* 09-11-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“జ్ఞాన సితారల సంబంధము జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞానచంద్రునితో”
స్మృతి స్వరూపంగా ఉండే స్పష్టమైన సితారలుగా ఎల్లప్పుడూ స్వయమును దివ్యసితారలుగా భావిస్తున్నారా? వర్తమాన సమయం యొక్క శ్రేష్ఠ భాగ్యమును బాప్ దాదాల నయనాల తారలుగా మరియు భవిష్యత్తు యొక్క ప్రాప్తి ఏదైతే లభించనుందో, భాగ్యమునేదైతే తయారుచేయనున్నారో ఆ శ్రేష్ఠ భాగ్యసితారలుగా స్వయమును చూసుకుంటూ నడుచుకుంటున్నారా? ఇప్పుడు స్వయమును దివ్యసితారలుగా భావించకపోతే ఈ రెండు సితారలు కూడా సృతిలో ఉండవు. కావున మీ త్రిమూర్తి సితార రూపమును ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ఏ విధంగా సితారలకు సూర్యచంద్రులతో సంబంధం ఉంటుందో, సూర్యునితో గుప్తరూపంలో సంబంధము మరియు చంద్రునితో ప్రత్యక్ష రూపముతో సంబంధము ఉంటుంది అలాగే చైతన్య సితారలైన మీ యొక్క సంబంధం కూడా ప్రత్యక్ష రూపము ఎవరితో ఉంది? చంద్రునితో ఉంది కదా! జ్ఞాన సూర్యునితోనైతే సాకార రూపంలో గుప్తంగానే ఉంది. ప్రత్యక్ష రూపంలో పెద్దతల్లితోనే సంబంధం ఉంది కదా! కావున స్వయమును సితారగానే భావిస్తూ ఉండండి. ఏ విధంగా సితారలకు సూర్యచంద్రులతో సంబంధం ఉంటుందో అలా సదా బాప్ దాదాతో పాటే సంబంధం ఉండాలి. ఏ విధంగా సితారలు ప్రకాశిస్తూ ఉంటాయో అలాగే మీ ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంలో ఎల్లప్పుడూ స్థితులై ఉండండి. సితారలు పరస్పరంలో సంగఠిత రూపంలో ఉంటూ సదా ఒకరికొకరు స్నేహీసహయోగులుగా ఉంటారు. చైతన్య సితారలైన మీ యొక్క స్మృతి చిహ్నము ఈ సితారలే. మరి మీరు ఇటువంటి శ్రేష్ఠ సితారలుగా అయ్యారా? చైతన్య మరియు చిత్ర సమానంగా అయ్యారా? మీ భిన్న భిన్న రూపాల, భిన్న భిన్న కర్తవ్యాల యొక్క స్మృతిచిహ్న చిత్రాలను చూస్తూ ఇవి చైతన్యుడినైన నా యొక్క చిత్రాలే అని భావిస్తున్నారా? చైతన్యము మరియు చిత్రములో తేడా సమాప్తమైపోయిందా లేక సమీపంగా వస్తున్నారా? సితారలు ఎప్పుడూ పరస్పరంలో, సంగఠనలో ఉంటూ పరస్పరం ఒకరి నుండి ఒకరు స్నేహం నుండి, సహయోగము నుండి దూరంగా ఉంటారా? మీరు ఎప్పుడూ సమ్మేళనాలు చేయలేదా? సందేశాన్నిచ్చే సమ్మేళనాలనైతే ఎన్నో చేశారు. ఇంకే సమ్మేళనాలు మిగిలి ఉన్నాయి? అంతిమ సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉద్దేశం ఏమిటి? సమ్మేళనాలకు ముందు వాటి ఉద్దేశాన్ని అందరికీ వినిపిస్తారు కదా! కావున అంతిమ సమ్మేళనం యొక్క ఉద్దేశం ఏమిటి? దాని తారీఖును నిర్ణయించండి. ఏవిధంగా ఇతర సమ్మేళనాల తారీఖును నిర్ణయిస్తారో అలా దీని తారీఖును నిర్ణయించారా? ఈ సమ్మేళనమునైతే అందరూ కలిసి చేయాలి, ఇదే మీ అంతిమ సమ్మేళనం యొక్క చిత్రము. చిత్రమేదైతే ఉందో దానినే ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. అందరి యొక్క సహయోగము, అందరి స్నేహము మరియు అందరి ఏకరస స్థితిలో స్థితులై ఉండే చిత్రము కూడా ఉంది కదా! ఏ విధంగా గోవర్ధన పర్వతంలో వేలు సహయోగమును గూర్చి చూపిస్తారో, అందులో వేలును పూర్తిగా తిన్నగా ఉన్నట్లు చూపిస్తారు. వంకర టింకరగా ఉంటే కదులుతూ ఉంటుంది. తిన్నగా మరియు స్థిరంగా ఉండాలి. దాని గుర్తును ఈ రూపంలో చూపించారు. అలాగే మీ పురుషార్థమును కూడా పూర్తిగా స్థిరంగా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఏ దారి అయితే అటూ ఇటూ అయిపోతుందో అనగా బుద్ది ఏదైతే అటూ ఇటూ తిరుగుతూ
ఉంటుందో అది సమాప్తమైపోయి ఏకరస స్థితిలో స్థిరమైపోవాలి. ఇటువంటి పురుషార్థం చేస్తున్నారా? మీ పురుషార్థంతో మీరు స్వయం సంతుష్టంగా ఉన్నారా? కోరిక శ్రేష్ఠంగా ఉంది కాని శక్తిహీనంగా ఉన్న కారణంగా ఏది కావాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నారు అని భక్తులను గూర్చి ఏదైతే అంటారో అలాగే మీరు కూడా శ్రేష్ఠముగా అవ్వాలి అని ఏదైతే కోరుకుంటున్నారో, శ్రేష్ఠంగా అవ్వాలి అన్న కోరికనైతే ఉంచుతున్నారు, కోరిక శ్రేష్టంగా ఉంది కాని పురుషార్థం తక్కువగా ఉంది. మీ సంతుష్టత యొక్క ఆధారంపై మీ లక్ష్యము దూరంగా కనిపిస్తోంది. కావున మిమ్మల్ని ఏమంటారు? మహాన్ జ్ఞాని అని అంటారా? స్వయమును సర్వశక్తివంతుని సంతానము అని అంటారు, కానీ సంతానము అని అన్న తర్వాత కూడా మీలో శక్తి లేదా? మనుష్యులు ఏది కావాలనుకుంటే అది చేయగలరు అని భావిస్తారు కదా! అలాగే మీరు కూడా మాస్టర్ సర్వశక్తివంతుని సంబంధంతో ఏదైతే ఆలోచిస్తున్నారో దానిని ఇప్పుడు చేయలేరా? ఇప్పుడు ఆ అంతిమ స్థితిని ప్రాక్టికల్ లోకి తీసుకురాలేరా లేక అంతిమం కాబట్టి అది అంతిమంలోనే జరుగుతుందా? అంతిమ స్థితి యొక్క అంతము కావున అది అంతిమ స్థితిలోనే ఏర్పడుతుంది అని కాదు. కాని ఇప్పటినుండే ఆ సంపూర్ణ స్థితిని ఎప్పుడైతే ప్రత్యక్షంలోకి తీసుకువస్తూ ఉంటారో అప్పుడు అంతిమ స్థితిని అంతిమంలో పొందగల్గుతారు. ఇప్పటినుండే ఆ స్థితిని సమీపంగా తీసుకురాకపోతే అది దూరం నుండే ఉండిపోతుంది, దానిని పొందలేరు. కావున ఇప్పుడు పురుషార్థంలో జంప్ చేయండి. నడుస్తూ నడుస్తూ పురుషార్థంలోని శాతంలో ఇప్పుడు లోటు ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు పురుషార్థపు స్థితిలో ఉన్నారు. పురుషార్థపు స్థితిలో ఉంటూ కూడా ఆ పర్సంటేజ్ ను నింపండి. పర్సంటేజ్ లో ఎంతో లోపం ఉంది. ఏ విధంగా ముఖ్య సబ్జెక్టయిన స్మృతియాత్ర ఏదైతే ఉందో దానిని నెంబర్ వారీగా తయారుచేసుకున్నారు కూడా! కాని, ఆ స్థితితో పాటు ఏ శాతమైతే ఉండాలో అది ఇప్పుడు తక్కువగా ఉంది. కావున ఏ ప్రభావమైతే కనిపించాలో అది తక్కువగా కనిపిస్తోంది.
ఎప్పటివరకైతే పర్సంటేజ్ ని పెంచుకోలేదో అప్పటివరకు ప్రభావమును వ్యాపింపజేయలేరు. దానిని వ్యాపింపజేసేందుకు పర్సంటేజ్ కావాలి. బల్బు ఉంటుంది కదా! వాటన్నింటిలోను ప్రకాశము ఉంటుంది. కాని ఎంతగా ప్రకాశం యొక్క పర్సంటేజ్ ఉంటుందో అంత ఎక్కువగా అది వ్యాపిస్తుంది. కావున బల్బులుగా అయితే అయ్యారు. ప్రకాశం యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉండాలో ఇప్పుడు అది లేదు, దానిని పెంచండి. ఒకటేమో లైటు, ఇంకొకటి సెర్చిలైటు, మూడవది లైట్ హౌసు. భిన్న భిన్న స్టేజీలున్నాయి కదా! లైట్ గా అయితే అయ్యారు కాని లైట్ హౌస్ అయి నలువైపులా అంధకారమును దూరం చేసి ప్రకాశమును వ్యాపింపజేయండి. అందరికీ ఎంతటి ప్రకాశమును వ్యాపింపజేయాలంటే, వారు తమను తాము చూసుకోగలగాలి. ఇప్పుడైతే తమను తాము కూడా చూసుకోలేరు. ఏ విధంగా చాలా అంధకారం ఉన్నప్పుడు స్వయమునూ చూసుకోలేరో అలాగే ఇతరులను కూడా చూడలేరో అలా ఎటువంటి లైట్ హౌస్ గా అవ్వాలంటే అందరూ తమను తాము చూసుకోగలగాలి. ఏ విధంగా దర్పణం ముందు ఎవరైతే ఉంటారో వారికి స్వయం యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుందో అలా దర్పణంలా అయ్యారా? ఇంతమంది దర్పణంగా అయి తమ కార్యమును ప్రారంభిస్తే నలువైపులా సర్వాత్మలకు స్వయం యొక్క సాక్షాత్కారం జరుగదా?ఎవరికైనా సాక్షాత్కారము జరిగినట్లయతే వారి నోటి నుండి తప్పకుండా జయజయనాదాలు వెలువడుతాయి. అటువంటి దర్పణములా అయితే అయ్యారు కదా! మొత్తము రోజంతటిలో ఎంతమందికి స్వయం యొక్క సాక్షాత్కారమును చేయిస్తారు? ఎదురుగా వచ్చినవారు సాక్షాత్కారము చేస్తారా? ఒకవేళ దర్పణము పవర్ ఫుల్ గా లేనట్లయితే అసలు రూపమునకు బదులుగా మరో రూపము కనిపిస్తుంది. ఉన్నదేమో సన్నగా, కనిపించేదేమో లావుగా... కావున అందరికీ స్వయము యొక్క సాక్షాత్కారమును చేయించగలిగేంతగా అటువంటి పవర్ ఫుల్ దర్పణంగా అవ్వండి అనగా మీ ఎదరుగా రావటంతోనే దేహాన్ని మర్చిపోయి వారి దేహీరూపములో స్థితులైపోవాలి. వాస్తవిక సర్వీస్ లేక సేవా సఫలత యొక్క రూపము ఇదే. అచ్ఛా!
సదా సఫలతామూర్తులకు, సంస్కారాల మిలన సమ్మేళనమును చేసేవారికి, తమ సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువచ్చేవారికి, దివ్యసితారలకు, బాప్ దాదాల నయన సితారలకు, భాగ్య సితారను మేల్కొలిపే వారికి ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment