08-07-1974 అవ్యక్త మురళి

08-07-1974         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మాస్టర్ జ్ఞానసాగరులు మరియు సర్వశక్తివంతులు రకరకాలైన క్యూ(వరుసలు)ల నుండి ముక్తి.

                             సర్వ సంబంధాల యొక్క రసన ఇచ్చేటువంటి, సర్వ కోరికలు పూర్తి చేసేటువంటి అవ్యక్తమూర్తి బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                            ఈ రోజు ఏ మేళా అని అంటారు? తండ్రి మరియు పిల్లల యొక్క మేళా. అదైతే లౌకిక సంబంధంలో కూడా ఉంటుంది. కానీ ఈ రోజు ఈ మేళా యొక్క విశేషత ఏమిటి? ఇది ఎక్కడ కూడా ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల మేళాయే కానీ అలౌకిక విషయం చెప్పండి. దీని విశేషత ఏమిటంటే - ఈ మేళా ఒకే సమయంలో, ఒకనితోనే సర్వ సంబంధాలతో, సర్వ సంబంధాల స్నేహం మరియు ప్రాప్తిని పొందే మేళా. కేవలం తండ్రి మరియు పిల్లలు, సద్గురువు  మరియు అనుసరించేవారి లేదా సమానంగా అయ్యేటువంటి ఆజ్ఞాకారి పిల్లలది కాదు. కానీ ఒకే సమయంలో ఒకనితోనే సర్వ సంబంధాలతో కలయిక జరుపుకునే అలౌకిక మేళా. ఈ అలౌకికత  లేదా విశేషత ఇంకెక్కడ లభించదు. ఇటువంటి మేళా జరుపుకునేటందుకు అందరు సాగరుని ఒడ్డుకి వచ్చారు. సర్వ సంబంధాలతో సర్వ ప్రాప్తులు లభిస్తున్నప్పుడు కేవలం ఒకటి, రెండు సంబంధాలతో కలుసుకోవటం లేదా ప్రాప్తిని పొందటంలో రాజీ అవ్వకూడదు. కొద్దిలో రాజీ  అయ్యేవారిని భక్తులు అంటారు. పిల్లలు అంటే సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులకు అధికారులు. ఈ అధికారాన్ని పొందే జ్ఞానీ ఆత్మలు మరియు యోగీ ఆత్మలు అంటే బాబాకి  ప్రియం. ఇలా బాబాకి ప్రియంగా అయ్యామా? అని స్వయాన్ని అడగండి. బాబా సమానంగా నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, నష్టోమోహ మరియు స్మృతి స్వరూపంగా అయ్యారా? స్మృతి స్వరూపంగా అయ్యేవారి గుర్తు ఏమి అనుభవం అవుతుంది? వారు సదా సర్వ సమర్థ స్వరూపంగా ఉంటారు.
                          నష్టోమోహులుగా అయ్యేటందుకు సహజయుక్తి ఏమిటి? దీని యొక్క అనుభవీగా అయ్యారు  కదా? సదా స్వయం ఎదురుగా సర్వ సంబంధాలతో బాబాని చూడాలి మరియు సర్వ సంబంధాల  ద్వారా సర్వ ప్రాప్తులను చూడాలి. ఎప్పుడైతే సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులు ఒకని ద్వారా అనుభవ అవుతున్నాయో ఇక ఏ సంబందమైనా లేదా ప్రాప్తి  అయినా ఉండిపోతుందా? ఎక్కడ మోహం అంటే తగుల్పాటు ఉంటుందో అక్కడ సహజంగా మరియు స్వతహాగా అనేక వైపుల నుండి త్రెంచుకొని ఒకే  వైపు జోడించే అనుభవం అవ్వదా? ఇప్పటి వరకు ఎవరితోనైనా మరియు ఎక్కడైనా తగుల్పాటు మోహం ఉంటే దీని ద్వారా బాబాతో సర్వ సంబంధాలు మరియు సర్వ ప్రాప్తులు అనుభవం చేసుకోవటం లేదు అని ఋజువు అవుతుంది.
                         ఈరోజు  తండ్రి మరియు పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ లేదా కలయిక మేళా యొక్క సమాచారం  వినిపిస్తున్నాను. సమాచారం వినటం అంటే అందరికీ అభిరుచి ఉంటుంది కదా! ఇప్పుడు ఈ సమాచారంలో నేను ఎక్కడ ఉన్నాను? అని చూసుకోవాలి.
                         మొదట అమృతవేళ యొక్క సమాచారం వినిపిస్తాను. అమృతవేళ యొక్క రకరకాలైన ఫోజుల గురించి మరియు పొజిషన్ గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను. ఈరోజు మరొక విషయం గురించి చెప్తాను. అమృతవేళ ప్రారంభం అవుతూనే నలువైపుల ఉన్న పిల్లలందరు మొదట నెంబర్ లభించాలని పురుషార్థం చేసున్నారు లేదా సంబంధం జోడించే పురుషార్థం చేస్తున్నారు కానీ  ఏమౌతుంది? లైన్ స్పష్టంగా ఉన్న కారణంగా కొంతమందికి తొందరగా లభిస్తుంది మరియు కొంతమంది నెంబర్ కలుపుకోవటంలోనే సమయం గడిపేస్తున్నారు. కొంతమంది నెంబర్ కలవని కారణంగా బలహీనం అయిపోతున్నారు మరియు కొంతమందికి బాబాతో నెంబర్  లభిస్తుంది. కానీ మధ్య, మధ్యలో సంబంధం మాయతో కలిసిపోతుంది. ఇలా మాయ మధ్యలో ఎలా వస్తుందంటే మరలా ఆ సంబంధం త్రెంచుకోవాలన్నా త్రెంచుకోలేకపోతున్నారు. ఎలా అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో మీకు కూడా ఏదైనా రాంగ్ (తప్పు) నెంబర్ కలిస్తే వారికి  చెప్పినా కూడా కట్ చేయరు. మీరు వారికి చెప్తారు మరియు వారు మీకు కట్ చేయండి అని  చెప్తారు. అలాగే మాయ కూడా ఆ సమయంలో బలహీన పిల్లల సంబంధమే త్రెంచేస్తుంది మరియు వారిని విసిగిస్తుంది కూడా. ఎందుకు విసిగిస్తుంది అంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే వారు రోజంతా సోమరితనం మరియు బద్దకానికి వశమై ఉంటారు మరియు వారికి ధ్యాస తక్కువ అయిపోతుంది. అటువంటి సోమరితనంతో ఉండే ఆత్మలను మాయ కూడా విశేషంగా వరదాని సమయంలో బాబా యొక్క ఆజ్ఞపై నడవనివ్వకుండా మార్చేస్తుంది మరియు అటువంటి ఆత్మల దృశ్యం చాలా ఆశ్చర్యకరమైనదిగా ఉంటుంది. అమృతవేళ యొక్క ఆ కొద్ది సమయంలో అనేక స్వరూపాలు చూపిస్తారు. ఒకటి, అప్పుడప్పుడు బాబాపై స్నేహంతో సహయోగం తీసుకునే కోరిక పెట్టుకుంటారు, అప్పుడప్పుడు బాబాని సంతోషపరిచేటందుకు బాబాకే బాబా యొక్క మహిమ మరియు కర్తవ్యం యొక్క స్మృతి ఇప్పిస్తూ ఉంటారు - మీరు దయాహృదయులు,మీరు సర్వ శక్తివంతులు, వరదానీలు, మీరు పిల్లల కోసమే వచ్చారు ఇలా మొదలైనవి చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు తెలివిలోకి వచ్చి మాయతో అలజడి అయ్యి సర్వశక్తుల రూపి శస్త్రాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. వారు అప్పుడప్పుడు కత్తిని ఉపయోగిస్తారు మరియు అప్పుడప్పుడు ఢాలుని ఎదురుగా పెట్టుకుంటారు కానీ ఆవేశంతో పాటు ఆజ్ఞాకారి, నమ్మకధారి మరియు నిరంతరం స్మృతి స్వరూపంగా అయ్యే తెలివి లేని కారణంగా వారి ఆవేశం యదార్థ గమ్యానికి చేర్చటం లేదు. ఈ దృశ్యం చాలా నవ్వు వచ్చేదిగా ఉంటుంది.
                           కొంతమంది అమాయక పిల్లలు కూడా ఉంటారు. వారు ఈశ్వరీయ ప్రాప్తి మరియు మాయ యొక్క తేడాను కూడా తెలుసుకోవటం లేదు. నిద్రనే శాంతి స్వరూపం లేదా బీజరూపస్థితి అని భావిస్తున్నారు. అల్పకాలిక నిద్ర ద్వారా విశ్రాంతి యొక్క సుఖాన్ని అతీంద్రియసుఖంగా భావిస్తారు. ఇలా అనేక రకాలైన పిల్లలు మరియు అనేక రకాలైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ లెక్కపెట్టేటువంటి కొద్దిమంది మహారథీ పిల్లలు మరియు మీ లెక్కలో ఉన్నవారి కంటే తక్కువమంది అంటే మీరు ఎనిమిది మంది అని అనుకుంటారు. కానీ బాబా లెక్కలో ఎనిమిది మంది కూడా తక్కువ. ఇప్పటి వరకు అష్టరత్నాలు అష్టశక్తి స్వరూపం, సంకల్పం, మాట, కర్మలో  బాబా సమానంగా అయ్యే స్థితిని పొందుతూ ఉన్నారు. అటువంటి అష్టరత్నాలకు డ్రామానుసారం బాబా యొక్క కలయికలో విశేష అధికారం యొక్క పాత్ర నిర్ణయించబడి ఉంది. వారికి నెంబర్ లభించవలసిన అవసరం లేదు. కానీ ఆ ఆత్మలకు నిరంతరం బాబాతో సంబంధం ఉంటుంది. ఈ వైర్లెస్ సంబంధం నిర్వికారి ఆత్మలకే లభిస్తుంది. సంకల్పం చేయగానే మిలనం అయిపోతుంది. ఇటువంటి వరదాని పిల్లలు చాలా తక్కువమంది ఉంటారు. ఇది అమృతవేళ యొక్క దృశ్యం.
             బాప్ దాదా దగ్గర రోజంతటిలో 4 రకాలైన క్యూలు (వరుసలు) పెడుతున్నారు. ఒక క్యూ ఏమిటంటే - రకరకాలైన కోరికలతో వచ్చేవారి క్యూ. అప్పుడప్పుడు స్వయం కొరకు శక్తి ఇవ్వండి, సహయోగం ఇవ్వండి, బుద్ధి యొక్క తాళం తెరవండి, ధైర్యం ఇవ్వండి, ముక్తి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు సంపర్కంలోకి వచ్చే ఇతర్మాతల కోరికలను తీసుకువస్తారు - నా భర్తది లేదా ఫలానా సంబంధీకుల బుద్ధి తాళం తెరవండి అని. అప్పుడప్పుడు వారు చేసిన సేవా సఫలతను చూసి మాకు సఫలత వస్తుందా లేదా సేవ మేము చేస్తాము మరియు సపలత మీరు ఇవ్వాలి, మా స్మృతియాత్ర నిరంతరం మరియు శక్తిశాలిగా అయిపోవాలి, మా ఈ సంస్కారాలు సమాప్తి అయిపోవాలి ఇలా రకరకాలైన కోరికలతో బాబా దగ్గరకు వస్తూ ఉంటారు.
              రెండవ క్యూ - ఫిర్యాదులు చేసేవారి క్యూ. వారి భాష ఎలా ఉంటుందంటే - ఇది ఎందుకు, ఇది ఎలా, ఎప్పుడు మరియు ఎందుకు జరుగుతుంది? నేను అనుకుంటున్నాను కానీ ఎందుకు అవ్వటంలేదు? స్మృతి ఎందుకు నిలవటంలేదు? లౌకిక మరియు అలౌకిక పరివారం యొక్క సహయోగం ఎందుకు లభించటంలేదు? ఇలా అనేక రకాలైన ఫిర్యాదులు ఉంటాయి వాటిలో కూడా విశేషంగా రెండు విషయాలు - వ్యర్దసంకల్పాలు ఎందుకు వస్తున్నాయి, శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుంది, స్మృతి ఎందుకు తెగిపోతుంది? ఇలా ఫిర్యాదుల యొక్క క్యూ పెద్దదిగా ఉంటుంది.
               కొంతమంది బాప్ దాదాను జ్యోతిష్యునిగా భావించి క్యూపెడుతున్నారు. మా అనారోగ్యం తొలగిపోతుందా? సేవలో సఫలత వస్తుందా? మా ఫలానా సంబంధీకులు జ్ఞానంలోకి వస్తారా? మా గ్రామంలో లేదా పట్టణంలో సేవ వృద్ధి అవుతుందా? వ్యవహారంలో సఫలత వస్తుందా? ఈ వ్యవహారం చేయమా లేక వద్దా? వ్యాపారం చేయమా లేక ఉద్యోగం చేయమా? నేను మహారథీగా  అవుతానా? నేను అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అలాగే గృహస్థవ్యవహారం యొక్క చిన్న, చిన్న విషయాలు అంటే మా అత్తగారి కోపం తగ్గిపోతుందా? నేను బంధనాలలో ఉన్నాను కదా, నా బంధనాలు తెగిపోతాయా? నేను స్వతంత్రంగా అవుతానా? ఇంకొక విశేష విషయంలో కూడా అడుగుతారు - నేను పూర్తిగా సమర్పణ అవుతానా? ఈ నా కోరిక పూర్తి అవుతుందా? ఇలా ఈ క్యూ కూడా ఉంటుంది.
             నాల్గవ క్యూ - నిందించేవారి క్యూ. మేము ముసలివారు అయిపోయిన తర్వాత, నేను అనారోగ్య శరీరంతో ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు? మొదటే మమ్మల్ని ఎందుకు మేల్కొల్పలేదు? ఆలస్యంగా ఎందుకు మేల్కొల్పావు? సింధు దేశంలోనే ఎందుకు వచ్చావు? మొదట అక్కడ  అక్కయ్యలనే ఎందుకు తీసుకున్నావు? సంగమయుగంలో మమ్మల్ని గోపకులుగా ఎందుకు చేసావు? శక్తులు ముందు అనే ఆచారం ఎందుకు తయారయ్యింది? ఈ అంతిమ జన్మలో నేను బంధనాలలో ఉండవలసిందేనా? ఇటువంటి కర్మబంధన నాకే ఎందుకు తయారయ్యింది? నన్ను బీదవానిగా ఎందుకు చేసావు? నేను ధనంతో సహయోగి అవ్వద్దా? సాకార రూపంలో కలయిక యొక్క పాత్ర మాకు ఎందుకు లేదు? ఇలా అనేక రకాలుగా నిందించేవారి క్యూ కూడా ఉంటుంది.
            ఐదవ క్యూ ఇది రాయల్ గా అడుక్కునే వారి క్యూ, ఇది ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. కృప చూపించండి లేదా ఆశీర్వాదాలు ఇవ్వండి అని అనటంలేదు కానీ దానిలో కోరిక నిండే ఉంటుంది.
                 ఎన్ని రకాలైన క్యూలు ఉన్నాయో విన్నారు కదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు స్వయాన్ని చూసుకోండి - ఈ రోజు నేను ఎన్ని క్యూలలో నెంబర్ తీసుకున్నాను అని. ఎలా అయితే ఈ రోజుల్లో ఒకే రోజులో అనేక రకాలైన వరుసలలో ఉంటున్నారు కదా అలాగే బాప్దాదా దగ్గర కూడా రోజంతటిలో ఈ వరుసలలో ఉంటున్నారు. కేవలం అవ్యక్త రూపంలో లేదా సూక్ష్మరూపంలో విషయాలు చెప్పటమే కాదు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి కలుసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఈ చిన్న, చిన్న విషయాలు అడుగుతూ ఉంటారు. మాస్టర్ జ్ఞానసాగరులు మరియు మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులైపోండి అప్పుడు అన్ని రకాలైన క్యూలు సమాప్తి అయిపోయి మీ ఒక్కొక్కరి ముందు మీ ప్రజలు మరియు భక్తులు క్యూలో ఉంటారు. ఎప్పటి వరకు స్వయమే ఈ క్యూలో బిజీగా ఉంటారో అప్పటి వరకు ఆ క్యూ ఎలా వస్తుంది? అందువలన ఇప్పుడు మీ స్థితిలో మీరు స్థితుల్లో ఈ అన్ని క్యూల నుండి తొలగించుకుని బాబాతో పాటు కలయిక జరుపుకునే  సంలగ్నతలో మీ సమయాన్ని ఉపయోగించండి మరియు లవలీనం అయిపోండి. అప్పుడు ఈ అన్ని విషయాలు సమాప్తి అయిపోతాయి. ఈ అన్ని కోరికలు లేదా ఫిర్యాదులకు జవాబు మరోసారి చెప్తాను అప్పుడిక మాటిమాటికి ఇక ఈ విషయాల గురించి అడగవలసిన లేదా వీటిలో సమయం పోగొట్టుకునే అవసరం ఉండదు. మంచిది!
               ఇలా అనేక రకాలైన క్యూల నుండి ముక్తులుగా ఉండేవారికి, బాప్ దాదాకు సదా తోడుగా, సహయోగిగా ఉండేవారికి, ఒక సెకనులో కలయిక జరుపుకునేవారికి, సర్వసంబంధాలు ఒకే బాబాతో జోడించేవారికి, సర్వప్రాప్తి స్వరూపులకు, సదా కోరికంటే ఏమిటో తెలియని స్థితిలో సదా ఉండేవారికి మరియు అష్టశక్తి స్వరూప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు,శుభరాత్రి మరియు నమస్తే.

Comments