09-05-1977 అవ్యక్త మురళి

09-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణ పవిత్రతయే విశేష పాత్ర అభినయించేవారి యొక్క శృంగారం.

                          విశేష పాత్రధారి ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                    స్వయాన్ని ఈ డ్రామాలో విశేష పాత్రను అభినయించే విశేష పాత్రధారిగా భావిస్తున్నారా? విశేష పాత్ర యొక్క విశేషత ఏమిటో తెలుసా? విశేషత ఏమిటంటే బాబాతో పాటు సహయోగి అయ్యి పాత్రను అభినయిస్తున్నారు మరియు వెనువెంట ప్రతి పాత్రను సాక్షి స్థితిలో స్థితులై అభినయిస్తున్నారు. విశేషత ఏమిటంటే బాబాతో పాటు సహయోగి మరియు సాక్షి స్థితి యొక్క పాత్ర. ఈ విశేషత కారణంగానే విశేష పాత్రధారిగా కీర్తించబడుతున్నారు. అయితే స్వయాన్ని పరిశీలించుకోండి - ప్రతి పాత్రను అభినయిస్తూ రెండు విశేషతలు ఉంటున్నాయా? అని. లేకపోతే కనుక సాధారణ పాత్రధారి అని అంటారు. తండ్రి శ్రేష్టమైనవారు మరియు పిల్లలు సాధారణమైనవారు ఇది శోభించదు.
                   విశేష పాత్రను అభినయించేటందుకు శృంగారం (అలంకరణ) ఏమిటి? సంపూర్ణ పవిత్రతయే మీ శృంగారం. సంకల్పంలో కూడా అపవిత్రత అనేది అంశమాత్రంగా కూడా ఉండకూడదు. ఇటువంటి శృంగారం నిరంతరం ఉంటుందా? ఎందుకంటే మీరందరు హద్దులోని అల్పకాలిక పాత్రను అభినయించేవారు కాదు. ప్రతి సెకను, ప్రతి సంకల్పం ద్వారా సదా బేహద్ పాత్రను అభినయించేవారు. అందువలన సదా అలంకరించబడిన మూర్తులు అంటే సదా పవిత్ర స్వరూపులు. ఈ సమయం యొక్క శృంగారం జన్మజన్మలకు అవినాశి అయిపోతుంది.
                    ముఖ్య సంస్కారాన్ని నింపుకునే సమయం ఇదే. ఆత్మలో ప్రతి జన్మ యొక్క సంస్కారాల రికార్డ్ ను ఈ సమయంలో నింపుకుంటూ ఉన్నారు. రికార్డ్ చేసే సమయంలో సెకను, సెకను చాలా ధ్యాస పెట్టుకుంటారు. ఏ రకమైన ఆందోళనలో అయినా ధ్యాస అంటే ఆందోళనలో కూడా ధ్యాస ఉండాలి. ఏ రకమైన ఆందోళన ఉన్నా రికార్డ్ మంచిగా నిండదు. సదాకాలికంగా శ్రేష్ట పేరుకి బదులు ఎంత బాగా నిండాలో అంత బాగా నిండలేదు అని అంటారు. అందువలన అన్ని రకాల ఆందోళనల నుండి అతీతంగా, స్వయం, సమయం మరియు బాబా తోడు గురించి సెకను, సెకను ధ్యాస పెట్టుకుని పాత్రను అభినయించండి. సర్వశక్తివంతుని సంతానం మాస్టర్
సర్వశక్తివంతులు, జ్ఞాన సాగరులు అయిన వారికి ఆందోళన రావడానికి ఆధారం రెండు మాటలు. ఆ రెండు మాటలు ఏవి? ఎందుకు మరియు ఏమిటి? ఏ విషయంలోనైనా ఇది ఎందుకు జరిగింది? ఏమి జరిగింది? ఇలా ఈ రెండు మాటలు ఎప్పుడైతే బుద్ధిలోకి వస్తాయో అప్పుడే ఏదోక రకమైన ఆందోళన ఉత్పన్నమవుతుంది. కానీ సంగమయుగి శ్రేష్ట పాత్రధారి ఆత్మలు ఎందుకు, ఏమిటి అనే ఆందోళనలో ఉండకూడదు; ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. సాక్షి మరియు సాథీ (తోడు) అనే విశేషతతో డ్రామాలో ప్రతి పాత్రను అభినయిస్తే ఎప్పుడు ఆందోళన రాదు. ఈ విశేష కళ్యాణకారి సమయం గురించి అర్ధం చేసుకుంటూ ప్రతి సెకను యొక్క సంస్కారాల రికార్డ్ ను నెంబర్ వన్ స్థితిలో నింపుకుంటూ వెళ్ళండి.
                      ఈ సంగమయుగి జ్ఞాన సాగర స్థితికి ఆసనం ఏమిటో తెలుసా? భక్తిమార్గంలో విద్యాదేవి అయిన సరస్వతికి ఏ ఆసనం (వాహనం) చూపించారు? ఎందుకు చూపించారు? దాని యొక్క విశేష గుణం ఏమి మహిమ చేస్తారు? దాని యొక్క విశేషత కూడా జ్ఞానసాగర స్థితినే చూపించారు. సత్యం మరియు అసత్యం రెండింటినీ గ్రహించడం కూడా జ్ఞానమే కదా! కనుక జ్ఞాన సాగర స్థితికి గుర్తు కూడా జ్ఞానం ఉన్నవారే తయారుచేసారు. 1. సత్యం మరియు అసత్యం ఏమిటో తెలుసుకునే జ్ఞానం మరియు 2. మీ స్థితికి గుర్తుగా కూడా ఈ ఆసనాన్ని చూపించారు. బుద్ధి ద్వారా సదా శుద్ద సంకల్పాలనే భోజనాన్ని స్వీకరించేవారు. సదా సర్వాత్మల ద్వారా లేదా రచన
ద్వారా గుణాలను ధారణ చేసేవారు. దీనికి గుర్తుగానే హంస ముత్యాలను గ్రహిస్తుంది అని చూపించారు. 3. స్వచ్చత. స్వచ్చతకు గుర్తుగా హంసను తెలుపు రంగులో చూపించారు. స్వచ్చత అంటే పవిత్రత. సదా జ్ఞానసాగర స్థితిలో స్థితులైన దానికి గుర్తుగా హంస వాహనాన్ని చూపించారు. సదా సేవాధారి రూపానికి గుర్తుగా సరస్వతి దేవిని వీణ వాయిస్తున్నట్లుగా చూపిస్తారు. జ్ఞాన వీణను సదా మ్రోగిస్తూ ఉండాలి అంటే సదా సేవాధారిగా ఉండాలి. స్మృతిచిహ్నంగా ఏ ఆసనాన్ని అయితే చూపించారో ఆ అన్ని విశేషతలను ధారణ చేసి పాత్ర అభినయించాలి. ఇదే విశేష పాత్ర. ఈవిధంగా సదా విశేష పాత్రధారిగా భావించి పాత్ర అభినయించండి.
                   ప్రకృతికి ఆధీనులు కాదు కదా? ప్రకృతి యొక్క ఏ తత్వం అలజడిలోకి తీసుకురాకూడదు. మున్ముందు చాలా పరీక్షలు రానున్నవి. స్థితి అనేది ఏ సాధనాల ఆధారంగా ఉండకూడదు. మాయాజీత్ గా అవ్వటంతో పాటు ప్రకృతి జీత్ గా కూడా అవ్వాలి. ప్రకృతి అలజడి మధ్యలో ఇది ఏమిటి? ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎలా అవుతుంది? ఇలా కొద్దిగానైనా సంకల్పంలో ఆందోళన వచ్చిందంటే ద్వాస తక్కువ అయినట్లు. అప్పుడు పూర్తిగా పాస్ కాలేరు. అందువలన సదా అచంచలంగా అవ్వాలి. మంచిది.
                 సదా జ్ఞాన సాగర స్థితి యొక్క ఆసనంపై స్థితులయ్యేవారికి, ప్రతి సెకను శ్రేష్ట పాత్రను అభినయించేవారికి, అన్ని రకాల పరీక్షలలో పూర్తిగా పాస్ అయ్యేవారికి, పాస్ విత్ ఆనర్ అయ్యేవారికి, సదా ఒకే బాబా యొక్క స్మృతి రసంలో ఏకరసంగా ఉండేవారికి, సదా బాబా సమాన శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments