08-12-1975 అవ్యక్త మురళి

08-12-1975         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పిల్లల యొక్క విభిన్న స్థితులు.

                     సదా విజయీ స్వరూపంగా తయారుచేసేవారు, సర్వ వరదానాలకు అధికారి మరియు విశ్వం ద్వారా సదా సత్కారీగా తయారుచేసేవారు, విశ్వకళ్యాణకారి తండ్రి మాట్లాడుతున్నారు -
                    అశరీరి భవ! ఈ వరదానాన్ని పొందారా? నేను అశరీరిని అని ఏ సమయంలో సంకల్పం చేస్తారో అదే సెకెనులో స్వరూపంగా అయిపోండి. ఇలాంటి సహజ అభ్యాసం ఉందా? ఇది సహజంగా అనుభవం అవ్వడమే సంపూర్ణతకు గుర్తు. అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టం, ఒక్కొసారి సెకెనులో, ఒక్కోసారి నిమిషంలో లేదా ఇంకా ఎక్కువ సమయంలో అశరీరి స్వరూపం యొక్క అనుభవం అవుతుందంటే సంపూర్ణ స్థితికి ఇప్పటికీ దూరంగానే ఉన్నట్లు. ఈ అభ్యాసం సదా సహజంగా అనుభవం అవ్వడమే సంపూర్ణతకు పరిశీలన.
                  1) ఇప్పుడిప్పుడే బాప్ దాదా విదేశము మరియు భారతదేశం యొక్క పిల్లలందరినీ చూసి వచ్చేటందుకు బయలుదేరారు. చుట్టూ తిరుగుతూ విశేషంగా ఏ విషయం చూశారు; మూడు రకాలైన పిల్లలను చూశారు. ఒకటి జ్ఞానరత్నాలు మరియు స్మృతిశక్తి ద్వారా సర్వశక్తులను స్వయంలో సంపన్నం చేసుకునేవారు, నిరంతరం చైతన్య ఛాత్రకులై ప్రతి సెకెను తీసుకునేవారు అనగా ధారణ చేసేవారు. వీరికి ప్రాప్తి పొందాలని లేదా స్వయాన్ని సంపన్నంగా తయారుచేసుకోవాలనే ఉంటుంది. కాని మరే ఇతర తగుల్పాటు ఉండదు. రాత్రయినా పగలైనా సంలగ్నత ఏకరసంగా ఉంటుంది. ఇలాంటి చైతన్య ఛాత్రకులు విదేశంలో కూడా ఉన్నారు మరియు భారతదేశంలో కూడా రెండు స్థానాల్లోనూ చూశారు.
                2) సేవా సంలగ్నతలో నిమగ్నమై ఉన్నవారు. వీరు రాత్రిపగలు సేవా ప్లాన్లు తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు. సేవకు ఫలస్వరూపంగా స్వయంలో సంతోషాన్ని అనుభవం చేసుకునేవారు. కానీ సర్వశక్తుల్లో, ప్రతి సంకల్పంలో, మాయాజీత్ గా అయ్యే శక్తిలో లేదా అశరీరి భవ అనే వరదానం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకోవటంలో సదా ఏకరస స్థితిలో లేరు. విశేషంగా సంతోషం యొక్క అనుభవం చేసుకుంటారు. కానీ శక్తి యొక్క అనుభవం తక్కువ చేసుకునేవారు వీరు. జ్ఞానసాగరుల యొక్క అనుభవం ఎక్కువ ఉంటుంది. కానీ శక్తిశాలి అనే అనుభవం తక్కువ ఉంటుంది. జ్ఞానాన్ని ఎక్కువ స్మరణ చేస్తారు కానీ సమర్ధ స్వరూపంగా తక్కువగా ఉంటారు. ఇలాంటి పిల్లలను చూశారు.
                3) రాత్రిపగలు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకుని సంపూర్ణంగా తయారవ్వాలనే శుభఆశ పెట్టుకుని సదా పురుషార్ధంలో నిమగ్నమై ఉంటారు. పురుషార్ధంలో ఎక్కువ సమయం మరియు ప్రాప్తి యొక్క సమయం తక్కువగా అనుభవం చేసుకుంటారు. ఏదో ఒక సమస్యను ఎదుర్కోవడంలోనే ఎక్కువ సమయం ఉపయోగించేవారిగా ఉంటారు. కష్టాన్ని సహజం చేసుకోవటంలో నిమగ్నమై ఉంటారు. ఇలాంటి పిల్లలు చాలా సమయం యుద్ధ స్థలంలోనే స్వయాన్ని అనుభవం చేసుకుంటారు. అతీంద్రియసుఖం యొక్క ఊయల్లో అనగా ప్రాప్తి యొక్క అనుభవంలో తక్కువ సమయం ఉంటారు. ఇలాంటివారు కూడా చాలామంది ఉన్నట్లు చూశారు. మొదటి నెంబర్ ఛాత్రకుల స్థితి సదా ఇదే ఉంటుంది. ఏదైతే పొందాలో అది పొందారు. ఇప్పుడు సమయం కూడా కొంచెమే ఉంది. రెండవ నెంబర్ వారు సేవాధారులు, వీరు జ్ఞానసాగరులుగా ఎక్కువగా ఉంటారు. కానీ శక్తిశాలిగా తక్కువగా ఉంటారు. వీరి స్థితి ఎలా ఉంటుందంటే పొందాము., కలుసుకుంటున్నాము మరియు పొందుతాము అనే నిశ్చయంలో ఉంటారు. సంతోషం యొక్క ఊయల్లో ఊగుతూ ఉంటారు కానీ మధ్యమధ్యలో ఊయల బాగా ఊగేటందుకు ఏదోక ఆధారం అవసరం అవుతుంది, ఆ ఆధారం ఏమిటి? చేసిన సేవకు ఇతరుల ద్వారా ధైర్యము, ఉల్లాసము ఇచ్చేవిధంగా అనగా చాలా మంచిది, చాలా బాగుంది అనేవారిగా ఉంటారు. అలా లేకపోతే సంతోషం యొక్క ఊయల ఊగుతూ ఊగుతూ ఆగిపోతుంది. ఆగిపోయిన దానిని మరలా నడిపించాలి కదా. మొదటి స్థితి వారికి స్వతహా ఊయల, మూడవ స్థితి గల వారికి అప్పుడప్పుడు ప్రాప్తి లేదా విజయం ఆధారంగా అతి హర్షితం మరియు అప్పుడప్పుడు మాటిమాటికి యుద్ధం యొక్క పరిస్థితిలో అలసటను అనుభవం చేసుకునేవారిగా ఉంటారు. ఏదో ఒక సాధనం ఆధారంగా స్వయాన్ని కొద్ది సమయం కొరకు సంతోషాన్ని అనుభవం చేసుకునేవారిగా ఉంటారు. ఒక్కోసారి సంతోషం, ఒక్కోసారి ఫిర్యాదులు. ఫిర్యాదులు అనగా ఏమి చేయను, ఎలా చేయను, చేస్తున్నాను, ఇంతగా శ్రమిస్తున్నాను, నా అదృష్టమే ఇంత, డ్రామాలో నా పాత్ర ఇలాగే నిర్ణయించబడి ఉంది మరియు కల్పపూర్వం కూడా ఇంతే చేశాను, ఇలా ఒక్కోసారి ఉన్నతంగా, ఒక్కోసారి నీచంగా ఈ మెట్లపై ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఈరకంగా మూడురకాలైన పిల్లలను చూశారు. సమయ ప్రమాణంగా వర్తమాన స్థితి ఎలా ఉండాలంటే ప్రతి సమయం సర్వప్రాప్తుల యొక్క అనుభవం అవుతుండాలి. ఈ చివరి సమయంలో యుద్ధంలో ఉండడం కాదు, సదా విజయీ స్థితి యొక్క నషాలో ఉండాలి. ఎందుకంటే బాబా సర్వశక్తుల్లో మనల్ని మాస్టర్ గా తయారుచేశారు. స్వయం కంటే కూడా శ్రేష్ఠ ప్రాప్తికి అధికారిగా తయారుచేశారు. ఇలాంటి మాస్టర్ లేదా సర్వాధికారి రెండవ లేదా మూడవ స్థితి యొక్క అనుభవంలో కాదు, మొదటి స్థితి యొక్క అనుభవంలో ఉండాలి. విదేశీ గ్రూపుని లాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంటారు కదా! ఫాస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు. కనుక విదేశీ గ్రూపు ఎవరైతే వచ్చారో వారందరూ మొదటి స్థితి కలిగినవారే కదా! మొదటి స్థితి అనగా సదా అనుభవీ మూర్తి. ప్రతి సెకెండ్ అనుభవంలో నిమగ్నమై ఉండేవారు. అలా ఉన్నారు కదా! అప్పుడప్పుడు మరియు ఇప్పుడిప్పుడే ఇలా అనేవారు కాదు కదా! ఒకసారి ఇలా అవుతుంది, ఇంకోసారి అలా అవుతుంది ఇలా లేరు కదా, సదా ఏకరసంలో ఉండేవారు, ఒకని ద్వారానే సర్వప్రాప్తులు పొందేవారు అలాంటివారినే ఫస్ట్ అని అంటారు. బాప్ దాదాకు కూడా ఇలాంటి లాస్ట్ సో ఫాస్ట్ పిల్లలపై గారాబముంది. ప్రతి ఒక్కరి మస్తకం యొక్క అదృష్టరేఖను బాప్ దాదా చూస్తారు. ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు ఏమిటి అని, భవిష్యత్తుని చూసి హర్షిస్తారు. ఇప్పుడు వచ్చిన గ్రూపులో కూడా మంచి ఆశావంతులైన పిల్లలున్నారు, వారు విశ్వానికి దీపంలా అయి బాబా సమానంగా అనేకులకు మార్గం చెప్పటానికి నిమిత్తం అవుతారు. ఇప్పుడైతే విశేషంగా విదేశీయుల కోసం కదా. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు ఎదురుగా మరియు కొంతమంది విదేశాల్లో రాత్రి పగలు ఇదే స్మృతిలో ఉన్నారు. వారు ఏమి అనుభవం చేసుకుంటున్నారు - రేడియోలో లేదా టీవీలో ఏదైనా విశేష కార్యక్రమం రాబోతుందంటే అందరూ తమ తమ స్విచ్ లు ఆన్ చేసుకుని పెట్టుకుంటారు కదా! అందరి ధ్యాస ఒకవైపే ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో కూడా నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ స్మృతి అనే స్విచ్ ఆన్ చేసుకుని కూర్చున్నారు. అందరి సంకల్పం ఇదే, ఒకే మధువనం యొక్క స్పృతిలో ఉన్నారు. దూరంగా ఉంటూ కూడా కొంతమంది పిల్లలు బాబాకి ఈ సంఘటనలో సన్ముఖంగా కనిపిస్తున్నారు. మంచిది.
                    ఈవిధంగా సాకార రూపంలో ఎదురుగా కూర్చునేవారికి లేదా ఆకారీ రూపంలో బుద్ధి యోగం ద్వారా ఎదురుగా కూర్చునేవారికి, సదా విజయీ స్వరూపులకు, అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగేవారికి, ప్రాప్తి స్వరూపులకి, సర్వ వరదానాలకు అధికారి, విశ్వం ద్వారా సదా సత్కారి, విశ్వం పట్ల సదా కళ్యాణి ఇలాంటి విశ్వానికి దీపాలైన వారికి, హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments