11-02-1975 అవ్యక్త మురళి

11-02-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మాయతో యుద్ధం చేసే పాండవుల కొరకు ధారణలు.

         పాండవుల కొరకు కల్పపూర్వపు మహిమ ఏదైతే ఉందో ఆ విశేషతలన్నింటినీ వర్తమాన సమయంలోని జీవితంలో అనుభవం అవుతున్నాయా? పాండవులు పర్వతాలపైకి వెళ్ళి స్వయాన్ని కరిగించుకున్నారు అనే మహిమ ఉంటుంది. దీని యొక్క రహస్యం ఏమిటి? ఏ విషయంలో కరిగారు. సూక్ష్మ విషయానికే స్థూల రూపంలో స్మృతిచిహ్నం ఉంటుంది. చైతన్యానికి స్మృతిచిహ్నం స్థూలంలో ఎలా ఉంటుందో అదేవిధంగా సూక్ష్మాన్ని స్పష్టం చేసేటందుకు ఉదాహరణ ఇస్తారు. స్వయాన్ని సఫలతామూర్తిగా తయారు చేసుకునేటందుకు నిమిత్త పురుషార్థీల పురుషార్థంలో ఏవైతే విఘ్నాలు ఎదురుగా వస్తాయో ఆ విఘ్నాల కారణంగానే స్వయాన్ని సఫలతా మూర్తులుగా తయారు చేసుకోలేరు. లేదా మాటిమాటికి ఆ స్వభావం లేదా సంస్కారం కారణంగానే అసఫలత వస్తుంది. దానినే నిజ సంస్కారం లేదా స్వభావం అని అంటారు. అలాంటి నిజ సంస్కారాలను కరిగించాలి. అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. అది చూసి మీ సంప్రదింపుల్లోకి వచ్చినవారు స్వయాన్ని పరివర్తన చేసుకున్నారని అనుభవం చేసుకోవాలి. దీనిలోనే సఫలత ఉంది. డ్రామానుసారం సహజ యోగి, శ్రేష్ఠ యోగి మరియు సఫలతామూర్తులుగా అయ్యేటందుకు ఎన్ని సాధనాలైతే లభించాయో అంతగానే ఫలితం చూపించారా? వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. దానికి బదులుగా వాతావరణాన్ని శక్తిశాలిగా తయారుచేయటంలో సహయోగి అవ్వటంలో ఫలితం చూపండి. దాంతో పాటు శ్రేష్ఠ సాంగత్యం అనే సాధనం కూడా లభించింది. ఏ ఆత్మలైతే తమ భాగ్యాన్ని పొందడానికి వస్తారో వారికి కూడా మీ సాంగత్యం యొక్క శ్రేష్ఠత అనుభవం అవ్వాలి. ఇదే బదులివ్వడం. అందరూ అనుభవం చేసుకోవాలి, ఈ ఆత్మలందరూ సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నారని. ఆత్మిక సాంగత్యం మరియు మీ చరిత్రల ద్వారానే శ్రేష్ఠముగా అవుతారు. మీ కర్మయోగి స్థితి ద్వారా మరియు మీ గుణమూర్తి స్వరూపం ద్వారా వచ్చేటటువంటి ఆత్మలకు ఉదాహరణగా అయ్యి వారు సహజంగా ప్రాప్తి పొందేవంటి సాధనంగా అవ్వండి. ప్రత్యక్ష, సాకార స్వరూపం యొక్క మీ ఉదాహరణ చూసి వారిలో కూడా విశేష ఉత్సాహం, ఉల్లాసాలు కలగాలి. ప్రతి కార్యంలో ప్రతి ప్రత్యక్ష ఉదాహరణలో మొదట నేను ఉదాహరణ అవ్వాలి. ప్రతి విషయానికి మేమే శాంపిల్ అని భావించాలి. ఎప్పుడైతే ఇలాంటి లక్ష్యం పెట్టుకుంటారో అప్పుడే పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోగలరు. విశ్రాంతి సాధనాలు ప్రాప్తించాయి, కానీ విశ్రాంతికి ఇష్టమైనవారిగా కాకూడదు. పురుషార్థంలో కూడా విశ్రాంతికి ఇష్టమైనవారిగా అంటే సోమరిగా కాకూడదు. విశ్రాంతి సాధనాలతో లాభం పొందుతూ అవి సదాకాలిక ప్రాప్తి పొందడంలో విఘ్నంలా కాకూడదు. ఈ ధ్యాస అవసరం. ఒకవేళ ఏ విధమైన సిద్ది లేదా ప్రాప్తిని స్వీకరించారంటే అక్కడ తక్కువ అయిపోతుంది. సాధనాలు లభించినా కానీ వాటిని త్యాగం చేయండి. ప్రాప్తించినా కానీ త్యాగం చేయడాన్ని త్యాగం అంటారు. అవి లేకుండా వాటిని త్యాగం చేశాము అంటే అది శ్రమ అయింది తప్ప త్యాగం కాదు. ఇంత ధ్యాస  స్వయంపై పెట్టుకుంటున్నారా లేదా సహజ యోగి అనగా సహజ సాధనాల ద్వారా యోగిగా అవ్వడం అని అనుకుంటున్నారా? ప్రతి విషయంలో ధ్యాస తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఫలితం పొందేస్తే ఇకముందు కోసం కట్ అయిపోతుంది, అనగా సమాప్తి అయిపోతుంది. మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అనేది ఎప్పుడూ పరిశీలించుకోవాలి. మంచిది.

Comments