08-06-1972 అవ్యక్త మురళి

* 08-06-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంపూర్ణస్థితి యొక్క పరిశీలన.

స్వయమును విఘ్నవినాశకులుగా భావిస్తున్నారా? ఏ విఘ్నమైనా మీ ముందుకు వస్తే దానిని ఎదుర్కొనే శక్తిని స్వయములో అనుభవం చేసుకుంటున్నారా? అనగా మీ పురుషార్థం ద్వారా స్వయమును బాప్ దాదాకు సమీపంగా లేక మీ సంపూర్ణ స్థితికి సమీపంగా వెళుతున్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారా లేక ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోయేవారిగా స్వయమును అనుభవం చేసుకుంటున్నారా? ఏ విధంగా యాత్రికులు ఎప్పుడూ ఎక్కడా ఆగరో అలా స్వయమును రాత్రి ప్రయాణికులులా భావిస్తూ నడుచుకుంటున్నారా? సంపూర్ణ స్థితి యొక్క ముఖ్య గుణము ప్రాక్టికల్ కర్మలో లేక స్థితిలో కనిపిస్తోందా? సంపూర్ణ స్థితి యొక్క విశేష గుణము ఏమిటి? ఆ గుణము ద్వారా మీరు మీ సంపూర్ణ స్థితికి సమీపంగా ఉన్నారా లేక దూరంగా ఉన్నారా? అని గుర్తించగలరు. ఇప్పుడు ఒక్క క్షణము కొరకు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతూ ఏ విశేష గుణము సంపూర్ణ స్థితిని ప్రత్యక్షం చేస్తుంది అన్నది తెలియజేయండి. ఎప్పుడైతే ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి తయారవుతుందో అప్పుడు వారి ప్రాక్టికల్ కర్మలో ఏమి గాయనం ఉంటుంది? సమానత యొక్క గాయనము ఉంటుంది. నిందాస్తుతి, జయపరాజయాలు, సుఖదు:ఖాలు, అన్నింటిలోను సమానత ఉండాలి. దీనినే సంపూర్ణత స్థితి అని అంటారు. దు:ఖంలో కూడా ముఖముపై లేక మస్తకంపై దు:ఖపు అలకు బదులుగా సుఖము లేక హర్షపు అల కనిపించాలి. నిందను వింటూ కూడా ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇది మహిమా యోగ్యమైన పదము అని అనుభవమవ్వాలి. ఇటువంటి సమానత ఉండాలి, దీనినే బాప్ దాదాల సామీప్యత స్థితి అని అనవచ్చు. కొద్దిగ కూడా దృష్టిలోను, వృత్తిలోను తేడా రాకూడదు. వీరు శత్రువు లేక నిందించేవారు, వీరు మహిమ చేసేవారు.... ఇటువంటి వృత్తియే ఉండకూడదు. శుభచింతక ఆత్మ యొక్క వృత్తి లేక కళ్యాణకారీ దృష్టి ఉండాలి. ఇరువురి పట్ల ఒకే విధమైన దృష్టి ఉండాలి. దీనినే సమానత అని అంటారు. సమానత అనగా బ్యాలెన్స్ సరిగ్గా ఉండని కారణంగా స్వయంపై బాబా ద్వారా ఆనంద వర్షమును తీసుకోలేకపోతారు. బాబా ఆనందసాగరుడు కదా! మీపై మీరు దీవించుకునేందుకు లేక బాబా యొక్క దీవెనలు తీసుకునేందుకు ఒక సాధనము - ఎల్లప్పుడూ రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి. ఏ విధంగా స్నేహము మరియు శక్తి రెండింటి యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడు స్వయమునకు స్వయం నుండి దీవెనలు లేక బాబా నుండి దీవెనలు లభిస్తూ ఉంటాయి. బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుకోవడం రావడం లేదు. ఒక నాట్యము విశేషత ఏమిటి? బ్యాలెన్స్. విషయం సాధారణమైనదే కానీ అద్భుతమంతా బ్యాలెన్స్ దే ఉంటుంది. నాట్యపు ఆటను చూశారు కదా! ఇక్కడ కూడా అద్బుతము బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుకోవడంలోనే ఉంటుంది. బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుకోవడం లేదు. మహిమను విన్నప్పుడు ఇంకా నషా ఎక్కుతుంది. గ్లాని నుండి ద్వేషం కలుగుతుంది. నిజానికి మహిమ యొక్క నషా కూడా ఉండకూడదు అలాగే గ్లానిని చూసి ద్వేషమూ రాకూడదు. రెండింటిలోను బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే స్వయమే సాక్షిగా అయి స్వయమును చూసుకున్నట్లయితే అద్భుతము అనుభవమవుతుంది. స్వయం నుండి సంతుష్టత అనుభవమవుతుంది. ఇతరులు కూడా మీ ఈ కర్మను చూసి సంతుష్టులవుతారు. కావున ఈ పురుషార్థంలో లోపము ఉన్న కారణంగా, బ్యాలెన్స్ యొక్క లోపము కారణంగా ఆనందమయమైన జీవితం ఏదైతే ఉండాలో అది ఉండదు. కావున ఇప్పుడు ఏమి చేయవలసి ఉంటుంది? బ్యాలెన్స్ సరిగ్గా ఉంచుకోండి. కొన్ని జంట పదాలు ఉంటాయి. న్యారా మరియు ప్యారా (అతీతంగా మరియు ప్రియంగా), మహిమ మరియు గ్లాని. మీది ప్రవృత్తి మార్గం కదా! ఆత్మ మరియు శరీరం కూడా రెండు ఉన్నాయి, బాబా మరియు దాదా కూడా ఇరువురు ఉన్నారు. ఇరువురి కర్తవ్యం ద్వారా విశ్వపరివర్తన జరుగుతుంది కావున ప్రవృత్తిమార్గము అనాది మరియు అవినాశి. లౌకిక ప్రవృత్తిలో కూడా ఒకరు సరిగ్గా నడుస్తూ ఇంకొకరు సరిగ్గా నడవకపోతే, బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే ఘర్షణ జరుగుతుంది, సమయం వ్యర్థమవుతుంది. ఏ శ్రేష్ఠ ప్రాప్తి అయితే లభించాలో దానిని పొందలేరు.

ఒక్క కాలుతో నడిచేవారిని ఏమంటారు? కుంటివారు అని అంటారు. వారు హైజంప్ చేయగలరా లేక వేగంగా పరుగెత్తగలరా? అలాగే ఇందులో కూడా సమానత లేకపోతే ఇటువంటి పురుషార్థులను ఏమంటారు? పురుషార్థములో ఒక విషయం యొక్క ప్రాప్తి అధికంగా ఉంటూ ఇంకొకటి తక్కువగా అనుభవమయితే హైజంప్ చేయలేరని, పరిగెత్తలేరని అర్థం చేసుకోవచ్చు. కావున ఎప్పుడైతే హైజంప్ చేయలేరో, పరుగు తీయలేరో అప్పుడిక సంపూర్ణతకు సమీపంగా ఎలా రాగలరు? ఈ లోపము వచ్చేస్తుంది, దానిని స్వయం కూడా వర్ణన చేస్తారు. స్నేహము సమయంలో శక్తి మర్జయిపోతుంది, శక్తి సమయంలో స్నేహం మర్జయిపోతుంది, మరి బ్యాలెన్స్ సరిగ్గా లేనట్లే కదా! రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి, దీనినే అద్భుతము అని అంటారు. ఒక సమయంలో ఒకటి ఎక్కువగా ఉండి, ఇంకొక సమయంలో ఇంకొకటి ఎక్కువగా ఉన్నా అది వేరే విషయం. కానీ ఒకే సమయంలో రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి, దీనినే సంపూర్ణత అని అంటారు. ఒకటి మర్జ్  అయి ఇంకొకటి ఎమర్జయితే ప్రభావం ఒకదానిదే పడుతుంది. శక్తుల చిత్రాల్లో ఎల్లప్పుడూ రెండు గుణాల సమానతను చూపిస్తారు. స్నేహంగా ఉంటారు మరియు శక్తిరూపంగాను ఉంటారు. నయనాలలో ఎల్లప్పుడూ స్నేహము మరియు కర్మలో శక్తి రూపం. కావున శక్తులను గూర్చి ఈ శివ శక్తులు రెండు గుణాల యొక్క సమానతను ఉంచేవారు అని చిత్రకారులకు కూడా తెలుసు, కావుననే వారు కూడా చిత్రాలలో ఇదే భావమును వ్యక్తపరుస్తారు. ఎప్పుడైతే ఆ శక్తులు ప్రాక్టికల్స్ అలా చేశారో అప్పుడే వారి చిత్రాలు తయారయ్యాయి కదా! కావున ఇప్పుడు ఇటువంటి లోటును సంపన్నం చేయండి, అప్పుడే ఏ ప్రభావమైతే వెలువడాలో అది వెలువడగలదు. ఇప్పుడు ఒక విషయం యొక్క ప్రభావం ఎక్కువగా, రెండవదాని ప్రభావం తక్కువగా ఉన్న కారణంగా ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒక విషయమును వర్ణన చేస్తారు, అన్నింటినీ చేయలేరు. నిజానికి సర్వగుణ సంపన్నంగా అవ్వాలి కదా! కావున ఈ విధంగా సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. ధర్మము మరియు కర్మ రెండింటి యొక్క సహయోగమును తెలియజేస్తారు, జనులు రెండింటినీ వేరు చేస్తారా? మీరు రెండింటి సహయోగమును తెలియజేస్తారు. కావున కర్మచేస్తూ కూడా ధర్మము అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి, అప్పుడు ధర్మము మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉన్న కారణంగా ప్రభావం పడుతుంది. కర్మ చేసే సమయంలో కర్మలోనైతే నిమగ్నమైపోతారు మరియు ధారణ పూర్తిగా లేకపోతే దానిని ఏమంటారు? ధర్మము మరియు కర్మను వేరు చేసిన కారణంగా ఈనాటి ఈ జీవితము మరియు పరిస్థితులు ఇలా అయిపోయాయి అని జనులకు చెబుతారు కదా! కావున ధర్మము మరియు కర్మ అనగా ధారణలు మరియు కర్మ రెండింటి యొక్క సమానత ఉంటోందా లేక కర్మచేస్తూ దానిని మరిచిపోతున్నారా అని స్వయమును ప్రశ్నించుకోండి.

ఎప్పుడైతే కర్మ సమాప్తమైపోతుందో అప్పుడు ధారణ స్మృతిలోకి వస్తుంది. ఎప్పుడైతే కర్మలో చాలా బిజీగా ఉంటారో ఆ సమయంలో మీ ధారణ కూడా ఉంటోందా లేక ఎప్పుడైతే కార్యము తేలికగా అయిపోతుందో అప్పుడు ధారణ భారీగా అయిపోతోందా? ఎప్పుడైతే ధారణ భారీగా ఉంటుందో అప్పుడు కర్మ తేలికగా అయిపోతోందా? రెండు తక్కెడల వైపు సమతూకంగా ఉన్నప్పుడే ఆ త్రాసుకు విలువ ఉంటుంది లేకపోతే అసలు త్రాసుకు విలువే లేదు. ఇక్కడ త్రాసు అనగా బుద్ధి. బుద్ధిలో రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడు వారిని శ్రేష్ఠ బుద్ధిగలవారు లేక దివ్యబుద్ధిగలవారు లేక చురుకైన బుద్ధి కలవారు అని అంటారు. లేకపోతే సాధారణ ఋద్ధి కలవారే. కర్మలు కూడా సాధారణంగా, ధారణలు కూడా సాధారణంగా ఉంటాయి. కావున సాధారణలో సమానతను తీసుకురాకూడదు, శ్రేష్ఠతలో సమానతను తీసుకురావాలి. ఏ విధంగా కర్మలు శ్రేష్ఠంగా ఉన్నాయో అలా ధారణలు కూడా శ్రేష్ఠంగా ఉండాలి. కర్మలు ధారణను అనగా ధర్మమును మర్జ్ చేసేయకూడదు, అలాగే ధారణ కర్మను మర్జ్ చేయకూడదు. కావున ధర్మము మరియు కర్మలు రెండూ శ్రేష్ఠతలో సమానంగా ఉండాలి. అటువంటివారినే ధర్మాత్మలు అని అంటారు. ధర్మాత్మలు అని అనండి, మహాత్మలు అని అనండి లేక కర్మయోగులు అని అనండి విషయమైతే ఒక్కటే. ఇటువంటి ధర్మాత్మలుగా అయ్యారా? ఇటువంటి కర్మయోగులుగా అయ్యారా? ఇటువంటి ఆనంద స్వరూపులుగా అయ్యారా? ఏకాంతవాసులుగానూ ఉండాలి మరియు దానితోపాటు రమణీకత కూడా అంతగానే ఉండాలి. ఏకాంతవాసులుగా ఉండడం ఎక్కడ మరియు రమణీకులుగా ఉండడం ఎక్కడ! ఈ రెండు పదాలలోను ఎంతో తేడా ఉంది. కాని, సంపూర్ణతలో రెండింటి యొక్క సమానత ఉండాలి. ఎంతగా ఏకాంతవాసులుగా ఉంటారో అంతగానే రమణీకత కూడా ఉంటుంది.

ఏకాంతంలో రమణీకత మాయమైపోకూడదు. రెండూ సమానంగా మరియు తోడుగా ఉండాలి. మీరు ఎప్పుడైతే రమణీకతలోకి వస్తారో అప్పుడు అంతర్ముఖత నుండి క్రిందకు వచ్చేసాము అని అంటారు మరియు అంతర్ముఖతలోకి వచ్చినప్పుడు ఈరోజు రమణీకత ఎలా ఉండగలదు అని అంటారు. కాని, రెండూ కలిసి ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏకాంతవాసులుగా మరియు ఇప్పుడిప్పుడే రమణీకులుగా ఉండాలి. ఎంతటి గంభీరత ఉంటుందో అంతగానే కలుపుగోలుగాను ఉండాలి, కేవలం గంభీరమూర్తులుగా ఉండిపోవడం కాదు. కలుపుగోలుగా ఉండేవారు అనగా సర్వుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలుపుకుపోయేవారు. గంభీరంగా ఉండడం అనగా ఎవరినైనా కలుసుకోవడం నుండి దూరంగా ఉండడమని కాదు. ఏ విషయమైనా అతిగా ఉంటే అది మంచిగా అనిపించదు. ఏ విషయమైనా అతిలోకి వెళ్లిపోతే దానిని తుఫాను అని అంటారు. ఒక గుణము తుఫానులా ఉంటూ ఇంకొకటి మర్జ్ అయిపోతే అది ఏమైనా మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. కావున ఈ విధంగా స్వయంలో పవర్ ఫుల్ ధారణను చేసుకోవాలి. ఎలా కావాలనుకుంటే అలా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మిమ్మల్ని మీరు స్థిరం చేసుకోవచ్చు. బుద్ధిరూపీ పాదము నిలువలేదు అని భావించడంకాదు. బ్యాలెన్స్ సరిగ్గా లేనికారణంగా అది నిలువజాలదు. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ పడిపోతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. బుద్ధి యొక్క ఈ అలజడి ఉన్న కారణంగా సమానత ఉండదు అనగా సంపన్నంగా లేరు. ఏ వస్తువైనా నిండుగా ఉంటే అది ఎప్పుడూ అలజడి చెందదు. ఎప్పుడైతే లోటు ఉంటుందో, సంపన్నత ఉండదో అప్పుడే అలజడి ఉంటుంది. కావున ఎప్పుడైతే ఫుల్ గా ఉండరో, సంపన్నంగా ఉండరో అప్పుడే ఈ బుద్ధిలో వ్యర్థ సంకల్పాల యొక్క లేక మాయ యొక్క అలజడి జరుగుతుంది. రెండింటిలోను సంపన్నంగా లేక సమానతగా ఉన్నప్పుడు అలజడి ఏర్పడజాలదు. కావున మిమ్మల్ని మీరు ఎటువంటి అలజడి నుండైనా రక్షించుకునేందుకు సంపన్నంగా అవుతూ ఉండండి, అప్పుడు సంపూర్ణంగా అయిపోతారు. సంపూర్ణ స్థితి అనగా నిండుగా ఉన్న వస్తువు యొక్క ప్రభావము వెలువడకుండా ఉండడము అన్నది జరుగజాలదు. చంద్రుడు కూడా ఎప్పుడైనా 16 కళా సంపూర్ణంగా అయిపోతాడో అప్పుడు వద్దనుకుంటున్నా కూడా ఇది అందరి ఆకర్షణ తనవైపుకు ఆకర్షించేస్తుంది. ఏదైనా వస్తువు సంపన్నంగా ఉన్నప్పుడు తనవైపుకు ఆకర్షిస్తుంది. కావున సంపూర్ణత యొక్క లోటు కారణంగా విశ్వంలోని సర్వాత్మలను ఆకర్షించలేరు. ఎంతగా స్వయంలో లోటు ఉంటుందో అంతగా ఆత్మలను తమవైపుకు తక్కువగా ఆకర్షించలేరు. చంద్రుడి కళలు తక్కువగా ఉంటే దాని వైపుకు ఎవరి అటెన్షన్ వెళ్ళదు, ఎప్పుడైతే సంపూర్ణంగా అయిపోతారో అప్పుడు వద్దనుకున్నా అందరి ధ్యానము అటువైపుకు వెళుతుంది. ఎవరు చూసినా, చూడకపోయినా అది తప్పకుండా కనిపిస్తుంది. సంపూర్ణతలో ప్రభావం చేయగల శక్తి ఉంటుంది కావున ప్రభావశాలిగా అయ్యేందుకు సంపన్నంగా అవ్వవలసి ఉంటుంది. అర్థమైందా? అచ్ఛా!

బ్యాలెన్స్ సరిగ్గా లేనప్పుడు అటూ ఇటూ కదులుతూ ఉండే, ఊగుతూ ఉండే ఆటనేదైతే చేస్తారో దానిని సాక్షిగా అయి చూసినట్లయితే మీపై మీకు ఎంతో నవ్వు వస్తుంది. ఎవరైతే పూర్తిగా స్పృహలో ఉండరో వారి నడవడికను చూసి నవ్వు వస్తుంది కదా! ఎప్పుడైతే మాయ మూర్ఛితులుగా చేసేస్తుందో, మీ శ్రేష్ఠ స్మృతి యొక్క నషాను మాయం చేసేస్తుందో ఆ సమయంలో మీ నడక ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఆ దృశ్యం మీముందుకు వస్తోందా? ఆ సమయంలో సాక్షిగా అయి చూసుకున్నట్లయితే మీపై మీకు నవ్వు వస్తుంది. బాప్ దాదా సాక్షిగా అయి పిల్లల ప్రతి ఒక్కరి ఆటను చూస్తారు. ఇటువంటి ఆటను చూడడం మంచిగా అనిపిస్తుందా? బాప్ దాదా ఏమి చూడాలనుకుంటున్నారో దానిని గూర్చి కూడా మీకు తెలుసు. తెలుసుకున్నాక, ఒప్పుకున్నాక మరప్పుడు ఆ విధంగా ఎందుకు నడుచుకోరు? మూడు కోణాలు సరిగ్గా ఉండి, ఒక్కటి సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? నాలుగు విషయాలను తెలుసుకొని, ఒప్పుకొని వర్ణన కూడా చేస్తారు కాని, కొంత నడుస్తారు, కొంత నడువరు, మరి అది లోపమైపోయింది కదా! ఇప్పుడు ఆ లోపాన్ని నింపే ప్రయత్నం చేయండి. ఏ విధంగా రెండు, రెండు విషయాలను వినిపించారో అలాగే జ్ఞానస్వరూపులుగా మరియు శక్తిస్వరూపులుగా ఈ రెండింటి బ్యాలెన్స్ ను సరిగ్గా ఉంచినట్లయితే సంపూర్ణతకు సమీపంగా వచ్చేస్తారు. నాలెడ్జ్ ఫుల్ గా ఎంతో అయ్యారు, పవర్ ఫుల్ గా తక్కువగా అయ్యారు కావున బ్యాలెన్స్ సరిగ్గా ఉండడం లేదు. శక్తులను మరియు శక్తిని బ్యాలెన్స్ గా చూపిస్తారు, ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా చూపిస్తారు. కావున వారు స్వయం తమ బ్యాలెన్స్ లో సరిగ్గా ఉండకపోతే, తమపై తామే బ్యాలెన్స్ ను ఉంచకపోతే మరి అనేకుల కొరకు మాస్టర్ ఆనందసాగరులుగా ఎలా అవ్వగలరు? ఇప్పుడు ఈ విషయంలో అందరూ బికారులుగా ఉన్నారు. ఆనందపు వరదానులు లేదా మహాదానులు శివుడు మరియు శక్తులు తప్ప ఇంకెవరూ లేరు. కావున ఏ వస్తువు యొక్క వరదానులుగా మరియు మహాదానులుగా ఉన్నారో అది మొదట ఎప్పుడైతే స్వయంలో సంపన్నంగా ఉంటుందో అప్పుడే దానిని ఇతరులకు ఇవ్వగలుగుతారు కదా!

ఇటువంటి మాస్టర్ జ్ఞానస్వరూపులు, ఆనందస్వరూపులు మరియు అంతగానే జాగ్రత్తగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే.

Comments