* 11-03-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పరిస్థితులను దాటేందుకు సాధనము స్వస్థితి."
వ్యక్తములో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసము ఇప్పుడు సహజమైపోయింది. ఎప్పుడు ఎక్కడ మీ బుద్ధిని పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి. ఈ అభ్యాసమును పెంచుకొనేందు కొరకు మీ ఇంటికి లేక భట్టీకి వస్తారు. కావున ఇక్కడి కొద్ది సమయపు అనుభవమును సదాకాలము ఉంచుకునేందుకు ప్రయత్నము చెయ్యాలి. ఏవిధంగా ఇక్కడ భట్టిలో మరియు మధువనములో నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని అవ్యక్త ఫరిస్తాగా భావిస్తారో అలా కర్మక్షేత్రము మరియు సేవా స్థానములో కూడా ఈ అభ్యాసమును మీతోటే ఉంచుకోవాలి. ఒకసారి చేసి ఉన్న అనుభవమును ఎక్కడైనా గుర్తు చేసుకోగలరు. కావున ఇక్కడి అనుభవమును అక్కడ కూడా గుర్తు ఉంచుకోవటం ద్వారా మరియు ఇక్కడి స్థితిలో అక్కడ కూడా స్థితి అవ్వటంతో బుద్ధికి అలవాటై పోతుంది. ఏవిధంగా లౌకిక జీవితంలో కోరుకోకపోయినా కూడా అలవాటు తన వైపుకు ఎలా లాగేస్తుందో అలాగే అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అలవాటు తయారైన తరువాత ఈ అలవాటు స్వతహాగనే తనవైపుకు లాగేస్తుంది. ఇంత పురుషార్థము చేస్తూ కూడా చాలామంది ఆత్మలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు కూడా ఇది నా అలవాటు అనే అంటుంటారు. బలహీనత ఎందుకు, ఎందుకు క్రోధము చేసారు, కోమలంగా ఎందుకు తయారయ్యారు? నా అలవాటు అని అంటారు. ఇటువంటి జవాబును ఇప్పుడు కూడా ఇస్తుంటారు. కావున అలాగే ఈ స్థితి మరియు ఈ అభ్యాసము అలవాటు అయిపోయినట్లయితే అప్పుడిక అనుకోకపోయినా కూడా ఈ అవ్యక్త స్థితిలో ఉండే అలవాటు తనవైపుకు ఆకర్షితము చేస్తుంది. ఈ అలవాటు మిమ్మల్ని ధర్మరాజు వద్దకు వెళ్ళటం నుండి రక్షిస్తుంది. అర్ధమైందా! చెడ్డ చెడ్డ అలవాట్లను నేర్చుకోగలిగినప్పుడు మరి ఈ అలవాటును నేర్చుకోలేరా? ఏ విషయమునైనా రెండు, నాలుగుసార్లు ప్రాక్టికల్ లోకి తెచ్చినట్లయితే ప్రాక్టికల్ లోకి తీసుకురావటం ద్వారా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇక్కడ ఈ భట్టిలో లేక మధువనములో ఈ అభ్యాసమును ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారు కదా! ఎప్పుడైతే ఇక్కడ ప్రాక్టికల్ లోకి తెస్తారో మరియు ప్రాక్టీస్ అయిపోయినట్లయితే ప్రాక్టీస్ చేసిన విషయము ఎలా అయిపోవాలి? నేచురల్ మరియు నేచర్ గా అయిపోవాలి. ఇది నా నేచర్ అని అంటారు కదా! కావున ఈ అభ్యాసము ప్రాక్టీస్ ద్వారా నేచర్ గా మరియు నాచురల్(సహజము)గా అయిపోవాలి. ఈ స్థితి నేచర్ గా అయిపోయినట్లయితే ఇక ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. మీ నేచర్ గా తయారవ్వకపోవటం వలన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఎదుర్కొనేవారు తమ స్వస్థితి ద్వారా ఆ పరిస్థితులను దాటివేయలేకపోయినట్లయితే ఇక ఆ పరిస్థితులు ఎలా వస్తాయి? ఎదుర్కొనేవారు ఇప్పుడు తయారుగా లేరు, కావుననే ఈ పరదా తెరుచుకోవటంలో ఆలస్యము జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఈ పాత ఆలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి, పాత ప్రపంచము నుండి, పాత దేహ సంబంధాల నుండి వైరాగ్యము కలగలేదు. ఎక్కడికైనా వెళ్ళేది ఉన్నప్పుడు ఏ వస్తువులనైతే వదలవలసి ఉంటుందో వాటి నుండి వెనుతిరగ వలసి ఉంటుంది. ఇప్పటివరకు వెనుతిరగటము రాలేదు. ఒకటేమో వెనుతిరగటం లేదు, రెండోది ఏ సాధనమయితే లభిస్తుందో దానిని ఉపయోగించడం లేదు. సీత మరియు రావణుని బొమ్మలు చూసారు కదా! రావణుని వైపు ఉన్నప్పుడు సీత ఏం చేస్తుంది? వెనక్కు తిరుగుతుంది కదా! ఒకవేళ వెనక్కు తిరిగినట్లయితే సహజంగానే దాని ఆకర్షణ నుండి రక్షింపబడతారు. కానీ వెనక్కు తిరగరు! ఏవిధంగా స్మశానవాటికకు సమీపంగా వచ్చినప్పుడు కాళ్ళు ఈవైపుకు మరియు ముఖాన్ని ఆవైపుకు తిప్పుతారు కదా! కావున ఇది కూడా అంతే, వెనక్కు తిరగటము రాదు. మళ్ళీ ముఖాన్ని ఆవైపుకు తిప్పుకుంటారు కనుకనే ఆకర్షణలో ఇరుక్కుపోతారు. కావున రెండు రకాలుగా వెనుకకు తిరగటము రాదా? మాయ చాలా ఆకర్షించే రూపాన్ని రచిస్తుంది, కనుకనే కోరుకోకపోయినా కూడా వెనుతిరిగేందుకు బదులుగా ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఆ ఆకర్షణలో పురుషార్థమును మరిచి, ఉన్నతిని మరిచి ఆగిపోతారు కూడా, అప్పుడిక ఏమౌతుంది? గమ్యమును చేరుకోవటములో ఆలస్యమైపోతుంది. కుమారుల భట్టీ కదా! కుమారులు ఈ బొమ్మను ఎదురుగా ఉంచుకోవాలి. మాయ వైపుకు ముఖాన్ని త్రిప్పుకుంటారు. మాయ వైపుకు ముఖాన్ని త్రిప్పుకోవటం ద్వారా మాయతరపు నుండి ఏ పరీక్షలైతే వస్తాయో వాటిని ఎదుర్కోలేరు. ఒకవేళ ఆ వైపుకు ముఖాన్ని త్రిప్పుకోనట్లయితే మాయ పరిస్థితులను ఎదుర్కోగలరు. అర్ధమైందా!
సదా ప్యూర్ గా మరియు సతోగుణీగా ఉండే కుమారుల స్మృతిచిహ్నము ఏది, తెలుసా? సనంతకుమార్, అతని విశేషతగా దేనిని చూపిస్తారు? అతనిని ఎల్లప్పుడూ చిన్న కుమారుని రూపముగానే చూపిస్తారు. అతడికి ఎల్లప్పుడూ 5 సంవత్సరాల వయసే ఉంటుంది అని అంటారు. ఇది పవిత్రతకు గాయనము. ఏవిధంగా 5 సంవత్సరాల పిల్లవాడు పూర్తి ప్యూర్ గా ఉంటాడో, సంబంధాల ఆకర్షణ నుండి దూరంగా ఉంటాడో, అలా లౌకిక పరివారము ఎంత ఉన్నాగానీ స్థితి మాత్రం చిన్న పిల్లవాడు పవిత్రముగా ఉన్నట్లుగా ఉంటుంది. అలాగే ప్యూరిటీకి ఇది స్మృతిచిహ్నము. కుమార్ అనగా పవిత్ర అవస్థ, అందులో కూడా కేవలము ఒక్కరిని కాకుండా సంగఠనను చూపించారు. ఉదాహరణగా అయితే కొంతనే చూపించటం జరుగుతుంది. కావున మీ ఈ సంగఠన ప్యూరిటీకి స్మృతిచిహ్నము. ఎటువంటి ప్యూరిటీ ఉంటుందంటే, అందులో అపవిత్రతా సంకల్పము లేక అనుభవమే ఉండదు. ఇటువంటి స్థితిని స్మృతి చిహ్న సమానంగా తయారుచేసుకొని వెళ్ళాలి. అందుకొరకే భట్టీలోకి వచ్చారు కదా! ఈ ప్రపంచ విషయాల నుండి, సంబంధము నుండి పూర్తిగా అతీతంగా అవుతారు అప్పుడే దైవీ పరివారానికి, బాప్ దాదాకు మరియు మొత్తము ప్రపంచమునకే ప్రియమైనవారుగా అవుతారు. మామూలుగా కూడా ఎవరైనా సంబంధీకుల నుండి దూరమైనా, లౌకికి రీతిగా కూడా వేరైనా , దూరమైన తరువాత అప్పుడు ఎక్కువ ప్రియమైన వారిగా ఉంటారు. మరియు ఒకవేళ వారితోటి ఉంటూ లేక వారి సంబంధాల ఆకర్షణలో ఉన్నప్పుడు అంత ప్రియమైన వారిగా ఉండరు. అది లౌకికము. కానీ ఇక్కడ జ్ఞాన సహితంగా అతీతముగా అవ్వాలి. కేవలము బయట నుండి అతీతంగా అవ్వటం కాదు, మనస్సు యొక్క ఆకర్షణ కూడా ఉండకూడదు. ఎంతెంతగా అతీతంగా అవుతారో అంతంతగానే తప్పక ప్రియంగా అవుతారు. ఇప్పుడు మీరు మీ దేహము నుండి కూడా అతీతంగా అయినట్లయితే ఆ అతీతత్వపు అవస్థ మీకు మీకే ప్రియమనిపిస్తుంది, ఇటువంటి అనుభవమును ఎప్పుడైనా చేసారా? మీ అతీతత్వపు స్థితి మీకు కూడా ప్రియంగా అనిపించినప్పుడు లగావ్ (ఆకర్షణ)నుండి అతీత స్థితి ప్రియంగా అనిపించదా? ఏ రోజైతే దేహముపై ఆకర్షణ ఉంటుందో, అతీతత్వము ఉండదో అప్పుడు మీకు మీరే ప్రియంగా అనిపించరు, వ్యాకులత చెందుతారు. అలాగే బయటి ఆకర్షణల నుండి ఒకవేళ అతీతంగా అవ్వనట్లయితే ప్రియంగా అవ్వడానికి బదులుగా కలత చెందుతారు. ఈ అనుభవమైతే అందరికీ ఉంటుంది. కేవలము ఇటువంటి అనుభవము సదాకాలముగా తయారుచేసుకోలేరు. ఈ అతీతము మరియు ప్రియత్వములను అనుభవము చెయ్యనటువంటివారు ఎవరైనా ఉన్నారా? స్వయాన్ని యోగి అని చెప్పుకుంటారు, మిమ్మల్ని మీరు సహజ రాజయోగి అని చెప్పుకున్నప్పుడు ఈ అనుభవము చేసుకోలేదు అన్నది ఉండజాలదు. లేదంటే ఈ టైటిల్ ను మీకు మీరు ఇవ్వజాలరు. యోగి అనగా ఈ యోగ్యత ఉంటుంది, అప్పుడే యోగులు. లేకపోయినట్లయితే మీ పరిచయములో మేము సహజ రాజయోగమును చదువుకొనే విద్యార్థులము అన్న మాటను చెప్పుకోలేరు. మీరైతే విద్యార్థులు కదా! విద్యార్థులకు చదువు అనుభవము లేకపోవడమనేది ఉండజాలదు. ఈ అనుభవమును ఎంతవరకు సదాకాలము తయారుచేసుకోగలరు మరియు అల్పకాలపు అనుభవమును ఎంతవరకు చేసుకోగలరు అన్నది తప్పనిసరి. ఈ తేడా ఉండగలదు. కానీ పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి అనుభవము అల్పకాలముగా ఉండకూడదు. ఒకవేళ ఇప్పటివరకు అల్పకాలపు అనుభవమే ఉన్నట్లయితే ఏమౌతుంది? సంగమయుగపు వారసత్వము మరియు భవిష్య వారసత్వము రెండూ కూడా అల్పకాలమే ప్రాప్తిస్తాయి. అర్థమైందా! ఏదైతే పూర్తి సమయము వారసత్వము తీసుకొనేది ఉందో దానిని తీసుకోలేరు. అల్పకాలమే చేస్తారు. మరి ఇందులోనే సంతుష్టమౌతారా?
ఈ రోజు కుమారుల భట్టీ ప్రారంభము కదా! భట్టీ ప్రారంభము అనగా పరిపక్వమునకు ఆరంభము కొందరు స్వాహా అవుతారు, కొందరు భట్టీలో పక్వమౌతారు, కొందరు పవిత్రత యొక్క సంకల్పాన్ని దృఢంగా చేస్తారు. ఇక్కడ చెయ్యటానికే వచ్చారు కదా! ఏది చెప్పారో దానిని చేసారా అన్నదానిని ఇప్పుడు చూడాలి. ఈ గ్రూపులోని వారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా మాయ అంటే ఏమిటో కూడా తెలియనట్లుగా ఇన్నోసెంట్ గా మరియు జ్ఞానముతో సెంట్ గా అయ్యి వెళ్ళాలి. సత్యయుగ ఆత్మలు ఇక్కడకు వచ్చినప్పుడు వికారీ విషయాల జ్ఞానము నుండి ఇన్నోసెంట్ గా ఉంటారు. చూసారు కదా! ఆత్మలమైన మేము సత్యయుగములో ఉన్నప్పుడు ఎలా ఉండేవారము అని మీకు స్మృతి వస్తుందా? మాయా జ్ఞానము నుండి ఇన్నోసెంట్ గా ఉండేవారు. గుర్తొస్తుందా? మీ ఆ సంస్కారము గుర్తుకు వస్తోందా లేక విన్నారు కాబట్టి అలా అనుకుంటున్నారా? ఈ జన్మలోని మీ చిన్ననాటి విషయాలు ఏవిధంగా స్పష్టంగా గుర్తుకు వస్తాయో, ఆవిధంగానే నిన్నటి మీ సంస్కారమేదైతే ఉండేదో, నిన్నటి ఆ సంస్కారము నేటి జీవనములో సంస్కారాల సమానంగా స్పష్టంగా స్మృతిలోకి వస్తాయా లేక స్మృతిలోకి తీసుకురావలసి వస్తుందా? సత్యయుగ సంస్కారాలు అలాగే స్పష్టంగా మా స్మృతిలోకి వస్తాయి అని ఎవరైతే భావిస్తారో వారు చేతులెత్తండి. ఇది స్పష్టంగా స్మృతిలోకి రావాలి. సాకారరూపములో స్పష్టమైన స్మృతి ఉండేది కదా. ఎప్పుడైతే మీ ఆత్మిక స్వరూపపు స్మృతి స్పష్టముగా మరియు సదాకాలికముగా ఉంటుందో అప్పుడే ఈ స్మృతి ఉంటుంది. అప్పుడిక ఈ స్మృతి కూడా స్పష్టముగా మరియు సదాకాలముగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మికస్థితి యొక్క స్మృతి అప్పుడప్పుడు దేహమనే పరదా లోపల దాక్కొంటుంది కావున ఈ స్మృతి కూడా పరదా లోపల కనిపిస్తుంది, స్పష్టంగా కనిపించటం లేదు. ఆత్మిక స్మృతి స్పష్టముగా మరియు బహుకాలము ఉండటం ద్వారా మీ భవిష్య వారసత్వము లేక మీ భవిష్య సంస్కారము స్వరూపములో ఎదురుగా వస్తుంది. మీరు చిత్రములో ఏం చూపించారు? ఒకవైపు వికారాలు పరుగెడుతాయి, మరొకవైపు బుద్ధి యొక్క స్మృతి తండ్రి మరియు భవిష్య ప్రాప్తి వైపుకు ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూపించారు కదా, ఈ చిత్రాన్ని ఎందుకొరకు తయారుచేసారు? ఇతరుల కొరకా లేక మీ స్థితి కొరకా? కావున భవిష్య సంస్కారాలను స్పష్టముగా సృతిలోకి తీసుకువచ్చేందుకు ఆత్మిక స్వరూపపు స్మృతి సదాకాలముగా మరియు స్పష్టముగా ఉండాలి. ఏవిధంగా ఈ దేహము స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మ స్వరూపము అంత స్పష్టంగా కనిపించాలి, అనగా అనుభవములోకి రావాలి. మరి ఇప్పుడు కుమారులు ఏం చెయ్యాలి?సెంట్‌గా కూడా అవ్వాలి, ఇన్నోసెంట్ గా కూడా అవ్వాలి. ఇది సహజమైన చదువు కదా! రెండు మాటలలో మీ పూర్తి కోర్స్ అయిపోతుంది. ఈ ముద్రను వేయించుకొని వెళ్ళాలి. బలహీనత, వ్యాకులత మొదలగు ఈ విషయాల నుండి పూర్తిగా ఇన్నోసెంట్ గా ఉండాలి, బలహీనత అన్న మాట కూడా సమాప్తమైపోవాలి. ఈ గ్రూపు పేరేంటి సింప్లిసిటీ(నిరాడంబరత) మరియు పవిత్రతలో ఉండే గ్రూపు. ఎవరైతే సింపుల్ గా ఉంటారో వారే బ్యూటిఫుల్ (అందం)గా ఉంటారు సింప్లిసిటీ అన్నది కేవలము డ్రెస్ విషయంలోనే కాదు, కానీ అన్ని విషయాలలో సింప్లిసిటీ ఉండాలి. నిరహంకారిగా అవ్వటము అనగా సింపుల్ గా అవ్వటము. క్రోధము లేనివారు అనగా సింపుల్. నిర్లోభి అనగా సింపుల్. ఈ సింప్లిసిటీయే ప్యూరిటీకి సాధనము. అచ్ఛా, ఏ స్లోగన్ ను గుర్తు ఉంచుకుంటారు? కుమారులు ఏది అనుకుంటే అది చెయ్యగలరు. ఏ విషయాలను చెప్పినా వాటిని “మొదట చేస్తాము, చూపిస్తాము, తరువాత చెప్తాము...” మొదట చెప్తాను కాదు. మొదట చేస్తాము, చూపిస్తాము, తరువాత చెప్తాము. ఈ స్లోగన్ ను గుర్తు ఉంచుకోవాలి. అచ్ఛా!
Comments
Post a Comment