07-02-1976 అవ్యక్త మురళి

07-02-1976         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అవ్యక్త ఫరిస్తాల యొక్క సభ.

                           అన్ని ఆత్మలకి సుఖం, శాంతి, శక్తి యొక్క దోసిలిని ఇచ్చేవారు, వరదానం ఇచ్చి తృప్తి చేసేవారు, జన్మ జన్మల యొక్క దాహాన్ని తీర్చేవారు, సర్వులని గమ్యాన్ని చేర్పించే ఆత్మిక తండ్రిని మాట్లాడుతున్నారు -
            బాప్ దాదా సదా హర్షితులు, సదా హద్దు యొక్క ఆకర్షణలకి అతీతంగా ఉండే అవ్యక్త ఫరిస్తాలను చూస్తున్నారు. ఇది ఫరిస్తాల యొక్క సభ. ప్రతీ ఒక్క ఫరిస్తాకి నాలుగు వైపుల నుండి ప్రకాశ కిరీటం ఎంత వరకూ కనిపిస్తుంది అంటే ప్రకాశ స్వరూపులుగా (లైట్ హౌస్) శక్తి స్వరూపులుగా (మైట్‌హౌస్) ఎంత వరకూ అయ్యారు అని చూస్తున్నారు.
           ఏవిధంగా అయితే భవిష్యత్తు స్వర్గ ప్రపంచంలో అందరిని దేవతలు అంటారో అదేవిధంగా వర్తమాన సమయంలో అందర్ని ఫరిస్తాలు అంటారు. నెంబర్ వారిగా ఏవిధంగా అయితే అక్కడ ప్రతి ఒక్కరూ వారి స్థితిని అనుసరించి సతో ప్రధానంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా వారి పురుషార్థంను అనుసరించి ఫరిస్తా స్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి యొక్క ఫలితం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతిమ పశ్చాత్తాపం యొక్క సమయం నడుస్తుంది. ఈ పశ్చాత్తాపం ప్రతి ఒక్కరూ ఎంత పొందారు. ఈ ఫలితంలో రెండు విషయాలు కన్పించాయి. అవి ఏమిటి?
                  ప్రతి ఒక్కరూ ఏ స్థితి వరకు చేరుకున్నారు? వ్యతిరేకత ఎక్కువగా ఉందా లేక ఎక్కువ స్థితిలో ఉన్నారా? పురాతన దేహం మరియు పురాతన ప్రపంచం యొక్క స్మృతిలో ఎంత వరకూ పరివర్తన అయ్యారు? నాలుగు సబ్జెక్టులలో ధారణా స్వరూపులుగా ఎంత వరకూ అయ్యారు? బాప్ దాదా యొక్క మూడు రూపాలు - సాకారం, ఆకారం మరియు నిరాకారం ద్వారా తీసుకున్నపాలనకి చదువుకి ఎంత వరకూ బాబాకి బదులు ఇచ్చారు. ఆది నుండి ఇప్పటి వరకూ బాప్ దాదాకి  ఏవైతే ప్రతిజ్ఞలు చేసారో ఆ అన్ని ప్రతిజ్ఞలు నిలుపుకునే వారిగా ఎంత వరకూ అయ్యారు? ఎంత లాభం పొందారు?ఇలా ప్రతి ఒక్కరు స్వయాన్ని పరిశీలించుకుంటున్నారా? నాలుగు సబ్జెక్టులని పరిశీలించుకోనే సాధన మీరు చేస్తున్న మహిమ. ఆ మహిమ ఏమిటో తెలుసా? అది అందరికి జ్ఞాపకమే కదా? ఈ నాలుగు సబ్జెక్టుల  యొక్క ఫలితం తెలుసుకోవలసి ఉంది. ఇది పరిశీలించుకోండి. నాలుగు విషయాలలో సంపన్నంగా ఉన్నానా అని. ఇప్పటి వరకూ 16 కళా సంపూర్ణంగా ఉన్నానా లేక 14 కళలే వచ్చాయా? సర్వగుణ సంపన్నంగా అయ్యారా లేక గుణ సంపన్నంగా అయ్యానా? అంటే ఏవో కొన్ని గుణములే ధారణ చేసానా? అన్ని మర్యాదలను ధారణ చేసి మర్యాదా పురుషోత్తముడిగా అయ్యానా? సంపూర్ణ అహింసకులుగా అయ్యానా? సంకల్పం ద్వారా కానీ ఏ ఆత్మకి దు:ఖము ఇవ్వటం గాని, దుఃఖం తీసుకోవటం గాని హింసయే. సంపూర్ణ అహింసకులు అంటే ప్రతి సంకల్పం, ప్రతి అడుగు ఉత్తమముగా అంటే శ్రేష్ఠముగా ఉండాలి. సాధారణంగా లేదా లౌకికంగా ఉండకూడదు. వ్యర్థం ఉండకూడదు. ఈ విధంగా ఎంత వరకూ తయారయ్యారు? బాప్  దాదా ఏం చూసారు? ఇప్పటి వరకూ విశేషించి రెండు శక్తులు చాలా అవసరం అని. అవి ఏమిటి? 
               1. స్వయాన్ని పరిశీలించుకునే శక్తి. 2. స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి. ఈ రెండు శక్తుల యొక్క ఫలితంలో ఎంత తీవ్ర పురుషార్థంలో వెళ్ళాలో అంత తీవ్రతను పెంచుకోలేకపోతున్నారు. ఈ రెండు శక్తులలో లోపం ఉన్న కారణంగా ఏదో ఒక ఆటంకం తీవ్రతను పెంచనివ్వటం లేదు. ఇతరులని పరిశీలించే శక్తి ఎక్కువగా ఉంది. ఇతరులని పరిశీలించాలనే సంకల్పం చాలా తీవ్రంగా ఉంది. దీనిలో ముందు మీరు అనే పాఠం పక్కా చేసుకున్నారు. ఎక్కడ ముందు నేను అనాలో అక్కడ అనాలో అక్కడ మీరు అంటున్నారు. మూడవ నేత్రంను బాబా ప్రతి ఒక్కరికీ వరదాన రూపంలో ఇచ్చారు. కానీ ఆ మూడవ నేత్రం ద్వారా బాప్ దాదా ఏం పని ఇచ్చారో ఆ పనిలో ఉపయోగించటం లేదు. ఆత్మను చూడటానికి మూడవ నేత్రం ఇచ్చారు. ఆత్మిక ప్రపంచం కొత్త ప్రపంచం చూడటానికి ఇచ్చారు. దానికి బదులుగా శరీరాన్ని, శరీరం యొక్క ప్రపంచం చూస్తున్నారు. అంటే యదార్థరీతిలో కార్యంలో ఉపయోగించటం రావటం లేదు. అందువలన ఇప్పుడు సమయం యొక్క గతిని తెలుసుకుని పరివర్తనా శక్తిని స్వయం పట్ల ఉపయోగించండి. సమయం యొక్క పరివర్తనకు చాలా ఎదురు చూస్తున్నారు. స్వపరివర్తనకు తక్కువ ఆలోచిస్తున్నారు. మరలా సమయం యొక్క పరివర్తన గూర్చి ఆలోచిస్తున్నారు. ఇది అవ్వాల్సిందే. స్వయం రచయిత సమయం రచనా రచయిత అయితే స్వపరివర్తన అవుతుంది. పరివర్తనకు ఆధార మూర్తులు. స్వయం మీరే సమయం యొక్క సమాప్తికి అంటే ఈ పురాతన ప్రపంచం యొక్క పరివర్తనకు గడియారం మీరే. మొత్తం విశ్వ ఆత్మలకి గడియారాలైన మీ పైన దృష్టి అంతా ఉంది. ఎప్పుడు ఈ గడియారం సమాప్తి యొక్క సమాయాన్ని చూపిస్తుంది. మీకు తెలుసా? మీ గడియారంలో ఎంత సమయం అయ్యింది లేక సమయాన్ని చూపించే గడియారాలే సమయం ఎంత అయ్యింది అని అడిగేవారా? మీరు చెప్పేవారా? త్రికాలదర్శులు  అడుగుతున్నారు, " ఇప్పుడు ఏమి అవుతుంది అని ". ఎప్పుడు అవుతుంది? అవుతుందా? అవ్వాదా? ఇలా డ్రామానుసారం ప్రతి సమయం పేపర్సు వస్తాయి. ఇక ముందు కూడా వస్తాయి కూడా.
                   తుఫాను వృక్షాన్ని ఊపుతుంది కదా! అదేవిధంగా నిశ్చయం అనే పునాదిని కదపటానికి పేపర్స్  వస్తాయి. ఈ పేపర్స్  తీసుకోవటానికి తయారుగా ఉన్నారా లేక బలహీనంగా ఉన్నారా? తెలివైన విద్యార్థి పేపరుని ఆహ్వానిస్తాడు. బలహీన విద్యార్థులు భయపడతారు. మరి మీరు ఎవరు? నిశ్చయ బుద్ధికి గుర్తు ఏమిటంటే ప్రతి విషయాన్ని ప్రతి దృశ్యాన్ని ఇది నిశ్చితం అని భావించి నిశ్చితంగా  ఉంటారు. ఏమిటి? ఎందుకు? ఎలాగా? అని చింతలు లేకపోవటమే ఫరిస్తా స్థితి యొక్క అంతిమతకి గుర్తు - సదా శుభ చింతకులుగా, సదా నిశ్చింతగా ఉంటారు. మరి ఆ విధంగా అయ్యారా? ఇప్పుడు ఈ అంతిమ కొద్ది పురుషార్థం యొక్క సమయంలో స్వయంలో సర్వశక్తులు ప్రత్యక్షం చేయండి..
            ప్రత్యక్షతా సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! బాబాని ప్రత్యక్షం చేయండి. ఈ సంవత్సరం విశేషించి జ్వాలా స్వరూపంగా అంటే ప్రకాశ స్వరూపం (లైట్ హౌస్) మరియు శక్తి స్వరూపం (మైట్ హౌస్) యొక్క స్థితిలో ఉంటూ పురుషార్థం చేయండి. విశేషించి స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకోండి. జ్ఞాన స్వరూపం యొక్క అనుభవీగా అవ్వండి. దీని ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క శుభ వృత్తి ద్వారా లేదా కళ్యాణకారి వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా భ్రమిస్తున్న వారికి, పిలుస్తున్నవారికి, దాహంలో ఉన్నవారికి ఆనందము, శాంతి మరియు శక్తి యొక్క అనుభవం చేయించండి. అర్థం అయ్యిందా? ఇప్పుడు ఏం చేయాలి? వినిపించటమే కాదు అనుభవం చేయించాలి. ఇతరులకు అనుభవం చేయించే ముందు స్వయం అనుభవీ మూర్తిగా అవ్వండి. స్వయం పరివర్తన అయ్యి విశ్వంను పరివర్తన చేయాలి. అర్థం అయ్యిందా? దృఢ సంకల్పం యొక్క ఫలితం సఫలత. మంచిది.
               ఈవిధంగా దృఢ సంకల్పం ద్వారా సృష్టి యొక్క నవ నిర్మాణం చేసేవారికి, ఆత్మిక వృత్తి ద్వారా వాయుమండలంను పరివర్తన చేసేవారికి, ప్రతి ఆత్మకు  సుఖ శాంతి యొక్క వరదానం ఇచ్చేవారికి, తృప్తి ఆత్మగా తయారు చేసేవారికి, జన్మ జన్మాంతరాల నుండి దాహంతో ఉన్నవారికి దాహంను తీర్చేవారికి, సదా నిశ్చయబుద్ధి, అలజడిలో కూడా అచంచలంగా ఉండేవారికి, జ్ఞాన స్వరూపులు లేదా స్మృతి స్వరూప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఈ వాణీ యొక్క సారం :-
1. సర్వ గుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణంగా, మార్యాదా పురుషోత్తములుగా, సంపూర్ణ అహింసకులుగా ఈ విషయాలలోనే నాలుగు సబ్జెక్టుల ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి ఈ నాలుగు విషయాలలో ఎంత వరకూ సంపన్నం అయ్యాను అని పరిశీలించుకోండి.
2. బాబా మనకి ఆత్మను చూడటానికి ఆత్మిక ప్రపంచంను, కీర్తి ప్రపంచంను చూడటానికి మూడవ నేత్రం ఇచ్చారు. కానీ దానికి బదులుగా శరీరంను, శారీరిక ప్రపంచాన్ని చూస్తున్నారు. అంటే మూడవ నేత్రాన్ని యదార్థ రీతిలో ఉపయోగించనట్లే.
3. స్వయం రచయిత, సమయం రచన. రచయిత అంటే స్వయం పరివర్తనలోనే రచన అంటే సమయం కూడా పరివర్తన అవుతుంది.
4. పరిశీలించి శక్తి స్వయంను పరివర్తన చేసుకుని శక్తిలో లోపం ఉన్న కారణంగానే ఏదో ఒక ఆటంకం వచ్చి గతిని తీవ్రం కానివ్వటం లేదు. కాబట్టి సమయం యొక్క గతిని తెలుసుకుని పరివర్తనా శక్తిని స్వయంలోకి తీసుకురండి..

Comments