08-12-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
శక్తుల యొక్క సిద్ధి ద్వారానే మహారథి యొక్క పరిశీలన.
సర్వశక్తులు మరియు సిద్ధుల యొక్క వరదానమిచ్చే సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
ప్రతి ఒక్కరి మస్తకం ద్వారా మస్తకమణిని చూస్తూ అదృష్టరేఖను గుర్తించగలుగుతున్నారా? మస్తకం మధ్యలో మెరిసే మణి అనగా శ్రేష్ట ఆత్మ యొక్క తరంగాల ద్వారా సహజంగానే గ్రహించవచ్చు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క పురుషార్థం లేదా ప్రాప్తి యొక్క అనుభవం తరంగాల ద్వారా సహజంగానే అర్థమైపోతుంది. సువాసన కలిగించేది ఏదైనా కానీ వాతావరణంలో వెంటనే వ్యాపించేస్తుంది, దాని ద్వారా అది బాగుందో లేదో సహజంగానే గ్రహించవచ్చు. అదేవిధంగా ఎంతెంత పరిశీలనా శక్తి పెరుగుతుంటుందో అంతగా ఏ ఆత్మ ఎదురుగా వచ్చినా కానీ వారు ఎంతవరకు ఆత్మీయతను అనుభవం చేసుకున్నారో వారి వైబ్రేషన్ ద్వారా వెంటనే స్పష్టంగా తెలిసిపోతుంది. ఎంత శాతం అనే పరిశీలన కూడా సహజంగా వచ్చేస్తుంది. వారు ఎంత శాతం ఆత్మిక స్థితిలో స్థితులై ఉన్నారో తెలిసిపోతుంది. ఎలాగైతే విజ్ఞాన యంత్రాల ద్వారా శాతం తెలిసిపోతుందో అలాగే శాంతి శక్తి ద్వారా, ఆత్మ యొక్క స్థితి ద్వారా ఇది కూడా తెలిసిపోతుంది. దీనినే పరిశీలనా శక్తి అని అంటారు. సంస్కారాల ద్వారా, మాటల ద్వారా మరియు నడవడిక ద్వారా పరిశీలించడం అనేది సాధారణ విషయం. కానీ సంకల్ప తరంగాల ద్వారా పరిశీలించడం దీనినే పరిశీలనా శక్తి అని అంటారు. అర్ధమైందా! మహారథీల పరిశీలనా శక్తి ఈ విధంగా ఉంటుంది. ఎలాగైతే ఎదురుగా ఉన్నవారిని ఎలా పరిశీలించగలమో అలాగే ఎవరైనా ఎదురుగా లేకపోయినా, కానీ లేదా రాబోతున్నా కానీ లేదా దూరంగా ఉన్నా కానీ పరిశీలనా శక్తి ఆధారంగా వారిని కూడా పరిశీలించగలరు. దీనినే మరోమాటలో శక్తుల యొక్క సిద్ధి అని అంటారు. ఈ సిద్ధి ప్రాప్తిస్తుంది. ఆత్మజ్ఞానులకు కూడా వారి నోటి నుండి ఏదైనా మాట్లాడినా, మాట్లాడకపోయినా ఏమి మాట్లాడాలనుకుంటున్నారో వారికి తెలిసిపోతుంది. అలాంటి సిద్ధి వారికి ఉంటుంది. ఏమి చేయబోతున్నారో ముందుగానే పరిశిలించేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా పరిశీలనాశక్తి సిద్ధిరూపంలో ప్రాప్తిస్తుంది. కాని ఈ శక్తులను యదార్థరీతిగా ఉపయోగించాలి. వ్యర్ధంగా పోగొట్టకూడదు మరియు వ్యర్ధకార్యాల్లో ఉపయోగించకూడదు. అప్పుడు ఈ సిద్ధి లేదా శక్తి చాలా కళ్యాణానికి నిమిత్తం అవుతుంది. ఇలా కూడా జరుగుతుంది. మీరు ఇలాంటివారు అలాంటివారు అని... భక్తిలో శక్తుల యొక్క మహిమ ఏదైతే చేస్తారో అలాగే వారిని చూసి కూడా అందరి నోటి నుండి మహిమ వస్తుంది. ఈ మహిమ మొదట ప్రత్యక్ష రూపంలో ఉంటుంది, ఆ తరువాత స్మృతిచిహ్నరూపంలో నడుస్తుంటుంది. కొద్ది సమయం కొరకు కొద్దిమందికి ఇలాంటి స్థితి కూడా ఉంటుంది. అందువలనే అంటారు ఎవరైతే అంతిమం వరకు ఉంటారో వారికి ఈ అన్ని దృశ్యాలు చూసే మరియు అనుభవం చేసుకునే ప్రాప్తి లభిస్తుంది. అంతిమం వరకు వ్రేలు ఇచ్చే పాత్ర కూడా ఇలాంటి శక్తులకే ఉంటుంది కదా? శక్తులకా లేక పాండవులకా? శక్తిస్వరూపులకే ఉంటుంది, బలహీనులకు ఉండదు. ఒకవైపు హాహాకారాలు, మరోవైపు జైజై కారాలు రెండూ వెనువెంట ఉంటాయి, అవి కూడా అతిలో ఉంటాయి, ఇవి కూడా అతిలో ఉంటాయి. మంచిది.
Comments
Post a Comment