07-02-1976 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మహారథి అంటే కొత్తది ఏమి కాదు అనే స్థితిలో ఉండేవారు మరియు వ్యర్థ ఖాతా సమాప్తి చేసుకునేవారు.
బాప్ దాదా యొక్క సహయోగినీ, అలసిపోని సేవాధారి, విశ్వ కళ్యాణీ దీదీ గారిని కలుసుకుంటూ బాబా మాట్లాడిన మహావాక్యాలు -
మహారథీల యొక్క మహాన్ స్థితి యొక్క గుర్తు ఏమిటి? దీని ద్వారా వీరు మహారథులు అని తెలుస్తుంది. 1. మహాన్ పురుషార్థీ అంటే మహారథీ. ఏ దృశ్యం చూసినా ఇది డ్రామానుసారం అనేక సార్లు జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇదేమీ క్రొత్తది కాదు అనిపిస్తుంది. ఏది క్రొత్త విషయములా అనిపించదు. దేనిలోనూ ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలే రావు. 2. ప్రతీ విషయం చూసిన దృశ్యంలా అనిపిస్తుంది. ఏదీ క్రొత్తది చేయటం లేదు. పాతదే మరలా చేస్తున్నాము అనుకుంటారు. కల్ప పూర్వం ఏది అయ్యిందో అదే ఇప్పుడు అవుతుంది అనుకుంటారు. ఇప్పుడే ఒక్క సెకనులో జరిగిన విషయం ఎలాగైతే మర్చిపోమో అలాగే ఇది కూడా కల్పపూర్వంలా జరుగుతుంది అనేది కూడా వారు మర్చిపోరు. ఎందుకంటే 1.సాక్షి స్థితిలో ఉంటారు. 2. త్రికాలదర్శిగా ఉంటారు. అందువలన ఇది కల్ప పూర్వం జరిగింది అనే స్మృతిలో తాజాగా ఉంటారు. ఇదొక విశేషత. ఇంకొకటి ఏమిటి? ఏదైనా ఎంత పెద్ద పరిస్థితి లేదా సమస్య అయినా కానీ వారి స్థితి ఉన్నతంగా ఉన్న కారణంగా అది చిన్నదిగానే అనిపిస్తుంది. పెద్ద విషయంగా అనిపించదు. కఠినంగా అనిపించదు. ఏవిధంగా అయితే పెద్ద పర్వతంపై నిల్చుని క్రింద ఉన్న ఏ వస్తువుని అయినా చూస్తే పెద్దది కూడా చిన్నదిగా కనిపిస్తుంది. అదేవిధంగా మహారథుల యొక్క మహాన్ పురుషార్థం ముందు ఏదీ పెద్దదిగా అనిపించదు. కాబట్టి మహావీరులు అంటే మహారథులు యొక్క మహాన్ పురుషార్థం యొక్క గుర్తు ఏమిటి? అంటే పెద్ద శూలం లాంటిది కూడా చిన్న ముల్లులా అనుభవం అవుతుంది. ఇటువంటి మహారథుల యొక్క నోటి నుండి ఏది జరుగుతుందో ఆ మాటలే వస్తాయి. దీనినే సిద్ధి స్వరూపం అంటారు. ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా సిద్ది అవుతుంది, వ్యర్థం ఉండదు. మహారథులకి గుర్తు ఏమిటంటే వికర్మల ఖాతా పూర్తి అయిపోతుంది. దానితో పాటూ వ్యర్థ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది. ఇదే మహారథీ పురుషార్థానికి గుర్తు. దృష్టి ద్వారా అద్భుతం చేసే సర్వీస్ ప్రారంభించారా? 1. మహాదానిగా 2. వరదానిగా 3. విశ్వ కళ్యాణిగా ఉండాలి. ఈ మూడు విశేషతలు ఒకరిలోనే ఉన్నాయా? లేక ఒకటి ఒకరిలో, ఒకటి ఇంకొకరిలో ఉన్నాయా? కొంతమందికి వరదాని రూపంలో, కొందరికి విశ్వ కళ్యాణ రూపంలో పూజ జరుగుతుంది. పూజ మహిమ ఒకరికి ఇంకొకరికి తేడా ఉంటుంది. ఎందుకు? మూడు ఉంటాయి. కానీ శాతంలో కొంతమందికి కొన్ని వాటిలో, కొంతమందికి కొన్ని వాటిలో శాతాల్లో మార్పు ఉంటుంది. 1. కర్మల యొక్క గతి. 2. ప్రాలబ్దం యొక్క గతి. 3. పూజా మహిమ యొక్క గతి. కర్మల యొక్క గతి ఎంత గుహ్యమో ఈ రెండింటి యొక్క గతి కూడా అంతే గుహ్యం. ప్రాలబ్దం యొక్క సాక్షాత్కారం ఇప్పుడే అవ్వాలి. ఎవరు ఏవిధంగా అయ్యారు? ఏ ఆధారంతో అయ్యారు? ఇవన్నీ స్పష్టం కానున్నవి. వద్దనుకున్నా గాని ఆలోచించలేకపోయినా కానీ ఎలా అవ్వాలో, అటువంటి కర్మ, సేవ నడవడిక, సంబంధం, సంపర్కం స్వతహాగానే వచ్చేస్తాయి. మన నడవడిక అంటే కర్మ దర్పణం. కర్మ దర్పణలో ప్రతి ఒక్కరి యొక్క సాక్షాత్కారం స్పష్టంగా కనిపిస్తుంది. మంచిది.
ఈ మురళీ యొక్క సారం :-
1. పెద్ద పర్వతంపై నుంచి చూస్తే క్రింద వస్తువులు పెద్దవి కూడా చిన్నవిగా కనిపిస్తాయి. అదేవిధంగా మహారథీల యొక్క మహా పురుషార్థం ముందు ఏదీ పెద్దవిగా కనిపించవు. శూలంను ముల్లుగా అనుభవం చేసుకుంటారు.
2. మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క ప్రత్యక్ష స్వరూపం వికర్మల ఖాతాతో పాటు వ్యర్ధ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది.
3. మహారథీల యొక్క గుర్తు ఏ విషయం క్రొత్తగా అనిపించదు. ఒక సెకను క్రితం జరిగిన విషయం ఎలా మర్చిపోమో ఇది కూడా కల్ప పూర్వం జరిగింది అనే విషయం మర్చిపోరు. ఎందుకంటే త్రికాలదర్శిగా ఉంటారు.
4. ఏవిధంగా అయితే కర్మలగతి గుహ్యమో అదేవిధంగా వర్తమాన సమయం యొక్క గతి కూడా గహ్యం .
Comments
Post a Comment