10-06-1972 అవ్యక్త మురళి

* 10-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము


సూక్ష్మఅభిమానం మరియు తెలియనితనము.

వర్తమాన సమయంలో నలువైపులా ఉన్న పురుషార్ధుల పురుషార్థములో ముఖ్యంగా రెండు విషయాల బలహీనత లేక లోటు కనిపిస్తోంది. ఆ లోటు కారణంగా ఏ అద్భుతమునైతే చూపించాలో దాన్ని చూపించలేకపోతున్నారు. ఆ రెండు లోపాలు ఏమిటి? ఒకవైపు అభిమానం, ఇంకొకవైపు తెలియనితనము. ఈ రెండు విషయాలు పురుషార్థమును ఢీలా చేసేస్తున్నాయి. అభిమానం కూడా చాలా సూక్ష్మమైనది. అభిమానము కారణంగా ఎవరైనా కొద్దిగా అయినా తమ ఉన్నతి కొరకు సూచనను ఇస్తే, సూక్ష్మముగా సహించుకోలేని అల వచ్చేస్తుంది లేక వీరు ఇలా ఎందుకు అన్నారు అన్న సంకల్పము లేక అల మనసులోకి వచ్చేస్తుంది. దీనిని కూడా సూక్ష్మరూపంలోని అభిమానము అనే అంటారు. ఎవరైనా మనకు ఏదైనా సూచనను చేస్తే ఆ సూచనను వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటి ఉన్నతికి సాధనంగా భావిస్తూ ఆ సూచనను ఇముడ్చుకొనే లేక స్వయములో సహించుకునే శక్తిని నింపుకొనే అభ్యాసము ఉండాలి. సూక్ష్మములోనైనా వృత్తి లేక దృష్టిలో అలజడి కలుగుతూ, ఎందుకు, ఎలా జరిగింది... అన్న అలజడి కలుగుతున్నా దీనిని కూడా దేహీ అభిమాని స్థితి అని అనరు. ఏ విధంగా మహిమ వినే సమయంలో వృత్తి లేక దృష్టిలో ఆ ఆత్మపట్ల స్నేహభావన ఉంటుందో, అలాగే ఎవరైనా శిక్షణతో కూడిన సూచనను చేస్తే అందులో కూడా ఆ ఆత్మపట్ల కూడా - ఈ ఆత్మ కూడా నాకు చాలా, చాలా శుభచింతక ఆత్మ అనే అటువంటి స్నేహముతో కూడిన శుభచింతక భావన ఉంటుంది. ఇటువంటి స్థితినే దేహీ అభిమాని స్థితి అని అంటారు. దేహీఅభిమానము లేకపోతే దానిని వేరే పదాలలో దేహాభిమానము అనే అంటారు. కావున వారు అవమానమును సహించుకోలేరు, ఇంకొకవైపు పూర్తిగా ఏమిటో కూడా తెలియనివారు... ఈ కారణంగా కూడా అనేక విషయాలలో మోసపోతూ ఉంటారు. కొందరు స్వయమును రక్షించుకునేందుకు కూడా తెలియనివారిగా అయిపోతారు, మరికొందరు నిజముగానే తెలియనివారిగా అయిపోతారు. కావున ఈ రెండు విషయాలకు బదులుగా దేనిద్వారానైతే అభిమానము పూర్తిగా అంతమైపోతుందో ఆ స్వమానము, మరియు నిర్మాణము ఈ రెండు విషయాలను ధారణ చేయాలి. మనస్సులో స్వమానపు స్మృతి ఉండాలి మరియు వాచాలో, కర్మణాలో నిర్మాణ చిత్త స్థితి ఉండాలి, అప్పుడు అభిమానము అంతమైపోతుంది. ఫిలాసఫర్ గా అయిపోయారు కానీ స్పిరుచ్యువల్ గా అవ్వలేదు అనగా ఆ స్పిరిట్ రాలేదు. కావున ఎవరైతే ఆత్మిక స్థితిలో, ఆత్మిక సంతోషంలో ఉంటారో వారిని స్పిరిచ్యువల్ అని అంటారు. ఈ రోజుల్లో ఫిలాసఫర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు, స్పిరుచ్యువల్ శక్తి తక్కువగా ఉంటోంది. స్పిరిట్ ఒక్క క్షణంలో ఎలా ఉన్నవారిని ఎలాచేసి చూపగలదు! ఏ విధంగా ఇంద్రజాలికులు ఒక్క క్షణంలో ఎలా ఉన్నవారిని ఎలా చేసేస్తారో అలా స్పిరిచ్యువల్ అనగా ఆధ్యాత్మికమైన వారిలో కూడా కర్తవ్యసిద్ధి వచ్చేస్తుంది. వారిది చేతివాటము, కాని ఇక్కడ ఇది ప్రతి కర్మ, ప్రతి సంకల్పంలో సిద్ధిస్వరూపులుగా అవ్వడము. సిద్ధి అనగా ప్రాప్తి. కేవలం పాయింట్లను వినడం-వినిపించడం, దీనిని ఫిలాసఫీ అని అంటారు. ఫిలాసఫీ ప్రభావం అల్ప కాలికంగా పడుతుంది. ఆధ్యాత్మికత యొక్క ప్రభావము సదాకాలికంగా పడుతుంది. కావున ఇప్పుడు స్వయంలో కర్మ యొక్క సిద్ధిని ప్రాప్తించుకునేందుకు స్వయంలో ఆత్మికతను తీసుకురావాలి. తెలియనివారిగా అవ్వడం అనగా ఏదైతే వింటారో దానికి స్వరూపం వరకు తీసుకురారు. ఎవరైతే తమ శిక్షాస్వరూపం ద్వారా శిక్షణనిస్తారో వారినే యోగ్యటీచర్లు అని అంటారు. వారి స్వరూపమే శిక్షా సంపన్నంగా ఉంటుంది. వారి చూడడము, నడవడము కూడా ఎవరికైనా శిక్షణనిస్తుంది. ఏ విధంగా సాకార రూపంలో అడుగడుగులోను, ప్రతికర్మలోను శిక్షకుని రూపంలో ప్రాక్టికల్ లో చూశారో, దానినే ఇంకొక  పదాలలో మీరు చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాణి ద్వారా శిక్షణనివ్వడం సామాన్యమైన విషయం. కానీ, అందరూ అనుభవాన్ని కోరుకుంటారు. తమ శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంకల్పాల శక్తితో అనుభవం చేయించాలి. అచ్ఛా!

Comments