధంగా ఉన్నతంగా ఉంటుందా? ఎక్కడకు వెళ్ళినా కాని స్వయంతో లేక మధువనపు సమూహం మధ్య లేక ఈశ్వరీయ దర్బారు మధ్య ఏ ప్రతిజ్ఞనైతే చేశారో అది సదా నిలిచి ఉంటుంది అన్నది పక్కా చేసుకోండి. ఇటువంటి అవినాశీ ముద్రను ప్రతి ఒక్కరూ తమలో తాము ముద్రించుకున్నారా? నిశ్చయపు విజయము తప్పకుండా ఉంటుంది మరియు ధైర్యమునుంచేవారికి బాప్ దాదా మరియు సర్వ ఈశ్వరీయ పరివారపు ఆత్మల సహాయము ఉంటుంది. మీ ధైర్యమును ఎవరు ఎంతగా చలింపజేసేందుకు ప్రయత్నించినా కాని మీరు ప్రతిజ్ఞనైతే చేశారో ఆ ప్రతిజ్ఞ యొక్క శక్తి నుండి కొద్దిగా కూడా పాదాలను కదపకూడదు. అవి ఏ పాదాలు? వాటి ద్వారా స్మృతి యాత్ర చేస్తారు. సృష్టి మొత్తం కదిలించినా కాని మీరు మొత్తం సృష్టిలోని ఆత్మల కన్నా శక్తి శాలురు. మొత్తం సృష్టి అంతా ఒకవైపు ఉండి, ఇంకొకవైపు మీరొక్కరే ఉన్నా మీ శక్తి శ్రేష్ఠమైనది. ఎందుకంటే సర్వశక్తివంతులైన తండ్రి మీకు తోడుగా ఉన్నారు. కావుననే శివ శక్తులు అన్న గాయనము ఉంది. శివుడు మరియు శక్తులు ఇరువురూ తోడుగా ఉన్నట్లయితే సృష్టిలోని ఆత్మలు వారి ముందు ఎంత? అనేకులు ఉంటూ కూడా ఒక్కరికి సమానంగా లేరు. ఇంతటి నిశ్చయబుద్ధిని లేక ప్రతిజ్ఞను పాలన చేసే ధైర్యమును ఉంచేవారిగా అయి వెళుతున్నారు కదా! ప్రాక్టికల్ పరీక్ష వస్తుంది, థియరీ పరీక్ష సహజమైనదే. ఎవరికైనా సాప్తాహిక కోర్సును చేయించడము లేక మ్యూజియము లేక ప్రదర్శినిని అర్థం చేయించడము థియరీ పరీక్షలాంటిది. కాని ఎవరైతే ప్రాక్టికల్ పరీక్షలో పాసవుతారో వారే పాస్ విత్ హానర్ గా అవుతారు. ఎవరైతే ఈ విధంగా పాసవుతారో వారే బాప్ దాదాలకు సమీపంగా ఉండే రత్నాలుగా అవుతారు. మరి మీరు సమీపంగా ఉండేందుకు ఇష్టపడతారా లేక దూరం నుండి చూడడం ఇష్టపడతారా? పాస్ విత్ హానర్‌గా అవుతాము అన్న ధైర్యమును కూడా ఉంచాలి కదా! ఈ ధైర్యమును అవినాశిగా చేసుకునేందుకు ఒక్క విషయమును సదా ధ్యానంలో ఉంచుకోవాలి.
ఏ సాంగత్యదోషంలోకైనా స్వయమును రానిచ్చుకునేందుకు బదులుగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. అనేకరకాలైన ఆకర్షణలు పరీక్షల రూపంలో వస్తాయి కాని ఆకర్షితులవ్వకూడదు. హర్షితముఖులుగా ఉంటూ వాటిని పరీక్షలుగా భావిస్తూ పాసవ్వాలి. సాంగత్యదోషము అనేకరకాలుగా ఉంటుంది. మాయ సంకల్పాల రూపంలో కూడా తన సాంగత్యపు రంగును అంటించే ప్రయత్నం చేస్తుంది. కావున ఈ వ్యర్థ సంకల్పాలలో, మాయ తెచ్చే ఆకర్షణల సంకల్పాలలో ఎప్పుడూ ఫెయిలవ్వకండి మరియు తరువాత స్థూల సంబంధీకుల సాంగత్యము - అందులో కేవలం పరివారపు సంబంధమే కాదు పరివారంతో పాటు ఇతర అనేక సంబంధాల సాంగత్యం కూడా ఉంటుంది. స్నేహితురాళ్ళ సాంగత్యం కూడా సంబంధపు సాంగత్యమే. కావున ఏ సంబంధీకుల సాంగత్యంలోకి రాకూడదు. ఎవరి వాణి యొక్క సాంగత్యదోషంలోకి రాకూడదు. వాణి ద్వారా కూడా తప్పుడు సాంగత్యపు రంగు అంటుకుంటుంది. దాని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలాగే ఆహారపు సాంగత్యదోషం కూడా ఉంది. ఎప్పుడైనా ఎవరి సమస్య అనుసారంగానైనా లేక ఏ సంబంధీకుల స్నేహానికి వశమై అయినా ఆహార దోషంలోకి వచ్చినట్లయితే ఆ అన్నం కూడా మీ మనస్సును సాంగత్యపు రంగులోకి తీసుకువచ్చేస్తుంది. కావున దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. కర్మ యొక్క సాంగత్యము కూడా ఉంటుంది. కావున దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి అప్పుడే పాస్ విత్ హానర్ గా అవుతారు. సాంగత్య దోషపు పరీక్షలలో పాసయినట్లయితే సమీపంగా రాగలరని అర్థం చేసుకోండి. సాంగత్యపు దోషంలోకి వచ్చినట్లయితే దూరమైపోతారు, అప్పుడు నిరాకారీవతనంలోనూ ఉండరు, సంగమయుగంలోనూ ఉండరు అలాగే భవిష్యత్తులోనూ సమీపంగా కూడా ఉండలేరు.
ఒక్క సాంగత్యదోషము మూడులోకాల నుండి దూరం చేసేస్తుంది. ఒక్క సాంగత్యదోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ద్వారా మూడులోకాలలోను, మూడుకాలాలలోను బాబాకు సమీపంగా ఉండే భాగ్యమును పొందగలుగుతారు. ఈ గ్రూపును బాప్ దాదా హంసల సంఘటన అని అంటారు. హంసల కర్తవ్యము లేక స్వరూపము ఏమిటి? హంసల స్వరూపము పవిత్రత మరియు వాటి కర్తవ్యము - సదా గుణాలరూపీ ముత్యాలను ధారణ చేస్తాయి మరియు అవగుణాలరూపీ రాళ్ళను ఎప్పుడూ బుద్ధిలో స్వీకరించవు. ఇదీ హంసల కర్తవ్యము. కాని ఈ కర్తవ్యమును పాలన చేసేందుకు బాప్ దాదా నుండి సదా ఆజ్ఞ లభిస్తూ ఉంటుంది. అది ఏ ఆజ్ఞ? ఆ ఆజ్ఞతో కూడిన మీ చిత్రము కూడా తయారై ఉంది - చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు. ఈ ఆజ్ఞను సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే సత్యమైన హంసగా అయి సర్వగుణాల సాగరుడైన బాబా సాగరతీరంపై సదా కూర్చొని ఉంటారు. కావున మీ బుద్ధిని జ్ఞానసాగరుడైన బాబా వద్ద తప్ప ఇంకెక్కడా నిలువనివ్వకండి, ఎందుకంటే హంసలు ఉండేది సాగరంలోనే. కావున స్వయమును హంసగా భావిస్తూ మీ ప్రతిజ్ఞలను పాలన చేస్తూ ఉండండి. అర్థమైందా? ముత్యాలను మరియు గులకరాళ్ళను రెండింటినీ వేరుచేయడము నేర్చుకున్నారా? గులకరాళ్ళు ఎలా ఉంటాయి, రత్నాలు ఎలా ఉంటాయి? జ్ఞానవంతులుగా అయితే అయ్యారు కదా! ఈ హంసలు ఏమి అద్భుతములను చేసి చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ హంసల సంఘటన అసంకల్పితముగా కూడా తమవైపుకు ఆకర్షిస్తాయి. కావున సాంగత్యదోషం నుండి రక్షించుకోవాలి మరియు ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. ఒక సాంగత్యమును వదలాలి, మరొక సాంగత్యమును జోడించాలి. ఈశ్వరీయ సాంగత్యము కేవలం శరీరం ద్వారా ఉండదు, బుద్ధి ద్వారా కూడా ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. బుద్ధి సదా ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి మరియు స్థూలమైన సంబంధంలోను ఈశ్వరీయ సాంగత్యం ఉండాలి. ఈ సాంగత్యపు ఆధారంపై అనేక సాంగత్యదోషాల నుండి సురక్షితులుగా ఉంటారు. కేవలం బదిలీ చేసుకోవాలి. కోమలతను అద్భుతంలోకి పరివర్తన చేయాలి. కోమలతను చూపించకూడదు. కేవలం సంస్కారాలను పరివర్తన చేయడంలో కోమలంగా అవ్వాలి, కర్మలో కోమలంగా అవ్వకూడదు. ఇందులో శక్తిరూపంగా అవ్వాలి. శక్తి స్వరూపపు కవచమును సదా ధారణ చేయకపోతే కోమలులకు బాణము చాలా త్వరగా తగులుతుంది. బాణమును కూడా కోమల స్థానముపైనే సంధిస్తారు. కావున శక్తి స్వరూపమైన కవచమును ధారణ చేసినట్లయితే శక్తిరూపంగా అయిపోతారు. అప్పుడిక మాయ యొక్క ఎటువంటి బాణము తగులజాలదు. కర్మలో కోమలముగా అవ్వకండి, కేవలం పరివర్తన చెందేందుకు రియల్ గోల్డ్ గా అవ్వాలి. ముఖంపై, నయనాలపై, నడవడికలో కోమలత్వమును తీసుకురాకూడదు. ఈ విషయాలన్నింటినీ స్మృతిలో ఉంచుకొని పాస్ విత్ హానర్ గా అవ్వాలి. ఈ గ్రూప్ లో ప్రాక్టికల్ ప్రమాణమును ఇచ్చి ప్రమాణంగా అయ్యే ఆశారత్నాలై కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు ముందుకు వెళ్ళాలి. కేవలం ఇతరులు ముందుకు వెళ్ళడం చూసి హర్షితంగా అవ్వడం కాదు, కేవలం ఇతరులను చూస్తూ ఉన్నట్లయితే భక్తులుగా అయిపోతారు. భక్తులు కేవలం చూస్తూ వారి గుణాలను గానం చేస్తూ సంతోషిస్తూ ఉంటారు. మీరు భక్తులుగా అవ్వకూడదు. జ్ఞానస్వరూపులుగా మరియు యోగయుక్తులుగా, జ్ఞానీ ఆత్మలుగా మరియు యోగీ ఆత్మలుగా అవ్వాలి. ఇప్పుడు పరీక్షల రిజల్టును చూద్దాము. ఎవరైతే ప్రత్యక్ష ప్రమాణమును ఇస్తారో వారు మొదటి నెంబర్ లోకి వస్తారు. ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వారిని చూసి బాబా కూడా రాజ్యభాగ్యమును ఇచ్చేందుకు ఆలోచిస్తారు. ఎవరైతే స్వయమును స్వయమే ఆఫర్ చేసుకుంటారో వారికి బాప్ దాదా కూడా విశ్వరాజధాని యొక్క రాజ్యభాగ్యమును మొదటే ఇచ్చేస్తారు. ఒకవేళ స్వయమును ఆఫర్ చేసుకోకపోతే బాప్ దాదా కూడా విశ్వరాజ్య సింహాసనాన్ని ఎందుకు ఆఫర్ చేస్తారు? మిమ్మల్ని మీరే ఆఫర్ చేసుకున్నట్లయితే ఆఫ్రీన్ అనగా అభినందించడం జరుగుతుంది. గ్యాసుబుగ్గలుగా అవ్వకండి, అవి చాలా త్వరగా ఎగురుతాయి కాని అల్పకాలికంగానే ఎగురుతాయి. ఇక్కడ మీలో మీరు అవినాశీ శక్తిని నింపుకోవాలి. అల్పకాలికమైన ఆక్సిజన్ ను ఆధారముగా తీసుకోకూడదు. అచ్ఛా!
Comments
Post a Comment