09-12-1970 అవ్యక్త మురళి

*  09-12-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "పురుషార్థమునకు ముఖ్య ఆధారము క్యాచింగ్ పవర్"

          ప్రతి ఒక్కరూ ఎంత నాలెడ్జ్ ఫుల్ గా మరియు ఎంత పవర్‌ఫుల్ గా అయ్యారు అని ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఈ రెండు విషయాలను చూస్తున్నారు. అందులో కూడా ముఖ్యంగా క్యాచింగ్ పవర్ (అందుకొనే శక్తి) ప్రతి ఒక్కరికీ ఎంత పవర్‌ఫుల్ గా ఉంది అన్నదానిని చూస్తున్నారు. పురుషార్థమునకు ముఖ్య ఆధారము క్యాచింగ్ పవర్ పైనే ఉంది. ఈ రోజుల్లో సైన్స్ వారు శబ్దమును క్యాచ్ చేసేందుకు కూడా ప్రయత్నము చేస్తారు కానీ, సైలెన్స్ శక్తి ద్వారా మీరు ఏం క్యాచ్ చేస్తున్నారు? ఏవిధంగా వారు చాలా పూర్వకాలపు శబ్దాలను క్యాచ్ చేసారో, అలా మీరు ఏం క్యాచ్ చేస్తారు? 5000 సంవత్సరాల ముందు ఉన్న మీ దైవీ సంస్కారాలను క్యాచ్ చెయ్యగలరా? అంత క్యాచింగ్ పవర్ వచ్చిందా? వారైతే ఇతరుల శబ్దాలను క్యాచ్ చెయ్యగలరు, కానీ మీరు మీ అసలైన సంస్కారాలను కేవలము క్యాచ్ చెయ్యటమే కాకుండా వాటి ప్రాక్టికల్ స్వరూపంగా తయారుచేస్తారు. నేను ఒకప్పుడు ఉన్నాను, మళ్ళీ అలా తయారవుతున్నాను అన్నదానిని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ఎంతెంతగా ఆ సంస్కారాలను క్యాచ్ చెయ్యగలరో అంతగా ఆ స్వరూపంగా అవ్వగలరు. మీ సృతిని శక్తి సంపన్నంగా తయారుచెయ్యండి అనగా శ్రేష్ఠముగా మరియు స్పష్టముగా తయారుచెయ్యండి. ఏవిధంగా మీ వర్తమాన స్వరూపము, వర్తమాన సంస్కారాల స్పష్టమైన అనుభవము ఉంటుందో అలా మీ ఆది స్వరూపము మరియు సంస్కారాలది కూడా అంత స్పష్టమైన అనుభవము ఉండాలి. అర్థమైందా! అంతగా క్యాచింగ్ పవర్ కావాలి. ఏవిధంగా వర్తమాన సమయములో మీ నడవడిక మరియు కర్తవ్యము స్పష్టముగా మరియు సహజంగా స్మృతిలో ఉంటుందో అలాగే మీ అసలైన నడవడిక సహజంగా మరియు స్పష్టంగా సృతిలో ఉండాలి. ఒకప్పుడు నేనే ఈ విధంగా ఉన్నాను అన్న దృఢ సంకల్పమే ఎల్లప్పుడూ ఉండాలి. 5000 సంవత్సరాల విషయము ఎంత స్పష్టంగా అనుభవమవ్వాలంటే నిన్నటి విషయమంత స్పష్టంగా అనుభవమవ్వాలి. దీనినే క్యాచింగ్ పవర్ అని అంటారు. మీ స్మృతిని ఇంత శ్రేష్ఠముగా మరియు స్పష్టంగా తయారుచేసుకొని వెళ్ళాలి. భట్టీలోకి వచ్చారు కదా! ఎల్లప్పుడూ మీ ఆది స్వరూపము మరియు ఆది సంస్కారము ఎదురుగా కనిపించాలి. మీ సృతిని పవర్ ఫుల్ గాతయారుచేసుకోవటం ద్వారా వృత్తి మరియు దృష్టి స్వతహాగనే పవర్ ఫుల్ గా అయిపోతాయి. అప్పుడిక ఈ కుమారుల గ్రూపు ఎటువంటివారిగా అయిపోతారు? అనుకుమార్‌గా అనగా అద్భుతమైనవారుగా అయిపోతారు. ప్రతి ఒక్కరి రెండు నయనాల ద్వారా రెండు స్వరూపాల సాక్షాత్కారము జరుగుతుంది. అవి ఏ రెండు స్వరూపాలు? నిరాకారి మరియు దివ్యగుణధారి అని వినిపించి ఉన్నాము కదా! ఫరిస్తా రూపము మరియు దైవీ రూపము. ప్రతి ఒక్కరూ ఇలా అనుభవము చేస్తారు లేక ప్రతి ఒక్కరికీ నడుస్తూ-తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ లుగా ఉన్నారు అన్న అనుభవము కలుగుతుంది. ఇటువంటి మీ స్వరూపపు సాక్షాత్కారము కలుగుతోందా? 5000 సంవత్సరాల విషయమును క్యాచ్ చెయ్యగలిగినప్పుడు, అనుభవము  చెయ్యగలిగినప్పుడు ఈ అంతిమ స్వరూపపు అనుభవము ఉండదా? ఇప్పుడు ఏ ఏ లోపాలైతే ఉండిపోయాయో వాటిని తొలగించుకొని అటువంటి అనుభవీ మూర్తులుగా అయ్యి వెళ్ళాలి. కావున ఎప్పుడూ ఏ లోపమూ ఉండిపోలేదు కదా అని చూసుకోవాలి. అటువంటి పరివర్తనను చేసుకొని భట్టి నుండి వెళ్ళాలి, అప్పుడప్పుడూ సత్యయుగీ ఆత్మలు ప్రవేశము చేసినప్పుడు వారికి ఈ పురుషార్ధీ జీవితపు నాలెడ్జ్ అస్సలు ఏవిధంగా ఉండనే ఉండదో అలా మీలో కూడా ఈ బలహీనతలు మరియు లోపాల నాలెడ్జ్ మర్జ్  అయిపోవాలి. ఇందుకొరకు ఈ గ్రూపు విశేషంగా రెండు విషయాలను గుర్తు ఉంచుకోవాలి. రెండు విషయాలు రెండు పదాలలోనే ఉన్నాయి - 1.ఈ పాత ప్రపంచమును ఎల్లప్పుడూ గెస్ట్ హౌస్ భావించాలి. 2. గెట్ అవుట్ అనగా బయటకు పంపించెయ్యాలి, ముందు ముందు ఇక లోపలికి రానియ్యకూడదు. అప్పుడిక ఎప్పుడూ బలహీనత మరియు లోటులను అనుభవము చెయ్యరు. సహజ పురుషార్థము కదా! ఈ గ్రూపు అద్భుతమును చేసి చూపించాలి, కావున ఇప్పుడు ఒక్క  క్షణము కూడా మనసా, వాచ,    కర్మణ సేవలో రెస్టు తీసుకోము, అప్పుడే బెస్ట్ అవుతాము మరియు 21 జన్మల కొరకు రెస్టు తీసుకుంటాము అన్న లక్ష్యమును ఎల్లప్పుడూ ఉంచాలి.

             అర్థమైందా, ఎందుకంటే ఇది హార్డ్ వర్కర్ల గ్రూపు. హార్డ్ వర్కర్ల గ్రూపు అనగా రెస్టు ఉండదు. వారు ఎప్పుడూ రెస్టు తీసుకోరు మరియు కొంచెము కూడా వేస్ట్ (వ్యర్థము) చెయ్యరు, కావున ఈ హార్డ్ వర్కర్ల గ్రూపుకు లేక ఆత్మిక సేవాధారుల సంగఠనకు సేవ తప్ప మరేదీ తోచనే తోచకూడదు. దీనినే పేరుకు తగ్గట్లు పని చేయడము అని అంటారు. సేవ కొరకు స్వయమునే ఆఫర్ చెయ్యాలి, అప్పుడు బాప్ దాదా నుండి స్వీకృతి లభిస్తుంది అన్నదానిని కూడా గుర్తు ఉంచుకోవాలి. హార్డ్ వర్కర్లు లేక ఆత్మిక సేవాధారీ గ్రూపు ఈ స్లోగన్‌ను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి - ఇముడ్చుకోవటము మరియు ఎదుర్కొవటము మా లక్ష్యము. ఇదే ఈ గ్రూపు స్లోగన్. ఎదుర్కోవటమును మాయతో చెయ్యాలి కానీ దైవీ పరివారముతో కాదు. దేనిని ఇముడ్చుకోవాలి? మీ పాత సంస్కారాలను ఇముడ్చుకోవాలి. నాలెడ్జ్ ఫుల్ తో పాటుగా పవర్ ఫుల్ గా కూడా అవ్వాలి, అప్పుడే సర్వీసబుల్ గా అవుతారు. అచ్చా! తిలక సమారోహమును చూసి రాజతిలక సమారోహము గుర్తుకు వస్తుందా? ఇప్పుడు ఈ తిలకము సంపూర్ణ స్థితిలో ఉండేందుకు, తరువాత రాజ తిలకము లభిస్తుంది. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షతల తిలకము ఇది. అంతటి శక్తి ఉందా? ఆత్మిక సేవాధారీ గ్రూపు కొరకు ముఖ్యంగా ఈ శిక్షణను ఇస్తున్నారు. మిమ్మల్ని ఎంత అధికారిగా భావిస్తారో అంతగానే సత్కారిగా అవ్వండి. మొదట సత్కారమును ఇవ్వాలి, తరువాత అధికారమును తీసుకోవాలి. సత్కారము మరియు అధికారము రెండూ తోడు తోడుగా ఉండాలి. ఒకవేళ సత్కారమును వదిలి కేవలము అధికారమును తీసుకున్నట్లయితే ఏమైపోతుంది? ఏదైతే చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కావున రెండు విషయాలనూ తోడు తోడుగా ఉంచాలి. అచ్ఛా!

Comments