07-06-1970 అవ్యక్త మురళి

                    * 07-06-1970         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

దివ్యమూర్తి అయ్యేటందుకు విధి.

నయనాల ద్వారా ఏం చూస్తున్నారు? మీరందరూ నయనాల ద్వారా చూస్తున్నారు. బాప్ దాదా కూడా నయనాల ఆధారమును తీసుకొని చూస్తున్నారు. బాప్ దాదా ఏం చూస్తారు? మీరందరూ ఏం చూస్తున్నారు? చూస్తున్నారా లేక చూస్తూ కూడా చూడటం లేదా? ఎటువంటి స్థితి ఉంది? బాప్ దాదా ఏం చూస్తున్నారో దానినే మీరూ చూస్తున్నారా? సంకల్పాలను క్యాచ్(గ్రహించే) చేసే అభ్యాసము ఉన్నట్లయితే సంకల్పరహితంగా ఉండటము కూడా సహజమవ్వగలదు. ఇతరుల సంకల్పాలను పరిశీలించలేనప్పుడే ఎక్కువ సంకల్పాలను నడిపించవలసి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరి సంకల్పాలను గుర్తించగలిగే అభ్యాసము ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా కలుగవు. ఇంకా చాలా సహజంగానే ఒక్క సంకల్పములో ఏకరస స్థితిలో క్షణములో స్థితులైపోతారు. కావున సంకల్పాలను చదవటము కూడా సంపూర్ణతకు గల ఒక లక్షణము. ఎంతెంతగా అవ్యక్త భావములో స్థితులౌతారో అంతగా ప్రతి ఒక్కరి భావమునూ సహజముగానే అర్థం చేసుకోగలుగుతారు. పరస్పర భావములను అర్థం చేసుకోలోకపోవడానికి కారణం - అవ్యక్త భావములో లోపము. అవ్యక్త స్థితి ఒక దర్పణము వంటిది. ఎప్పుడైతే మీరు అవ్యక్త స్థితిలో స్థితులౌతారో అప్పుడు ఏ వ్యక్తి భావమైనా అవ్యక్త స్థితిరూపీ దర్పణములో చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అప్పుడిక కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎవరి భావమునైనా అర్థం చేసుకొనేందుకు దర్పణమునకు కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎంతెంతగా అవ్యక్త స్థితి ఉంటుందో అంతగానే దర్పణము కూడా శుభ్రముగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. ఇంత సహజాతిసహజంగా ఇతరుల భావములను స్పష్టముగా అర్థం చేసుకుంటారు. అవ్యక్త స్థితిరూపీ దర్పణమును శుభ్రముగా, స్పష్టముగా చేసుకొనేందుకు మూడు విషయముల అవసరము ఉంది. ఆ మూడు విషయాలలో ఏదైనా ఒక విషయాన్ని వినిపించండి (ప్రతిఒక్కరూ వినిపించారు). ఈ రోజు ప్రతి ఒక్కరిలోని సరళత, శ్రేష్ఠత మరియు సహనశీలత - ఈ మూడు విషయాలను చూస్తున్నారు. ఈ మూడు విషయాలలో ఏ ఒక్కటైనా మంచిరీతిలో ధారణ జరిగినట్లయితే దర్పణము స్పష్టముగా ఉంటుంది. ఒకవేళ ఒక్క విషయములో లోపమున్నాగానీ దర్పణముపై కూడా లోపమనే మచ్చ కనిపిస్తుంది. కావున ఏ కార్యము చేసినా, ప్రతి కార్యములో మూడు విషయాలను పరిశీలించుకోండి. అన్ని విధాలుగానూ సరళత కూడా ఉండాలి, సహనశీలత కూడా ఉండాలి మరియు శ్రేష్ఠత కూడా ఉండాలి. సాధారణత కూడా ఉండకూడదు. ఇప్పుడు అక్కడక్కడా శ్రేష్ఠతకు బదులుగా సాధారణత కనిపిస్తుంది. సాధారణతను శ్రేష్ఠతలోకి బదిలీ చెయ్యండి, ప్రతి కార్యములో సహనశీలతను మీ ముందు ఉంచుకోండి మరియు మీ ముఖములో, వాణిలో సరళతను ధారణ చెయ్యండి. అప్పుడిక సేవలో మరియు కర్తవ్యములో సఫలత ఎంత శ్రేష్ఠముగా ఉంటుందో చూడండి. ఇప్పటివరకు కర్తవ్యపు రిజల్టు ఎలా కనిపిస్తుంది? ప్లాను మరియు ప్రాక్టికల్ లో ఎంత అంతరము ఉంది? అంతరమునకు గల కారణము ఏమిటి? మూడు రూపాలలోనూ ఇప్పుడు పూర్తి ప్లెయినుగా అవ్వలేదు. స్మృతిలో కూడా ప్లెయిన్(స్వచ్ఛత), వాణిలో కూడా ప్లెయిన్ గా ఉండాలి. పాత సంస్కారమునకు చెందిన ఎటువంటి మచ్చా ఉండకూడదు మరియు కర్మలలో కూడా ప్లెయిన్ అనగా శ్రేష్ఠత. ఒకవేళ ప్లెయిన్‌గా అయిపోయినట్లయితే అప్పుడు ఇక ప్లాను మరియు ప్రాక్టికల్ ఒక్కటైపోతుంది. అప్పుడు సఫలత ప్లెయిన్ (విమానము)లాగా పైకెగురుతుంది. కావున ప్రతి విషయములో మనసా-వాచ-కర్మణ మరియు చిన్న విషయములో కూడా అప్రమత్తత అవసరము. మనస్సు, వాణి, కర్మలలో అయితే ఉండవలసిందే, కానీ దానితో పాటుగా అలౌకిక సంబంధమేదైతే ఉందో అందులో కూడా ప్లెయిన్ గా ఉన్నట్లయితే సేవా సఫలత మీ అందరి మస్తకముపై సితార రూపంలో మెరుస్తూ ఉంటుంది. అప్పుడు మీ ప్రతి ఒక్కరి సఫలతా సితారను ప్రతి ఒక్కరూ చూస్తారు. ఏ స్లోగన్ ను గుర్తు పెట్టుకోవాలో వినిపించాము కదా. సఫలత మా జన్మసిద్ధ అధికారము. అప్పుడిక మిమ్మల్ని ఎవరు చూసినా వారికి దూరము నుండే దివ్యమూర్తి కనిపిస్తుంది. సాధారణమూర్తి కాదు, దివ్యమూర్తి. ఈ రోజుల్లో సేవలో చాలా బిజీగా ఉన్నారు. ఏదైతే చేసారో అది చాలా మంచిగా చేసారు. ఇక సఫలతను సమీపంగా తీసుకురండి. ఎంతెంతగా ఒకరికొకరి సమీపంగా వస్తారో అంతగా సఫలత సమీపంగా వస్తుంది. ఒకరికొకరికి సమీపంగా అనగా సంస్కారాలకు సమీపముగా రావడం, అప్పుడే ఏ సమ్మేళనమైనా సఫలమవుతుంది. సమయము ఎలా సమీపంగా వస్తూ ఉందో, అలా అందరూ సమీపంగా వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇటువంటి సమీపతలో ఏమి నింపాలి? సమీపత ఎంతగా ఉంటుందో అంతగా ఒకరికొకరికి గౌరవమును ఇవ్వాలి. ఎంతగా ఒకరికొకరికి గౌరవమును ఇస్తారో అంతగానే మొత్తము విశ్వము మీ అందరికీ గౌరవమునిస్తుంది, గౌరవమును ఇవ్వటం ద్వారా గౌరవము లభిస్తుంది. ఇవ్వటం ద్వారానే లభిస్తుంది కానీ, తీసుకోవటం ద్వారా లభించదు. తీసుకోవటం ద్వారా ఒకటి లభిస్తే, ఇవ్వటం ద్వారా ఇంకోటి లభిస్తుంది. కావున ఎవరికైనా గౌరవమును ఇవ్వటము అనగా సర్వుల నుండి గౌరవమును తీసుకోవటము. భాషలో కూడా పరివర్తన అవసరము. ఈ రోజు అందరూ సేవాధారులు కూర్చుని ఉన్నారు కదా, అందుకని భవిష్యత్తు గురించిన సూచనను ఇస్తున్నారు. ఎప్పుడైనా ఎవరి ఆలోచన అయినా స్పష్టంగా లేకపోయినా కూడా ఎప్పుడూ 'కాదు' అని చెప్పకూడదు. ఎల్లప్పుడూ 'సరే' అన్న మాటే వెలువడాలి. ఎప్పుడైతే ఇక్కడ హాజీ అంటారో అప్పుడు అక్కడ సత్యయుగములో కూడా మీ ప్రజలు అంతగానే హాజీ,హాజీ అని అంటారు. ఒకవేళ ఇక్కడే కాదు, కాదు అని అంటుంటే అక్కడ కూడా ప్రజలు దూరము నుండే నమస్కారము చేస్తారు. కావున కాదు అన్న శబ్దమును తొలగించివేయాలి. ఏ విషయమైనాగానీ మొదట సరే అని అనాలి. హాజీ, హాజీ అని అనటమే ఇతరుల సంస్కారములను సరళముగా చేసే సాధనము. అర్థమైందా. వర్తమాన సమయములో ఏ కర్మనైతే చేస్తున్నారో అది భవిష్యత్తులో లా(చట్టాలు)గా తయారవుతాయి అని ఇంతకుముందు వినిపించి ఉన్నాము కదా. మీ అందరి కర్మలు భవిష్యత్తులో చట్టాలు. లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వారు బాగా ఆలోచించి మాటలను మాట్లాడుతారు ఎందుకంటే వారి ఒక్కొక్క మాట భవిష్యత్తు కొరకు చట్టాలుగా తయారవుతాయి. అందరి ప్రతి సంకల్పము భవిష్యత్తులో చట్టాలుగా తయారవుతాయంటే ఎంత ధ్యానమును పెట్టవలసి ఉంటుంది! ఇప్పటివరకూ ఒక విషయాన్ని పట్టుకుంటారు, మరొక విషయాన్ని వదల్తుంటారు. కానీ రెండు విషయాలూ గుర్తు ఉండాలి. ఒక్కోసారి విధిని పట్టుకొని విధానాన్ని వదిలేస్తారు. ఒక్కోసారి విధానాన్ని పట్టుకుంటే విధిని వదిలేస్తారు. కానీ విధి మరియు విధానము రెండింటి ద్వారానే విధాత సృతి కలుగుతుంది. ఒకవేళ విధాతయే స్మృతిలో ఉన్నట్లయితే విధి మరియు విధానము రెండు కూడా స్మృతిలో ఉంటాయి. కానీ విధాతను మర్చిపోతే ఒకదానిని వదిలివేస్తారు. విధాత స్మృతిలో ఉన్నట్లయితే విధి మరియు విధానము రెండూ తోడుగా ఉంటాయి. కానీ విధాతను మర్చిపోవటం ద్వారా ఒక్కోసారి విధానము తొలగిపోతే, ఒక్కోసారి విధి తొలగిపోతుంది. ఈ రెండూ తోడుగా ఉన్నప్పుడే సఫలత మెడలోని హారంగా అయిపోతుంది. అచ్ఛా! ఈరోజు చాలా శిక్షణలను ఇచ్చాము, ఇది స్నేహము ఎందుకంటే బాప్ దాదా సమానంగా చేయాలనుకుంటారు. సమానంగా అయ్యేందుకు సాధనము - స్నేహమే కదా.

ఇప్పుడు కుమారీల పరీక్షను తీసుకోవలసి ఉంది. సాహసమును ప్రత్యక్ష రూపములోకి తీసుకువచ్చేందుకు సాహసములో చాలా చాలా శక్తిని నింపాలి. ఇప్పుడు ఎంత శక్తి నిండి ఉంది అన్న పరీక్షను తీసుకుంటాము. అచ్ఛా!


*పార్టీలతో వ్యక్తిగత మిలనము*

1. అందరి పురుషార్థము మంచిగా నడుస్తోందా? ఏ నెంబరును లక్ష్యముగా ఉంచారు? (ఫస్ట్) ఫస్ట్ నెంబరు కొరకు ఏం చెయ్యవలసి ఉంటుందో తెలుసా? ఫస్ట్ నెంబరును తీసుకొనేందుకు విశేషంగా ఫాస్ట్ ఉండవలసి ఉంటుంది. ఫాస్ట్ కు రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి - వ్రతాన్ని ఫాస్ట్ అంటారు. మరి విశేషంగా ఏ వ్రతాన్ని ఉంచుతారు? (పవిత్రతా వ్రతము) ఈ వ్రతమైతే మామూలిదే. ఈ వ్రతమునైతే అందరూ చేస్తారు. ఫస్ట్ వచ్చేందుకు విశేషంగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అన్న వ్రతమును ఉంచాలి. ప్రతి విషయములో ఒక్కరి స్మృతే రావాలి. ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ను ఉంచుతారో అప్పుడు ఫస్ట్ లోకి వచ్చేస్తారు. రెండవ అర్ధం - త్వరగా వెళ్ళడమును కూడా ఫాస్ట్ అంటారు అనగా తీవ్ర పురుషార్థము.

ఎవరైతే ఎల్లప్పుడూ మాయపై విజయమును పొందుతారో వారినే మహారధులు అని అంటారు. మాయకు సదాకాలమునకు వీడ్కోలును ఇచ్చేసెయ్యాలి. విఘ్నాలను తొలగించే పూర్తి జ్ఞానము ఉందా? సర్వశక్తివంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు. కావున జ్ఞానము ఆధారముతో విఘ్నములను తొలగించి ఎల్లప్పుడూ మగ్నావస్థలో ఉండాలి. ఒకవేళ విఘ్నములు తొలగనే తొలగకపోతే తప్పకుండా శక్తిని ప్రాప్తి చేసుకోవటములో లోపము ఉంది. జ్ఞానమును తీసుకున్నారు కానీ దానిని తమ లోపల ఇముడ్చుకోలేదు. జ్ఞానమును ఇముడ్చుకోవటము అనగా స్వరూపముగా అవ్వటము. ఎప్పుడైతే కర్మ వివేకపూరితముగా ఉంటుందో దాని ఫలితముగా సఫలత తప్పకుండా లభిస్తుంది.

2. తీవ్ర పురుషార్థుల లక్షణములు ఏమిటి? ఆజ్ఞాకారి అని ఎవరిని అంటారో అర్థం చేయించాము కదా? ఎవరి సంకల్పము కూడా ఆజ్ఞ లేకుండా నడవదో అటువంటి ఆజ్ఞాకారినే తీవ్ర పురుషార్థి అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రికి చెందిన శక్తివంతమైన పిల్లల ముందు మాయ కూడా దూరము నుండే నమస్కారము చేసి వీడ్కోలు తీసేసుకుంటుంది. వల్లభాచారులు తమ శిష్యులను తాకను కూడా తాకరు. తాకకూడనిదానిని తాకినట్లయితే స్నానము చెయ్యవలసి ఉంటుంది. ఇక్కడ కూడా జ్ఞానస్నానము చేసి అంటరానిది దగ్గరకు రాకుండా ఉండేంత శక్తిని ధారణ చెయ్యండి. మాయ కూడా ఎటువంటిది? అంటరానిదే కదా! అచ్చా!

3. ఎంతెంతగా మిమ్మల్ని మీరు సేవా బంధనలో బంధించుకుంటూ ఉంటారో అంతగానే ఇతర బంధనాలు తొలగిపోతూ ఉంటాయి. ఈ బంధనము తొలగిపోతే సేవలో నిమగ్నులమైపోతామని అలా ఆలోచించకండి. అలా కాదు. సేవ చేస్తూ ఉండండి. బంధనము ఉన్నాకూడా స్వయమును సేవాబంధనలో జోడిస్తూ ఉండండి. ఇలా జోడించటమే వదిలించుకోవటము. వదిలించుకున్న తరువాత జోడించటము జరుగదు. ఎంతగా జోడిస్తారో అంతగానే తెగిపోతాయి. స్వయమును ఎంతగా సేవలో సహయోగిగా తయారుచేసుకుంటారో అంతగానే ప్రజలు మీకు సహయోగులుగా అవుతారు. ఏదైనా కారణము ఉన్నాగానీ దానిని తేలికగా వదిలేని, మొదట సేవా అవకాశమును ముందు ఉంచండి. కర్తవ్యమును ముందు ఉంచటము జరుగుతుంది. కారణాలు ఉంటూనే ఉంటాయి, కానీ కర్తవ్యబలము ద్వారా
కారణము ఢీలాగా అయిపోతుంది.

4. తయారైయున్న మాతల సంగఠనలోకి దూరిపోండి. మెంబరుగా అవ్వటం ద్వారా చాలామందిని తమ సమానంగా తయారుచేసే అవకాశము లభిస్తుంది. సంపర్కములోకి రావటం ద్వారానే అవకాశము లభిస్తుంది. ఇప్పుడు మాతల సంస్థలలో మీ పేరు ప్రసిద్ధమవ్వలేదు. మొదట గుప్త వేషములో కాలు మోపండి, తరువాత వారు మీవారిగా అయిపోతారు. భ్రమిస్తున్న మాతలకు దారి చూపించాలి. పాపం 'అత్యాచారాలను సహించే మాతలను కూడా మీరు రక్షించగలుగుతారు. చాలామంది మాతలు ఆధారాన్ని కోరుకుంటారు, వారికి ఆధారము లభించేస్తుంది. కావున ఈ సేవ చేసి అద్భుతమును చేసి చూపించినట్లయితే ఎన్ని హాండ్స్ లభిస్తాయో చూడండి! చాలా సమయానికి చెందిన ఈ విషయమును ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. వారు శరణమును ఇస్తారు కదా? అది అనాధ ఆశ్రమము, ఇదైతే సనాధ ఆశ్రమము. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, ఈ సమయంలో ఏదైతే కర్మ చేస్తున్నారో అది ఏమవుతుంది? అవ్యక్త స్థితి రూపి దర్పణాన్ని స్వచ్చంగా మరియు స్పష్టంగా చేసుకునేటందుకు ఏ మూడు విషయాలు అవసరం? సహజంగా సంకల్పరహితంగా ఎలా కాగలరు? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment