09-01-1975 అవ్యక్త మురళి

09-01-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఎదురు చూడడానికి బదులు, తయారీలు చేయండి.

                తన యొక్క సర్వ శ్రేష్ఠ లేదా కళ్యాణకారీ సంకల్పంతో సత్యయుగీ, పావన సృష్టి యొక్క సృజన చేసే సృజనాకరుడు శివబాబా మాట్లాడుతున్నారు -
                నిరాకారి, ఆకారి, సాకారి ఈ మూడు స్థితులను సమానంగా తయారు చేసుకున్నారా? సాకార రూపంలో స్థితులవ్వడం ఎంత సహజంగా అనుభవం చేసుకుంటున్నారో, అంతగానే ఆకారీ స్వరూపం అనగా మీ యొక్క సంపూర్ణ స్థితి లేదా మీ యొక్క అనాదీ స్వరూపం, నిరాకారి స్థితిలో స్థితులవ్వడం కూడా సహజంగా అనుభవం అవుతుందా? సాకారీ స్వరూపం ఆది స్వరూపం, నిరాకారి అనాది స్వరూపం. ఆది స్వరూపం సహజం అనిపిస్తుందా, లేక అనాది రూపంలో స్థితులవ్వడం సహజం అనిపిస్తుందా? అది అవినాశీ స్వరూపం మరియు సాకారీ స్వరూపం పరివర్తన అయ్యే స్వరూపం. మరైతే ఏది సహజంగా ఉండాలి? సాకారీ స్వరూపం యొక్క స్మృతి స్వతహగా ఉంటుందా, లేక నిరాకారీ స్వరూపం యొక్క స్థితి స్వతహగా ఉంటుందా లేదా స్మృతిలోకి తెచ్చుకోవాల్సి వస్తుందా, నేను ఎవరు, ఎలాంటి వాడినో దానిని స్మృతిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఇప్పటి వరకు స్మృతి స్వరూపంగా తయారుకాలేదా? ఇదే అంతిమ స్థితియా? లేక చాలా సమయం యొక్క అభ్యాసియే అంతిమంలో ఆ స్థితిని పొంది పాస్ విత్ ఆనర్ అవుతారా? వర్తమాన సమయంలో పురుషార్థీల మనసులో ఈ సంకల్పం వస్తుంది - అంతిమంలో విజయీ అవుతాం లేదా అంతిమంలో నిర్విఘ్న మరియు విఘ్న వినాశకులు అవుతామని. ఈ సంకల్పమే రాయల్ రూపం యొక్క సోమరితనం అంటే రాయల్ మాయ. ఇది సంపూర్ణంగా తయారవ్వడంలో విఘ్నం వేస్తుంది. ఈ సోమరితనమే సఫలతామూర్తిగా మరియు సమానమూర్తిగా అవ్వకుండా చేస్తుంది. రెండవ సంకల్పం - వినాశనం యొక్క ఘడియలు లెక్కించుకుంటున్నారు. ఏమవుతుందో, ఎలా అవుతుందో, అవుతుందో అవ్వదో అని ఆలోచిస్తున్నారు. ఇది నిదానమైన స్వరూపం కాదు, ఇది సంశయం యొక్క రూపం. అందువలనే నిదానము అనే మాట వాడకుండా రాయల్ అనే మాట మాట్లాడుతున్నారు. ఏమవుతుందో? ఎలా అవుతుందో? ఈ స్వరూపంతో ఆలోచిస్తున్నారు. సమయం ఎంత సమీపంగా వస్తూ ఉందో అంతగా స్వయాన్ని సత్యయుగ దేవీ దేవతల యొక్క విశేషతలకు సమీపంగా తయారు చేసుకుంటున్నారా? వినాశనం ఎవరి కోసం అవుతుంది, ఎవరి కోసం అవుతుందో తెలుసా? తీవ్రపురుషార్థీలు లేదా సంపూర్ణంగా తయారైన ఆత్మల కోసం సంపూర్ణ సృష్టి లేదా సతోప్రధాన ప్రకృతి యొక్క ప్రాలబ్దాన్ని అనుభవించేందుకు వినాశనం జరగాలి. మరైతే వినాశనం యొక్క ఘడియలు లెక్కించుకుంటూ ఉండాలా లేదా స్వయాన్ని సంపూర్ణ సతోప్రధానంగా తయారుచేసుకునేటందుకు బాబా సమాన లక్షణాలను మాటిమాటికి లెక్కించుకుంటూ ఉండాలా? వినాశన ఘడియల కోసం ఎదురు చూడడానికి బదులు, ఇప్పటి నుండే స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోవడంలో, మరియు బాబా సమానంగా తయారయ్యి తయారుగా ఉండాలి. కానీ ఎదురు చూడడంలో ఎక్కువగా ఉంటున్నారు. ప్రాలబ్దం అనుభవించేవారే ఇలా ఎదురుచూడడంలో ఉంటే సాధారణ ప్రాలబ్ధం పొందే ఇతర ఆత్మల వరకు కూడా ఈ సూక్ష్మ సంకల్పం చేరుతుంది. ఫలితం చూస్తే ఎక్కువమంది ఆత్మలు ఏమంటున్నారంటే వినాశనం ఉనప్పుడు చూద్దాం. ప్రత్యక్ష ప్రభావం చూసినప్పుడు మేము కూడా పురుషార్థం చేసేస్తాం, ఏమవుతుందో, ఎలా అవుతుందో ఇది ఎవరికి తెలుసు, నిమిత్తం అయిన ఆత్మల యొక్క ఈ తరంగాలు ఇతరులను కూడా బలహీనంగా చేయడానికి లేదా భాగ్యహీనులుగా చేయడానికి కారణం అవుతున్నాయి. ఈ సమయంలో మీ అందరిదీ జగన్మాత, జగత్ పిత లేదా మాస్టర్ రచయిత స్థితి. కనుక రచయిత యొక్క ప్రతి సంకల్పం లేదా వృత్తి యొక్క తరంగాలు రచనలో స్వతహగానే వచ్చేస్తాయి. అందువలన వర్తమాన సమయంలో నేను ఏదైతే కర్మ చేస్తానో అది చూసి అందరూ చేస్తారు. కేవలం ఈ ధ్యాస పెట్టుకోవడమే కాదు, కానీ దాంతో పాటు నేను ఏ సంకల్పం చేస్తానో, నా వృత్తి ఎలా ఉంటుందో, వాయు మండలంలో లేదా ఇతరాత్మలకు అలాంటి తరంగాలు వ్యాపిస్తాయి అనే ఈ స్లోగన్ కూడా స్మృతిలో ఉంచుకోవడం అవసరం. లేకపోతే రచయితలైన మీ యొక్క రచన బలహీనంగా అంటే తక్కువ పదవి పొందేవారిగా అయిపోతారు. రచయిత యొక్క లోపం రచనలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన ఇప్పుడు మీ బలహీన సంకల్పాలను కూడా సమర్ధవంతంగా తయారు చేసుకోండి. సంకల్పంతో సృష్టిని రచించారు అని మహిమ ఉంది. అది ఈ సమయం యొక్క మహిమే. ఎలాంటి సంకల్పమో అలాంటి మీ రచన రచించడానికి నిమిత్తం అవుతారు. అందువలనే ప్రతి నక్షత్రంలో వేర్వేరు ప్రపంచం ఉందని చెబుతారు. అనేక ఆత్మలకి నేను ఆధారం అని స్మృతిలో ఉంచుకుంటూ నడుస్తున్నారా? లేక ఇది బాప్ దాదా పనా? మీ పనియా లేక బాబా పనియా? ప్రాలబ్దం పొందేవారు పురుషార్ధం చేయాలా లేక బాబా చేయాలా? తీసుకోవడంలో కొంచెం కూడా తక్కువ చేసుకోకూడదనుకుంటున్నారు. లేదా తీసుకునే సమయంలో ఎవరితోనూ తక్కువగా భావించడం లేదు. నాకు కూడా అధికారం ఉందనుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని చేయడంలో కూడా మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తున్నారా? లేక చేసే సమయంలో మేము చిన్నవాళ్ళం ఇది పెద్దవాళ్ళ పని అని అనుకుంటున్నారా? తీసుకునే సమయంలో అయితే చిన్నవాళ్ళమైనా మేము తక్కువ కాదు అంటున్నారు. చిన్నవారికి కూడా అన్ని అధికారాలు కావాలనుకుంటున్నారు. చిన్నవారిని కూడా పెద్దగా భావించాలా లేక తయారవ్వాలా? ఏది చేస్తారో అది పొందుతారా లేక ఏది ఆలోచిస్తారో అది పొందుతారా? నియమం ఏమిటి? ఆలోచించడం, మాట్లాడడం మరియు చేయడం ఈ మూడు ఒకేలా సమానంగా తయారుచేసుకోండి. ఆలోచించడం మరియు మాట్లాడడం చాలా గొప్పగా చేయడం ఏమీ లేదు. ఇలాంటి వారు ఆలోచిస్తూ మరియు మాట్లాడుతూనే సమయం అంతా గడిపేస్తారు. చేయడం ద్వారా ఏదైతే పొందాలో అది వారు పొందలేరు. స్వయాన్ని శ్రేష్ట పదవి నుంచి వంచితం చేసుకుంటారు. తమ రచనని కూడా వంచితం చేస్తారు. అందువలన చెప్పడం తక్కువ చేయడం ఎక్కువ ఉండాలి. శ్రమ చేసి పొందుతాను అనే లక్ష్యం సదా గుర్తు పెట్టుకోండి. నన్ను కూడా మహరథీగా లేదా సేవాధారిగా భావించాలి. నాకు కూడా అధికారం ఇవ్వాలి, స్నేహం లేదా సహయోగం ఇవ్వాలి. ఇవన్నీ అడిగే వస్తువులు కాదు. అడిగే విషయాలు కాదు. శ్రేష్ట కర్మ, శ్రేష్ట వృత్తి, శ్రేష్ఠ సంకల్పానికి సిద్ధి రూపంలో ఈ అన్ని విషయాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. అందువలన ఈ సాధారణ సంకల్పాలలో లేదా వ్యర్ధ సంకల్పాలలో స్వయాన్ని వ్యర్ధంగా పొగొట్టకండి. అర్థమైందా!
                      ఈవిధంగా బాబా సమానంగా గుణాలు మరియు కర్మ చేసేవారికి, ప్రతి సంకల్పంలో బాధ్యత ఉంది అని భావించే వారికి సంకల్పంలో కూడా సోమరితనం తొలగించుకునేవారికి, సదా బాబా సమానమైన బాబాకి సాథీ అయి తోడు నిలుపుకునేవారికి, ప్రతి పాత్రను సాక్షిగా వ్యవహరించే వారికి, సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments