09-05-1972 అవ్యక్త మురళి

* 09-05-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"మీ ఫీచర్ ద్వారా ఫ్యూచర్ చూపించండి"

అందరూ సదా స్నేహులేనా? బాప్ దాదా ఏవిధంగా ఎల్లప్పుడూ పిల్లలకు స్నేహిగా మరియు సహయోగిగా ఉంటారో, అన్ని రూపాల ద్వారా, అన్ని విధాలుగా సదా స్నేహులో మరియు సహయోగులో, అలాగే పిల్లలు కూడా అన్ని రూపాలలో, అన్ని విధాలుగా తండ్రి సమానంగా సదా స్నేహులుగా మరియు సహయోగులుగా ఉన్నారా? ఎవరికైతే క్షణకాలము కూడా తండ్రి తోటి స్నేహము వీడిపోకుండా ఉంటుందో మరియు ఒక్క క్షణము, ఒక్క సంకల్పము కూడా తండ్రికి సహయోగులుగా కాకుండా పోదో అటువంటి వారినే సదా సహయోగులు మరియు సదా స్నేహులు అని అంటారు. కావున ఇలా మిమ్మల్ని సదా స్నేహులు మరియు సహయోగులుగా భావిస్తున్నారా, అనుభవము చేసుకుంటున్నారా? బాప్ దాదా స్నేహమునకు ఋజువు లేక ప్రత్యక్ష ప్రమాణము కనిపిస్తుందా? కావున తండ్రి సమానులైన పిల్లలెవరైతే ఉంటారో వారికి కూడా స్నేహము మరియు సహయోగముల ఋజువు లేక ప్రత్యక్ష ప్రమాణము కనిపిస్తూ ఉంది. స్నేహీ ఆత్మల స్నేహము ఎప్పుడూ దాగి ఉండజాలదు. ఎవరు ఎంతగా తమ స్నేహమును దాచాలని అనుకున్నా కానీ స్నేహము ఎప్పుడూ గుప్తముగా ఉండదు. స్నేహము ఏదో ఒక రూపములో, ఏదో ఒక కర్తవ్యము ద్వారా లేక ముఖము ద్వారా తప్పకుండా కనిపిస్తుంది. కావున - నా  ముఖము ద్వారా స్నేహీ తండ్రి గుణాలు కనిపిస్తున్నాయా? అని మీ ముఖమును అద్దములో చూసుకోవాలి. ఏవిధంగా మీ ముఖాన్ని స్థూల అద్దములో చూసుకుంటారో అలాగే ప్రతిరోజూ అమృతవేళ మిమ్మల్ని మీరు ఈ సూక్ష్మ దర్పణంలో చూసుకుంటున్నారా? లక్షణాల ద్వారా ప్రతి ఆత్మ లక్ష్యము తెలుస్తుంది మరియు ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి లక్షణాలు స్వతహాగనే ఉంటాయి. మరి మీ లక్షణాల ద్వారా లక్ష్యమును ప్రత్యక్ష రూపములో ఎంతవరకు చూపిస్తున్నారు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా? ఎటువంటి ఆత్మకైనా మీ ఫీచర్స్(స్వరూపము) ద్వారా ఆ ఆత్మ ఫ్యూచర్ మరియు మీ ఫ్యూచర్ ను చూపించగలరు. లెక్చర్( ఉపన్యాసము)ద్వారా ఫీచర్స్ ను చూపించటము సాధారణ విషయము కానీ ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్‌ను చూపించటము ఇదే అలౌకిక ఆత్మల అలౌకికత. అలా నా ఫ్యూచర్స్ తయారయ్యాయా అని దర్పణములో చూసుకుంటున్నారా? స్థూల ముఖము ఉంది కదా! ఒకవేళ ఎవరైనా ముఖమును చూసినప్పుడు మొట్టమొదటగా విశేషమైన అటెన్షన్ తిలకము వైపుకు వెళుతుంది, అదేవిధంగా ఎవరైతే బిందు స్వరూపములో స్థితులౌతారో అనగా స్వయమును ఈ ధారణల సింగారముతో అలంకరించుకుంటారో, అటువంటి అలంకరింపబడిన ముఖము వైపుకు చూడటంతోనే అందరి ధ్యానము దేనిపైకి పోతుంది? మస్తకములోని ఆత్మ బిందువు వైపుకు. అదేవిధంగా ఏ ఆత్మ అయినా మీ సమ్ముఖమునకు వచ్చినట్లయితే వారి ధ్యానము మీ అవినాశీ తిలకము వైపుకు ఆకర్షితమవ్వాలి. అదికూడా ఎప్పుడైతే స్వయము సదా తిలకధారులుగా ఉంటారో అప్పుడే జరుగుతుంది. ఒకవేళ స్వయమే తిలకధారులుగా కానట్లయితే ఇతరులకు మీ అవినాశీ తిలకము కనిపించజాలదు.

ఎవరైతే ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించారో, లేక ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యారో, ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే అటువంటి పిల్లలకు మొత్తము విశ్వములోని సర్వ సుఖాల ప్రాప్తి సదాకాలము కొరకు ఉంటుంది. మిగిలిన అందరినీ ముక్తిధామములో కూర్చోబెట్టి ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే పిల్లలకు విశ్వ రాజ్య భాగ్య ప్రాప్తిని కలిగిస్తారు. మామూలుగా అయితే మొత్తము సృష్టిలోని ఆత్మలందరూ పిల్లలే, కానీ ఇతర ఆత్మలందరికీ అల్పకాలికమైన సుఖము ప్రాప్తిస్తుంది మరియు ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేవారికి సదాకాలపు ప్రాప్తి కలుగుతుంది. ఇటునంటి స్నేహీ పిల్లలకు తప్ప ఇతరులెవ్వరికీ సర్వ సంబంధాలతో సర్వ ప్రాప్తుల పాత్ర ఉండదు. ప్రీతిని నిర్వర్తించే పిల్లలను బాబా కూడా రాత్రింబవళ్ళు గుణగానము చేస్తారు. ఎవరిపైనయినా అతి స్నేహము ఉన్నట్లయితే ఆ స్నేహము కొరకు అందరినీ దూరము చేసుకొని అంతటినీ వారికి అర్పిస్తారు, ఇదే స్నేహమునకు ప్రమాణము. కావున సదా స్నేహులు మరియు సహయోగీ పిల్లలను తప్ప మిగిలిన ఆత్మలందరినీ ముక్తిధామములో ఉంచేస్తారు. కావున తండ్రి ఏవిధంగా స్నేహమునకు ప్రత్యక్ష ప్రమాణమును చూపిస్తున్నారో అలా సర్వ సంబంధాలను, ఆకర్షింపచేసే అన్ని వస్తువులను మీ బుద్ధిలో నుండి తొలగించారా? సర్వ రూపాలతో, సర్వ సంబంధాలతో, ప్రతి రీతితో అంతటినీ తండ్రికి అర్పించారా? తండ్రి కర్తవ్యము తప్ప ఒక్క క్షణము కూడా ఇతరమైన ఎటువంటి వ్యర్ధ కార్యములో మీ సహయోగమునైతే ఇవ్వటం లేదు కదా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ స్నేహము అనగా యోగము ఉన్నట్లయితే సహయోగము కూడా ఉంటుంది. ఎక్కడైతే యోగము ఉంటుందో అక్కడ సహయోగము ఉంటుంది. ఒక్క తండ్రితోనే యోగము ఉన్నట్లయితే సహయోగము కూడా ఒక్కరితోటే ఉంటుంది. యోగి అనగా సహయోగి. కావున సహయోగము ద్వారా యోగమును చూడగలరు. యోగము ద్వారా సహయోగమును చూడగలరు. ఒకవేళ ఏదైనా వ్యర్థ కార్యములో సహయోగిగా అయినట్లయితే తండ్రికి సదా సహయోగిగా ఉన్నట్లా? ఏదైతే మొట్టమొదట ప్రమాణము చేసి ఉన్నారో దానిని సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి కర్మను చేస్తున్నారా? భక్తులవలె పిల్లలైన మీరుకూడా తండ్రిని మోసమైతే చెయ్యటం లేదు కదా! భక్తులు మోసగాళ్ళు అని భక్తులను గూర్చి అంటారు కదా! మరి మీరుకూడా మోసగాళ్ళుగా అయితే కావటం లేదు కదా? ఒకవేళ నీదిని నాదిగా భావించి కార్యములో పెట్టినట్లయితే మోసగాళ్ళు అయినట్లే కదా! చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి - దీనిని ఏమంటారు? తనువు-మనస్సు-ధనము అన్నీ నీవే అనే అంటారు కదా! నీవిగా అయినప్పుడు మళ్ళీ మీకు వాటిపై అధికారము ఎక్కడి నుండి వచ్చింది? అధికారమే లేనప్పుడు వాటిని మీ మన్మతము ద్వారా కార్యములో ఎలా పెట్టగలరు? సంకల్పాలను, సమయమును, శ్వాసను, జ్ఞానధనమును, స్థూల తనువును ఏ ఖజానానైనా ఒకవేళ మన్మతము ద్వారా వ్యర్థముగా పోగొట్టినట్లయితే అది మోసము కాదా! జన్మ జన్మల సంస్కారమునకు వశమైపోతారు. ఈ పద్ధతి ఎప్పటివరకు నడుస్తూ ఉంటుంది? ఏ విషయమైతే స్వయమునకు కూడా మంచిగా అనిపించదో దానిని గూర్చి ఆలోచించాలి - నాకే మంచిగా అనిపించనప్పుడు అది తండ్రికి ఎలా ప్రియంగా అనిపించగలదు? స్నేహితునికి సదా అతి ప్రియమైన దానినే ఇవ్వటం జరుగుతుంది. కావున నేను ఎంతవరకు ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

స్వయమును సదా హైయస్ట్(అతి ఉన్నతము)గా మరియు హోలియస్ట్ (అతి పవిత్రము)గా భావిస్తూ నడుస్తున్నారా? ఎవరైతే హైయస్ట్ గా భావిస్తూ నడుస్తారో వారి ఒక్కొక్క కర్మ, ఒక్కొక్క మాట తండ్రి ఎంత హైయ్యస్టో అంత హైయస్ట్ గా ఉంటాయి అనగా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి పేరు ఉన్నతమైనది, వారి ధామము ఉన్నతమైనది, వారి కర్తవ్యము ఉన్నతమైనది అని తండ్రి మహిమను గానము చేస్తారు కదా! కావున ఎవరైతే హైయస్ట్ గా ఉంటారో వారు కూడా ఎల్లప్పుడూ తమ ఉన్నతమైన పేరు, ఉన్నతమైన ధామము మరియు ఉన్నతమైన కార్యములో తత్పరులై ఉంటారు. ఎటువంటి నీచ కార్యమును చెయ్యను కూడా చెయ్యలేరు. ఏవిధంగా ఎవరైనా గొప్ప ఆత్మలుగా అయినప్పుడు వారు ఎప్పుడూ ఎవరిముందూ ఒంగరు. వారిముందే అందరూ ఒంగుతారు, అప్పుడు వారిని మహానాత్మ అని అంటారు. నేటి మహానాత్మల కన్నా గొప్పవారు, శ్రేష్ఠ ఆత్మలు, తండ్రిచే ఎంచుకోబడిన ఆత్మలు, విశ్వరాజ్య అధికారులు, తండ్రి వారసత్వమునకు అధికారులు, విశ్వ కల్యాణకారులు, ఇటువంటి ఆత్మలు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులలోనైనా లేక మాయ యొక్క భిన్న భిన్న ఆకర్షిత రూపాలలో తమను తాము తలవంచుకునేలా చేసుకోగలరా? నేడు మహాత్ములమని చెప్పుకొనేవారు నిజానికి మహానాత్మలైన మిమ్మల్ని కాపీ చేసారు. కావున అటువంటి శ్రేష్ఠ ఆత్మలు ఎక్కడ కూడా, ఏ రీతిగా కూడా ఒంగజాలరు. వారు ఒంగేలా చేసేవారే కానీ ఒంగేవారు కాదు. మాయ ఫోర్స్ ఎంతగా ఉన్నాగానీ ఒంగజాలరు. అలా మాయను సదా వంచేవారిగా అయ్యారా లేక అప్పుడప్పుడు ఒంగి కూడా ఉంటున్నారా? ఎప్పుడైతే ఇప్పటినుండే సదా వంచే స్థితిలో స్థితులై ఉన్నట్లయితే, అటువంటి శ్రేష్ఠ సంస్కారమును తమలో నింపుకున్నప్పుడే అటువంటి ఉన్నతోన్నతమైన పదవి ప్రాప్తమవుతుంది. సత్యయుగములోని ప్రజలు స్వమానముతో ఒంగుతారు మరియు ద్వాపరములో బికారులై ఒంగుతారు. మీ స్మృతి చిహ్నాల ముందు భక్తులు కూడా ఒంగుతూ ఉంటారు కదా! ఒకవేళ ఇక్కడ మాయ ముందు ఒంగే సంస్కారమును సమాప్తముచేసుకోనట్లయితే, ఒంగే సంస్కారము కొంచెమన్నా ఉండిపోయినట్లయితే తరువాత ఒంగేవారు ఒంగించే వారి ముందు ఎల్లప్పుడూ ఒంగుతూనే ఉంటారు. లక్ష్యమైతే దేనిని ఉంచారు  ఒంగేందుకా లేక ఒంగించేందుకా? ఎవరైతే తామే రచించిన పరిస్థితుల ముందు ఒంగుతారో వారిని హైయస్ట్ లు అని అంటారా? ఎప్పటివరకైతే హైయస్ట్ లుగా అవ్వరో అప్పటివరకు హోలీయస్ట్ లుగా కూడా అవ్వజాలరు.

సంపూర్ణ నిర్వికారి అని మీ భవిష్య స్మృతిచిహ్నమును గురించి గాయనము ఉంది. వారిని కూడా హోలీయస్ట్ అని అంటారు. సంపూర్ణ నిర్వికారి అనగా ఏ శాతములోనైనా ఎటువంటి వికారము వైపుకు ఆకర్షణ పోకుండా ఉండటము మరియు వాటికి వశీభూతమవ్వకుండా ఉండటము. ఒకవేళ స్వప్నములో అయినా ఏవిధముగా అయినా ఎంతో కొంత శాతములో వికారమునకు వశమయినట్లయితే సంపూర్ణ నిర్వికారులు అని అంటారా? ఒకవేళ స్వప్నదోషము జరిగినా సంకల్పములో అయినా వికారమునకు వళీభూతమైనట్లయితే వారిని వికారాల నుండి దూరమవ్వలేదు అనే అంటారు. అటువంటి సంపూర్ణ పవిత్రులుగా మరియు నిర్వికారులుగా మిమ్మల్ని తయారుచేసుకుంటున్నారా లేక తయారైపోయారా? ఏ సమయములో అయితే చివరి బెల్ మ్రోగుతుందో ఆ సమయములో తయారవుతారా? ఒకవేళ ఎవరైనా చాలా సమయము నుండి ఇటువంటి స్థితిలో స్థితులవ్వనట్లయితే అటువంటి ఆత్మలకు మళ్ళీ గాయనము కూడా అల్పకాలమైనదే జరుగుతుంది. లాస్ట్ లో ఫాస్ట్ (వేగం)గా వెళ్లి ఇటువంటి స్థితిని పొందుతాము అని భావించకండి. కానీ అలా జరగదు. బహుకాలపు గాయనము ఏదైతే ఉందో దానిని కూడా స్మృతిలో ఉంచుకుంటూ మీ స్థితిని హోలీయస్ట్ గా మరియు హైయస్ట్ గా తయారుచేసుకోండి. ఏదైనా సంకల్పమును గానీ లేక కర్మను గానీ చేసినప్పుడు ఎంతటి ఉన్నతమైన పేరు ఉందో అంతటి ఉన్నతమైన కార్యము ఉందా? అని మొదటగా పరిశీలించుకోండి. ఒకవేళ పేరు గొప్పగా కార్యము తక్కువైనదిగా ఉన్నట్లయితే ఏమవుతుంది? మీ పేరును అపకీర్తిపాలు చేసుకుంటారు. కావున అటువంటి పని ఏదీ ఉండకూడదు అన్న లక్ష్యమును ఉంచుకొని అటువంటి లక్షణాలను మీలో ధారణ చెయ్యండి. ఒకవేళ జ్ఞాన విరుద్ధంగా ఏదైనా వస్తువును స్వీకరించినట్లయితే వారిని జ్ఞాని అని అనరు, అజ్ఞాని అని పిలవబడతారు, ఒకవేళ ఒక్కసారైనా కూడా ఏదైనా నియమాన్ని పూర్తిరీతిలో పాలన చెయ్యనట్లయితే వీరు జ్ఞానమునకు విరుద్ధముగా చేసారు అని అంటారు అని మీరు ఇతరులకు అర్థం చేయిస్తుంటారు కదా! కావున మిమ్మల్ని మీరు కూడా  ఒకవేళ నేను ఏదైనా సాధారణ సంకల్పము చేసినట్లయితే మరి నన్ను హైయస్ట్ అని అంటారా? అని ప్రశ్నించుకోండి. కావున సంకల్పము కూడా సాధారణంగా ఉండకూడదు. ఎప్పుడైతే సంకల్పము శ్రేష్ఠమైనదిగా అవుతుందో అప్పుడు మాటలు మరియు కర్మలు ఆటోమేటిక్ గానే శ్రేష్ఠమైపోతాయి. అలా మిమ్మల్ని మీరు హోలీయస్ట్ గా మరియు హైయస్ట్ గా, సంపూర్ణ నిర్వికారిగా తయారుచేసుకోండి. వికారపు అంశము కూడా ఉండకూడదు. ఎప్పుడైతే అంశమాత్రము కూడా ఉండదో అప్పుడిక పని ఏవిధముగా ఉంటుంది? ఏవిధంగా భవిష్యత్తులో వికారాల అంశమాత్రము కూడా ఉండదో అలా హైయస్ట్ మరియు హోలీయస్ట్ లుగా ఇప్పటినుండే తయారవ్వండి, అప్పుడది అనేక జన్మలు కొనసాగుతూ ఉంటుంది. అచ్ఛా, అలా ఉన్నతమైన పేరు మరియు ఉన్నతమైన కార్యమును చేసేవారికి నమస్తే.

Comments