10-06-1971 అవ్యక్త మురళి

* 10-06-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సేవా ధరణిని తయారుచేసేందుకు సాధనము- సర్చ్ లైట్.”

            ప్రతి ఒక్కరి మస్తకముపై ఏ మూడు రేఖలను చూస్తున్నారు? మీకు మీ రేఖలు కనిపిస్తున్నాయా? బాబా సృతిచిహ్నములో ఏవిధంగా మూడు రేఖలను తప్పక చూపిస్తారో, అలాగే సాలిగ్రామాలైన ప్రతి ఒక్కరి మస్తకముపై ఏ మూడు రేఖలు కనిపిస్తాయి? మస్తకమును ఎప్పుడైనా దర్పణములో చూసారా? ఏ దర్పణములో చూసారు? ప్రతి ఒక్కరి మస్తకముపై ఒక రేఖ లేక గుర్తు విజయమునకు సంకేతము. విజయమునకు గుర్తు - త్రిశూలము. త్రిశూలము మనసు, వాణి, కర్మ మూడింటిలో సఫలతకు గుర్తు, విజయమునకు గుర్తు. శక్తుల చిత్రాలలో కూడా త్రిశూలాన్ని చూపిస్తారు. కావున ప్రతి ఒక్కరి మస్తకములో ఈ విజయమునకు గుర్తు అయిన త్రిశూలము ఉంది. త్రిశూలముపై కల మరొక రేఖ లేక గుర్తు బిందువు. అలాగే త్రిశూలమునకు క్రింద పొడవైన రేఖ ఏదైతే ఉందో అది మూడవ రేఖ - ఇది లైన్ క్లియర్ (స్పష్టత) మరియు కేర్ ఫుల్(జాగ్రత్త)కు గుర్తు. కేర్ ఫుల్ గా కూడా మరియు క్లియర్ గా కూడా. మార్గమధ్యములో ఎటువంటి ఆటంకము రాకూడదు. కావున మూడవ గుర్తు - సూటి మార్గములో ఏకరసులై నడిచేవారు. మూడు రేఖలు లేక గుర్తులు ప్రతి ఒక్కరి మస్తకముపై చూస్తున్నారు. రేఖలైతే అందరికీ ఉంటాయి కానీ, కొందరికి స్పష్టంగా ఉంటాయి. కొందరికి స్పష్టంగా ఉండవు. మరి మీరు మీ రేఖలను చూసారా? త్రిశూలము ఉంది, లైన్ క్లియర్ గా కూడా ఉంది మరియు ఆత్మిక స్థితిరూపీ బిందువు కూడా ఉంది. భక్తులు కూడా మస్తకముపై తిలకపు గుర్తును దిద్దుకుంటారు. మీకు మస్తకముపై పెట్టుకొనే అవసరము లేదు, ఎల్లప్పుడూ మీ మస్తకములోని ఈ రేఖల ద్వారా మీ స్థితిని పరిశీలించుకోగలరు. మూడు రేఖలూ చాలా సమర్థముగా ఉండాలి, అప్పుడే సాక్షాత్కారమూర్తులుగా అవ్వగలరు మరియు మీ కర్తవ్యమును సఫలము చెయ్యగలరు. ఇప్పుడు మీరు సేవలోకి వెళ్తున్నారు. ఇప్పటినుండే ఆ ఆత్మలపై మీ సర్చ్ లైట్ ప్రసరింపచేయటమును మొదలుపెట్టాలి. ప్రారంభించారా లేక అక్కడకు వెళ్ళి ప్రారంభిస్తారా? సర్చ్ లైట్ ప్రకాశము దూరము వరకు వెళ్తుంది, కావున ఇక్కడి నుండే సర్చ్ లైటును వెయ్యాలి. ఆత్మలను ఎన్నుకోగలరు. ఇక్కడినుండే కార్యమును మొదలు పెట్టడం ద్వారా అక్కడకు వెళ్ళటంతోనే ప్రత్యక్ష ప్రమాణము కనిపిస్తుంది. సర్చ్ లైట్ గా అయ్యే నడుస్తూ తిరుగుతూ ఉన్నారా లేక ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడే సర్చ్ లైట్ ను ఇస్తారా? నిరంతర సర్చ్ లైట్లుగా భావించి నలువైపులా వాయుమండలమును తయారుచేసే కర్తవ్యమును ఇప్పటినుండే చెయ్యాలి. అక్కడకు వెళ్ళటంతోనే వాయుమండలపు ఆకర్షణ ద్వారా సమీపంగా వచ్చే ఆత్మలు తమ భాగ్యమును సహజంగానే పొందగలరు. ఎందుకంటే, ఇప్పుడు సమయము తక్కువగా ఉంది మరియు సఫలతను వెయ్యిరెట్లుగా చూపించాలి. ముందు ఉన్న సమయము వేరుగా ఉండేది, అప్పుడు సమయము ఎక్కువ మరియు సఫలత తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు తక్కువ సమయంలో సఫలత వెయ్యి రెట్లు ఉండాలి, ఆ ప్లాన్ ను తయారు చెయ్యాలి. ప్లాన్ కంటే ముందు ప్లెయిన్ గా అవ్వాలి. ఒకవేళ ప్లెయిన్ గా అయినట్లయితే ప్లాన్ ప్రాక్టికల్ లో సరిగా వచ్చేస్తుంది. ప్లెయిన్ గా అవ్వటం వలననే ప్లాన్ సరిగా నడవగలదు. ప్లెయిన్‌గా అయిన తరువాత, సదా సఫలతను పొందేందుకు ఏ ప్లాన్ ను  చెయ్యాలి? ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేందుకు క్లుప్తంగా వినిపిస్తాము. గుర్తు పెట్టుకోవలసిన మొదటి విషయము - మనందరిది ఏకమతము అనగా ఒక్కరి మతముపై ఏక మతము. రెండవ విషయము - వాణి ద్వారా కూడా ఎల్లప్పుడూ ఒక్కరి పేరునే పదే పదే స్వయమునకు మరియు ఇతరులకు స్మృతిని కలిగించాలి. మూడవ విషయము - వ్యవహారము మరియు కర్మలో ఎకానమీ(పొదుపు). కేవలము ధనము విషయములోనే పొదుపు చెయ్యటం కాదు, కాని వాణిలో కూడా పొదుపు కావాలి, సంకల్పములో కూడా పొదుపు, సమయములో కూడా పొదుపు కావున వ్యవహారములో అన్ని రకాల పొదుపు ఉండాలి. ఈ మూడు విషయాలు - ఏకమతము, ఒక్కరి పేరు అనగా ఏకనామి మరియు ఎకానమీ. ఈ మూడు విషయాలనూ ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకొని అప్పుడు అడుగు వెయ్యాలి మరియు సంకల్పమును వాణిలోకి తీసుకురావాలి. 

            ఏదైనా ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారము చేస్తున్నట్లయితే ఆ సమయములో ఒక స్లోగన్ ను గుర్తు  పెట్టుకోవాలి - బాలకులుగా మరియు యజమానులుగా అవ్వడం. ఏ సమయములో అయితే  అభిప్రాయాలను తెలుపుతారో ఆ సమయములో యజమానులుగా అయ్యి ఇవ్వాలి. కానీ ఏ  సమయములో అయితే ఫైనల్ అవుతుందో ఆ సమయములో మళ్ళీ బాలకులుగా అయిపోవాలి. కేవలము యజమానత్వము కూడా కాదు, కేవలము బాలకత్వము కూడా కాదు. ఏ సమయములో ఏ కర్మ చెయ్యాలో ఆ సమయములో అదే స్థితి ఉండాలి. మరియు ఇతర ఆత్మల సేవను ఎప్పుడు చేసినా, ఇతరుల సేవతో పాటు తమ సేవను కూడా చెయ్యాలి అన్నదానిని కూడా ధ్యానములో ఉంచుకోండి.

            ఆత్మిక స్థితిలో మిమ్మల్ని స్థితపరచుకోవటము, ఇది మీ సేవ. మా సేవ కూడా జరుగుతుందా అని మొదట దీనిని పరిశీలించుకోండి. మీ సేవ లేనట్లయితే ఇతరుల సేవలో సఫలత ఉండదు. తండ్రి స్మృతి అనగా మీ స్మృతి మరియు మీ స్మృతి అనగా తండ్రి స్మృతి అని ఇతరులకు వినిపిస్తారు కదా! అదేవిధంగా ఇతరుల సేవ అనగా మీ సేవ. దీనిని కూడా స్మృతిలో ఉంచుకోవాలి. ఎవరైనా సేవ కొరకు వెళ్ళినప్పుడు సేవతో పాటు మా పాత సంస్కారాల అంతిమ సంస్కారమును చేస్తాము అని ఎల్లప్పుడూ భావించండి. ఎంతగా సంస్కారాల అంతిమ సంస్కారమును చేస్తారో అంతగానే సత్కారము లభిస్తుంది. ఆత్మలందరూ మీ ముందు మనస్సు ద్వారా నమస్కరిస్తారు. చేతులతో నమస్కరించటము ఒకటి, మనస్సుతో నమస్కరించటము మరొకటి. మనసు లోపలనే గుణాలను గానము చేస్తూ ఉండాలి. భక్తి కూడా పైకి చేయటము ఒకరకమైతే మానసికమైనది మరొకటి. కావున బయట నుండి నమస్కారము చెయ్యటము - ఇదేమంత పెద్ద విషయము కాదు, కానీ మనసు ద్వారా నమస్కారము చేస్తారు, వీరిని ఇలా తయారుచేసిన వారు ఎవరు అని తండ్రి గుణాలను గానము చేస్తారు. మరొకటి - ఎవరికైతే తమ దృఢమైన ఆలోచనలు ఉంటాయో వారిని కూడా మీరు వినిపించిన శ్రేష్ఠ విషయాల ముందు తల ఒంచేటట్లుగా చేస్తారు. అప్పుడది  నమస్కారమైంది కదా! మనసు ద్వారా నమస్కారము చెయ్యాలి, ఈ పురుషార్థము చెయ్యాలి. బయట భక్తి చేసేవారిని తయారుచెయ్యకూడదు, కానీ మానసిక నమస్కారము చేసేవారిని  తయారుచెయ్యాలి. ఆ భక్తులే మారి జ్ఞానులుగా అయిపోవాలి. ఎంతెంతగా బుద్ధిని ఎల్లప్పుడూ, స్వచ్ఛముగా అనగా ఒక్కరి స్మృతిలోనే అర్పణ చేస్తారో అంతగానే స్వయం దర్పణంగా అయిపోతారు.  దర్పణము (అద్దము) ముందుకు రావటంతోనే కోరుకోకపోయినా కూడా తమ స్వరూపము  కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఒక్కరి స్మృతిలోనే బుద్ధిని అర్పణ చేస్తారో, అప్పుడు మీరు చైతన్య దర్పణముగా అయిపోతారు. ఎవరు ఎదురుగా వచ్చినా, వారు వారి సాక్షాత్కారమును లేక వారి స్వరూపమును సహజముగా అనుభవం చేస్తూ ఉంటారు. కావున దర్పణంగా అవ్వటము - దీని ద్వారా స్వతహాగనే సాక్షాత్కారము అయిపోవాలి. ఇది బాగుంది కదా! ఏదో సర్చ్ లైట్ ఉందని, దూరంనుండే తెలుస్తుంది కదా. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఎంత పెద్ద సంగఠనలో ఉన్నా కానీ,  సంగఠన మధ్యలో కూడా వీరు సర్చ్ లైట్ అనగా మార్గమును చూపిస్తూ ఉంటారు అని దూరము నుండే  తెలియాలి.

            జ్ఞానము మరియు స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా మార్గమును చూపే సర్చ్ లైట్లు మీరు. మరియు ఎప్పుడైతే దృఢ సంకల్పము చేసి వెళ్తారో, అప్పుడు సంకల్పము ద్వారా స్వరూపము తయారవ్వనే తయారవుతుంది. మేము విజయీ రత్నాలము అని సంకల్పము ఉన్నట్లయితే స్వరూపము కూడా విజయముదే తయారవుతుంది. వాణి మరియు కర్మ అలాగే నడుస్తాయి. సంకల్పము ఆధారముతోనే కర్మలో విజయము నిండి ఉంది. సేవాధారులైన ఆత్మలకు విజయతిలకము దిద్దబడింది. సేవ అనగా విజయతిలకము ఉండటము. సేవాయోగ్యులైన ఈ గ్రూపు వెళ్తుంది కదా! ఎవరి ఒక్క క్షణము కూడా మరియు ఒక్క సంకల్పము కూడా సేవ లేకుండా ఉండదో - వారే సేవాయోగ్యులు. ఈ గ్రూపు అటువంటిదే కదా! ఎప్పుడైతే ప్రత్యేకంగా సేవలో వెళ్తారో అప్పుడు మీ పైన కూడా ప్రత్యేకంగా ధ్యానమును ఉంచవలసి ఉంటుంది. ఇది సాధారణ సేవ కాదు, విశేష సేవ. సాధారణ సేవ చేసినట్లయితే సాధారణ స్మృతి ఉంటుంది. ఎప్పుడైతే ఏదైనా విశేష కార్యము చెయ్యవలసి ఉంటుందో అప్పుడు విశేష స్మృతి ఉంటుంది. కావున సాధారణ స్మృతిలో కాకుండా శక్తి శాలీ స్మృతిలో ఉండాలి. ఎల్లప్పుడూ శక్తి శాలీ స్మృతిలో ఉండటం ద్వారా వాయుమండలము శక్తి శాలిగా ఉంటుంది. శక్తి శాలీ వాయుమండలము ఉన్న కారణంగా ఏ ఆత్మ కూడా ఈ వాయుమండలము నుండి బయటకు వెళ్ళాలని కోరుకోదు, అప్పుడే సేవా సఫలత లభిస్తుంది. ఎల్లప్పుడూ ఇతరుల ఆలోచనలకు సత్కారమును ఇచ్చి స్వీకరించినట్లయితే మళ్ళీ మానసిక నమస్కారములను సహజముగానే చేస్తారు. ఎల్లప్పుడూ హాజీ, హాజీ(సరేనండి, సరేనండి) అన్న పాఠాన్ని దృఢం చేసుకోవాలి. ఎంతగా హాజీ, హాజీ అని అంటారో అంతగానే అందరూ జయజయకారాలను చేస్తారు. మీరు మీ శక్తి స్వరూపమును లేక పాండవస్వరూపమును ప్రత్యక్షము చేసేందుకై వెళ్తున్నారు కదా! అశ్వ చక్రమును వేసి ఆత్మలను యజ్ఞములో స్వాహా చేసేందుకు వెళ్తున్నారు. స్వయమైతే స్వాహా అయిపోనే అయిపోయారు, పూర్తిగా ప్లెయిన్ గా అవ్వాలి, తోడుగా భారాన్ని తీసుకువెళ్ళవద్దు. పాండవులు ఐదుగురు, కానీ మతము ఒక్కటే. మేమందరమూ ఒక్కటే అని అంటారు కదా. ఒక ఉదాహరణను స్థిరంగా ఉంచేందుకు ఇది మొదటి గ్రూపు. ఇతరులకు ప్రతి సమయము స్మృతి స్వరూపపు స్మృతిని ఇప్పించటం ద్వారా ఒకటే మతము అయిపోతుంది. పంచ పాండవుల ఐక్యమతము గురించి విశేషత ఉంది మరియు ప్రతి ఒక్కరికీ వారి వారి విశేషత కూడా ఉంది. ప్రతి ఒక్కరికీ ఉన్న విశేషత ఏమిటి? తుపాకి పట్టిన నలుగురు సిపాయిల కధను వినిపిస్తారు కదా! (విదేశములో నలుగురు సిపాయిలతో కూడిన ఒక సినిమా నడిచింది, అందులో నలుగురూ ఒకేవిధంగా ఉంటారు మరియు చెప్పకుండానే ఏ కార్యమునైనా ఐకమత్యముతో చేసేస్తారు) కావున అందరితో కలసిమెలసి ఉంటూ ప్రతి కార్యమునూ సఫలము చేయించాలి. ప్రతి ఒక్కరూ విశేషంగా ఒక డ్యూటిని తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వారి విశేష కార్యము యొక్క బాధ్యతను వినిపించండి. సంగఠనలో ఉంటూ కూడా తమ విశేషతా సహయోగమును ఇవ్వటం ద్వారా సహజమైపోతుంది.

