10-09-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
జ్ఞాన సాగరులు మరియు శక్తిశాలి ఆత్మలే సఫలతా మూర్తులు.
జ్ఞానసాగరులు, శక్తిసాగరులు, సదా జాగృతి జ్యోతి, అలసిపోని సేవాధారులైన పిల్లలను నిద్రాజిత్ గా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు --
సదా ప్రతి స్థితిలో మాష్టర్ జ్ఞాన సాగరులుగా, శక్తిశాలిగా మరియు సఫలతా మూర్తులుగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే జ్ఞాన సాగరులు మరియు శక్తిశాలి ఆత్మ ఫలితమే సఫలతా మూర్తి. వర్తమాన సమయంలో స్మృతి అనగా శక్తిశాలి మరియు జ్ఞానము అనగా జ్ఞానసాగరులుగా అవ్వడం. ఈ రెండు స్థితుల యొక్క ఉద్దేశ్యం సఫలతామూర్తులుగా అవ్వడం. దీనినే ప్రత్యక్షఫలం అని అంటారు. ఈ సమయం యొక్క ప్రత్యక్షఫలం మీ భవిష్య ఫలాన్ని ప్రఖ్యాతి చేస్తుంది. భవిష్యఫలం ఆధారంగా ఇప్పటి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకోవడం నుండి వంచితులుగా ఉండకూడదు. వర్తమానంలో ఏమి కనిపించదు, లేదా ప్రాప్తించదు. ఈ చదువే భవిష్యత్తు కొరకు అని ఎప్పుడూ భావించకండి. నా భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఇప్పుడు నేను గుప్తంగా ఉన్నాను, అంతిమంలో ప్రఖ్యాతి అవుతాను అనుకోకండి. ఎందుకంటే భవిష్య మెరుపు, భవిష్య ప్రాలబ్దం లేదా అంతిమసమయంలో ప్రసిద్ధమయ్యే ఆత్మ యొక్క మెరుపు ఇప్పటి నుండే సర్వులకు అనుభవం అవ్వాలి. అందువలన మొదట ప్రత్యక్షఫలం మరియు దానితో పాటు భవిష్య ఫలం, ప్రత్యక్ష ఫలం లేకుంటే భవిష్యఫలం కూడా లేదు. స్వయాన్ని స్వయం ప్రత్యక్షం చేసుకోలేకపోయినా కానీ, వారి సంప్రదింపులు, స్నేహం మరియు సహయోగంతో వారిని స్వతహాగానే ప్రసిద్ధం చేసేస్తుంది. ఏ రకంగానైనా స్వయాన్ని సిద్ధి చేసుకునేవారు ఎప్పుడూ కూడా ప్రసిద్దికాలేరు, ఇది ఈశ్వరీయ నియమం. అందువలన నా గురించి నాకు తెలుసు, నేను సరిగ్గానే ఉన్నాను, ఇతరులు తెలుసుకోకపోయినా లేదా ఇతరులు గ్రహించకపోయినా, ఆఖరికి గ్రహిస్తారు లేదా ఇకముందు ఏమి జరుగుతుందో చూడండి, ఈ సంకల్పాలు కూడా ఙ్ఞాన స్వరూప, స్మృతి స్వరూప ఆత్మ కొరకు స్వయాన్ని మోసగించే సోమరితనం యొక్క మధురమైన నిద్ర. ఇలాంటి అల్పకాలిక విశ్రాంతినిచ్చే, అల్పకాలికంగా మనసుకు భరోసా ఇచ్చే మాయా నిద్రలు అనేక రకాలున్నాయి. ఏ విషయంలో అయినా మీ ప్రాలబ్దాన్ని లేదా ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తిని కోల్పోతున్నారంటే తప్పకుండా ఇలాంటి అనేక రకాలైన నిద్రలో నిద్రపోతున్నట్టే. కనుకనే నిద్రపోయినవారు పోగొట్టుకున్నారు అని అంటారు. పోగొట్టుకోవడమే నిద్రపోవడం. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా సమయానికి సఫలతను పొందలేరు అనగా సఫలతామూర్తి కాలేరు. కల్పం అంతటిలో కేవలం సంగమయుగానికే డ్రామా ప్లాన్ అనుసారంగా ఒక వరదానం ఉంది. అది ఏమిటి? సంగమ యుగానికి ఏమి వరదానం ఉంది? ప్రత్యక్ష ఫలం యొక్క వరదానం. ఇది కేవలం సంగమయుగానిదే. ఇప్పుడిప్పుడే ఇవ్వడం, ఇప్పుడిప్పుడే పొందడం. మొదట చూస్తారు.తరువాత చేస్తారు, పక్కా వ్యాపారస్తులు. సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే ఈ యుగంలోనే బాబా కూడా ప్రత్యక్షం అవుతారు, ఉన్నతోన్నత బ్రాహ్మణులు కూడా ప్రత్యక్షం అవుతారు. మీ అందరి 84 జన్మల కథ కూడా ప్రత్యక్షం అవుతుంది. శ్రేష్ఠ జ్ఞానం కూడా ప్రత్యక్షం అవుతుంది. ఈ కారణంగానే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ప్రత్యక్షఫలం పొందే సమయంలో భవిష్యఫలం గురించి ఆలోచిస్తుంటే అలాంటి ఆత్మను ఏమంటారు? ఆ ఆత్మను మాస్టర్ జ్ఞాన సాగరులు అంటారా లేక ఇది కూడా ఒక అజ్ఞానమేనా? ఏ రకమైన అజ్ఞానమైనా కానీ అజ్ఞానాన్ని నిద్ర అని అంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఏ రకమైన అజ్ఞాన నిద్రలో నిద్రపోలేదు కదా? సదా జాగృతి జ్యోతిగా అయ్యారా? మెలుకవగా ఉన్నదానికి గుర్తు ఏమిటంటే మేల్కొని ఉండడం అంటే పొందటం. సర్వప్రాప్తులు చేసుకునే సదా జాగృతి జ్యోతులేనా, సదా జాగృతి జ్యోతిగా అయ్యేటందుకు ముఖ్యమైన ధారణ ఏమిటో తెలుసా?సాకార బాబాలో అది విశేషంగా ఉండేది, ఏమిటో చెప్పండి, సాకార బాబా యొక్క విశేష ధారణ ఏమిటి? జాగృతి జ్యోతిగా అయ్యేటందుకు ముఖ్య ధారణ అలసిపోనివారిగా అవ్వడం. అలసిపోతే నిద్ర వచ్చేస్తుంది, సాకార తండ్రిలో అలసిపోని స్థితి యొక్క విశేషతను సదా అనుభవం చేసుకున్నారు.తండ్రిని అనుసరించేవారే సదా జాగృతి జ్యోతిగా అవుతారు. నడుస్తూ నడుస్తూ ఏ రకమైన అలసట లేదా అజ్ఞాన నిద్ర నన్ను నిద్రింపచేయడం లేదు కదా? అందువలనే కల్పపూర్వం యొక్క స్మృతిచిహ్నంలో కూడా నిద్రజీత్ గా అయ్యే విశేష గుణం గురించి గాయనం చేయబడింది. అనేక రకాలైన నిద్రల నుండి నిద్రజీత్ గా అవ్వండి. ఏయే రకాలైన నిద్ర, నిద్రాజీత్ అవ్వనివ్వడం లేదో ఆ జాబితా తీయాలి. ఆ నిద్రకు గుర్తు ఆవలింతలు మరియు అజ్ఞాన నిద్రకు గుర్తు ఉదాసీనత. ఈవిధంగా గుర్తులను తీయండి. ముఖ్యంగా రెండు విషయాలు 1) సోమరితనం 2)నిర్లక్ష్యం. మొదట ఈ గుర్తులు వస్తాయి. తరువాత నిద్రమత్తు ఎక్కుతుంది. అందువలన దీని గురించి మంచిగా పరిశీలించుకోవాలి, పరిశీలించుకోవడంతో పాటు పరివర్తన చేసుకోవాలి. కేవలం పరిశీలించుకోవడం కాదు, పరిశీలన మరియు పరివర్తన రెండూ చేయాలి. అర్థమైందా! మంచిది.
ఈవిధంగా స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేసేవారికి, బాబా సమానంగా సదా అలసిపోనివారికి, ప్రతి సంకల్పం మాట మరియు కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం అనుభవం చేసుకునే వారికి, సర్వ ప్రాప్తి స్వరూప విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment