07-10-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వ అధికారులు మరియు బేహద్ వైరాగ్యం కలవారు రాజఋషిలు.
సదా విజయీగా తయారు చేసేవారు, సర్వ అధికారాలు ప్రాప్తింపచేసేవారు, ఆత్మిక సేన యొక్క సర్వోన్నత సైన్యాధిపతి, నిరాకార శివబాబా మాట్లాడుతున్నారు --
ఈరోజు బాప్ దాదా ఏ సభను చూస్తున్నారు? ఇది రాజఋషిల సభ. స్వయాన్ని సదా రాజఋషిగా భావించి నడుస్తున్నారా? ఒకవైపు రాజు, రెండవవైపు ఋషి. ఇద్దరి లక్షణాలు వేర్వేరు. ఒకటి భాగ్యం, మరొకటి త్యాగం. ఒకరు సర్వాధికారి మరియు మరొకరు ఋషి అనగా బేహద్ వైరాగి. సర్వాధికారి మరియు బేహద్ వైరాగి, ఒకరు సర్వులకు ప్రియం మరియు ఇంకొకరు సర్వులకు అతీతం. ఇద్దరి లక్షణాలు, మాట మరియు కర్మలో సదా వెనువెంట కనిపించాలి. వర్తమానంలో స్వరాజ్యం అనగా స్వయం యొక్క సర్వ కర్మేంద్రియాలపై రాజు, దీనినే స్వరాజ్యం అని అంటారు. ఇలాంటి వారు భవిష్యత్తులో డబల్ రాజ్యాధికారులు. డబల్ రాజ్యం యొక్క నషా సదా ఉంటుందా? రాజ్యం యొక్క నషా ఎంతగా ఉంటుందో అంతగానే బేహద్ వైరాగ్యం అనగా ఋషి రూపం సదా స్మృతిలో ఉంటుందా? రెండింటి సమానత ఉందా లేక ఒక స్వరూపం గుర్తుంటుంది, మరొకటి మర్చిపోతున్నారా? ఈ పాత దేహం మరియు దైహిక ప్రపంచం నుండి బేహద్ వైరాగి అయిపోయారా? లేక ఇప్పటికి ఈ పాత దేహం మరియు ప్రపంచం తనవైపుకు ఆకర్షిస్తున్నాయా? ఇదంతా స్మశానం వలె అనుభవం అవుతుందా? అందరూ మూర్చితులైన ఆత్మలుగా కనిపిస్తున్నారా లేక కేవలం అనటం వరకే ఉన్నారా? వీరందరూ చనిపోయారు. అనగా ఇది స్మశానం అని ఎప్పటి వరకు ఇలా అనుభవం అవ్వదో అప్పటి వరకు బేహద్ వైరాగిగా అవ్వలేరు. ఈనాటి ప్రపంచంలో కూడా హద్దులోని వైరాగులు అడవుల్లోకి లేదా శ్మశానాల్లోకి వెళ్ళిపోతారు. అందువలనే శ్మశాన వైరాగ్యం అనే మహిమ ఉంది. ఎప్పటి వరకు ఈ ప్రపంచం ఒక శ్మశానంలా అనుభవం అవ్వదో అప్పటి వరకు సదాకాలిక బేహద్ వైరాగ్యం యొక్క అనుభవం ఏవిధంగా అవుతుంది?
నేను ఋషిగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలాంటి నిశ్చయబుద్ధి అయిన వారు, వైరాగ్యంతో పాటు అధికారం యొక్క సంతోషంలో కూడా ఉంటారు. కనుక రాజఋషిగా తయారయ్యేటందుకు రాజ్యం యొక్క నషా ఎంతగా ఉంటుందో అంతగానే బేహద్ వైరాగ్యం యొక్క దృశ్యాలు రెండూ కూడా వెనువెంట అనుభవం అవుతాయి. ఈ ప్రపంచంలో శ్మశానం వలె ఎంతగా అనుభవం అవుతుందో అంతగా ఫరిస్తాల ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంది. త్యాగంతో పాటు భాగ్యం కూడా స్పష్టంగా ఎదురుగా కనిపిస్తుంది. సంపూర్ణ రాజ ఋషి స్థితి అనగా నషా మరియు గమ్యం రెండూ స్పష్టంగా ఉంటాయి. గమ్యం అనగా సంపూర్ణ స్థితి. ఈవిధంగా నషాలో ఉండేవారి ఎదురుగా గమ్యం ఎంత సమీపంగా ఉంటుందంటే స్థూల నేత్రాలతో ఎదురుగా ఉన్న స్థూల వస్తువును స్పష్టంగా చూసినంత సమీపంగా ఉంటుంది. వస్తువు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఆ వస్తువు ఉందా లేదా లేక ఎలా ఉంది అనే ప్రశ్నలు రావు. అదేవిధంగా సంపూర్ణ స్థితి అనే గమ్యం ఎదురుగా కనిపిస్తున్న కారణంగా నేను సంపూర్ణంగా అవుతాను లేక అవ్వను లేదా సంపూర్ణ స్థితిని అని దేనినంటారు? ఇలాంటి ప్రశ్నలు సమాప్తం అయిపోతాయి. సంపూర్ణ స్థితి యొక్క గుర్తులన్నీ స్వయంలో స్పష్టంగా కనిపిస్తాయి. సంపూర్ణ స్థితికి గుర్తులేమిటో తెలుసా? లేదా అనుభవం చేసుకుంటున్నారా? సంపూర్ణ స్థితికి మొదటి గుర్తు పాత ప్రపంచం యొక్క ఏ వ్యక్తితో లేదా వైభవంతో సంకల్పమాత్రంగా లేదా స్వప్నమాత్రంగా కూడా తగుల్పాటు ఉండదు. సదా స్వయాన్ని కలియుగీ ప్రపంచం నుండి అతీతంగా సంగమయుగిగా భావిస్తారు. సృష్టి మొత్తంలోని అసురీ ఆత్మలను కళ్యాణ దృష్టితో మరియు దయా దృష్టితో చూస్తారు. సదా స్వయాన్ని బాబా సమానంగా విశ్వ సేవాధారిగా అనుభవం చేసుకుంటారు. ప్రతి పరిస్థితిలో లేదా పరీక్షలో సదా స్వయాన్ని విజయీగా అనుభవం చేసుకుంటారు. విజయం నా జన్మసిద్ధ అధికారం. ఇలా అధికారీ స్వరూపంగా భావించి ప్రతి కర్మ చేస్తారు. సదా త్రిమూర్తి సింహసనాధికారిగా అనుభవం చేసుకుంటారు. త్రికాలదర్శి స్థితి యొక్క స్మృతి స్వరూపంగా అయిన కారణంగా ప్రతి కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకుని ప్రతి కర్మ శ్రేష్ట కర్మగా చేస్తారు లేదా సుకర్మిగా అవుతారు. వికర్మల యొక్క ఖాతా సమాప్తి అయినట్లుగా అనుభవం చేసుకుంటారు. ప్రతి కార్యం, ప్రతి సంకల్పం సిద్ధించవలసిందే అన్నట్లుగా సదా అనుభవం చేసుకుంటారు. పాత స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అనుభవం చేసుకుంటారు. సదా సాక్షి స్థితి అనే ఆసనంపై స్వయం స్థితి అయి ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇవే సంపుర్ణ స్థితికి గుర్తులు మరియు ఇదే మీ గమ్యం కూడా. ఇలాంటి వారిని రాజఋషి అని అంటారు. ఇలాంటి రాజఋషిగా తయారయ్యారా? రాజఋషి అనే బిరుదు అయితే లభించింది. కదా! బిరుదు ఏదైతే ఉందో ప్రత్యక్షంలో కూడా అదే ఉంది కదా? బ్రాహ్మణులు అనగా చెప్పటం మరియు చేయటం, ఆలోచించడం మరియు మాట్లాడడం, వినటం మరియు స్వరూపంలోకి తీసుకురావడం అన్ని సమానంగా ఉంటాయి. మరైతే అందరూ బ్రాహ్మణులే కదా? ఒక్క సెకెనులో స్వయాన్ని ఎక్కడ ఏ స్థితిలో స్థితులు చేసుకోవాలో ఆవిధంగా స్థితులు చేసుకోగలుగుతున్నారు కదా? ఈవిధంగా ఎవరెడీగా (సంసిద్ధంగా) తయారయ్యారా? అశరీరి అభ్యాసం ఎంత సహజంగా అనుభవం అవుతుందంటే శరీరంలోకి రావడం అతి సహజంగా మరియు స్వతహగా ఎలా అనిపిస్తుందో అలా. ఆత్మిక సైన్యం కదా? సైన్యం అనగా ప్రతి సమయం ప్రతి ఆజ్ఞను సెకెనులో అమలులోకి తీసుకువచ్చేవారు. అశరీరి భవ! అని ఇప్పుడిప్పుడే ఆజ్ఞ లభించగానే సంసిద్ధులేనా లేక సంసిద్ధులుగా అవ్వాల్సి వస్తుందా? ఒకవేళ సైన్యం సంసిద్ధులు అవ్వడంలో సమయం పడితే విజయం లభిస్తుందా? కనుక ఈ విధంగా సదా ఎవరెడీగా ఉండే అభ్యాసం చేయండి. మంచిది.
ఈవిధంగా సదా సర్వ అధికారాల యొక్క నషాలో ఉండేవారికి, సంగమయుగి శ్రేష్ట బాహ్మణులకు, స్వరాజ్యం మరియు విశ్వరాజ్యం యొక్క నషాలో ఉండేవారికి, శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment