08-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యేటందుకు ప్రేరణ.
విశ్వమనే బేహద్ డ్రామాలో ముఖ్యమైన లేదా విశేషమైన పాత్రధారిగా తయారుచేసే మరియు అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన సూర్యుడైన శివబాబా మాట్లాడుతున్నారు -
స్వయాన్ని బాప్ దాదాకి అలంకరణగా, బ్రాహ్మణ కులానికి అలంకరణగా, విశ్వానికి అలంకరణగా, మీ యొక్క ఇంటికి అలంకరణగా భావిస్తున్నారా? బాబా తన పిల్లల్ని శిరోకిరీటాలుగా, కంఠహరాలుగా భావిస్తారు. అందువలన మీరు బాప్ దాదాకి అలంకరణయే కదా! మీ ఇల్లు అనగా పరంధామం లేదా శాంతిధామంలో కూడా అందరూ మెరుస్తున్న సితారలవలె ఆత్మలుగా ఉంటారు. వారి మధ్యలో మీరు విశేషంగా మెరుస్తూ ఆ ఇంటికే అలంకారంగా ఉంటారు. అదేవిధంగా సాకార సృష్టి అనగా విశ్వమనే నాటకంలో హీరో పాత్రధారులు. అనగా విశేష పాత్రాభినయించే విశేషాత్మలు. అంటే విశ్వానికి కూడా అలంకరణే కదా మీరు. ఈ విధంగా మిమ్మల్ని మీరు శ్రేష్ట అలంకారంగా భావిస్తూ నడుస్తున్నారా? ఈరోజు బాప్ దాదా తన అలంకారాలను చూస్తున్నారు. ఏమి చూశారు అందరినీ మెరుస్తున్న మణుల రూపంలో చూశారు. అందరి రూపం మెరుస్తున్న మణియే కానీ తప్పకుండా నెంబర్ వారీగానే ఉంటారు. మూడు అలంకారాల్లో మణులను చూశారు. మొదటి అలంకారం శిరోకిరీటంలో మస్తకం మధ్యలో మెరుస్నున్న మణులను చూశారు. అందరి రూపం మెరుస్తున్న మణియే, మూడు రకాల మణులలో తమ తమ విశేషతలను చూశారు. మొదటి నెంబర్ యొక్క మణులు అనగా కిరీటంలో మెరిసేటటువంటి మణుల యొక్క విశేషత ఏమిటంటే ఈ మణులన్నీ బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా మెరుస్తూ ఉన్నారు. సూర్య కిరణాలు విశ్వాన్ని ప్రకాశమయం చేస్తాయి, నలువైపులా అంధకారాన్ని దూరం చేస్తాయి. అదేవిధంగా మాస్టర్ జ్ఞానసూర్య స్వరూప మణులు తమ యొక్క సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వెదజల్లుతున్నట్లుగా చూశారు. ప్రతి ఒక్కరి యొక్క ప్రతి శక్తిరూపీ కిరణాలు బేహద్ గా విశ్వం వరకు చేరుకుంటున్నాయి, హద్దు వరకు కాదు, ఒకరి వరకు కాదు, కొద్దిమంది ఆత్మల వరకు కాదు, కాని విశ్వం వరకు వ్యాపిస్తున్నాయి. దీనితో పాటు మీరు బాబా సమానంగా సర్వ గుణాలలో మాస్టర్ సాగరులు. దీనికి గుర్తుగా ప్రతి మణిలో సర్వ రంగులు ఇమిడి ఉంటాయి. ఒక మణిలో సర్వ రంగుల మెరుపు ఉంది. ఇటువంటి మాస్టర్ గుణసాగరులు తమ సర్వ రంగుల యొక్క మెరుపుతో మెరుస్తూ ఉండేటటువంటి మణులు కిరీటానికే శ్రేష్ఠ శోభ. కిరీటంలో మస్తకం మధ్యలో ఇమిడి ఉన్నటువంటి ఆ మణులు బాప్ దాదా యొక్క విశేష అలంకార రూపంలో కనిపించారు. ఈ విశేష మణులు మస్తకం మధ్యలో ఇమిడి ఉండడంలో కూడా రహస్యం ఉంది. ఈ విశేష మణులు సదా సాకార రూపంలో మస్తకం మద్యలో మెరుస్తున్న మణి అనగా ఆత్మ స్వరూపంలో సదా స్థితి అయి ఉంటారు. సాకార సృష్టిలో ఉంటూ కూడా బుద్ధి సదా బాబా స్మృతిలో, ఇంటి స్మృతిలో, రాజధాని స్మృతిలో మరియు ఈశ్వరీయ సేవ యొక్క స్మృతిలో ఇమిడి ఉంటుంది. అందువలన వీరి యొక్క స్థానం కూడా వీరి ఉన్నత స్థితికి గుర్తుగా మస్తకం మధ్యలో అతికించబడినట్లుగా కనిపించారు మరియు ఇలాంటి ఆత్మలు సదా ఉన్నత స్మృతిలో ఉన్నత దృష్టి, ఉన్నత వృత్తి మరియు ఉన్నత ప్రవృత్తిలో ఉంటారు. అందువలనే వీరికి ఉన్నతమైన స్థానం అనగా శిరోకిరీటంలో ప్రాప్తించింది. అన్నింటికంటే ఉన్నతమైన అలంకారం కిరీటం, ఉన్నత స్థితికి గుర్తు కిరీటం మరియు యజమాని స్థితికి కూడా గుర్తు కిరీటం మరియు సర్వ ప్రాప్తులకు గుర్తు, అధికారి స్థితికి గుర్తు ఇలాంటి మస్తకమణులు లేదా కిరీటంలో అలంకరించబడిన మణుల యొక్క విశేషత విన్నారు కదా! ఇలాంటి విశేష మణులు చాలా కొద్దిమంది కనిపించారు. వీరు మొదటి నెంబర్ మణులు మరియు మొదటి నెంబర్ అలంకారం.
ఇప్పుడు రెండవ అలంకారం - బాప్ దాదా యొక్క కంఠహరంలోని మణులు. వీరి యొక్క విశేషత ఏమిటి మరియు ఆధారం ఏమిటి? వీరు కూడా తమ తమ మెరుపులను నలువైపులా వ్యాపిస్తూ ఉన్నారు, కానీ తేడా ఏమిటి? మొదటి నెంబర్ యొక్క మణుల యొక్క శక్తి కిరణాలు నలువైపులా సమానంగా వ్యాపించబడి ఉన్నాయి. కానీ కంఠహరంలోని మణుల యొక్క కిరణాలు అన్నీ సమానంగా లేవు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని కిరణాలు బేహద్ వరకు, కొన్ని హద్దు వరకు ఉండిపోయాయి. అనగా బాబాకి సమీపంగా ఉన్నారు, కానీ బాబా సమానంగా లేరు. సర్వ గుణాల రంగులో రంగరించబడి ఉన్నారు, కానీ సర్వ రంగులు స్పష్టంగా లేవు. స్నేహం మరియు సహయోగం ఆధారంగా బాప్ దాదాకు బలిహరం అయ్యారు. అందువలన కంఠహరం అయ్యారు. ఇలాంటి ఆత్మలు సదా కంఠం ద్వారా అనగా నోటి మాట ద్వారా బాబా యొక్క మహిమ చేసి బాబా పరిచయాన్ని ఇచ్చి బాబాకి సమీపంగా తీసుకువస్తారు. అనగా వాచా సబ్జెక్టులో పూర్తిగా పాస్ అవుతారు. కానీ మనస్సు యొక్క సబ్జెక్టులో పూర్తి పాస్ అవ్వరు. సదా స్మృతిస్వరూపంగా ఉండరు, కానీ సదా స్మృతి ఇప్పించే స్వరూపంగా ఉంటారు. దీని ఆధారంగా బాబాకి సమీపంగా, బాబా కంఠహారంగా అవుతారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. హరంలో ఎక్కువ మణులుంటాయి కదా! కంఠహరంలోని మణులు కిరీటంలోని మణుల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి.
ఇక మూడవ అలంకారం - చేతి గాజులు. వీరి యొక్క విశేషత మరియు ఆధారం ఏమిటి? చేతులు సహయోగానికి లేదా సహయకారి అయిన దానికి గుర్తుగా మహిమ చేయబడతాయి. చేతులకు హరం లేదా గాజులు రెండూ ఒకటే. గాజులను చేతిహారంగా చెబుతారు కదా! మరి వీరి విశేషత ఏమి చూశారు? వీరి కిరణాల యొక్క మెరుపు బేహద్ వరకు లేదు హద్దులోనే ఉంది. సర్వ గుణాలనే రంగులు కూడా లేవు. కానీ కొన్ని కొన్ని గుణాల రూపీ రంగులు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. వీరి విశేషత ఏమిటంటే ప్రతి సేవా కార్యంలో సదా సహయోగిగా ఉంటారు. అనగా కర్మణా సబ్జెక్టులో ఫుల్ పాస్ అవుతారు. సేవార్థం తనువు, మనసు, ధనంతో సదా ఎవరెడీగా ఉంటారు. బాబాపై స్నేహం అనే బాహువుల్లో సదా ఇమిడి ఉంటారు మరియు బాప్ దాదా యొక్క హస్తాన్ని సదా తమపై ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. సదా వెంట ఉండేవారిగా కాదు కానీ తమపై చేయి ఉన్నట్లుగా అనుభవం చేసుకునేవారిగా ఉంటారు. వీరి యొక్క సంఖ్య కూడా ఎక్కువే, వీరు సహయోగి ఆత్మలు. వారు సమాన ఆత్మలు మరియు రెండవ నెంబరు సమీప ఆత్మలు. మూడు రకాల అలంకారాల గురించి అరమైందా? ఇలా ఈ రోజు పిల్లలందరినీ మూడు రకాలైన అలంకారాలుగా చూశారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. నేనెవరు? ఈరోజు యొక్క సమాచారం ఇది. సూక్ష్మవతనం యొక్క సమాచారం వినాలని ఆసక్తి ఉంటుంది కదా! మంచిది.
ఈవిధమైనటువంటి నెంబర్‌వారీ సర్వ అలంకారాల యొక్క మణులకు, సదా బాప్ దాదా యొక్క స్మృతిలో ఉండే సమర్ధ ఆత్మలకు మరియు సదా సర్వుల పట్ల శుభ చింతకులకుగా ఉండే పిల్లలకు బాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment