11-04-1973 అవ్యక్త మురళి

* 11-04-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరివర్తన.

ప్రత్యక్ష మూర్తిగా తయారుచేసేవారు, సర్వగుణ సంపన్న శివబాబా మాట్లాడుతున్నారు.

          వర్తమాన సమయమును పరివర్తనా సమయము అని అంటారు. ఈ సమయము అనుసారంగా ఎవరైతే నిమిత్తంగా అయి ఉన్నారో వారిలో కూడా తప్పకుండా అన్నివేళలా పరివర్తన జరుగుతోంది. కావుననే వారి ఆధారముపై సమయ పరివర్తన జరుగుతుంది. సమయము పరివర్తనకు ఆధారము. పరివర్తన అయ్యేవారిపై అనగా ఎవరైతే పరివర్తన చేసేందుకు నిమిత్తులుగా ఉన్నారో వారు అన్నివేళలా మనసా వాచా కర్మణా పరివర్తన జరుగుతోంది అని అనుభవం చేసుకుంటున్నారా? దీనినే పైకి ఎక్కే కళ యొక్క పరివర్తన అని అంటారు. పరివర్తన అయితే ద్వాపర యుగంలో కూడా జరుగుతుంది, కాని అది దిగే కళ యొక్క పరివర్తన. కాని, ఇప్పుడు సంగమ యుగంలో పైకి ఎక్కే కళ యొక్క పరివర్తన జరుగుతుంది. కావున ఎప్పుడైతే సమయానుసారంగా కూడా పైకి ఎక్కే కళ యొక్క పరివర్తన ఇప్పుడు జరుగుతోందో మరి అప్పుడు ఎవరైతే నిమిత్త ఆధారమూర్తులుగా ఉన్నారో వారిలో కూడా తప్పకుండా అలాగే పరివర్తన జరుగుతుంది కదా! పరివర్తన అవుతోంది అని అనుభవం చేసుకుంటున్నారా? పరివర్తన యొక్క వేగమును ఎప్పుడైనా పరిశీలించారా? పరివర్తన ఒక్క వారం రోజుల్లో జరుగుతుంది, ఒక్క రోజులో జరుగుతుంది మరియు ఒక్క గంటలో కూడా జరుగుతుంది. అన్నింటినీ కలిపి పరివర్తన అని అంటారు. కాని, ఇప్పటి సమయానుసారంగా పరివర్తన యొక్క స్థితి ఎలా ఉండాలో అది అనుభవం చేసుకుంటున్నారా? ముఖ్యంగా నిమిత్తులై ఉన్న మహావీరులెవరైతే ఉన్నారో వారిలో ఏదైనా విషయంలో పరివర్తన తీసుకువచ్చేందుకు సమయం పడుతుందంటే మరి ఫైనల్ పరివర్తనలో కూడా తప్పకుండా సమయం పడుతుంది.

          నిమిత్తమై ఉన్న మహావీరులు సమయాన్ని సూచించే గడియారం వంటివారు. ఏ విధంగా గడియారము సమయమును స్పష్టముగా చూపిస్తుందో అదేవిధంగా ఎవరైతే మహావీరులుగా అవుతారో, ఎవరైతే నిమిత్తులుగా అయ్యారో వారు కూడా గడియారం వంటివారు. గడియారంలో సమయం సమీపంగా కనిపిస్తుందా లేక దూరంగా కనిపిస్తుందా? మీరు స్వయమే గడియారము. మరియు స్వయమే సాక్షిగా అయి సమయమును పరిశీలించేవారు. మరి పరివర్తన యొక్క ప్రగతి వేగంగా ఉందా? ఫైనల్ పరివర్తన ద్వారా సృష్టి యొక్క పరివర్తన కూడా జరగాలి. ఇప్పుడు మీలో కొద్దికొద్దిగా పరివర్తన జరుగుతోంది. కావున సృష్టి యొక్క పరిస్థితుల్లో కూడా కొద్ది కొద్దిగా పరివర్తన ఉంది. కాని ఫైనల్ సంపూర్ణ పరివర్తనకు గుర్తులు ఏమిటి? తద్వారా ఇది పరివర్తన యొక్క సంపూర్ణ స్థితి అని అర్థం చేసుకోగలగాలి.

          ఇప్పటి పరివర్తన యొక్క స్థితి, సంపూర్ణ పరివర్తన యొక్క చిహ్నాలు, సంవత్సరాలను లెక్కిస్తూ లెక్కిస్తూ ఇంక అసలు సమయమే ఏం మిగిలింది! పరివర్తన ఎలా ఉండాలంటే, వీరిలో పూర్తిగా పరివర్తన వచ్చేసింది అని అందరి నోటి నుండి వెలువడాలి. తమ పరివర్తన యొక్క విషయాన్ని అడుగుతారు. సదా కాలికంగా సహజ సిద్ధమైన రూపంలో కనిపించాలి. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు సహజ రూపంలో లేదు. ఇప్పుడు పరివర్తన ద్వారా కొద్ది సమయం కొరకు ఆ ప్రకాశము కనిపిస్తుంది. కాని, సహజసిద్ధ రూపము సదాకాలికంగా ఉంటుంది. కావున సంపూర్ణ పరివర్తనకు గుర్తు ఇదే. ప్రతి ఒక్కరిలో బలహీనత యొక్క మూలసంస్కారమేదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరూ తమది తాము తెలుసుకోగలరు. ఇప్పుడు కూడా కొందరు స్థితిలో సంపూర్ణంగా పాసవ్వలేదు, పర్సంటేజ్ లో పాసవుతారు. దీనికి కారణం ఇదే. కావున ప్రతి విషయంలోను ప్రతి ఒక్కరిలోను ఏ మూలసంస్కారమైతే ఉందో, దేనినైతే మీరు నేచర్ అని అంటారో అది కనిపించాలి. వీరి స్వభావము ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు అలా లేదు అని అనిపించాలి. పరస్పరంలో తమ మూలసంస్కారాల వర్ణనను కూడా చేస్తూ ఉంటారు. ఈ పురుషార్థంలో చాలా బాగున్నారు కాని ఈ సంస్కారము వీరిని సమయ ప్రతిసమయము ముందుకు వెళ్ళడంలో అవరోధము కలిగిస్తుంది. ఈ మూలసంస్కారాలలో ఎప్పటివరకైతే పరివర్తన జరుగదో అప్పటివరకు సంపూర్ణ విశ్వపరివర్తన జరుగజాలదు. అందరిలో పరివర్తన జరుగడమనేది వేరే విషయము. అదైతే నెంబర్ వారీగా రిజల్టులో కూడా జరుగుతుంది. కాని, పరివర్తన యొక్క మూల ఆధారమూర్తులెవరైతే ఉన్నారో, ఎవరినైతే మహావీరులు మరియు మహారథులు అని అంటారో వారి కొరకు ఈ పరివర్తన అవసరము. కావున వీరి ఈ సంస్కారాలు ప్రారంభం నుండే ఉన్నాయి అని ఎవ్వరూ వర్ణించకుండా ఉండేందుకు పర్సంటేజ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇది వర్ణన చేయడంలో రాకూడదు, కనిపించకూడదు, దీనినే సంపూర్ణ పరివర్తన అని అంటారు. కొద్దిగా అంశమాత్రము ఉన్నా, దానిని సంపూర్ణ పరివర్తన అని అనరు. సాధారణ పరివర్తనను గూర్చి మహారథులనైతే అడుగరు కదా! ఎవరైతే విశ్వపరివర్తన కొరకు నిమిత్తులుగా అయ్యారో వారి పరివర్తన యొక్క స్థితి కూడా ఉన్నతముగా ఉంటుంది. కావున ఈ చెకింగ్ జరగాలి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా కనిపించాలి. ఈ విషయం ఆధారం పైనే లక్కీ స్టార్స్ యొక్క గాయనము ఉంది. జ్ఞానసూర్యుడు మరియు జ్ఞానచంద్రుడు తమ తమ స్థానాలలో ఉన్నారు. కాని సంపూర్ణ పరివర్తనలో లక్కీ సితారల పేరు ప్రఖ్యాతమై ఉంది. వర్తమాన సమయంలో ఆకార రూపంలో అందరూ మిమ్మల్నే అనుసరిస్తారు కదా! బుద్ధియోగం ద్వారా శక్తిని తీసుకోవడము, బుద్ధి యోగం ద్వారా శ్రేష్ఠ కర్మలను అనుసరించడము అందుకు మాతాపితలు నిమిత్తులై ఉన్నారు. కాని, సాకార రూపంలో మీరు ఇప్పుడు ఎవరిని అనుసరిస్తారు? నిమిత్తులై ఉన్నావారిని. కావున పరివర్తన యొక్క ఇటువంటి ఉదాహరణగా అవ్వండి. సంవత్సరంలో ఒకటి, రెండుసార్లయినా ఇటువంటి సంగఠన జరగాలి. అన్నివేళలా సంగఠనలో తమ పైకి ఎక్కే కళ యొక్క పరివర్తన ఉంటుంది. ఏ విధంగా ఏ సంవత్సరమైతే గడిచిపోయిందో అందులో స్నేహము, సంపర్కము, సహయోగములలో పైకి ఎక్కే కళ మరియు పరివర్తన ఉన్నాయో అలా ఇప్పుడు సంపూర్ణ స్థితి ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఈ సంవత్సరంలో ఈ పరివర్తన విశేషరూపంగా ఉండడం అవసరము.

          ఇప్పుడు మెల్లమెల్లగా ప్రత్యక్షత కొరకు కావాలనే బాంబులను వేయడం ప్రారంభించారు కదా! ఎప్పుడైతే ధర్మయుద్ధపు స్టేజీ పైకి వస్తారో అప్పుడు మీరు ఒక్క విషయంలోనే ఓటమిని చవిచూపించగలరు. మీ ధర్మము మరియు ధారణ ప్రాక్టికల్ గా లేదు, మరియు పరమాత్మ యొక్క జ్ఞానపు ప్రత్యక్ష ప్రమాణము ప్రత్యక్ష జీవితము అని చెప్పండి. ఒకవైపు ధర్మయుద్ధపు స్థితి, ఇంకొకవైపు ప్రత్యక్ష ధారణామూర్త స్థితి, ఈ రెండింటి తోడూ లేకపోతే ప్రత్యక్ష జీవితం యొక్క మీ ప్రాక్టికల్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ప్రత్యక్ష రూపంలో కనిపించదు. ఎంతెంతగా ముందుకు వస్తూ ఉంటారో అంతంతగా ఈ విషయం పైన కూడా అటెన్షన్ ను ఉంచాలి. ప్రాక్టికల్ లో జ్ఞానము అనగా ధారణామూర్తులుగా, జ్ఞానమూర్తులుగా లేక గుణమూర్తులుగా ఉండడము. మూర్తి ద్వారా కూడా ఆ జ్ఞానము మరియు గుణాలు కనిపించాలి. ఈ రోజుల్లో డిస్కస్  చేయడం ద్వారా తమ మూర్తిని నిరూపించుకోలేరు. కాని, ఆ మూర్తి ద్వారా వారిని ఒక్క క్షణంలో శాంతింపజేయగల్గుతారు. ఒకవైపు భాషణ ఉండాలి మరియు ఇంకొకవైపు ప్రత్యక్ష మూర్తి కూడా ఉండాలి. అప్పుడే ధర్మయుద్ధంలో సక్సెస్ ఫుల్ గా అవుతారు కావున ఏ విధంగా సేవ యొక్క కార్యక్రమాలను తయారుచేస్తారో అలాగే వాటితో పాటు మీ కార్యక్రమంలో కూడా అభివృద్ధి చెందండి. ఇది జరగడం కూడా అవసరమే. తమ పురుషార్థం యొక్క అభివృద్ధిలో తమ తమ పురుషార్థపు భిన్న భిన్న అనుభవాలను ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం కూడా తోడుగా జరగాలి. రెండింటి యొక్క బ్యాలెన్సు కలిసి ఉండాలి. అచ్ఛా!

Comments