            పాండవులు ప్రతి ఒక్కరూ ఏ విశేషతను చూపిస్తారు? ఆత్మల సంబంధములో అయితే అందరూ పాండవులు మరియు శక్తులు కూడా. మీ విశేషత గురించి తెలుసా? మీ ఉల్లాస-ఉత్సాహాలు మరియు ఏకరస స్థితి ఎల్లప్పుడూ ఉండాలి. ఎవరు ఎంతగా ఏ విషయాల ద్వారానైనా మిమ్మల్ని హైరానా పరిచేందుకు ప్రయత్నించినా కానీ, మీరు ప్రాక్టికల్ అనుభవమూర్తులై ఆత్మిక దృష్టిలో ఉండి, శక్తిశాలి స్థితిలో స్థితులై వారితో రెండు మాటలైనా శక్తిశాలిగా మాట్లాడినట్లయితే వారు తమను కాగితపు పులిగా భావిస్తారు. దేవతల చిత్రాలలో కూడా చూపిస్తారు కదా - అసురులు భయంకరమైన రూపంతో ఎదిరించేందుకు వస్తారు, కానీ వారి ముందు పూర్తి పశువులుగా అనగా తెలివిహీనులైపోతారు. ఎంతటి పెద్ద తెలివిగలవారైనా గానీ మీ అనుభవీ మూర్తి మరియు ఆత్మిక దృష్టి ముందు పూర్తిగా తమను తెలివిహీనులుగా భావిస్తారు. మీ ఎదురుగా ఎంత పెద్ద రూపాన్ని ధరించటానికి ప్రయత్నం చేసినా, శక్తుల పాదాల కింద ఎల్లప్పుడూ ఎద్దును చూపిస్తారు, ఎందుకని? ఎవరు ఎంతగా తమను సెన్సిబుల్ గా, నాలెడ్జ్ ఫుల్ గా భావించినా కానీ ఎద్దు ఏవిధముగా పూర్తిగా తెలివిలేనిదిగా ఉంటుందో అలా అయిపోతారు. ఒక రూపాన్ని ధరించి వస్తారు, కానీ మరొక రూపముగా అయిపోతారు. శక్తుల స్మృతి చిహ్నాన్ని చూపిస్తారు కదా. అసురులు ఎదిరించేందుకు భయంకర రూపాన్ని ధరించి వస్తారు కానీ, ఎప్పుడైతే శక్తుల గురి తగులుతుందో అప్పుడు వేరే రూపమైపోతుంది. కావున మేము ఆల్ మైటీ అథారిటీ ద్వారా నిమిత్తమయ్యాము అన్నదానిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఆల్ మైటీ గవర్నమెంట్ కు సందేశకులు. ఎవరితోటైనా డిస్కషన్(చర్చ)ద్వారా మీ మైండ్ ను డిస్టర్బ్ చేసుకోవద్దు. లేనట్లయితే వారు సైన్స్ శక్తి ద్వారా మీ సంకల్పాలను కూడా చదువుతారు, కావున ఎప్పుడైనా ఏవిషయమునకైనా సంబంధించి ఎటువంటి శబ్దము వచ్చినా, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. మీ ముఖముపై లేక మనస్సు స్థితిలో తేడాను తీసుకురావద్దు. మంత్రమును గుర్తు ఉంచుకోవాలి. ఏవిధంగా ఎవరైనా మాటల ద్వారా గానీ లేక ఇతర పద్ధతి ద్వారానైనా వశము కానట్లయితే, మంత్ర తంత్రాలు చేస్తారు! కావున అటువంటి విషయమేదైనా ఎదురుగా వచ్చినట్లయితే మీ ఆత్మిక దృష్టి నేత్రము మరియు మన్మనాభవ మంత్రమును ప్రయోగించినట్లయితే పులి కూడా పోతులాగా అయిపోతుంది. ఇంద్రజాల మంత్రమైతే వచ్చు కదా? ఇక్కడి నుండే అన్ని విషయాలు వెలువడ్డాయి. మంత్రమును వెయ్యటము, రిద్ధి-సిద్ధి కూడా ఇక్కడి నుండే వెలువడ్డాయి. మీ ఆత్మిక దృష్టితో మీ సంకల్పాలను కూడా సిద్ధింపజేసుకోగలరు. అక్కడ ఉన్నది రిద్ధి-సిద్ధి మరియు ఇక్కడ విధి ద్వారా సిద్ధి, మాటల తేడా ఉంది. రిద్ధి-సిద్ధి అల్పకాలికమైనవి, కానీ స్మృతి అనే విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అన్నది అవినాశి. వారు రిద్ధి-సిద్ధిని వాడుతారు మరియు మీరు స్మృతి అనే విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తింపజేసుకుంటారు. అచ్ఛా!

Comments